ఓ ప్రేమ కథ (మోహన రాగం)-12

ధారావాహిక నవల

జరిగిన కథ

రాగ మాలను తండ్రి పిలిచి మందలించాడు. ఆఫీసులో రామారావు గారితో ఇబ్బందిగా ఉందని చెప్తాడు. తల్లి అన్నలతో కలిసి తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళిన రాగమాలకి కాస్త మనసు సేద తీరినట్లు అనిపిస్తుంది

ఇక కథలోకి వెళ్దాం!

కిటికీలో నుండి చల్లని గాలి వస్తుంటే, అలసిపోయిన శరీ రాలు ఆదమరచి నిద్రించాయి. అప్పటికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది.

అనురాగ్ ,రాగ మాల ఇద్దరూ కలిసి బయట మాడ వీధులన్నీ చూసి ఏదైనా షాపింగ్ చేద్దాము అనుకున్నారు. వసుంధర కాటేజ్ లోనే ఉండిపోయింది.

ప్రశాంతమైన వాతావరణం, పవిత్రమైన ప్రాంగణం మాడవీధుల్లో ఊరేగుతూ స్వామి వారు ఇవన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి.

అవన్నీ చూసుకుంటూ షాపుల వెంబడి వెళ్లారు. రకరకాలైన విగ్రహాలు, బొమ్మలు, పూసల తోరణాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఆమె తనకి ఇష్టమైన కొన్ని వస్తువులను కొనుక్కుంది. మోహన్ కోసం ఒక ఉంగరం కూడా కొన్నది.వెంట శీను కూడా వచ్చాడు. అక్కడి ప్రాంతం వాడే కాబట్టి దుకాణాల్లో చక్కగా బేర మాడి ఇప్పించాడు.

ఎక్కడికి వెళ్లినా మనసు మాత్రం మోహన్ తలపులోనే ఉంది. తమ పెళ్ళికి ఏమీ ఆటంకాలు రాకూడదని పదేపదే దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది.

తెల్లవారి కొండ మీద ఉన్న పాపనాశనం,ఆకాశ గంగ తీర్థాలు దర్శనం చేసుకున్నారు.

ఆరోజు రాత్రికి తిరుమల నుండి తిరుపతికి బస్సులో వచ్చారు. హోటల్ రూమ్ తీసుకొని బస చేసి తెల్లవారి అలివేలు మంగాపురం, కపిలతీర్థం, గోవింద రాజుస్వామి ఆలయం దర్శనం చేసుకుని సాయంత్రం కాళ హస్తికి వెళ్లారు. ఆరోజు రాత్రి కాళహస్తిలో బస చేసి కాళ హస్తీశ్వరుడి దర్శనం చేసుకుని, కన్నప్ప గుడిని కూడా దర్శించి, రైలుకు బయలుదేరాలి అనుకున్నారు. ఇంతవరకు రాగమాల రైలు ఎక్కలేదు.తను ఆ ప్రయాణం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తుంది.

సాయంత్రం ఆరు గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఎక్కారు. విజయవాడకు ప్రయాణం.

ట్రైన్ లో కూర్చున్న రాగ మాల యధాలాపంగా కిటికీలో నుండి బయటకు చూసింది.

బయట నుండి మోహన్ ఇద్దరు తమ్ముళ్ళు మరియు వారితో మరో ఇద్దరు కనిపించారు.

ఒక్కసారి ఆశ్చర్యపోయింది. “ఇదేంటి? వీళ్లు ఇక్కడున్నారు?” అనుకోని కిటికీలో నుండి మళ్ళీ చూసింది. వాళ్లు ముందుగా రాగమాలను చూడలేదు. కానీ తర్వాత వెనక్కి ఒక్కరొక్కరుగా వచ్చి కిటికీ దగ్గర చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. “ఇదేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు?” అనుకుంది.

ఒక తమ్ముడు రఘు మాత్రం వచ్చి పలకరించి వెళ్ళాడు.

అనురాగ్ అడిగాడు..

“వీళ్లేంటి ఇక్కడ అనుకోకుండా”? అన్నాడు.

“ఏమో నాకేం తెలుసు”అని ఆమె అన్నది.

విజయవాడ చేరుకున్నారు. తెల్లవారి స్టేషన్లో మళ్లీ ఆ నలుగురు కనిపించి, ముఖంలో ఒక రకమైన పిచ్చి నవ్వు చూపిస్తూ వెళ్ళిపోయారు.

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆరోజు సాయంత్రం హైదరాబాదుకి రైలులో ప్రయాణమయ్యారు.

రైలు ప్రయాణాన్ని మాత్రం ఆమె చాలా ఇష్టపడింది. మనసంతా తేలిక పడ్డట్టు అనిపించింది. హైదరాబాద్ చేరుకున్నాక అనురాగ్ హైదరాబాదులోనే ఉండిపోయాడు. వసుంధర, రాగమాల వాళ్ళ ఊరికి బయలుదేరారు.

ఆమె ప్రయాణం అలసట తీరే వరకు నిద్రపోయింది. నిద్ర లేచేవరకు జోరున వర్షం పడుతుంది. అప్పటికే వర్షం నీళ్లన్నీ వసుంధర పెద్ద పెద్ద బిందెల్లో నింపి పెట్టింది. ప్రయాణం చేసి వచ్చిన బట్టలన్నీ ఆ వర్షం నీటితో ఇద్దరూ కలిసి ఉతికేసుకున్నారు. అంతా పనయ్యాక అలా కుర్చీలో కూర్చుందో, లేదో మోహన్ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.

“అదేంటి సడన్ గా వచ్చావు? ఇంకా నయం నాన్న, అన్నయ్య ఇంట్లో లేరు. పరవాలేదులే కూర్చో” అంది.

“దర్శనం బాగా చేసుకున్నారా? అందరూ ప్రయాణం చేసి వస్తే అలసటకి చిక్కిపోతారు. నువ్వేంటి బాగా మెరిసిపోతున్నావ్?”అన్నాడు.

“మేం వెళ్లిన చోట వర్షాలు పడుతున్నాయి. అందులో అక్కడ నీళ్లు చాలా బాగున్నాయి. దేవుడి దర్శనాలు కాబట్టి ముఖంలో ఆ మెరుపు కనిపిస్తుందో ఏంటో”అన్నది.

“నిజమే ఊరికే తిరిగితే అలసట ఉంటుంది. అన్ని దేవుడి దర్శనాలే కదా?”అన్నాడు.

“తిరుపతి స్టేషన్లో మీ తమ్ముళ్లను చూశాను. నువ్వు వాళ్లు తిరుపతి వెళుతున్నట్టు చెప్పలేదు. వాళ్లంతా నన్ను వెనక్కి ముందుకు తిరుగుతూ చూశారు. ఎందుకట్లా చూశారో నాకు అర్థం కాలేదు”అన్నది.

“అనుకోకుండా వెళ్లారు. టికెట్ ముందు బుక్ చేసుకోకుండానే బయలుదేరారు. కిటికీలో నుండి నిన్ను చూసిన తర్వాత నేను కూడా నీ పక్కనే ఉన్నానేమో అని సందేహంతో అలా వెనక్కి వచ్చి చూశారట”అన్నాడు.

“అదేంటి? నువ్వు నాతో ఉండడమేంటి? ఆ ఊహనే పిచ్చిగా ఉంది . వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు?నాకు అసలు బాగా అనిపించలేదు”అన్నది కొంచెం కోపంగా.

“ఏమోలే, ఇప్పుడు అది వదిలేయి. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కి ఎప్పుడు వస్తున్నావ్?”అన్నాడు.

“ఇంకా కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! అప్పుడు వస్తాను”అన్నది.

“నేను ఇప్పుడు స్కూల్స్ లో మానేశాను” అన్నాడు.

“చదువుకోవడం కోసమా?” అన్నది.

“కాదు, మెడికేర్ అనే ఫార్మాసిటీ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేరాను” అన్నాడు.

“నిజమా?” అన్నది సంతోషంగా.

“అవును.ఇప్పుడు ఇంట్లో చెప్పడానికి నా దగ్గర రిజన్ ఉంది” అన్నాడు.

“ఈసారి చెప్తావా?” అన్నది.

“అందుకే ఊరికి వెళుతున్న.ముందుగా నీకు చెప్పాలని వచ్చాను” అన్నాడు.

ఆమె ఎంతో సంతోష పడింది. తిరుపతి ప్రసాదం తెచ్చి అతని చేతిలో పెట్టింది.

భక్తిగా కళ్ళకి అద్దుకుని భుజించాడు.

తర్వాత అతను వెళ్ళిపోయాడు.

అతను చెప్పే శుభ వార్త కోసం ఎదురు చూస్తూ ఉంది.కానీ మనం అనుకున్నవి జరగవు అని నిరూపణ అయ్యింది.

ఆమెకు చాలా నిరాశ కలిగింది.

అనుకున్నవేవీ జరగవు అనే దానికి ఉదాహరణ అనే వీరి జీవితాలు.

“తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి శుభవార్త తీసుకొస్తున్నాడు” అని ఎదురుచూస్తున్న రాగమాలకి అనుకోని వార్త వినాల్సి వచ్చింది.

“మోహన్ ఉత్తరం కూడా రాయడం లేదు” అని మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది.

సడన్గా మోహన్ ఒక రోజు వచ్చాడు. రావడంతోనే ఆత్రంగా అడిగింది..

“ఏమైంది కనీసం ఒక ఉత్తరం అయినా రాయలేదు. ఇంట్లో మన విషయం చెప్పావా? ఏమన్నారు?”అని త్వర త్వరగా ప్రశ్నల వర్షం కురిపించింది.

“ఇన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే ఎలా? చెప్పాలని ఇంటికి వెళ్లాను. కానీ మా నానమ్మకు ఒంట్లో బాగాలేదని తెలిసింది. వెంటనే అందరం హైదరాబాద్ వెళ్ళాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. కానీ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయారు”అని మోహన్ బాధగా చెప్పాడు.

“అయ్యో !అలా జరిగిందా?” అని బాధపడింది.

“ముందు నువ్వు కూర్చో” అని దగ్గరికి వెళ్ళింది.

“దూరంగా ఒక కుర్చీ వెయ్యి. తాకకూడదు కదా”అన్నాడు.

“అవును ఆ విషయమే మర్చిపోయాను. ఎన్ని రోజులయింది?”అని అడిగింది.

“ఈరోజుకు ఐదు రోజులు”అని చెప్పాడు.

దూరంగా మంచినీళ్ల గ్లాసు, టీ కప్పు పెట్టి తాను కూడా ఒక కుర్చీలో కూర్చుంది .

ఇంకా పెళ్లి విషయం ఏం మాట్లాడ గలుగుతుంది? ఇద్దరు మౌనంగానే చాలాసేపు కూర్చున్నారు.

“ఏంటి బాధ పడుతున్నావా? ఇప్పుడు చెప్పడం ఎలాగూ కుదరదు. తర్వాతయినా సంవత్సరం వరకు శుభకార్యం చేయకూడదు. ఈ లోపల నేను జాబ్ లో సెటిల్ అవుతాను.సెటిల్ కావడం కూడా ముఖ్యమే కదా! సంవత్సరం ఎంత లోపల గడిచిపోతుంది?”అన్నాడు.

‘మగ పిల్లలకు సంవత్సర కాలం తక్కువే. కానీ పెళ్ళికి ఉన్న ఆడపిల్లలకి సంవత్సరం కాలం ఎక్కువే ‘అని రాగమాల మనసులో అనుకుంది.

ఆరోజు ఇంట్లో ఎవరూ లేనందువల్ల కాసేపు తృప్తిగా మాట్లాడుకున్నారు. ఇంట్లో అందరూ దగ్గర బంధువుల పెళ్లి ఉంటే వెళ్ళిపోయారు. రాగమాల ఫంక్షన్లకు వెళ్లడం తక్కువే. అందుకే ఇంట్లోనే ఉండిపోయింది.

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. మోహన్ నానమ్మ గారు చనిపోయారు అనే వార్త తెలిసి బాధ పడ్డారు.

పెళ్లి సంవత్సరం వరకు వాయిదా పడుతుందని కూడా అనుకున్నారు. అప్పటికే అనురాగ్ పెళ్లి సెటిల్ అయింది. రెండు పెళ్లిళ్లు ఒకేసారి చేయాలని తండ్రి కోరిక. కానీ ఇప్పుడు అది వాయిదా వేయాల్సి వస్తుంది.

రాగమాల ఇవన్నీ మర్చిపోయి, మిగతా ఎగ్జామ్స్ గురించి ధ్యాస పెట్టింది. బీఈడీ ఎగ్జామ్ ,లా ఎంట్రెన్స్ రెండు మిగిలిపోయాయి. లా ఎగ్జామ్ గురించి అంతగా ప్రిపేర్ కాలేదు. కానీ బిఈడి గురించి ఎక్కువగా ప్రిపేర్ అయ్యింది.

మళ్లీ హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఈసారి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాయాలని అనుకుంది .

బాబాయ్ కూతురుతో తనకు సాన్నిహిత్యం ఉంది. వాళ్ళింటికి వెళ్లడం కూడా అనుకోకుండానే జరిగింది. ఈ విషయం మోహన్ కి చెప్పడానికి సమయం లేకపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఉత్తరం రాసింది.

“నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. నీకు బాబాయ్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా!
మన ఎగ్జామ్ అయిన తెల్లవారి నువ్వు వీళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న సుధా హోటల్ దగ్గరకు వచ్చి వేచి ఉండు. అక్కడికి మేమిద్దరం వస్తాము. వైదేహిని నేను అడిగాను దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ ఏవి అని రోడ్డు మీద నిలబడి మాట్లాడు కోలేము కదా అందుకని ఆ ప్లేస్ చెప్తున్నాను. తనకి మన విషయం కూడా చెప్పాను” అన్ని వ్రాసింది.

మోహన్ కి కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు తెలుసు.

హైదరాబాద్ దారుల గురించి ఏమీ తెలియని ఆమె తన కజిన్ ని అడిగింది . “ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ ఉన్నాయా?” అని అడిగింది.

“ఎందుకక్కా అది మన ఇంటికి దగ్గరే సుధ హోటల్ ఉంది”అని చెప్పింది కజిన్ వైదేహి.

విషయం అంతా ఆమెకు చెప్పింది. అది విన్న వైదేహి..

“అతను మాకు తెలుసు. మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా నాకు తెలుసు”అని చెప్పింది.

“అయితే పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నమాట”అన్నది నవ్వుతూ.

“అవును చాలా ఏళ్లు పక్కపక్కనే ఉన్నాము”అని వైదేహి అన్నది.

“అయితే నా లా ఎగ్జామ్ అయిపోయిన తెల్లవారి రమ్మన్నాను. ఆరోజు వెళ్దాము”అన్నది .

“సరే అక్క! నాకు ఎలాగు ఇప్పుడు హాలిడేస్. ఎప్పుడంటే అప్పుడు వెళదాము”అన్నది.

ఆమె లా ఎగ్జామ్ కోసం పెద్దగా ప్రిపేర్ కాలేదు. ఆ సబ్జెక్టులో అంత నాలెడ్జ్ కూడా లేదు .ఏదో పైపైన చదువుకొని ఒంటిగంటకు పరీక్ష అని తెలిసి పన్నెండు గంటలకు వైదేహితో కలిసి బస్ స్టాప్ కి వెళ్ళింది.

మళ్లీ సెంటర్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో పడింది. ఇద్దరూ గబగబా బస్ స్టాప్ వైపు నడుస్తుంటే, సైకిల్ మీద వస్తూ మోహన్ కనిపించాడు.

“ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు?
వైదేహి బాగున్నావా?”
రాగమాలా! నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇక్కడికి వస్తావని చెప్పనేలేదు”అన్నాడు సైకిల్ దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి.

“అది సరేగాని ఎగ్జామ్ కు టైం అవుతుంటే నువ్వు ఎటు వెళ్తున్నావు?”అన్నది.

“ఏంటి ఎగ్జామ్ టైమింగ్స్ చూసుకోలేదా? ఉదయం పదకొండు గంటలకి రాసి వస్తున్నా”అన్నాడు.

“అయ్యో !న్యూస్ పేపర్ లో కూడా ఒంటి గంట అనే వచ్చింది”అని టెన్షన్ పడింది.

“ఇంకేముంది ఎగ్జామ్ పోయినట్లేలే! అయినా టైం చూసు కోకుంటే ఎలా”అన్నాడు.

ఆమెకు చాలా బాధ కలిగింది.

“పోనీలే అక్కా! ఏం చేస్తాం” అని వైదేహి అన్నది.

“నువ్వు వస్తున్నట్లు నాకు చెప్పలేదు ఏంటి? మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాను. తాళం వేసి ఉంది .సడన్గా ఇక్కడికి వచ్చావేంటి?”అన్నాడు.

“అన్నయ్యకు హాలిడేస్ వచ్చాయి కదా! ఏదో పనిమీద వేరే ఊరికి వెళ్ళాడు. నాన్న నన్ను బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపించాడు. రాగానే నీకు లెటర్ రాశాను చేర లేదా?” అన్నది.

“నువ్వేం రాయలేదు ఊరికే అబద్ధం చెప్తున్నావు”అన్నాడు.

“నీకెప్పుడూ సందేహమే! ఏది చెప్పినా నమ్మవు”అన్నది.

అక్కడే ఉన్న వైదేహి”స్టాప్,స్టాప్ ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను.మరచిపోతే ఎలా” అన్నది నవ్వుతూ.

“లేదే !నిన్ను కూడా అడిగాను కదా! దగ్గర రెస్టారెంట్స్ ఏమీ ఉన్నాయని, అక్కడ మోహన్ ను కలుస్తాను అని నీకు చెప్పలేదా? లెటర్ కూడా నీ ముందే రాశాను” అన్నది.

“అవును, రాసింది. అంతెందుకు రేపు మీకు ఉత్తరం చేరుతుంది .నో ఫైట్” అన్నది.

“ఎలాగూ కలిశాం కదా! సుధ హోటల్ వద్దు కానీ, సుదర్శన్ థియేటర్ లో “సాగర సంగమం” సినిమా వచ్చింది.అక్కడికి వచ్చెయ్యండి” అని చెప్పి సైకిల్ మీద వెళ్ళిపోయాడు.

“సినిమా సంగతి తర్వాత, నేను ఎగ్జామ్ రాయ లేకపోయాను కదా! చాలా బాధగా ఉంది”అన్నది.

ఇంటికి వెళ్ళాక వాళ్ళ బాబాయ్ వెక్కిరింపుగా నవ్వాడు.

“అదేంటి ఎగ్జామ్ సమయం సరిగ్గా చూసుకోలేదా?”అని తను కూడా పేపర్ తీసి చూసాడు అందులో మసకగా వన్ అనే పడింది.

వైదేహితో అలా షాపింగ్ కి వెళ్లి వచ్చింది. తర్వాత తెల్లవారి సినిమాకు వెళ్లాలని అనుకున్నారు.

తెల్లవారి పేపర్లో ఒక ప్రకటన పడింది. చాలా మంది పిల్లలు పేపర్ ప్రింట్ మిస్టేక్ వల్ల ఒంటి గంటకి వచ్చారట. అందుకని తర్వాత నెలలో ఎగ్జామ్ ఉంటుందని ప్రకటన ఇచ్చారు.

తెల్లవారి వైదేహితో కలిసి సుదర్శన్ థియేటర్ కి వెళ్ళింది.

అప్పటికే మోహన్ అక్కడికి వచ్చి కూర్చున్నాడు.

కిటికీలో నుండి చల్లని గానీ వస్తుంటే, అలసిపోయిన శరీ రాలు ఆదమరచి నిద్రించాయి. అప్పటికి సాయంత్రం 6 గంటలు అయ్యింది.

అనురాగ్ ,రాగమాల ఇద్దరూ కలిసి బయట మాడవీధులన్నీ చూసి ఏదైనా షాపింగ్ చేద్దాము అనుకున్నారు. వసుంధర కాటేజ్ లోనే ఉండిపోయింది.

ప్రశాంతమైన వాతావరణం, పవిత్రమైన ప్రాంగణం మాడవీధుల్లో ఊరేగుతూ స్వామి వారు ఇవన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి.

అవన్నీ చూసుకుంటూ షాపుల వెంబడి వెళ్లారు. రకరకాలైన విగ్రహాలు, బొమ్మలు, పూసల తోరణాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఆమె తనకి ఇష్టమైన కొన్ని వస్తువులను కొనుక్కుంది. వెంట శీను కూడా వచ్చాడు అక్కడి ప్రాంతం వాడే కాబట్టి దుకాణాల్లో చక్కగా బేరమాడి ఇప్పించాడు.

ఎక్కడికి వెళ్లినా మనసు మాత్రం మోహన్ తలపులోనే ఉంది. తమ పెళ్ళికి ఏ మీ ఆటంకాలు రాకూడదని పదేపదే దేవుడిని ప్రార్థిస్తూనే ఉంది.

తెల్లవారి కొండ మీద ఉన్న పాపనాశనం,ఆకాశ గంగ తీర్థాలు దర్శనం చేసుకున్నారు.

ఆరోజు రాత్రికి తిరుమల నుండి తిరుపతికి బస్సులో వచ్చారు. హోటల్ రూమ్ తీసుకొని బస చేసి తెల్లవారి అలివేలు మంగాపురం, కపిలతీర్థం, గోవిందరాజుస్వామి ఆలయం దర్శనం చేసుకుని సాయంత్రం కాళహస్తికి వెళ్లారు. ఆరోజు రాత్రి కాళహస్తిలో బస చేసి కాళహస్తీశ్వరుడు దర్శనం చేసుకుని, కన్నప్ప గుడిని కూడా దర్శించి, రైలుకు బయలుదేరాలి అనుకున్నారు. ఇంతవరకు రాగమాల రైలు ఎక్కలేదు.తను ఆ ప్రయాణం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తుంది.

సాయంత్రం 6 గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఎక్కారు. విజయవాడ కు ప్రయాణం.

ట్రైన్ లో కూర్చున్న రాగమాల యధాలాపంగా కిటికీలో నుండి బయటకు చూసింది.

బయట నుండి మోహన్ ఇద్దరు తమ్ముళ్ళు మరియు వారితో మరో ఇద్దరు కనిపించారు.

ఒక్కసారి ఆశ్చర్యపోయింది. “ఇదేంటి? వీలుక్కడున్నారు” అనుకోని కిటికీలో నుండి మళ్ళీ చూసింది. వాళ్లు ముందుగా రాగమాలను చూడలేదు. కానీ తర్వాత వెనక్కి ఒక్కరొక్కరుగా వచ్చి కిటికీ దగ్గర చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. “ఇదేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు?” అనుకుంది.

ఒక తమ్ముడు రఘు మాత్రం వచ్చి పలకరించి వెళ్ళాడు.

అనురాగ్ అడిగాడు..

“వీళ్లేంటి ఇక్కడ అనుకోకుండా”? అన్నాడు.

“ఏమో నాకేం తెలుసు”అని ఆమె అన్నది.

విజయవాడ చేరుకున్నారు. తెల్లవారి స్టేషన్లో మళ్లీ ఆ నలుగురు కనిపించి, ముఖంలో ఒక రకమైన పిచ్చి నవ్వు చూపిస్తూ వెళ్ళిపోయారు.

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆరోజు సాయంత్రం హైదరాబాదుకి రైలులో ప్రయాణమయ్యారు.

రైలు ప్రయాణాన్ని మాత్రం ఆమె

అతను చెప్పే శుభ వార్త కోసం ఎదురు చూస్తూ ఉంది.కానీ మనం అనుకున్నవి జరగవు అని నిరూపణ అయ్యింది.

ఆమెకు చాలా నిరాశ కలిగింది .

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా.. రావమ్మా..!

మౌనానంద స్వామికి జై