అమ్మ కల

అమ్మ మనకు జన్మనిచ్చి
తను మళ్లీ పునర్జన్మ ఎత్తుతుంది
అమ్మ దేవతా స్వరూపమే!

అమ్మ తన బిడ్డ కోసం
చిన్నపిల్లై ఆడుతుంది
బుడి బుడి అడుగులు నేర్పించి
ఎంతో మురిసిపోతుంది
తప్పటడుగులు వేస్తే
చేయందించి తోడునిస్తుంది
నీడలా ఎప్పుడూ మన తోడు ఉంటుంది
అన్నం తినక పోతె
ఆకాశంలో ఉన్న చందమామనె
నేలపై కి పిలుస్తుంది

సముద్రమంత ప్రేమ చూపించే అమ్మలు
ఇప్పుడు ఇంట్లో కంటే
ఎక్కువగా వృద్దాశ్రమాలలో కనిపిస్తున్నారు
ఏమీ తెలియని పసివయసు నుంచి
మనం ఎదిగి మంచిగా స్థరపడేదాక
తన రక్తాన్ని చిందించి పనిచేస్తుంది

అమ్మ కల ఒక్కటే
తాను కష్టాల కడలిలో ఉన్నా
తన బిడ్డలు మాత్రం
సుఖాలతీరం చేరాలనేదే

Written by P. Bhavyasri

9వ తరగతి
జి.ప.ఉ.పా రంగంపేట,మెదక్ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నదీమతల్లి -2

హరి చందన-2