రాధటెన్తు స్టేట్ఫస్టులో పాసయ్యానని అందరికీ స్విట్స్ పంచింది
“అమ్మారాధా !డాక్టరుగారికి కూడా స్వీట్బాక్స్ ఇచ్చిరా! “అన్నాడు వెంకటేశ్వర్లు.
“అలాగే” అంటూ బయలుదేరింది.ఏదోచెప్పలేని అలజడి. చదువులో మరుగుపడ్డ నీడ మరలకంటిముందు తాఛ్ఛాడుతోంది.
మెల్లిగా కన్సల్టేషన్ రూము బయటనుంచొని,”మే ఐ కమిన్ డాక్టర్ .”అంది రాధ.
“ఎస్ ప్లీజ్ “అంటూ తలెత్తిన పద్మావతి స్వీట్బాక్స్ తో రాధని చూసి ఉబ్బితబ్బిబ్బయింది.’ఏమిటి ఈ అమ్మాయిలో ఆకర్షణ? పూర్వజన్మ అనుబంధంలా!’ అనుకుంటూ,
“రామ్మారాధా!”అంటూ కుర్చీచూపింది కూర్చోమన్నట్టు.
డాక్టరుగారు నేను టెంత్ స్టేట్ఫస్ట్ వచ్చాను.నాన్న గారు స్వీట్లిచ్చి మీ ఆశీర్వాదం తీసుకోమన్నారంటూ కాళ్ళకి దండంపెట్టింది.
“ఓ!హార్టీ కంగ్లట్యులేషన్స్.” అంటూ రాధని లేవనెత్తి హగ్ చేసుకుంది.
“ఊఁ!నెక్స్ట్ ఏంచేద్దామనుకుంటున్నావు?.ఏగ్రూప్ తీసుకోవాలనుకుఃటున్నావు?” అడిగింది పద్మావతి.
తలవంచుకొని తటపటాయిస్తూ నేనొకవిషయం మాట్లాడాలి మీరు బిజీ కాకపోతే అంది రాధ.
“ఇవాళ అర్జెంటు కేసుల్లేవు.రౌండ్స్ కి వెళ్ళాలి.”అంది పద్మావతి.
మౌనంగా తలవంచుకుంది రాధ.
“చెప్పమ్మా!మీ అక్కలాంటిదాన్ని.నువ్వేంచెప్పినా ఎవరికీచెప్పనులే!” అంది పద్మావతి.
అతి కష్టం మీద గొంతుపెగల్చుకొని “నాకు మీతమ్ముడిని చేసుకోవటానికి అభ్యంతరంలేదు. కానీ…..”అంటూఆగింది.
“ఆఁ కానీ……” ఆతురతగా అడిగిందిపద్మావతి.
నాకు చదువుకోవాలని ఉంది.నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో పాల్గొనాలనిఉంది.అదికుదురుతుందా?అందిరాధ.
పద్మావతి ఒక్కుదుటునలేచి రాధని కావలించుకుంది.భావోద్గేతంతో అశ్రునయనాలతో రాధ రెండు చేతులూ పట్టుకుని తనకళ్ళకు అద్దుకుంది పద్మావతి.
★★★
రాధ నిర్ణయం విన్న వెంకటేశ్వర్లు, అన్నలూ,అక్కకి రాధ నిర్ణయం అగ్నికి ఆకర్షింపడిన మిడతలా అనిపించింది.
“ఏమ్మారాధా!అన్నలము చేతకానివాళ్ళమనా ఈనిర్ఢయం?” ముగ్గరు ఒకేసారి అన్నారు.
“లేదు రాజన్నా! నామనసుకి దైవనిర్ణయం అనిపించింది. అదే నా నిర్ణయం.”ఆత్మవిశ్వాసంతో అన్నది.
“తల్లీ నా తరువాత నిన్ను చూసుకునే వ్యక్తి. రా వాలని తండ్రిగా నా ఆశ.అంతేగానీ నువ్వు జీవితాంతం చూసుకోవలసిన వ్యక్తి కాదు.
ఆస్తిపాస్తులు లేకపోయినా నీకుజోడైనసంబంధం తేగలమన్ననమ్మకం నాకుందిరా బంగారు.” గద్గద స్వరంతో అన్నాడువెంకటేశ్వర్లు.
“అయ్యో !అలా అనికాదు నాన్నా!నాకెంతో మంచి సంబంధం తెచ్చినా నాదురదృష్టం కొద్దీ ఆవ్యకి ఏ
యాక్సిడెంట్లోనన్నా కాలు చేయి పోగొట్టుకుంటే ఆవ్యక్తిని వదలేయలేనుకదా నాన్నా!ఎంతో మంచివ్యక్తి అని మీరు నమ్మి చేస్తే ఆవ్యక్తి వ్యసనపరుడని మీరు తెలిసికోలేరుకదా! భగవంతుడు నాకు ఆవ్యక్తికి చేయూతనివ్వడానికే పుట్టించాడనిపించి ఈనిర్ణయం తీసుకున్నా!”అంటూ తండ్రిబుజంమీద తల వాల్చింది రాధ.
★★★★
“అక్కా! నేను నమ్మలేకున్నా! నువ్వే ఎదో మాయ మాటలు చెప్పి ఆమెను ఒప్పించి ఉంటావు.నా వయసెక్కడ? ఆమె వయసెక్కడ?”ఉద్రేకంతో పెదిమలు అదురుతుండగా అన్నాడు కృష్ణమోహన్.
“లేదురా!కృష్ణా! రాధ నా దగ్గిరకి వచ్చి చెప్పింది. నేనింకా వెంకటేశ్వర్లు గారితోమాట్లాడలేదు. నిన్నడిగి మాట్లాడుదామని” అంది పద్మావతి.
“అక్కా నిర్ణయం తీసుకునేముందు నేను రాధతో ఒకసారి మాట్లాడాలి.అప్పుడే నా అభిప్రాయం చెప్పగలను “అన్నాడు కృష్ణ మోహన్.
అలాగే!నేను రేపు సాయంత్రం వాళ్ళింటికెళ్ళి మాట్లడతాను. అఃది పద్మావతి.
రాధనిర్ణయం సంచలనం రేపింది అందరికీ. వెంకటేశ్వర్లు వయసు గురించి ప్రస్తావించబోయాడు.
“నాన్నా ఏదో ఒక నెపం పెట్టద్దు దయచేసి” అంది రాధ.
రాధ వయసు అలాంటిది .ఆవేశంతోకూడుకున్న ఆశయం,మానవతాధృక్పధం,దయాగుణం వీటన్నిటితో ప్రాక్టికల్గా ఆలోచించశక్తి కోల్పోయింది. దానికితోడు ఏదో తెలియనిభయం.తానుఅందరికీ బరువవుతానేమోనని.తనపెళ్ళిగురించి తండ్రి ఆర్ధికంగా మానసికంగా కృంగిపోగూడదనే ఆలోచనతో తనది నూటికి నూరుపాళ్ళు సరిఅయిననిర్ణయమేనని విశ్వసించింది.
చేసేదిలేక వెంకటేశ్వర్లు డా౹౹పద్మావతి కోరిక మేరకు కృష్ణమోహన్ రాధలని సమావేశపరచారు.
★★★
“రాధా మీకు నేనంటే ఇష్టమేనా?” సూటిగా అడిగాడు కృష్ణ మోహన్.
తలపైకెత్తి సూటిగా కృష్ణ మోహన్ కళ్ళల్లో చూస్తూ “అవును”అంది రాధ.
“నా అవకరం సంగతి తెలిసే ఒప్పుకున్నావా?”అన్నాడు కృష్ణమోహన్.
“కనబడని అవకరంకంటే కనపడే అవకరం మేలుకదా?”అంటూ ప్రశ్నించింది. రాధ.
“నువ్వు స్పోర్ట్సుగర్లవి నేనెలానచ్చానీకు?”అన్నాడు కృష్ణమోహన్.
“మీరెంతో సంస్కారవంతులు కాబట్టే మీలోని లోపాన్ని మీరే ఎత్తిచూపుకుని నన్నువారించ ప్రయత్నిస్తున్నారు. మీలోని ఈనిస్వార్ధత నాకు నచ్చింది.మీ క్వాలిఫికేషన్ నాకు నచ్చింది. అన్నిటికంటే మీమాటల్లో మృదుత్వం, గంభీరత,నాకు మానాన్న దగ్గర ఉన్నంత భద్రత ఉంటుందనిపించింది.నాకింతకంటే ఎలా మాట్లాడాలో తెలియదు.”అంది రాధ.
బిగ్గరగా నవ్వాడు కృష్ణమోహన్.అన్నీ నీ అభిప్రాయాలేనా నాకభిప్రాయాలుండవా? నువ్వు నాకెందుకు నచ్చాలి?”అన్నాడు.
“ఠక్కుమని తలెత్తింది పౌరషంతో” రాధ.
చిలిపినవ్వుతో తననేచూస్తున్న కృష్ణమోహన్ని చూసి మొట్టమొదటిసారి సిగ్గుపడింది రాధ.తలవంచుకుని “చెప్పండి” అంది.
రెండడుగులు ముందుకువేసి రాధచేతిని తనకళ్ళకు ఆనించుకున్నాడు.కన్నీళ్ళతో రాధ చేతులు తడిసాయి.
“నాకు నువ్వు అన్నివిధాల నచ్చావు రాధా!బహుశా నిన్ను ఈ అవిటివాడి గురించే సృష్టించాడేమో!” అన్నాడు కృష్ణమోహన్.
“అప్రయత్నంగా రాధచేయి కృష్ణమోహన్ పెదవులను మూసింది.” అలా అనవద్దన్నట్లు.
★★★
చాలాక్లుప్తంగా కావలసిన సహృదయులైన బంధువులనిపిలిచి శాస్త్రోక్తంగా తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాధా కృష్ణమోహనుల.
వివాహం జరిపించారు వెంకటేశ్వర్లురెడ్డి, అనంతరెడ్డిలు.
“చూడచక్కనిజంట భగవంతుడు ఆలోపం ఎందుకు పెట్టాడో!” అనుకున్నాడు వెంకటేశ్వర్లు.
పోనుపోనూ వెంకటేశ్వర్లకి,రాజారెడ్డి, కేశవరెడ్డి, శ్రీ నివాసరెడ్డికి, జయలక్ష్మికి క్రష్ణమోహన్ వ్యక్తిత్వం,సహృదయం ఎంతో ఆకట్టుకుంది. కృష్ణమోహన్ లోని లోపం ఎవరికీ కనిపించటంలేదు. చంద్రశేఖర్ అయితే కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉంటే మంత్రముగ్ధుడవుతాడు.
అందరూ మనస్పూర్తిగా రాధా కృష్ణ మోహనులని చల్లగా ఉండాలని దీవించారు.
అనంతరెడ్డి మళ్ళీ జగదాంబ క్రష్ణమోహన్ ను చూసుకోవడానికి రాధని సృష్టించి పంపిందా అన్నంత ఆనంద పడ్డారు.
రాధ ఇంటర్ చదవటానికి కాలేజీలో చేరదామనుకునే లోపల కృష్ణమోహన్ కి గవర్నమెంటు కాలేజీ ప్రిన్స్పాల్ గా తిరుపతి బదిలీ అయ్యింది.
దాంతో తిరుపతిలో కొత్తకాపురం పెట్టకతప్పలేదు. రాధాకృష్ణమోహన్లకి.ఇప్పుడు రాధకి చేతినిండా పని.కృష్ణమోహన్ పనులన్నీ స్వయంగా చూసుకునేది.
కృష్ణమోహన్ సాహచర్యంలో రాధకు ఎటువంటి లోపంకానీ చిన్నతనానికిగానీ లోను కాలేదు .దానితో కృష్ణమోహన్ కి రాధ మీద గౌరవం ఇనుమడించింది.
కృష్ణమోహన్ నికాలేజీకి పంపి తను కాలేజీకి వెళ్ళేది.రాంగానే వంటచేసి కృష్ణమోహన్ గురించి ఎదురు చూసేది.
రాధకి డౌట్లు క్లియర్చేసి ఎలాచదువుకోవాలో గైడ్ చేసేవాడు.మంత్రముగ్ధై కృష్ణమోహన్ చెప్పేది ఆలకించేది.ఫస్ట్ ఇయర్ ఫైనల్సు అవటంతో పట్టు దలతో చదివి ఎక్జామ్స్ రాసింది.
అనుకోకుండా రెండురోజులు వరుసగా జ్వరం రావడం వాంతులు కళ్ళుతిరగడంతో డాక్టరుదగ్గరకెళ్ళిన రాధ, ‘తల్లి కాబోతున్న దన్నవార్త ఒకవైపు సంతోషం అయ్యో నాచదువు’ అనుకుంది.
పదిహేడేళ్ళకే ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా ఉండాలంది తిరుపతి డాక్టరు.
ఈవిషయంతెలిసి పద్మావతి, రాధని చిత్తూరుకు రమ్మని పుట్టింట్లోరెస్ట్ తీసుకుంటుంది.తను చూసుకోవడానికి వీలవుతుందని కృష్ణమోహనుకు చెప్పడంతో రాధని పుట్టింట్లో దింపాడుకృష్ణమోహన్.
ఎక్కడో కృష్ణమోహన్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. ‘మైనారిటీతీరని రాధ ప్రెగ్నెన్సీ చట్టవిరుధ్ధం.’అని.
‘రాధ క్షేమంగా ఉండాలి తండ్రీ.’అని పదే పదే శ్రీనివాసుని ప్రార్ధించాడు కృష్ణమోహను.
★★★
పాపంపుణ్యం,మంచీచెడు దేనితోనూ సంబంధంలేనికాలం దాని మానాన అది పరుగెడుతూనే ఉంది.
రాధకి ఎనిమిదోనెల నిండగానే నొప్పులు మొదలై సీరియస్అవటంతో ఎమర్జెన్సీ గా సిజేరియన్ చేసి బిడ్డని తీసి ఇంక్యుబేటర్లో పెట్టారు. రాధ పరిస్థితి ఆందోళనగా ఉంది.కృష్ణమోహన్ భగవంతుని ప్రార్ధించటం తప్ప ఏమీచేలేని పరిస్థితి.
అయితే భగవంతుని దయ వల్ల రాధ నెమ్మదిగా కోలుకుంటోంది.ఇటు అన్నావదినల సంరక్షణ తండ్రిప్రేమ.,
ఆడపడచు డా౹౹ పద్మావతి వైద్యం తో మామూలు మనిషయ్యింది.
పిల్లవాడికి ఏడవనెలరాంగానే,”నాన్నా! నేను తిరుపతి వెళ్తాను.ఆయన ఒంటరిగా ఏడాది నించీ అవస్త పడుతున్పారు.”అంది.
వెంకటేశ్వర్లు ఏమీ చెప్పలేకపోయాడు
కృష్ణమోహన్ మామగార్కి ధైర్యంచెప్పి రాధకి అసిస్టెంట్ ని పెడతానని చెప్పి అక్క దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకొని రాధని చంటివాడు ప్రణవ్ ని తీసుకుని తిరుపతి ప్రయాణంకట్టాడు కృష్ణమోహన్.
చిత్తూరు తిరుపతి జంటనగరాల్లాంటివి. ఎప్పుడుకావాలంటే అప్పుడు వచ్చి పోవచ్చునన్న భరోసాతో అందరూ వారిద్దరినీ సాగనంపారు.
మాతృత్వం ఒకమైకం. ఆమైకంలో ఆశలుఆశయాలు పటా పంచలైనాయి. రాధకిప్పుడు పసివాడు ప్‌ణవ్ మీదే ధ్యాసంతా.భర్తకి కావలసినవి సమకూర్చి కాలేజీకి పంపి, పిల్ల వాడిఠి పాలు,నీళ్ళు చూసుకోవటం, వాడికి వేక్సినేషన్స్ క్రమంతప్పకుండాఇప్పించటంలాంటి పనుతో రాధకి రోజెలా గడిచేదో తెలిసేదికాదు. సాయంత్రం కాలేజీనించి రాంగానే ఫ్‌ష్అయి భార్యాభర్తలిద్దరు పసివాడి తో ఆడుకునే వారు. వాడు తమ కలలపంటని,వారికి బంగారు బాట వేస్తాడని మురిసి పోయేవారు.
ప్రణవ్ ని మూడవ ఏట స్కూలులో చేర్పించాక కృష్ణమోహను రాధని అడిగాడు.
“రాధా!ఇంటర్ కంప్లీట్ చేస్తావా! అప్లికేషన్ ఫామ్ తెమ్మంటావా!” అని
“నాకు ఆశక్తిలేదు” అంటూ కొట్టిపారేసింది రాధ.
ఈలోగా కుటుంబంలో చాలా మమార్పులు వచ్చాయి .రాధతండ్రి రెండవసారి హార్ట్ఎటాక్ రావడంతో కాలంచేసారు.అనంతరెడ్డి పద్మా వతిదగ్గరకు షిఫ్ట్అవడంతో మనవడిని చూపించటానికంటూ చిత్తూరు ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి.
చిన్నన్నయ్యలిద్దరికీ వివాహమై ఎవరిసంసారాల్లో వారు తల మునకలయ్యారు.రాజారెడ్డి కొడుకులు ఇద్దరూ ఎమ్ ఎస్ చేయటానికి స్టేట్స్ వెళ్ళారు.
రాధ సంసారబాధ్యతలతో తన చదువు ఆశయం సంగతి మరుగున పడింది.ప్రణవ్ కి ఐదేళ్ళు నిండుతున్నాయి.వాడి తుంటరి చేష్టలతో రాధకి వేరే ఆలోచనే దరీచేరలేదు.
కృష్ణమోహన్ రాధని ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని పల్లెత్తమాట అనేవాడుకాదు.రాధ తెలివితేటలు చూసి పద్మావతి ఎంతో ఆనందపడేది.
ఒక్కపిల్లవాడిని సక్రమంగా పెంచుకుంటే చాలనుకున్న రాధాకృష్ణల నిర్ణయం ఆఏడుకొండలవాడికి నచ్చలేదు.రాధ ఇంకొక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి తండ్రుల అందాన్నంతా స్వంతం చేసుకుంది రాగిణి.తండ్రికి బంగారుతల్లి.
నెలకొకసారైనాకృష్ణ రాధచదువుగురించి టాపిక్ తేవటం రాధ దాటేయటంతో రాధ వైవాహిక జీవితం ఎనిమిదేళ్ళు గడిచాయి.
ప్రణవువ్ కి చదువుచెప్పటం వాడిచేత హోమ్వర్క్స్ చేయించటం,ఆటలు ఆడించటం,రాగిణిని ముస్తాబుచేటంతో ఒకరకమైన ప్రశాంతమైన జీవితానికి అలవాటు పడింది రాధ.
హఠాత్తుగా నెత్తి నపిడుగుపడ్డట్టయింది రాధకి.గుండె ఒక్కక్షణం కొట్టుకోవడంఆగింది.ప్రపంచమంతా శూన్యంగా ఉంది.సజలనయనాలతో కృష్ణమోహన్వంక చూసింది.అవునన్నట్లు తలవంచుకున్నాడు.టీపాయ్ మీద కాగితం రెపరెపలాడుతోంది నేనే విధి అంటే అన్నట్లు.
మళ్ళీ ఆకాగితం తీసుకుని చూసింది.
ఔను అది నిజమే అందులో డేట్సతోసహా కృష్ణమోహన్సర్వీస్ నోటిఫికేషన్.
‘పదిహేను ఏళ్ళు మాత్రమే కృష్ణకు సర్వీసుంది.అంటే.కృష్ణ తనకంటె పదిహేడేళ్ళు దగ్గిరదగ్గర పెద్ద.
మూడేళ్ళ రాగిణి తల్లి మెడచుట్టూ చేయివేసి ఉయ్యాల జంపాల ఊగుతోంది.
సహజంగానే తెలివిగలదైన రాధ తప్పెవరిదని ఎవరినీ నిలదీయలేదు.
రాత్రంతా నిద్ర లేమితో భార్యాహర్తలిద్దరికీ కళ్ళు మంకెనపూలయ్యాయి.
“రాధా! నన్ను క్షమించు పెళ్ళికిముందే ఎన్నోసార్లు చెబుదామనుకున్నా! కనపడే లోపంగురించి తప్ప గానీ కనపడని నావయసుతెలియదని.నీవెంత అమాకురాలవైతే పి.హెచ్ డి చేసిన నా వయసుని
కనీసం అంచనా వేయలేదు.
నీ అమాయకత్వంతో నిన్ను వాడుకోవటం అయింది.దానిలో నేను భాగస్వామిని.”అంటూ రాధ వళ్ళో తల పెట్టి రోదించాడు కృష్ణమోహన్.
‘రాధ కృష్ణమోహన్ కళ్ళుతుడిచింది.ఛ!ఊరుకోండి.మనకి రాసిపెట్టిఉంది.నా అంతట నేనే మిమ్మల్ని చేసుకోవానుకున్నా. మిమ్మల్ని చేసుకోవటం దురదృష్టంగా నేనెన్నడూ భావించలేదు.నేనిప్పుడు బాధ పడుతున్నదిఈ పసికందుల గురించి.
నేను సంపాయించటంలేదు.పిల్లల చదువులు పెళ్ళిళ్ళు మీ ఒక్కరి జీతంతో నెట్టుకు రావడం కష్టం.మీరు రిటైర్ అయినతరువాత ముందు జీవితం గురించి అలోచిస్తుంటేనే వణుకు పుడుతోంది.
ఇన్నాళ్ళు చదువుకోమంటుంటే పెడచెవిన పెట్టాను.ఈ ఏడాది ప్రైవేటుగా సెకండ్ ఇంటర్ కి ప్రపేర్ అవుతాను. మీరు నాకు తోడుంటే ఏదైనా సాధించగలను.”అంటూ ఆత్మస్థైర్యం తో కృష్ణమోహన్ వైపుచూసింది.