“ఎవరి జీవితానికి వారే”

నా భావాలకు కాస్త సమయం కావాలి
వ్యక్తపరిచే హక్కును నాకివ్వలేరు
అలవాటు పడటమే ఊరకుండటమే
ఆడదానిగా సంసారబాగు లక్షణమని చెప్పారు
అప్పటినుండి నా తెలివిని
కాలానికి,పరిస్థితులకు దహనం చేసిన
మనసపుడు చినిగిన బట్ట పేలికగా మారితే ఎప్పటిమాదిరిగానే జతపరిచి
కొత్త బొంతలా తీర్చిదిద్దాను
మెత్తటి పరుపులా అందరినీ హాయిగా
నిదురపుచ్చింది ఆ బొంత
కానీ నేను నిదురలేని రాతులతో
నా హృదయాన్ని రోజు తెరచిచూసుకునే నాతో నేను గడిపే ఉషోదయ చీకట్లు నాకు వెన్నెలలు
ఎన్ని తీరాలు దాటిన నా భావాలను దాటడం కష్టం
రెండు తీరాలు చూస్తున్న ఆడపిల్లలను
ఒకరు మొత్తం ముసుగు వేసుకొని ఉంటే
ఇంకో తీరంలో ఏమాత్రం దాచుకొని నీలిబొమ్మను
అవి రెండూ నేను కాదు కానీ ఎలా ఉన్నా నిందించేది నన్నే కదా
దిక్కుతోచని దీనురాలిగా ఎదను బరువుచేసుకుంటూ
ఎదుగుతున్న పిల్లలు ఓర్పును మరిచి
కభోదిలా ప్రపంచాన్ని మరిచి చేస్తున్న
చిందులను ఇపుడు దాచవలసి వస్తే
తల్లిగా నిలబడగలనా
ఎపుడూ అండగానే ఉన్నా
నీ మాటలను వింటూనే నా జీవితాన్ని దాటాను
ఫ్రీడమ్ అంటే నిర్వచనం తెలీని పిల్లలు
భావితరాలకు ఎలా భవితలు
సమాధానం చెప్పాల్సింది నిర్ణయించాల్సింది
ఎవరి జీవితానికే వారే
ఇప్పుడేం చెప్పగలం
గురువు వెనుక నవ్వే శిష్యులకు
అమ్మ వెనుక దాచే అబద్ధాలకు
మోసపోతుంది అమ్మానాన్న కాదు
వారిదివారే చినుగులు వేసుకుంటున్న తరాలు తీరాలు దాటాయి
అంటే నిజమేమరి కానీ తెలుసుకోలేని అబద్ధమదే

Written by Bhanuja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన – భాగం -8

The Cruise – ఓ దృశ్య ప్రయాణం Part 2