కలలే కన్నీళ్ళుగా

ఆకాశాన్ని తాకే తన కలలు,
ఆలోచనకి అంతుచిక్కని ఆశయాలు,
తీరమాల్లే తరుముతున్న తొలకరి కోరికలు,
ప్రయత్నాన్ని ఆపే పలు అడ్డంకులు,
కలలే కన్నీరై జారే ముగింపులు…
అలా కలలే కన్నీరై కరిగిన క్షణమున,
ఏ వెలుగులు చూడలేక,
కనురెప్పతో చీకటిగా మారిన తన జీవితం…
చివరికి ఓదార్పుగా మారిన కన్నీళ్లు…
చివరాకరి వరకు తోడుగా నిలిచిపోయే అనుభవాలు…
చితివరకు నిలిచిపోయే శోకం.

Written by K. Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“ఛోటా (హిమాలయన్) చార్ థామ్ యాత్ర”

నిష్క్రియా పర్వం