గోరింటాకు

కవిత

              గడ్డం సులోచన

గోరింట
ఓ మోస్తరు నెచ్చెలి..
సన్న సన్నని
ముళ్ళకొమ్మలు..
చిన్న చిన్న పచ్చలాకులు..
గుత్తులు గుత్తులుగా
ముత్యాల పూలు..

సౌందర్య రాశి
సుగుణాల వాసి
కృష్ణశాస్త్రి హృదయంలోంచి ఉప్పొంగిన అరుణారుణ భావాల ఝరి

వానలను
హరితహస్తాలతో
గోముగా పిలిచే
ఆషాడ శ్రావణాలు

ఒళ్లంతా చిన్న చిన్న కళ్ళతో గట్ల పైన పిల్ల దారుల పక్కన గున్నలుగున్నలుగా
ఒదిగి చూస్తుంటాయి.
పిల్లలను పెద్దలను
సూదంటు రాయిలా ఆకర్షిస్తూ,
మగువల మనసు దోచుకుంటాయి

చర్మ వ్యాధులకు ధన్వంతరి..
చల్లదనానికి హిమగిరి..
చూలింతకు
బాలింతకు ప్రశాంతి
నిచ్చే
మందు గోలీలు ఈ మైదాకు మాత్రలు

గోరింట పండుగ
దినాల్లో..
ఆకులతో ముచ్చట్లు
కలిపి రుప్పిన ముద్దను
అరచేతులు ప్రేమగా హత్తుకునే రాత్రి..
ఆ రాత్రినీ అందంగా
రంగరించిన అద్భుత
జ్ఞాపకం..

పుట్టింటికి వచ్చే
అమ్మవారు..
ఆడబిడ్డల సంబరాలు
గోరింట వాయినాలు
ఆచారాల ఆనందాలు
అరచేతిలో పూసిన మందారాలు

ఇప్పుడు నాకనిపిస్తుంది
లోకమంతా
మమతల
గోరింటలతో..
మందార మనసులై పూస్తే ఎంత బాగుండు!

Written by Gaddam Sulochana

పరిచయం
పేరు: గడ్డం సులోచన.
తల్లిదండ్రులు: గడ్డం సరోజినీ,రంగారెడ్డి.
భర్త: కొమ్మిడి లక్ష్మీనారాయణ రెడ్డి.
పుట్టిన ఊరు:
మంచాల, మంచాల మండలం, రంగారెడ్డిజిల్లా.
మెట్టినఊరు: పులిగిల్ల, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.
విద్యార్హతలు: ఎంఏ,బీఈడీ
వృత్తి: విశ్రాంతఉపాధ్యాయిని
పదవీ విరమణ: జూన్ 2024

సాహితీ ప్రస్థానం:
1) "నానీలోచనాలు" (కవిత్వం) ఫిబ్రవరి 2024 ప్రచురణ.
2)
"మాటలచెట్టు" (కవిత్వం)
మే 2024 ప్రచురణ.
చరవాణి: 7702891559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Brief Summary

నులివెచ్చని గ్రీష్మం