ప్రతి ఇంట గిల్లికజ్జాలు
ప్రతి బంధంలో
కయ్యాలు వియ్యాలు
హద్దుదాటని జగడాలు
సర్దుకున్నాక
సరదా సరదా సంగతులు
చేంతాడంతటి సమస్యలు
మూరెడు తీగలై నవ్వులు పూస్తవి
చిన్ననాటి అన్నదమ్ములు
అక్కచెల్లెల్లు
అల్లరి నేస్తాల
చిలిపి తగవులన్నీ
విరుపుల్లేని ఇడుపు లేని ఆటవిడుపులు
ఆస్వాదించే పుదీనా పిప్పరమెంట్లు
యాదికొస్తే మనసు
పూల పూల వాన..
మురిసిపోతూ ముచ్చటగా
అల్లుకునే జ్ఞాపకాల మాల
గిల్లికజ్జాలే చిలికి చిలికి గాలి వానైతే
లాగి లాగి తెగిపోయే దారాలు
తక్కువ చేయడం
ఎక్కువ అనుకోవడంలోనే చిక్కంతా.
చిన్ని చిన్ని అలకలు
గోడ మీది మరకలు
తుడుచుకునే మనసుంటే
బంధమేదైనా అందమే!
Back to Top