శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం

కవిత

యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే…
శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…
చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!
వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!
కలలన్నీ కాలిపోయి మిగిలిన ఒంటరి డొక్కలను
ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాలను
ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?
సహాయం చేయడమంటే దానం కాదు,
మనిషి మనిషిగా నిలవడం..!
ఒక గుండె విరిగిన కథ ఇది..!
ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు
మనసు తడిపే కన్నీటి గానం ఇది !

మనిషి కోసం మనిషి నిలవాలని చెబుతున్న
మనసున్న మనిషి హృదయావేదన ఇది!!

Written by Manjula Patipati

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రదాయ కేదారాలు మన దేవాలయాలు

చిలిపి తగవులు