తెలియని రహస్యం

8-2-2025 తరుణి పత్రిక సంపాదకీయం

సాధారణంగా మనుషుల చైతన్యాన్ని గమనిస్తే వాళ్ళ వాళ్ళ సామాజిక అనుభూతులు గానే వాళ్ల వ్యక్తిత్వాలు బయటపడుతుంటాయి. అవును ఇది వింతగానే అనిపిస్తుంది. కానీ, ఇది నిజం. అనుభూతి అంటే ఇంగ్లీష్ లో experience అనీ feeling  అనీ అంటుంటారు.అనుభూతి, అనుభవం అంటే ప్రత్యక్షమైన ప్రామాణికమైన జన్య జ్ఞానాన్ని కలిగి ఉండేది అని వివరణ ఇచ్చుకోవచ్చు. అంటే మనిషి లోపల ఉండే  అంతఃకరణాలు, అరిషడ్ వర్గాలు మనిషి పై పని చేసే తీరు తెన్నులు  అన్ని వస్తాయి. ఇక్కడ తెలియని రహస్యం ఏముంది అంటే మనం అనుకుంటూ ఉంటాం నాదైన వ్యక్తిత్వం నేను నాది అనే మాట. ఎదుటి వ్యక్తితో నేను అని పదేపదే అంటుంటారు కానీ ఈ వ్యక్తిత్వం పై ప్రభావం చూపించేవి ‘అవసరాలు’. ఇదే తెలియని రహస్యం. దీంట్లో చాలా విషయాలు వస్తాయి. ఆహారం తీసుకునే రుచులు ఆకలి దాహము వంటి విషయాలు, సంతోషాలు బాధలు వంటి ఫీలింగ్స్ ఇవి కాకుండా సెంటిమెంటల్ ఆటిట్యూడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒక్కొక్కళ్ళకు ఒక్కో రీతిలో భిన్నమైన తీరులలో ఉంటాయి.

ఉదాహరణకు మద్యపానం సేవించడం, తాగడం, తీసుకోవడం తప్పు అని చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. ఇక్కడ ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితిలను సృష్టించారు. అది ఈ కాలంలో కాదు అనాదిగా వస్తున్నదే ‘సురాపానం’ గురించి మనకు ఎన్నో కథలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి చారిత్రక సత్యాలు ఉన్నాయి . దీనివల్ల రాజ్యాలే పడిపోయాయి, రాష్ట్రాలే విడిపోయాయి కుటుంబాలే కూలాయి.

సైద్ధాంతిక ప్రక్రియలు అన్నీ చూస్తాం ఈ విషయం పైన సగటు జీవుల, సంఘ జీవుల జీవన క్రమాన్ని అంచనా వేయాలి. దీంట్లో  Extroverted ఎలా ఉందో చూడాలి. అంటే లోకానుభూతులు ఎట్లా ప్రభావితం చేస్తాయో గమనించాలి.Introverted పనితనాన్ని పసిగట్టాలి.అంటే ఆత్మానుభూతులు ఎలా ఉన్నాయో ఓ నిఘానేత్రంతో ఎక్స్ప్లోర్ చేయాలి.

కానీ అత్యంత రహస్యంగా చేయాలి. నలుగురి ముందు మాట్లాడితే ఆ వ్యసనపరులకు నచ్చదు. దీనికంత పునాది ఎక్కడా అంటే ఇల్లు.. ఇంట్లో మనుషులు… కుటుంబం.. సంతానం.. ఇవే వస్తాయి. దీంట్లో నాయకులు ఎవరు ఉండరు ఉప నాయకులు అంతకన్నా ఉండరు. బాధ్యత అనే భావమే నాయకత్వం వహించాలి. ఈ మధ్య మద్యపానం అనేది ఓ సమస్య గానే పరిగణించడం లేదు. చాలా కామన్ గా చాలా నాచురల్ గా తాగుతున్నారు. దేశీయ సరుకు, విదేశీ సరుకు విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. ఇవే ప్రభుత్వాల ఆదాయం అయిన ఆ రాజకీయాలను పట్టించుకోకుండా ఇంటి వ్యక్తులు ముందు పడాలి.

కుటుంబమనే దీపానికి నూనె తండ్రి. అంటే భర్త బాధ్యత.వత్తి తల్లి. అంటే భార్య బాధ్యత . ఇద్దరూ ఈ వెలుగులు సమంగా పంచినప్పడే మంచి దారిలో పిల్లలు నడుస్తారు. భావి జీవితం బంగరుమయం అవుతుంది.

ఏం చేస్తే ఇది సాధ్యమవుతుంది ఎట్లా అంటే, పిల్లలకు పని కల్పించడం. అంటే తల్లి తండ్రులు వాళ్ళు చేసే పనుల్లో భాగస్వామ్యాన్ని కల్పించడం. పనికి తగ్గ ప్రతిఫలాన్ని అందేలా చూడడం అంటే ఇదేమైనా కూలీ డబ్బులా?  కాదు ఒక చిన్న మెచ్చుకోలు అదే మాట పిల్లల ఆలోచనలకూ, సృజనాత్మకతకు బూస్ట్ అవుతుంది.

దానివల్ల ఇంకా ఇంకా పని చేయాలి, మనమందరమూ ఒకటే , అమ్మానాన్న కష్టపడుతున్నారు, ఈ కష్టం మనకోసమే అని ఆలోచన పిల్లలలో కలుగుతుంది. ఇప్పుడే ఘోర పటాటోపాలతో పోకుండా,ఏ  లోపాలు లేకుండా ఉండడం .ఒకరితో ఒకరికి ఐక్యత అనేది కల్పింప చేయడం. దీనివల్ల కుటుంబ పునర్నిర్మాణం అనే ఒక సంస్థాగతభావం ఏర్పడుతుంది. అంటే వ్యక్తి పటిష్టత నుండి సమిష్టి ప్రతిష్ట తో కు వీలవుతుంది. ఒక చక్కని ఫీల్ వస్తుంది. వీటివల్లనే బయట ఆకర్షణలకు లోను కారు. అయితే ఇందులో నటన ఉండకూడదు నటించినా కూడా వాళ్ళ ముందు నటనలా బయటపడకూడదు. జీవితమే ఒక నాటకరంగం కదా. పిల్లలకి ఏది చెప్తారో అది అనుసరించడం ఇది చాలా ముఖ్యం. One sincere affection అనేది feel good తో చేస్తే ప్రేమానుబంధంతో కట్టివేయబడతారు. అబద్ధాలు చెప్పరు ,తప్పుడు పనులు చేయరు .ఇంతకన్నా దేవరహస్యం ఇంకేం ఉంటుంది ఇదే.

ఇది జాతి పునర్నిర్మాణం కాదు. ఓ పిడికెడు ఆత్మవిశ్వాసాన్ని ఓ గుప్పెడు సహనశీలతను వంట పట్టించుకుంటే మనం మన ముందున్న  సమస్యలన్నీ ఛేదించగలం . ఇదే వ్యక్తిత్వ సౌధాన్ని నిర్మించుకోవడం. వ్యక్తిత్వం నిర్మించుకోవడానికి మనస్సుల్లో ఉన్న Grand Greater Gate ను open చేయాలి.

____***___

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పిట్టె ముట్టుడు

యూరోప్ ట్రిప్ – 13