నమ్మిచెడినాంక…

కవిత

ఆడెల్లి పోయిండక్కా , మళ్ళీ రాడు
పొద్దులు రాకముందే పుట్టి ఆ నాడు
రోజులు రాకముందే నిన్ను నెట్టి ఈ నాడు..
ఆడెప్పుడూ నీకు మోసమే చేసెనక్కా !
ఆటోల తెచ్చి , చెట్టు కింద కూక పెట్టి
మల్లొస్తనంటే నమ్మేసినవా !
బ్రెడ్ ముక్కలిచ్చి , నీళ్ళ సీస నిచ్చి , నిమ్మల్లంగ జారుకున్నరు.
ఊరి పొంట కే యెల్లి పోయిండ్రు.
ఎండ యేడి కి నువ్వు దూప గొన్నవా !
ఆకలి కి అలో అన్నవా !
ఎన్నడెరగని బస్తి ల ఏమైతవో అన్న చింత
గింతన్న లేక పాయె !
జనమెందరు తిరిగుతున్నా నిన్నెవరు గానరక్కా !
పెట్టేందుకు చాచిన చెయ్యి ని అడిగేందుకు చాస్తే , పొద్దంత నిల్సున్నా , నీ పొట్ట నిండదక్కా !
ఇన్ని ఒద్దులు అమ్మవు , ఈ రోజు కెల్లి అడుక్కంటవు .
ముద్దులాడి పెంచినోడు , ముష్ఠి దాన్ని చేసె.
న్యాయమెక్కడున్నది ,, నమ్మి చెడినాంక .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం – నేరెళ్ల శారద

దేవుడు నవ్వాడు