తొలకరి చినుకువై కురుస్తావా!
నీలి మేఘమై తేలి వస్తావా!
మలయ మారుతంలా అలవోకగా స్పృశిస్తావా!
నాకళ్ళను అంటి పెట్టుకున్న కన్నీటి బిందువై ఉండి పోతావా!
నా కలం ఒలికించే అక్షరాలలో భావమై నన్ను అలరిస్తావా!
జ్ఞాపకాల పందిరిలో పూలన్నీ సౌరభాలు వెదజల్లుతూ..
నీవున్నావనీ నన్ను మురిపిస్తుంటే..
నీ పిలుపు కరువైన మనసు..
నీవు లేవనే నిజాన్ని సాక్ష్యంగా చూపించి..
నన్ను ఎడారిలో ఒంటరినై పయనించమని..
అంతర్లీనంగా దిశా నిర్దేశన చేస్తుంటే..
నీకై నేను నిరాశ వాకిట ఎదురు చూడనా!
నిస్తేజంగా కన్నీటితో ఇలాగే కాలం గడపనా!
విధి నిర్ణయం అని సరిపెట్టుకోనా!
కలిపింది ఆ విధియే కదా!
బంధాలను అవలీలగా కాల రాయడం నేర్పరి తనమా!
సంధించిన ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుసు..