ఆమె ఓకవయిత్రి అధ్యాపకులుగా పనిచేసి ఎన్నో గ్రంథాలు రచించారు. బాల్యంనుంచీ సాహిత్య ప్రేమికురాలు. పద్యగద్యంలో ఆరితేరారు. హిందీ అధ్యాపకులైనా తెలుగుసంస్కృతంపై పట్టుసాధించారు.ఆమె ఆధ్యాత్మిక గురువు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారు.భర్త తో కలిసి స్వామి శిష్యులై వివిధ ఆశ్రమాల్లో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు.గంగగారు ఒరిస్సాలోని మాచ్ఖండ్ లో పుట్టారు. కొప్పాడ చంద్రావతి నారాయణ మూర్తి దంపతులు ఈమె తల్లిదండ్రులు.10 వక్లాస్ దాకా అమ్మమ్మ గారి ఊరుముమ్మడివరంలో చదివారు.ఈమె మాతామహుడు మేడా భైరవస్వామి కవీశ్వరులు.బి.ఎస్.ఎన్.ఎల్.లో పనిచేసే కోటేశ్వర రావుగారితో పెళ్లి కాగానే విశాఖ పట్టణంలో స్థిర పడ్డారు.బి.ఎ. హిందీ ఎం.ఎ.చేశారు.హిందీ టీచర్ గా పనిచేశారు.2005 లో కుర్తాళం స్వామివారి సమక్షంలో కవితాగానం చేయటం ఓమలుపు.ఆమె కవితలు వ్యాసాలు ఎన్నో మాసపత్రికల్లో వచ్చాయి.2016 నుంచి పద్యరచన చేస్తున్నారు.వివిధ ఛందస్సుల్లో తొలిసారి శ్రీమాతా శతకాన్ని రాశారు.ప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ కోలవెన్ను మలయవాసిని ఆనాటి ఆంధ్రాయూనివర్శిటీ ప్రొఫెసర్ ఈమె రచనాశైలిని ప్రశంసించారు.

బయోడేటా
పేరు: మాతా గంగా భవానీ శాంకరీ దేవి
అత్తమామలు: వరలక్ష్మి, అప్పలరాజు గారలు
తల్లిదండ్రులు: చంద్రావతి, నారాయణ మూర్తిగారలు
భర్త: మాతా కోటేశ్వర రావు, బిఎస్సెఎన్ ఎల్(విశ్రాంత), విశాఖపట్టణం
విద్యార్హతలు: హిందీ భాషా ప్రవీణ, ఎమ్.ఏ(హిందీ)ఎయు
ఉద్యోగం: హిందీ ఉపాధ్యాయురాలు (పూర్వo)
నివాసం: విశాఖపట్టణం
ఆధార్ నెం.8672 4176 4720
ఫోన్ నెం: 7981338902
రచనలు:
1. “ఎనుకుదురాట” – అచ్చతెలుగు అష్టావధానము, కాలిఫోర్నియా సిలికానాంధ్ర వారి ప్రచురణ. జూలై 2018లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవిష్కరణ. ఇండియాలో అవనిగడ్డలో 15-08-2018 నాడు ఆవిష్కరణ. అష్టావధాని- శ్రీపాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు.
2. విజయమాత శతకము.9/2018
3. కాశీ విశ్వనాధ శతకము.9/2018
శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా విశాఖపట్టణం లలితా పీఠంలో ఆవిష్కరణ.
4. కుర్తాళహనుమోదాహరణ ఉదాహరణ కావ్యము, సిద్ధేశ్వరిమాత దండకం, మరకత కాళీ దండకం. శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా కర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠంలో 07/2022 ఆవిష్కరణ
5. గణపవరపు శ్రీసువర్ణేశ శతకం, దండకం (రుద్రరాజు ఫౌండేషన్ వారి ప్రచురణ) గణపవరంలో 08/2022 ఆవిష్కరణ
6.అనంతఛ్ఛందస్సౌరభము వివిధ ఛందస్సులతో వంద శతకాల సంకలనంలో ఒక శతకం 10/2022 ఆంధ్రావిశ్వవిద్యాలయంలో ఆవిష్కరణ.
8. భరతమాతకు ఉత్పల గజమాల సంకలనంలో 256 పద్యపాదాలు.
7. శక్తిజ్యోతి మాసపత్రికలో నెలనెలా ప్రాచీన మహిళాజ్యోతి శీర్షికలో ప్రాచీన సాధ్వీమణులపై వ్యాసాలు.
8. మౌనప్రభ, లలితప్రభ,శక్తిజ్యోతి, సృజనరంజని(అంతర్జాల) మాస పత్రికలలో అనేక పద్య సంకలనాలలో 300కి పైగా ఆధ్యాత్మిక వ్యాసాలు, పద్యాలు.
9. శ్రీమాతా శతకం ! (గురుత్రయ మకుట వివిధ ఛందశ్శతకము) శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా విశాఖపట్టణం లలితా పీఠంలో 28-07-2023 నాడు ఆవిష్కరణ.
10. ‘శ్రీమాతా’ నాచేసృజించబడిన నూతనవృత్తం (చతుశ్శతిపద్య సంకలనం అనంతఛందం ప్రచురణ) హైదరాబాదు కర్మణఘాటు అయ్యప్ప గుడిలో 27-8-2023 నాడు ఆవిష్కరణ
11. ‘బంధ కవితాంజలి’ అంతర్జాతీయ తెలుగు మహాసభలు, కాలిఫోర్నియాలో ఆవిష్కరణ 22-10-2023
12. “బంధ కవితాంజలి” ఇండియాలో మహాశివరాత్రి 08-03-2024 కాశీలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ
13. తిరుప్పావై పాశురములు తెలుగు శతక పద్యమాలిక 30-03-2024 కాశీలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ
14.`కవన గంగా తరంగిణి`పంచ శతక,ఉదాహరణ కావ్యముల సంకలనము 15-09-2024 నాడు వారణాసి సిద్ధాశ్రమములో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరణ
అముద్రితాలు: కాశీ మహాత్మ్యము, చిత్రబంధ కవిత్వం శతాధికం( అన్నీ ప్రచురణకు సిద్ధం), దేశభక్తి-జాతీయత త్రిశతి పద్యకావ్యం (తానావారి ఈ పుస్తకంలో ప్రచురణకు సిద్ధం), కాళీ శతకము
సత్కారములు:
1. 2018 జూలైలో కాలిఫోర్నియలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారిచే ఎనుకుదురాట (అచ్చ తెలుగు అష్టావధానం) పుస్తకావిష్కరణ సభలో సన్మాన సత్కారo.
2. 2018 ఆగష్టు 15 నాడు అవనిగడ్డ లో శ్రీమండలి బుద్ధ ప్రసాద్ గారు శ్రీకూచిభట్ల ఆనంద్ గారి చేతులమీదుగా ఎనుకుదురాట పుస్తకం ఇండియాలో ఆవిష్కరణ, సత్కారం.
3. 2019 జనవరిలో కుర్తాళంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానoద భారతీ స్వామి వారి సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా పద్యమాల సమర్పించి నందుకు అభినoదన సత్కారం.
4. 2020 ఫిబ్రవరిలో విశ్వనాధ సత్యనారాయణ వారి రంజని సంస్థ పద్యపోటీలలో గెలుపొoదినందుకు హైదరాబాదు, త్యాగరాయ గానసభలో బహుమతి సత్కారం.
5. 2022 ఏప్రిల్ లో అంబేద్కర్ భవనం విశాఖలో శ్రీశ్రీ కళావేదిక వారిచే పల్లెగూటికి పండగొచ్చింది జాతీయస్థాయి పద్యకవితకు బహుమతి, సత్కారం.
6. 2022 జూలైలో కుర్తాళంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిచే సత్కారం
7. 2022 జూలైలో తిరుపతి, అన్నమాచార్య ఆడిటోరియంలో తెలుగు సంసృత శతావధానంలో పృచ్ఛకురాలిగా పాల్గొన్నందుకు సత్కారం
8. 2022 ఆగష్టు లో గణపవరంలో రుద్రరాజు ఫౌండేషన్ వారిచే గణపవరం శ్రీసువర్ణేశ శతకం పుస్తకావిష్కరణలో బహుమతి, సత్కారం.
9. 2022 అక్టోబర్ లో ఆంధ్ర విశ్వ విద్యాలయ ప్రాంగణంలో అనంత ఛందంవారిచే అనంతఛ్ఛందస్సౌరభము వివిధ ఛందస్సులతో వంద శతకాల పుస్తకావిష్కరణ సభలో సత్కారం.
10.’శ్రీమాతా’ నాచేసృజించబడిన నూతనవృత్తం (చతుశ్శతిపద్య సంకలనం అనంతఛందం ప్రచురణ ఆవిష్కరణ సందర్భంగా సత్కారం, హైదరాబాదు 8/23
11.15-09-2024 నాడు వారణాసి సిద్ధాశ్రమములో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా సత్కారము.
ప్రశంసా పత్రాలు:
1.వాగ్దేవి కళాపీఠం విజయవాడ కవనవేదిక
2.శ్రీ శ్రీ కళావేదిక,(అంతర్జాతీయ గుర్తింపు)
3.మనుమసిద్ధి కవన వేదిక
4.కవి తారల సాహితీ వేదిక
5.రామదాసు కళాసంస్థ
6.ఉస్మానియ తెలుగు రచయితల సంఘం 7.తెలంగాణా సాహిత్య కళా పీఠం
8. వాగ్దేవీ సాహితీ వేదిక
9. మగువ మహారాణి సంస్థ
10.సాయివనంలో సాహిత్యం,హైదరాబాదు
11. సేవా అంతర్జాతీయ సంస్థ
12. మహతీ సాహితీ కవితా వేదిక
13.కవి పత్రిక
14.గోదావరి రచయితల సంఘం, రాజమండ్రి
15.కవికుల సాహిత్య వేదిక
16.శ్రీశ్రీ కవన వేదిక- రాజరాజేశ్వరీ అమ్మవారికి ఉత్తమ వచన కవిత
17 మహతీ సాహితీ కవి సంగమం,
కరీమ్ నగర్
18.తెలుగువెలుగు సాహిత్య జాతీయవేదిక
19.ఉత్తర అమెరికా తెలుగు సంఘం,తానా ప్రపంచ సాహిత్య వేదిక
20 కలం స్నేహం సంస్థ(ఉగాది సందర్భంగా)
21. శ్రీశ్రీశ్రీనివాస కవన వేదిక
పై సంస్థలు అంతర్జాలం ద్వారా నిర్వహించిన పద్య గద్య కవితా విషయాలపై అనేక రచనలు చేసినందున ప్రశంసా పత్రాలు ఇచ్చారు.
అంతర్జాల అవధానములు:
1.మహతి యూట్యూబ్ ఛానల్
2.సాహిత్య సుధాంబుధి
3.కళా స్రవంతి
4.గోదా సంస్థ
పైసంస్థలు నిర్వహించిన అనేక అవధానాలలో పృఛ్ఛకురాలుగా పాల్గొనడం జరిగింది
వీరి పెద్ద కుమార్తె కాలిఫోర్నియాలో ప్రభుత్వ డాక్టర్.అల్లుడు అమెజాన్ లో సీనియర్ పొజిషన్ లో ఉన్నారు.కొడుకు ఎం.టెక్ ఐరోపాకంపెనీకి సీనియర్ ఇంజనీర్. గంగగారు భర్త తో కల్సి
పీఠాధిపతి సాధనలు హోమాలు చేస్తుంటారు.ఇలా ఆధ్యాత్మిక జీవితం గడపటం పూర్వజన్మ సుకృతం.ఇలా జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న ఈదంపతులు మనందరికీ ఆదర్శప్రాయులు
