మన మహిళామణులు – శ్రీమతి మద్దాలి కృష్ణకుమారి

వయసుకి హాబీకి సంబంధంలేదు అంటున్న శ్రీమతి మద్దాలికృష్ణకుమారి????

ఆమె తండ్రివైపు సంగీత సాహిత్య కుటుంబం.ఆమె ఒక గృహిణిగా తల్లిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత కాలాన్ని సద్వినియోగం చేయాలనే తలంపుతో ఇప్పుడు నటనపై దృష్టిపెట్టారు. ఒకప్రక్క మ్యారేజ్ బ్యూరో నడుపుతూ వేరొక వంక టి.వి.సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా రాణిస్తున్నారు.పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు సంగీతవేత్త.ఆయన చెల్లెలు కృష్ణ కుమారికి బామ్మ, ఓగిరాల సౌభాగ్యలక్ష్మి. తల్లిదండ్రులు ఓగిరాల రాజ్యలక్ష్మి రాధాకృష్ణమూర్తి.ప్రసిద్ధ రంగస్థలనటులు అద్దంకి శ్రీరామ మూర్తి గారి భార్య ఈమెకి మేనత్త.అందుకే కృష్ణ కుమారికి సంగీత సాహిత్యాలతో సంబంధం ఉండటంతో కళారంగంలో నటిగా పైకివచ్చారు.సంగీతంని కృతులదాకా వంకమామిడి వీరరాఘవయ్యగారి వద్ద నేర్చుకున్నారు.

16వ ఏటనే తండ్రి మిలట్రీ లోచేరటం,సుబేదారు మేజర్ గా చైనా చైనావార్ లో పాల్గొన్నారు.దేశ సరిహద్దుల్లో ఉండే తండ్రివల్ల తను అన్న తమ్ముడు,అమ్మ బామ్మ దగ్గర విజయవాడ లోనే ఉండిపోయారు.తండ్రికి ఔరంగాబాద్ ట్రాన్స్ఫర్ కావటంతోఆర్మీ క్వార్టర్స్ లో ఉండి ఆర్మీ స్కూల్లో చదివారు ఆమె.తండ్రికి కచ్ బార్డర్ కి ట్రాన్స్ఫర్ కావటంతో అమ్మ తో సహా విజయవాడ లో బామ్మ దగ్గర ఉన్నారంతా. 10వ క్లాస్ కాగానే తల్లి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది.టైప్ హయ్యర్ పాసవటం, ఉమ్మడి కుటుంబంలోమూడో కోడలుగా కొత్త జీవితం ఆరంభమైనది.భర్త కి హెచ్.ఎ.ఎల్.లో జాబ్ కాబట్టి బెంగుళూర్ లో కాపురం 3కొడుకులతో జీవితం సాఫీగా సాగింది.తమిళ కన్నడ హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడుతారు ఆమె.1996లో భర్త హఠాత్ మరణం,ముగ్గురు కొడుకులు 8,9,10 క్లాసుల్లో ఉన్న సమయంలో ఆర్థిక బాధలు వేధించినా ఒక స్కూల్లో టైపిస్ట్ గా,ఆతర్వాత చాల ప్రైవేట్ జాబ్స్ చేసి పిల్లలందరినీ ఒంటిచేత్తో వృద్ధిలోకి తెచ్చారు కృష్ణ కుమారి.పెద్ద బ్బాయి నేవీ ,రెండు మూడు సాఫ్ట్వేర్.కుటుంబపోషణకై ఒక్క గదిలో ఉండి మిగతా ఇల్లు అద్దెకిచ్చి సంసారం నడిపారు.భర్త పెన్షన్ రావటంతో కాస్త కుదుట పడ్డారు.పిల్లల పెళ్లి మనవలు, యు.ఎస్.ఢిల్లీ పుణె మొదలైన ఊళ్లకెళ్లారు కొడుకులు కోడళ్లతో కాలం గడిపారు.ఓపిక ఉన్న ప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే 2010లో మ్యారేజ్ బ్యూరో పెట్టారు.భావనాత్మక వివాహ వేదిక లో అనుభవం గడించి ఇంట్లోనే స్పందన వివాహవేదిక నడుపుతున్నారు.ఖాళీగా కూచోకుండా తనలోని టాలెంట్ ని మెరుగు పర్చుకోవాలని అనుకున్న టైంలో2020లో టి.వి.సీరియల్ నటి నాగలక్ష్మి ప్రోత్సాహంతో నేడు వయసుకి తగిన పాత్రల్లోరాణిస్తున్నారు 5కే ఇంటినుంచి బైలుదేరితే యూసఫ్ గూడాలో అన్ని టి.వి.ఛానల్స్ బస్సులు ఎక్కించుకుంటాయి.లొకేషన్ లో పాక్యప్ చెప్పాక ఇల్లు చేరేప్పటికి 11దాటుతుంది.కోఆర్డినేటర్స్ ద్వారా ఛాన్సులొస్తాయి.ఈమె నటించిన కొన్ని సీరియల్స్*శతమానంభవతి,మనసంతా నువ్వే,దీర్ఘ సుమంగళి* దాదాపు 10 ఉన్నాయి.సుమన్ టి.వి.లో అందమైన అనుభవం మందుల బట్టల యాడ్స్, ఎన్నికల టైంలో నటించిన అనుభవాలు మరపురానివి అంటారామె. సీనియర్ సిటిజన్ గా యాక్టివ్ గా ఉంటూ మనకాళ్లపై మనం నిలబడితే ఏదో ఒక హాబీతో జీవితం సాఫీగా సాగుతుంది” అనే ఆమె మాటలు అక్షర సత్యం

ఖుషి మూవీ కీ మా అందరిని రెండు బస్సులలో అన్నవరం లో షూటింగ్ మూలంగా వెళ్ళాము. నా లైఫ్ లో నేను అన్నవరం వెళ్ళలేదు ఎప్పుడూ షూటింగ్ పుణ్యమా అని మనస్ఫూర్తిగా భగవంతుడు ని దర్శనం చేసు కున్నాము. అంతే కాకుండా చాలా షూటింగ్స్ సీరియల్స్ వి టెంపుల్స్ లో జరుగుతాయి నేను ఎప్పుడూ చూడని టెంపుల్స్ చూసే అవకాశంలభిస్తోంది. ఈ వయసులో ఇంత కన్నా కావలసింది ఏముంది. చిన్నా, pedda నటులు అందరు ఖాళీ సమయంలో రీల్స్ చేసుకుంటూ, పాటలు పడుకుంటు ఎంతో సరదాగా సమయం గడిచి పోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

మన మహిళామణులు – శ్రీమతి భారతీకృష్ణ