ఆడపిల్లగా బతకడం అంటే
ఏమో అనుకున్నా…
బాల్యం నుంచే ఆంక్షలు
ఎందుకో అర్థం కాలేదు.
అమ్మ మాటలు విన్నప్పుడు
అవేంటి అనిపించింది…
పెద్దయ్యాక తెలిసింది—
నేను ఆడపిల్లనని.
అణిగి మణిగి ఉండాలని,
ఆధారపడి బతకాలనని
అప్పుడు అర్థమైంది
ఆడపిల్లల బాధ ఎంతనో.
అందుకే చెబుతున్నా
చదువు ఒక్కటే మార్గం,
ఆడపిల్లకు నిజమైన వరం.
