నేను ఎవరో తెలుసుకో!

కవిత

Kavali Rukmini MPC 2

అందం చూసి వచ్చావు,
అది నీ తప్పు కాదు
నిన్ను నమ్మినదే నా తప్పు.

అవసరం కోసం దగ్గరయ్యావు,
ఆ అవసరం తీరగానే వెళ్లిపోయావు
ఇప్పుడు చూస్తే
అది ప్రేమ కాదు, నీ స్వార్థం.
అని తెలుసుకున్నా

“దాసోహం” అన్న మాటలు,
ఇప్పుడు వినిపిస్తే నవ్వొస్తుంది.

ఎందుకంటే
నేను ఎవరో ఇప్పుడు నాకు తెలుసు.
నన్ను వాడుకునే వాళ్ల కోసం కాదు నేను,
నన్ను గౌరవించే వాళ్ల కోసం పుట్టాను.
నువ్వు వదిలేసింది అమ్మాయి కాదు,
నువ్వు కోల్పోయింది ఒక విలువ.
ఇక మళ్లీ వెనక్కి తిరిగి చూసే పని లేదు,
నా దారి… నా నిర్ణయం.

నేను ఒంటరిగా కాదు
నా ఆత్మగౌరవం నాతో ఉంది.
నన్ను తక్కువగా చూసిన ప్రతి చూపుకి,
నా మౌనమే సమాధానం.

Written by Kavali Rukmini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రైతుబిడ్డ

ప్రేమ ఖరీదు