తెలుసుకుందాం!

మనకు కొన్నివిషయాలు ఆసక్తిని కలగజేస్తాయి. అలాంటి కొన్ని సంగతులివి.

ఇప్పుడు కలర్ వాకింగ్ అనే కొత్త ట్రెండ్ వచ్చింది.నడిచేటప్పుడు ఇది ఫిట్నెస్ ట్రెండ్.నడిచే వ్యక్తి ప్రకృతిలో ఒక రంగుని ఎన్నుకుని ఆరోజు వస్తువులను వెతుకుతూ వెళ్లడం అన్నమాట! పూలు,గోడ,ఇల్లు దుస్తులు,సైన్ బోర్డు వాహనాలు వెతుకుతూ చూస్తూ పోవటం వల్ల మెడిటేషన్ క్రియేటివిటీ పెరుగుతుంది.ఊహాశక్తి పెరుగుతుంది.రోజుకో రంగుని తల్చుకుని వెతుకుతూ నడవటంలో ఓమజాతో పాటు బోర్ కొడ్తోంది అన్న పదం మాయం అవుతుంది.నెగిటివ్ భావాలు తుడిచిపెట్టుకుపోతాయి.నేచురల్ థెరపీ ఇది.మందులతో పనిలేదు.సహనం ఓర్పు ,మూడ్స్ పై నియంత్రణ, హాపీ హార్మోన్ల విడుదల జరుగుతుంది.

విమాన ప్రయాణంలో కొబ్బరికాయ తీసుకునివెళ్లరాదు. ఫ్లైట్ లోషార్ప్ మొనదేలిన వస్తువులేకాదు, ఎండిన కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టేది లగేజ్ లో ఉంటే ఎక్కనీయరు.కారణం ఏమంటే వేడిని త్వరగా గ్రహించి మండిపోయే ప్రమాదం ఉంది.కొబ్బరికాయ లోపల పేలుడు పదార్థాలు పెట్టే ఛాన్స్ ఉంది.కొబ్బరిముక్కలు తీసుకువెళ్లొచ్చు. కొబ్బరిబొండాంని కూడా అనుమతించరు. ప్లేన్ కాబిన్ లోచేపలు, పచ్చిమాంసాన్ని బ్యాగ్ లో పెట్టితీసికెళ్లరాదు.

తక్కువ ఖర్చులోమనం ఈవిదేశాలకు వెళ్లొచ్చు. నేపాల్ కి వీసా తో పనిలేదు.మన భారతీయ రూపాయిని వాడవచ్చు.భారత్ హిల్ స్టేషన్ ఖర్చు తో నేపాల్ వెళ్లిరావచ్చు.వియత్నాంలో హానోయ్ హొచిమిన్ సిటీలు అందమైన ప్రాంతాలు.థాయిలాండ్ లోతక్కువఖర్చుతో ఆనందంగా విహారం చేయవచ్చు.ఇండోనేషియా,భూటాన్లో మనరూపాయితో ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు.టీతోటలతో శ్రీలంక సుందరదృశ్యాలతో అలరిస్తుంది. వీసా సులభంగా దొరుకుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విస్ఫోటనం ….

అనామకులెవరు? ( కాలమ్ )