ఆలు-మగలు

వ్యాసం

భార్యాభర్తలు అన్నాక అనేక ఒడిదుడుకులు మాట_ మాటలు, చికాకులు -చీదరింపులు ,కోపాలు- తాపాలు ,పంతాలు-పట్టింపులు అనురాగాలు-ఆప్యాయతలు,మాట పోటులు -ఆట పోటులు ,అన్నీ ఉంటాయి. కానీ ….అన్నిటికీ పట్టు విడుపు ఉండాలి అప్పుడే ఆ సంసారం సాఫీగా సాగుతుంది ఒక నానానికి బొమ్మ ,బొరుసు ఎలాగో, ఒక సంసారానికి ఆలు-మగలు అలాంటివారు.బొమ్మ ,బొరుసు లేకపోతే ఎలాగైతే నానానికి విలువలేదో. అలాగే ఒక సంసారానికి ఆలుమగలు లేకపోతే విలువ ఉండదు. ఆలుమగలు ఒక బంధంగా ఏర్పడింది ఒక కొత్త అనుభవాన్ని, కొత్త పాఠాన్ని, కొత్త ఒరవడిని ,కొత్త అనుబంధాన్ని, కొత్త పిలుపునిచ్చి ,ఒక కొత్త మలుపుని చదువుకుంటూ ముందుకు సాగాలి. కన్నీళ్లు -కష్టాలు అనేవి ప్రతి సంసారంలో భార్యకి ,భర్తకి సహజంగా వస్తాయి అవి జీవితంలో ఒక పాఠంగా మిగలాలి, కానీ అది వారికి వెంటాడే కక్ష సాధింపుగా ఉండకూడదు. ప్రతి మనిషి తన తప్పు -ఒప్పులను తెలుసుకొని,వేసే ప్రతి అడుగు తప్పదుగా కాకుండా. ఒక మంచి మెట్టుగా మార్చుకొని సర్దుకు పోతే ఆలుమగలు జీవితం చాలా ఆనందంగా, ఎంతో సాఫీగా అందంగా, అర్థవంతంగా మారుతుంది మనం నడిచే మార్గం భార్య భర్తలుగా, ఆలుమగలుగా ఒక ఆదర్శ మార్గల్లా మారుతుంది. అంతేకాదు మనం మన భావితరాలకు ఒక మంచి స్ఫూర్తినిచ్చే వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మనం వచ్చే తరాల ఈ రోజుల్లో పెళ్లి బంధాలు,భార్యాభర్తల బంధాలకి చాలా భయపడుతున్నారు. వారికి వారి దారిని మళ్లించి ఒక మంచి కుటుంబ వ్యవస్థను భార్యాభర్తల ప్రేమ, అనురాగాలను వారికి తిరిగి అందించిన వాళ్ళం అవుతాము.

Written by K. Srivatsala

పేరు:కె.శ్రీవత్సల
వయసు:42
విద్యా అర్హతలు: ఎం.ఏ, బి.ఎడ్
వృత్తి: ఉపాధ్యాయురాలు ఇతర హాబీలు: కథలు రాయడం,కవితలు రాయడం నేను రాసిన కొన్ని కథలు "సాహితీ కిరణం" లో పబ్లిష్ అయ్యాయి ,కవితలు" రవళి" ఆన్‌లైన్ పత్రికలో పబ్లిష్ అయ్యాయి.భక్తి గీతాలు పాడటం,కథలు చెప్పటం.
7780547843

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అవధేశ్ రాణి

శిఖరానికి ఆఖరి మెట్టు