నోములు — వ్రతాలు

మనో నిగ్రహం అలవాడడానినోములుకే నోములు, వ్రతాల యొక్క ముఖ్య ఉద్దేశం. మనోన్నిగ్రహం అలవడితే జీవితంలోని ఒడిదుడుకోలు ఎదుర్కొనడం సులభతరఅవుతుంది.అందుకే ప్రతి సంస్కృతిలోనూ ఇవి జత చేసి ఉంటాయి.దక్షిణాయనం వచ్చిందంటే మన ప్రాంతాల్లో నోములు వ్రతాలకు ప్రసిస్తమైన కాలం. వీటిలోదీక్ష, మనోనిగ్రహం అవసరమవుతాయి. ఇందులో చాలామటుకు మహిళలు ఆచరించేవే. కాలం ఎన్నో మార్పులు తీసుకొస్తుంది కానీ మూలాలు ఎక్కడో దాగే ఉంటాయి, వృక్షం మూలం,లాగ మరుగవ్వకుండా. అలాగే మన సంస్కృతిలో అన్ని కులాల వాళ్ళకి,అన్ని వర్గాల వారికి వారి వారి సాంప్రదాయాల ప్రకారం నోములు వ్రతాలు పాటించటం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో కూడా కాలానుగుణంగా కొన్ని మార్పులువచ్చాయి. కానీ ధ్యేయం మారలేదు. ఇదిగో ఇప్పుడు శ్రావణమాసం వచ్చింది. ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో, రంగవల్లులతో పూలతో అలంకరించబడి ఉంటాయి.మంగళ గౌరీ వ్రతాలు,

వరలక్ష్మి వ్రతం, అమావాస్య వ్రతాలను మనం జరుపుకుంటే, వివిధ రాష్ట్రాల్లో వారి ఆచార్య వ్యవహారాలు బట్టి జరుపుకుంటారు. ఎవరు ఎలా జరుపుకున్నా అందులో ఆధ్యాత్మికత, సంస్కృతి పరిరక్షణ, సామూహిక ఆనందం కనబడతాయి. ప్రతి కుటుంబంలో ఎంతో కొంత ఆనందం కనబడుతుంది. అట్లతద్ది, రాఖీ పౌర్ణమి మొదలైనవిపేరు,తీరు మారినా దేశవ్యాప్తంగా జరుపుకునే వ్రతం లాంటి పండుగలు . వినాయక చవితి కూడాఒక వ్రతమే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయ. నోములు అన్ని మహిళలకు సంబంధించినవే. కొన్ని వ్రతాలలో మాత్రం పురుషులు కూడా పాల్గొంటారు.
కొన్ని దశాబ్దాల క్రితంస్త్రీలు విద్య గరపడానికి వీలుండేది కాదు. బాల్య వివాహాలు కూడా జరిగేవి. సుమారు 600 సంవత్సరాలు పైన భారతదేశము పరాయి పాలనలో మగ్గింది. ఆ రోజులలో ఆడపిల్లకు రక్షణ అంతగా ఉండేది కాదు. ఆ కారణంగా స్త్రీలు ఇళ్లకే పరిమితి అయ్యేవారు. పెద్దలు కూడా అలాంటి సమాజంలో ఆడపిల్లను బయటికి పంపడానికి భయపడేవారు. బాల్యంలోనే వివాహం చేసి ఆమెకు ఒక రక్షణ కల్పించినట్లు భావించేవారు. అలా ఇళ్లల్లో ఉన్న ఆడపిల్లలకు సత్ప్రవర్తన నేర్పడానికి వారి చేత నోములు వ్రతాలు చేయించేవారు. వాటిల్లో వచ్చే కథల ద్వారా మంచి చెడులను వివరించేవారు. ఇవన్నీ కూడా అమ్మ, బామ్మ, అత్తగారు లాంటి వారు చెప్పేవారు ఇది అత్తింటికి, పుట్టింటికి వన్నితేస్తాయని బోధించేవారు. ఆనాడు ఆడపిల్లకు తెలిసింది అత్తిల్లు,పుట్టిల్లు కదా! దీనివల్ల ఆడపిల్లలు ఒక దృఢ సంకల్పం ఏర్పడుతుందని వారి భావన. దీనివల్ల మన పెద్దలు ఎవరు పాడైపోలేదు, గతితప్పలేదు. ఇది కూడా ఒక మంచి ఉద్దేశ్యమే కదా!
ఈ నోములు, వ్రతాలలో జీవితపు నాలుగు దశల్లో ఆచరించేవి కూడా ఉన్నాయి. బాల్యం, కౌమారం, యవ్వనం వృద్ధాప్యాల లో ఆచరించేవి కూడా ఉన్నాయి. వృద్ధాప్యంలో సహస్ర చంద్ర దర్శనం అనే వ్రతాన్ని జరుపుకుంటారు. అంటే వాళ్లు జీవితంలో వేయి పౌర్ణములు దర్శించారు అన్నమాట. ఇది ఎదిగిన పిల్లలు ఎంతో ఆనందంగా జరిపిస్తారు. సాంప్రదాయంలో కొన్ని నోములు వ్రతాలు పెళ్లయిన దంపతులు చేయవలసినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు సత్యనారాయణ వ్రతము, కేదార వ్రతము మొదలగునవి. ఇది కూడా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వారి వారి పెద్దల నుండి వచ్చిన ఆచారాలను పాటిస్తూ నేటికీ జరుగుతూనే ఉన్నారు. ఈ నోములు వ్రతాలలో ప్రకృతి ఆరాధన కూడా ఉంటుంది. గోవులను, దేవతాపృక్షాలను, పాములను పూజించడం దీనికి సంబంధించినదే.ప్రకృతి బాగుంటేనే కదా మానవ జీవితం బాగుంటుంది. ఇప్పుడుఆధునికత పేరుతో మన చేతులారా మన ప్రకృతిని చెడగొట్టుకొని చాలా నష్టాలను చవి చూస్తున్నాం. ఆ కాలంలో మగవారు కుటుంబ పోషణ కోసం బయటికి వెళితే, వారి క్షేమం కోసం స్త్రీలు ఈ నోములు వ్రతాలు ఆచరించేవారు. సంసారానికి మూలవిరాట్ అయిన కదా ఆ రోజుల్లో. వీటిల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నా …. అన్నిటినీ ఆధునికత పేరుతో కొట్టి పారేస్తే మన హైందవ సంస్కృతిఅడుగంటుతుంది.సంస్కృతినిఎప్పుడూచెరగనియ్యకూడదు.. దీన్ని కాపాడుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. వివిధ మతాల్లో కూడా ఇలాంటి వ్రత దీక్షలు కనిపిస్తాయి. రంజాన్ నెల రోజులు ముస్లిం సోదరులు, సోదరీమణులు ఉపవాసాలు దీక్షగా వ్రతంలా చేస్తారు. అలాగే క్రిస్టియన్స్ కి, సిక్కులకి, జైనులకి వారి వారి మతానుసారము వ్రత దీక్షలు ఉన్నాయి. ఎవరు ఏ రకంగా ఆచరించినా చెడును వదిలి మంచిని పట్టుకోవడానికే….
ఈ నోముల ద్వారా తమకున్న దానిని ఇతరులతో పంచుకోవడంజరుగుతుంది.సాటివారిలోదైవత్వాన్నిచూడడం అలవాటుతుంది. ఒకరినొకరు ప్రేమను పంచు కోవడానికి దోహదపడుతుంది. ఈ నోములలో పంచుకునే తాంబూలం రూపంలో ఉండే ఆకు వక్క,సున్నంస్త్రీలకు ఎముకల్లో క్యాల్షియం పెరగడానికి దోహదపడతాయి. నానబెట్టిన పెసలు,శనగలు, పళ్ళు ఆరోగ్యానికి పనికి వచ్చేవే. వచ్చిన ముత్తయిదుకి బొట్టు పెడతాం మనం పెట్టించుకుంటాం. దీనివలన ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. చేతికి తోరం కట్టుకోవడం వలన మణికట్టు లో ఉండే నరాల మీద ఒత్తిడి పెరిగి ఆక్యుప్రెషర్ ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళకి కాటుక ఇచ్చిపుచ్చుకోవటం వలన నేత్ర రోగాలు రావు. కాళ్ళకి పసుపు రాసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు. చేతులకు పెట్టుకునే గోరింటాకు కూడా అంతే.ఈ నోములు వ్రతాలలో ఉపవాస దీక్షలు కూడా ఉంటాయి. ఈ దక్షిణాయనమంతా వర్షాకాలము శీతాకాలం తో నిండి ఉంటుంది. కాస్త అనారోగ్యాలు దరిచేరే కాలంఇది. మన పెద్దలు ప్రతి కార్యానికి వెనుక కారణాన్ని కూడా చెప్పారు. అవి తెలుసుకొని ఆచరించడం ఇంకా మంచిది. గుడ్డేద్దు చేలో పడినట్టు కాదు. మనం రేపు జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని పరిశీలిద్దాం…. అందులో చారుమతి ఊరి వారందరిని కలుపుకుని వ్రతం ఆచరిస్తుంది. వాయినాలు రూపంలో తన కొన్నది అందరికీ పంచుతుంది. అందరి దగ్గర నుంచి ఆశీర్వచనాలు పొందుతుంది. అంతేకాదు ఆమె హితంగా, మితంగా మాట్లాడుతూ, గయ్యాళికాక, అత్తమామలను సేవిస్తూ, ఇరుగుపొరు గు వారతో సఖ్యంగా ఉంటూ, అందరు మంచి కోరుతూ అందర్నీ కలుపుకొని ఆ వ్రతం ఆచరించింది. చూశారా ఇందులో ఎంత మిత్ర భావం, సమానత్వము కనిపిస్తోందో!
నేటి ఆధునిక మహిళలు కూడా ఎంత చదువుకొని, ఎంత సంపాదించినా, వీటి మీద మక్కువ పోలేదు. వ్రతం ఆచరించే సమయంలో కొత్త చీరకట్టుకోవడం, సొమ్ములు పెట్టుకోవడం ఆడవారు ఇష్ట మైన పని.నోములు వ్రతాలు వలన ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. సంతోషమే సగం బలం కదా ఎవరికైనా…… సమస్యలని పక్కనపెట్టి ఎంతో ఆనందంగా ప్రతి వనత ఈ నోములు చేస్తారు. ఇంకా చెప్పొచ్చేది ఏమంటే పూర్వం కంటే వైభవంగా,ఈ నోములు వ్రతాలు జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు ” ఆడంబరం కన్నా వ్రతంలో అంతర్గతంగా చెప్పిన మూలమే ముఖ్యమని. బీద,గొప్పభేదం లేకుండా,ఏస్థాయికి,చెందినవారు,ఆస్థాయిలోజరుపుకున్నప్పుడే,సంసారం,సంఘం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.అలా ఉండాలని ఆశిద్దాం.

కామేశ్వరి వాడ్రేవు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కంచి పట్టుచీర

మహిళామణులు