
ప్రేమ ప్రేమ అంటారు
ప్రేమ ఎన్ని రకాలో మీకు తెలుసా!
.. తల్లి ప్రేమ బదులుకోరంది
భార్య ప్రేమ విడదీయని అర్థ భాగం అయింది.
కొడుకు ప్రేమ కూడబెట్టిన ధనం లాంటిది.
… కూతురు ప్రేమ కొరత లేనిది.
ప్రియుడు ప్రేమ పదిలంగా దాచుకునేది.
….. ప్రేయసి ప్రేమ మురిపించేది.
బంధువుల ప్రేమ బాధ్యత లేనిది.
దాయాదుల ప్రేమ అరువు తెచ్చుకున్నది.
ఇరుగుపొరుగు వారి ప్రేమ ఇష్టంతో కూడుకున్నది.
ప్రకృతి ప్రేమ దాని దయాదాక్షణ్యాలతో కూడుకున్నది.
ప్రేమని చుట్టని మన జీవితం ఉందా?
ప్రేమకు అన్ని ఆంక్షలే.
కానీ సర్దుకుని అల్లుకుపోదాం.