మనిషి ప్రకృతి సిద్ధంగా ఎంత స్వేచ్ఛ జీవో అంత నిర్బంధ జీవి. ఇంతటి వైరుధ్యము కేవలం మనిషి జీవితంలోనే కనిపిస్తుంది జంతువులకు పక్షులకు ఇవేవీ ఉండవు. ఎందుకంటే వాటికి ఏ నియమ నిబంధనలు లేవు, ఏ కూటములు లేవు. జాతి వైరుధ్యాలు సహజ సిద్ధంగా ఉంటాయేమో పిల్లికి ఎలుక,పులికి లేడి ఆహారపు శత్రుత్వమే తప్ప ఆలోచనల శత్రుత్వం కానీ,మనిషి బ్రతుకు అలా కాదు. ఆనాటి రాతియుగంలో ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో అంత స్వేచ్ఛగా ఉండలేడు. కారణం మనిషి సంఘ జీవి కాబట్టి. సంఘజీవి అయ్యాక కోరికలు, ఉబలాటాలు, ఆరాట పోరాటాలు,మునగటాలూ తేల్చడాలు, ఇష్టాలు అయిష్టాలు ఎన్నో ఎన్నో మనిషిని అల్లుకొని ఉంటాయి. అందులో భాగంగానే ఆహారపు అలవాట్లు కూడా మార్పులు చెందుతూ వచ్చాయి. ఇదంతా క్రమానుగతంగా తాను నేర్చుకున్నటువంటి జ్ఞాన విజ్ఞానాల వల్లే. తన ఆకలి తీర్చుకోవడానికి ఆకలి ఆకులు అలములు జంతు మాంసాలూ తినడం నుండి వండుకు తినడం అలవాటైన వరకు మనిషి క్రమానుగత జీవన వ్యవస్థను గతంలో చర్చించుకున్నాం. శాఖాహార భోజనం vegetarian food అవసరాలు అలవాట్లు అవకాశాలు వంటివన్నీ చర్చించుకున్నాం.
మాంసాహార భోజనం విషయాన్ని,శారీరక శోషణ ను బట్టి మాంసాహారం తీసుకున్నప్పుడు శరీరీనికి సరిపడుతుంది. సరైన ప్రొటీన్లు లభించే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ను పరిశుభ్రమైన , సరి పక్వమైనవి తీసుకుంటే ఇబ్బంది ఉండదు.
అయితే ఈ మధ్య కాలంలో కోళ్లు, గొర్రె లకు ఇంజెక్షన్ లు ఇచ్చి పెంచుతున్నారు. కృత్రిమ వాతావరణంలో స్వచ్ఛ మైన తిండి తిననివి అవడం వలన ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. చేపలు కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే ఆర్గానిక్ మాంసం విక్రయిస్తున్నారు. ఇది కాస్త ధర ఎక్కువగా ఉన్నా ఇది తీసుకోవడమే మంచిది. ఇలా చాలా విషయాలు లెక్కలోకి వస్తాయి. “ఆరోగ్యమే మహాభాగ్యం “అన్నారు పెద్దలు ఈ మాట ఎంతో సత్యం.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న సూచనలను పాటించాలి. అన్నింటికన్నా ప్రధానమైనది పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో పరిశుభ్రంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వేడి వేడిగా తినడం, బాగా ఉడికిన పదార్థాలు గట్టిగా నమిలి తినడం వలన అరుగుతుంది అనారోగ్యం రాదు. లాలాజలం వలన అరుగుతుంది. కాబట్టి ఇవన్నీ స్త్రీ లు ఇళ్ళల్లో పిల్లలకూ పెద్ద లకూ చెప్పడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతవు. కనీసం సమస్యలను తగ్గించినవారవచ్చు. కుటుంబ పాలన ఒక పెద్ద సమస్యే.
కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే నిజం గా మహా భాగ్యం అనే సత్యాన్ని గ్రహించి సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం.