ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు లో ఎల్.డి.సి.గాచేరి ఇన్స్పెక్టర్ గా రిటైరైనారు.పుట్టింటివారు అరిపిరాల.అత్తింటివారు పీసుపాటి. విజయవాడ లో చదివారు.ముఖలింగం మాష్టారి ప్రభావంతో విద్యార్థిగా చిన్న చిన్న పాటలు రామాయణం విజయవాడ రాసి పాడుకునేవారు. గుంటూరులో ఎమర్జన్సీ టీచర్స్ ట్రైనింగ్ ఒక ఏడాదిలో పూర్తిచేశారు.తండ్రి ప్రోత్సాహంతో ఎస్.బి.హెచ్.లో జాబ్ వచ్చింది.కానీ ఇన్కంటాక్స్ లో ఉద్యోగంలో చేరి పరీక్షలు పాసై ఇన్స్ పెక్టర్ గా రిటైరవటం తర్వాత సాహిత్యరంగంలో అడుగుపెట్టడం జరిగింది.

మా తాత గారు కీర్తిశేషులు అరిపిరాల సత్యన్నారాయణ మూర్తిగా రు సంగీత విద్వాంసులు.
వారికి ఉత్తమ ఉపాధ్యా యుడిగా నేషనల్ అవార్డు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా అందుకున్నారు. ఆయన విజయవాడ వాస్తవ్యులు.
ఆయన రాసిన సంగీత గ్రంథాలు సంగీత పరీక్షలకు టెక్స్ట్ బుక్స్ చదువుతారు.
మా తాతగారికి అనేక సంగీత ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. అరిపిరాల విశ్వం గారు మాకు వరసకు బాబాయి
అవుతారు . ఆయన గొప్ప కవి రచయిత. గుంటూరు శేషేంద్ర శర్మ గారి తో దగ్గర మిత్ర త్వం.
ఆయన “పరంపర” అనే ట్రస్టు పెట్టి ఆధ్యాత్మికంగాదీక్ష నామంగా “ఆనందఘన” గా ప్రసిద్థి పొందారు. శ్రీవిద్య మీద అనేక విశేష గ్రంథాలు అమ్మవారి ప్రసాదంగా వ్రాసారు. మహావతార్ బాబాజీ క్రియా యోగ అనుయాయులు ఆయన ఇప్పుడు కీర్తి శేషులు.

1973 లో పెళ్లి ఇద్దరు కొడుకులు సంసారంతో జాబ్ చేశారు.బి.ఎ.స్పెషల్ తెలుగు 3 ఏళ్ల కోర్సుని ఏడాదిన్నరలో పూర్తిచేశారు.పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్శిటీ నుంచి అస్ట్రాలజీ ఎం.ఏ.చేశారు.రిటైరైన తర్వాత ఐ.టి.డి.వారి గ్రూప్ లో చేరి రచనపై శ్రద్ధపెట్టారు. సర్వశ్రీ బలరామమూర్తి,సుధామ గార్ల ప్రోత్సాహంతో రచయిత్రిగా గుర్తింపుతెచ్చుకున్నారు. మానవసంబంధాలు, అనుభవాల్లోంచి పుట్టిన ఆలోచనలకు కథారూపం ఇస్తారు.అవి అందరిప్రశంసలు పొందటం బహుమతులు రావటంతో ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు.అనారోగ్య సమస్యలు వల్ల తగిన సమయం కేటాయించలేకపోతున్నాను అని అంటారామె.