జరిగిన కథ..
ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టని కారణంగా ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్, వనజా “గీత ” హాస్పిటల్స్ కి వస్తారు అక్కడ రేవతి డాక్టర్ ని కలిసాక వాళ్లలో ఆశ చిగురిస్తుందివాళ్లుపెట్టుకున్న నమ్మకమే”ఇందు” రూపంలో ఎదురయింది అనేక కారణాలవల్ల సరోగసి (ivf) కి ఒప్పుకున్న “ఇందు” బిడ్డని కన్నాక ఇచ్చేయడానికి ఒప్పందం జరిగింది.. ఒప్పందం ప్రకారం ఆ పిల్లని వాళ్ళకి అప్పగిద్దామని అనుకుంటుంది. కానీ ఆ రోజు జరిగిన కారు ప్రమాదం వల్ల వాళ్ళిద్దరూ హాస్పిటల్లో గాయాలతో స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్లు రాలేని పరిస్థితులలో “సాయనిక “ఇందు దగ్గరే పెరుగుతుంది.. పదహారేళ్ల తర్వాత వచ్చిన శ్రీకాంత్ ని చూసి ఆశ్చర్య పోతుంది…
కళ్ళు తెరిచి చూడగానే బాగా తెల్లవారి పోయింది ఇవాళ కాలేజీ కి లేట్ అయిపోతుందేమో అనుకుంటూ తలుపు తీసి గేటుకి వేళ్ళాడుతున్న పాలపేకెట్లసంచి తీసుకుని లోపలికి వస్తుంటే హల్లో టేబెల్ మీద ఉన్న సెల్ ఫోన్ మోగింది ఇంత పొద్దూనే ఎవరా అనుకుంటూ తిసేలోగా సెల్ ఆగిపోయింది, మిస్ కాల్ ల్లో” శ్రీకాంత్ ‘ పేరు ఉంది మళ్లి కాల్ బ్యాక్ చెయ్యగానే’ ఇందు’ వనజని హాస్పిటల్ ల్లో జాయిన్ చేశాను అన్నాడు.
అయ్యో ఏమైంది కంగారుగా అడిగింది
హటాత్తుగా గతం గుర్తుకొచ్చి చాల గొడవ చేసింది తనకూతురు ఏది అంటూ అప్పటికప్పుడు డాక్టర్ కి ఫోన్ చేస్తే వెంటనే తీసుకు రమన్నారు జాయిన్ చేశాను ..
ఇప్పుడు ఎలా ఉంది ?
బాగానే ఉంది నువ్వు సాయంకాలం
వస్తావా? ఆత్రంగా అడిగాడు
వస్తాను ఏ హాస్పిటల్ ? యశోదకి వచ్చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసాడు
కిచన్ లోకి వెళ్లి పాలుగిన్నెలో పోసి స్టవ్ వెలిగిస్తూ ఇప్పుడు పూర్తిగా వనజకి తలివచ్చి మాములు మనిషి అయిపోతే,సైనికని ఇచ్చేయాలి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు కానీ నైనిక కి అసలు విష్యం ఎలా చెప్పాలి. నన్ను అర్ధం చేసుకుంటుందా ?
వెనక నుంచి వచ్చి “అమ్మా’ అంటూ కావలించుకుందినైనిక లేటుగా లేచావా అంటూ అప్యాంగా బుజాల మీద వేసిన చేతులని పట్టుకుని కాపీ కావాలా అడిగింది.
అవును ఎందుకో సరిగా నిద్ర పట్టలేదు ఇప్పుడే శ్రీధర్ అంకుల్ ఫోన్ చేసారు వనజ అంటిని హాస్పిటల్ ల్లో జాయిన్ చేసారుట,సాయంకాల వెళ్ళాలి నువ్వు వస్తావా ! వస్తాను అంటిని చూడాలని ఉంది కాని మళ్ళీ నువ్వు నాకూతురు అంటుందేమో అంటూ ‘ఇందు’ మొహంలోకి చూసింది.
అవన్నీ ఆలోచించకు .నాకు లేట్ అవుతోంది నువ్వు వస్తాను అంటే నేను ఆటోలో వెళ్తాను నువ్వు సాయంకాలం కారు తీసుకుని రా ఇద్దరం వెళ్లి చూసి వద్దాం…
సరే నేను తమ్ముడికి నాన్నకి టిఫిన్ చేస్తాను నువ్వు ఎం తింటావు?
కాలేజీ కాంటీన్ లో తింటాను అసలే లేట్ అయ్యింది అటో కూడా వచ్చింది ఉంటాను అంటూ ‘ఇందు’ వెళ్లి పోయాక సైనిక ఉప్మా చేస్తూ ఆలోచిస్తోంది ‘అమ్మ, నాన్న శ్రీకాంత అంకుల్ వెళ్ళాక మాట్లాడుకున్న మాటలు యధాలాపంగా వింది, నాన్న బెడ్రూమ్ తలుపు దగ్గరగా వేసిఉన్నాయి ‘.అమ్మని ‘ఎదో అడుగుదామని వచ్చి వాళ్ళ మాటలు విని స్థాణువులా నిలబడింది. అమ్మ ఆందోళన వింది తను’ శ్రీకాంత్’ అంకుల్ కుతురునని తెలిసాక ఆరాత్రీ నిద్ర పోలేదు. ఎలా జరిగింది నన్ను ఎందుకు తీసుకొచ్చారు. అమ్మకి యాక్సిడెంట్ అవగానే దగ్గర స్నేహితులైన వీళ్ళు నన్ను పెంచరా ? వాళ్ళకి నాకు తెలిసిందని ఎలా చెప్పాలి ? అందుకే హాస్పిటల్ వెళ్ళాలి అక్కడ ‘అమ్మతనకోసంఇరవై ఏళ్ళుఎదురుచూసింది. అక్కడకి వెళితే అసలు సంగతి తెలుస్తుందా? మతి పోగొట్టుకుని, చిన్న పిల్లలా ప్రవర్తించి అలసిపోయిన ‘అమ్మ’ ఇవాళ ఏ స్థితిలో ఉందో చూడాలి … తరువాత నా భవిష్యత్తు ఏమిటి ? అక్కా! టిఫిన్ రెడియో అంటూ వచ్చిన సుధీర్ ఆలోచిస్తూ నిలబడిన సైనిక దగ్గరగా వెళ్లి ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు, మీహిర్ గురించా డైనింగ్ టేబల్ మీద కూర్చుంటూ. లేదురాఆలోచించడానికిఏముంది! సాయంకాలం వనజ అంటిని చూడనికి అమ్మ వెళుతుంది నన్ను కూడా రమ్మని అడిగింది. మరి మీహిర్ గురించి చెప్తావా ? ఇప్పుడు కాదు అయిన మీహీర్ వచ్చేనెలలో వస్తాడు అప్పుడు చెప్తాను అమ్మ నాన్న ఒప్పుకుంటారునాకు ఆనమ్మకంఉంది. అవును వాళ్ళు ఒప్పుకుంటారు.. సరే నేను వెళుతున్నాను అంటూ వెళ్ళిపోయాడు సుదీర్ … వీడిని కూడా నేను విడిచి పెట్టి వెళ్ళిపోవాలా? దిగులుగా అనిపించింది అయినా సిటీలోనేకదా ఉండేది కలుస్తూనే ఉంటాను అనుకుంది, అప్పుడు మనసు కొద్దిగా తేలిక పడింది … సాయంకాలం కోసం ఎన్నడు లేనిది ఎదురు చూసింది, ఇన్నాళ్ళు పెంచిన బంధం, కన్న బంధం కన్నా గొప్పది. నన్ను తనకూతురిగా పెంచినఈఅమ్మ ఋణం ఎలా తీర్చుకోను. సుధీర్ ని వదిలి వెళ్ళగలనా ? నాన్న అన్నట్లు వాళ్ళని ఈ పరిస్థితి లో నేను దగ్గరఉండి చూసుకునే బాధ్యత నాకు ఉంది… ఆబాధ్యత నెరవేర్చా గలనా ? ‘నాన్న’ ఇంకా లేవలేదు నాన్న ఎప్పుడు ఒక్క అడుగు దూరంగానే ఉన్నారు నాతో.. చిన్నప్పుడు చాల బాధపడేదాన్ని తమ్ముడు అంటేనీకు ప్రేమ అని నాన్న చాల సార్లు గొడవ చేశాను కుడా అన్నిటికి ఒక్క చిరునవ్వుతో దాటావేసేవారు,
నాబంగారు తల్లికి నాది అంటూ అమ్మ నన్ను ఒడిలోకి తీసుకుని ముద్దు చేసేది ఎలా మరచి పోగలను ? ఇప్పుడు ‘అమ్మ’ నిజం చెప్పి వెళ్ళు ఆ ‘ఇంటికి’ అంటే అంటే వెళ్ళాలి, కానీ ఆ కొత్త ప్రదేశంలో ఇమడ గలనా ?కొత్తగా వాళ్ళని అమ్మ నాన్న అంటూ పిలవగలనా ? అన్ని ప్రశ్నలే జవాబు దొరకనివి… గోడ గడియారం’ టంగ్ టంగ్ మంటూ గంటలు కొట్టింది, ఇది అమ్మమ్మ గుర్తు ఆకాలం నాటిది, ఎని సార్లు రీపేర్కి వెళ్ళినా మళళ్ళీ కొత్తదానిలా కాలాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది . నాన్నకి ‘టి’చేసి గదిలోకి తీసుకు వెళ్లి ఇస్తూ చెప్పింది అమ్మ నేను హాస్పిటల్ వెళ్తూన్నామని చెప్పగానే ఎప్పటిలాగే జాగర్తగా డ్రైవ్ చెయ్యి అంటుంటే ఎప్పుడు లేని అభిమానంచూస్తుంటే నాన్న కొత్తగా అనిపించారు ‘నేను’ అంటే మొదటినుంచి ఇష్టం లేదు అని, నేను ఉహించుకుంటూ బాధ పడ్డనా? మనసు గందరగోళంలో పడిపోయింది.
నాకోసం ఇంకా ఎన్నేళ్ళు వాళ్ళు ఎదురు చూస్తారు ఆలోచనలతోసతమతమవుతూనే టైం చూసుకుని ‘ఇందు దగ్గరకి బయలు దేరింది ఇద్దరు మొదటి సారిఎవరి ఆలోచనలో వాళ్ళు మౌనంగా కూర్చున్నారు అన్న విష్యం ఇద్దరికి తెలియనంతగా… కారు హాస్పిటల్ ముందువచ్చేదాకా వాళ్ళు గమనించలేదు ‘ఇందుని’ దింపి కారు పార్క్ చేసి వచ్చింది సైనిక అప్పటిదాక ‘ఇందు ‘శ్రీకాంత్ తో మాట్లాడుతూ నిలబడింది . నైనిక రాగానే ముగ్గురు కలిసి స్పెషల్ వార్డులోకి వెళ్లారు…
రూమ్ లోకి అడుగు పెట్టగానే ఎదురుకుండా ఉన్న బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న వనజని చూడగానే అప్పటిదాకా ఉన్న అలజడి తగ్గింది, అలకిడి వినగానే కళ్లువిప్పిచూస్తూనే ఇందు’అంటూ పలకరించింది…
ఇందు ఆమె చెయ్యి పట్టుకుని ఎలా ఉన్నారు అంటు ఆప్యాయంగా చేతులు అడిగింది
బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అడిగింది వెనకే నిలబడి ఆత్రుతతో చూస్తున్న సైనిక వైపు చూస్తూ ఎంత పెద్ద దానివి అయిపోయావు, ఎం చదువుతున్నావు అనిఅడగానే, కదిలి పోయింది నైనిక కళ్ళల్లో నీరుకంటి చూపునిమసక చేస్తుంటే బాగున్నాను అంటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను అంది అంటియా ? మీ అమ్మ చెప్పలేదానువ్వు నాకూతురివిఅని అంటూగడగడా ఒణికి పోయింది చిన్న ‘ఫిట్స్’ లా రావడం చూసి శ్రీకాంత్ డాక్టర్ అంటూ గది బయటికి గబగబా వెళ్ళాడు …
సైనిక ‘వనజ చేయి పట్టుకుంటు అమ్మ అంతా చెప్పింది’ మీరే నా ‘అమ్మ’ అని నేను ఇంకా మీ ఇంటికి వచ్చేస్తాను,కంగారు పడకండి అంటూ ఓదార్చింది నిజంగా వచ్చేస్తావా ? నిజంగా వచ్చేస్తాను అంటుంటే డాక్టర్ తో పాటు లోపలి వచ్చిన శ్రీకాంత తో మన అమ్మాయి మన ఇంటికి వచ్చేస్తుందిట ఏర్పాట్లు చేయండి,డాక్టర్ నన్ను డిశ్చార్జ్ చేయండి మా అమ్మాయితో వెళ్ళిపోతాను అంటూ లేవబోతుంటే శ్రీకాంతే ఆమెని పట్టుకుని పడుకో పెడుతూ నువ్వు ఇంకా కోలుకోలేదు కోలుకోగానే అమ్మయిని మన ఇంటికి తీసుకొస్తాను నేను కోలుకున్నాను పదండి వెళ్లి పోదాం అంటు బెడ్ మీద నుంచి లేచి నిలబడుతూ కుప్పకూలి పోయింది.
శ్రీకాంత్, ఇందు,సైనిక కంగారు పడ్డారు వెంటనే నర్స్ వచ్చింది, డాక్టర్ ఆయ కలిసి మళ్ళిబెడ్ మీద పడుక్కోపెట్టారు,కళ్ళు తెరిచిన వనజ పదండి వెల్లిపోదాం నేను ఇక్కడ ఉండను అంటు ఏడ్చింది,ఇంతలో నర్స్ బీప్ చెక్ చేసి, సెలెన్ బాటిల్ పెట్టి మీరు ఈ సిలేన్ బాటిల్ అయ్యి పోగానే ఇంటికి వెళ్లి పోవోచ్చు డాక్టర్ గారు చెప్పారు ..అంది అందులో ఇంజక్షన్ ఎక్కిస్తూ, ప్రశాంతంగా పడుకున్న వనజ వైపు చూస్తూ శ్రీకాంత్ ఇందు ఇంకా ఇప్పటిలో వనజకి తెలివి రాదు మీరు యిద్దరు బయలు దేరండి అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను .నైనిక వేపు తిరిగి నీకు ఇందు అంతా చెప్పిందాఅడిగాడు, లేదు అంది ‘అంటిని ‘అలా చూడలేక అబధం ఆడాను క్షమించండి అంకుల్ అంది సైనిక…
అమ్మ నేను నేను కార్ తెస్తాను నువ్వు వచ్చేయి అంటూ వెళ్లి పోతున్న సైనికని చూస్తూ ఉండిపోయారు ఇద్దరు
కారులో కుర్చున్నాక థాంక్స్ అంది “ఇందు ఎందుకమ్మా అంటిని అలా చూడలేక పోయాను నేను చెప్పిన అబ్దంతో ఆవిడ హాయిగా ఉన్నారు కదా అంది ఇందు సమాధానం కోసం ఎదురు చూస్తూ ట్రాఫిక్ లో కార్ నిదానంగా వెళుతోంది ఇద్దరు ఆలోచనలో పడ్డారు… ఆ మరసటి రోజు ..