మంత్రద్రష్ట ఋషిక లోపాముద్ర 

పూర్వం వేదాల కాలంలో కూడా మహిళలుఇంటికే పరిమితం కాకుండా ఉపనిషత్తులు, పురాణాలలో జ్ఞానం, తత్వవిచారాలలో జిజ్ఞాసకి అధిక ప్రామాణికతను ఇచ్చారని మన ఇతిహాసాలు, వేదీయ–సాహిత్య ఆధారాలుతెలియ చేస్తున్నాయి. వారిలో ప్రముఖంగాతత్వపరమైన దృష్టితో చర్చించబడిన స్త్రీ లోపాముద్రభారతీయ వైదిక–పౌరాణిక సంప్రదాయంలో ఆమెకు ఋగ్వేదం 1.179 సూక్తం ఆపాదించబడిందిఅందుకే ఋషిక / కవయిత్రి అనడం సమంజసం మని అంటారు. భారతీయ ప్రాచీన తత్వచింతనకు ప్రతీకగా నిలిచిన మహిళ. 

వాచక్నవి గార్గి, మైత్రేయి వంటివారు వేదజ్ఞానం, తత్త్వచింతనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాని లోపాముద్ర వ్యక్తిత్వం ద్వారా గృహస్థాశ్రమం–సన్యాసంభక్తి–కామంస్త్రీ స్వాతంత్ర్యం–ఆధ్యాత్మికత అన్న అంశాలు సమన్వయంగా కనిపిస్తాయని ఋగ్వేద సూక్తం 1.179 చెబుతుంది. 

 అగస్త్యు, లోపాముద్ర.

పురాణ–వేద సంప్రదాయాల ప్రకారం లోపాముద్రఋషి అగస్త్యుని భార్యఆమె స్వయంగా ఋగ్వేద కాలానికి చెందిన కవయిత్రి. వేదకాలంలో స్త్రీలు కేవలం గృహకర్తవ్యాలకే పరిమితం కాదనివేదజ్ఞానం, తత్త్వచింతనలో కూడా గౌరవప్రదమైన భాగస్వామ్యం కలిగి ఉన్నారని చూపిన ప్రతీక. 

ఋషి అగస్త్యుడు వివిధ దేవతల నుండి సౌందర్యం, విద్య, గుణాలు తీసుకుని ఒక స్త్రీ రూపాన్ని సృష్టించాడు. ఆ రూపమే లోపాముద్ర. ఆమెను విదర్భ రాజుకు దగ్గర ఉంచి పెంచమని చెప్పినట్టుగాతర్వాత ఆమెను తన  భార్యగా స్వీకరించాడని పురాణకథల ద్వారా తెలుస్తుంది. “లోప” అంటే భాగాలు, “ముద్ర” అంటే సారం — అనేక గుణాల సారమే లోపాముద్ర అనే వ్యాఖ్యాతల భావన ఉంది.   

అగస్త్యుడు

కొన్ని పురాణ రచనల్లో లోపాముద్ర పుట్టుకను భిన్నంగా వర్ణించారు. పురాణకథల ప్రకారం మహర్షి అగస్త్యుడు వివిధ దేవతల గుణసారాన్ని సమీకరించి, అరుదైన అందం, వివేకం కలిగిన స్త్రీరూపంగా లోపాముద్రను సృష్టించినట్టు చెప్పబడుతుంది. ఈ కథనాలు చారిత్రక వాస్తవాలుగా కాక, పురాణాత్మక–సాంబోళిక వర్ణనలుగా పరిగణించాల్సి ఉంటుంది. ‘లోపాముద్ర’ అనే నామానికి సంబంధించి కూడా వివిధ వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ, అవి ప్రధానంగా తాత్విక, సాహిత్య విశ్లేషణలుగానే అర్థం చేసుకోవాలి. ఆమెను సృష్టించిన తరువాత అగస్త్యుడు ఆమెను విదర్భదేశంలోని రాజకుటుంబానికి అప్పగించినట్లు పురాణకథలు చెబుతాయి. 

తన దీర్ఘ తపస్సు ఫలితంగా దివ్య లోకాలను దర్శించిన అగస్త్య మహర్షి, అక్కడ ఒక లోయపై తలకిందులుగా వేలాడుతూ ఉన్న తన పూర్వీకులను చూశాడు. వారి దుస్థితికి కారణం ఏమిటని అడిగినప్పుడు, తమ వంశంలో సంతానం లేకపోవడం వల్ల ఈ స్థితిలో ఉన్నామని వారు తెలిపారు. తమ విముక్తి కోసం అగస్త్యుడు వివాహం చేసుకుని ఒక కుమారుడిని కనడం, శ్రాద్ధాది పితృకర్మలను నిర్వహించడం అవసరమని వారు చెప్పారు. తమ విముక్తి ఇప్పుడు అతని చేతిలోనే ఉందని తెలియజేశారు. అగస్త్యుడు వారి కోరికను నెరవేర్చుతానని వాగ్దానం చేశాడు. మరికొన్ని సంప్రదాయాల్లో, ఈ దర్శనం అగస్త్యునికి స్వప్నంలో కలిగినట్టుగా కూడా చెప్పబడుతుంది. కాలక్రమేణా అగస్త్యుడు పితృఋణాన్ని గుర్తించి గృహస్థ ధర్మం అవసరాన్ని ఆలోచించాడు. 

ఆ తరుణంలోనే లోపాముద్రను పెంచుతున్న రాజు తన కుమార్తె వివాహ విషయంలో అగస్త్య మహర్షి సలహా కోరుతూ ఆయనను ఆశ్రయించాడు. అప్పుడు అగస్త్యుడు స్వయంగా లోపాముద్రను వివాహం చేసుకోవాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. రాజు, రాణి రాజసౌఖ్యంలో పెరిగిన కుమార్తెను తపస్వికి ఇవ్వాలా అనే ధర్మసంకటంలో పడ్డారు. వారి ఆందోళనను గ్రహించిన లోపాముద్ర, ధర్మబద్ధంగా ఆలోచించి అగస్త్యుని వివాహం చేసుకోవడానికి స్వచ్ఛందంగా అంగీకరించింది. వివాహానంతరం ఆమె భర్తతో కలిసి ఆశ్రమ జీవితం స్వీకరించి, అతని తపస్సుకు అనుకూలంగా జీవించింది.  

అగస్త్యుడు తీవ్రమైన తపస్సులో లీనమై ఉంటాడు. లోపాముద్ర అతనితో గృహస్థ ధర్మాన్ని విస్మరించకూడదుకామం, దాంపత్యం కూడా ధర్మమే అని చెబుతుంది. తన పూర్వీకుల పితృకర్మలు నిర్వహించటానికి అగస్త్యుడికి సంతానం కలగడం తప్పనిసరి అవుతుంది. లోపాముద్ర, తర్కంతో  జీవన ధర్మ సమతుల్యతను సూచిస్తూ అతన్ని సంపద సమీకరణకు ప్రేరేపించింది. తదనంతరం అగస్త్యుడు శ్రుతర్వన్, వ్రధనాశ్వుడు, త్రసదస్యుడు అనే ముగ్గురు రాజులను ఆశ్రయించినప్పటికీ, వారి ప్రజాధర్మ బాధ్యతలను గౌరవిస్తూ సంపద స్వీకరించలేదు. వారి సూచన మేరకు, అతను అసుర రాజు ఇల్వలుడిని సంప్రదించడానికి బయలుదేరాడు. 

మహాభారతంలో అగస్త్య మహర్షి మహిమను వివరిస్తూ, ఇల్వలుడు–వాతాపి అనే అసుర సోదరుల కథ ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. కొన్ని కథనాలలో వారు మణిస్మతి అనే ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నట్టు చెప్పబడుతుంది. తరువాతి కాలపు సంప్రదాయాల్లో వాతాపిని కర్ణాటకలోని బాదామి అని గుర్తిస్తారు. ఇంద్రుడిలా శక్తివంతుడైన కొడుకును ప్రసాదించమని ఇల్వలుడు అగస్త్య మహర్షిని అభ్యర్థించినప్పటికీ వరం పొందలేకపోయాడు.  అగస్త్యుని తపశ్శక్తికి లోబడి ఓడిపోవడంతో ఇల్వలుడు, వాతాపి బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకుని మాయాజాలాలను అవలంబించడం ద్వారా బ్రాహ్మణులపై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారు. తన రాజభవనంలో ఇల్వలుడు తన సోదరుడు వాతపి మాంసపు మాయా ఆహారాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడుబ్రాహ్మణులు మాంసం తిన్న తర్వాత వాతాపిని బయటకు రమ్మని పిలిచే వాడు. ఆ బ్రాహ్మణుల పొట్టలను చీల్చుకుని వాతాపి బయటకు వచ్చేయటంతో వారు చనిపోయేవారు.  

ఇల్వలుడు, సంపద నిమిత్తమై వచ్చిన అగస్త్యుడిని అతనితో పాటు వచ్చిన ముగ్గురు రాజులను తన నగర పరిధిలో, తగిన గౌరవాలతో స్వాగతించాడు. వాతాపి విషయం తెలిసిన రాజులు ఆ మాంసాన్ని తినడానికి భయపడ్డారు కానీ అగస్త్యుడు వారికి వడ్డించిన మాంసాన్ని తాను తింటానని చెప్పాడు. అప్పుడు తనకు వడ్డించిన మాంసాన్ని తిని వెంటనే మాంసాన్ని జీర్ణం చేసుకుని “వాతాపి జీర్ణో భవ” అని అన్నాడు, అంటే ‘వాతాపి జీర్ణమవ్వాలి’ అని అన్నాడు. ఇల్వలుడు, గతంలో లాగా తన సోదరుడు వాతాపిని బయటకు రమ్మని పిలిచాడు. కానీ అగస్త్యుడు కేవలం త్రేనుపు మాత్రమే తీసుకున్నాడు. వాతాపి జీర్ణమై ఉండటంతో అతని నోటి నుండి వాయువు మాత్రమే వచ్చింది. ఈ పరిణామాలతో ఇల్వలుడు తన తప్పును తెలుసుకుని అగస్త్య మహార్షిని మన్నించమని కోరి, ఆయన కోరుకున్న సంపదనంతా ఇచ్చాడు. అసుర రాజు తన బంగారు రథం, బంగారం, వెండి నాణేలను అగస్త్యుడు, అతని ముగ్గురు రాజులను తమతో తీసుకెళ్లమన్నాడు. సంపాదించిన సంపదతో, అగస్త్యుడు తన భార్య వద్దకు వెళ్ళాడు, ఆమె ఎంతగానో సంతోషించింది.లౌకికమైనదీ, పవిత్రమైనదీ అయిన రెండు విషయాల్లోనూ అగస్త్యుడు తన శక్తిని లోపాముద్రకు నిరూపించాడు. 

అప్పుడు అగస్త్యుడు లోపాముద్రనుఆమెకు వెయ్యి మంది కుమారులా, లేక వెయ్యి మందిని ఓడించగల ఒకే ఒక్క కుమారుడిని కోరుకుంటుందా అని అడిగాడు. దానికి లోపాముద్ర, వెయ్యి మంది దుర్మార్గులకన్నా ఒకే ఒక్క పండితుడైన కుమారుడిని కలిగి ఉండటానికే తాను ఇష్టపడతానని అగస్త్యుడికి చెప్పింది. తర్వాత ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. తన తండ్రికి చెక్కతో చేసే యజ్ఞ కర్మలలో సేవలందించడం వల్ల అతనికి ‘ఇధ్మవాహ’ (అంటే “త్యాగ కర్మలను మోసేవాడు”) అని పేరు పెట్టారు. అతన్ని దృఢస్యుడు’ అని కూడా పిలుస్తారు. అతనికి వేదాలు, ఉపనిషత్తులలోఅపారమైన జ్ఞానం ఉంది. అగస్త్యుడు తన పూర్వీకులకు శ్రాద్ధాది పితృకర్మలు చేసి, వారికి విముక్తిని కలిగించాడు.  

లోపాముద్ర సందర్భంలో, సన్యాస ధర్మాన్ని నిలుపుకుంటూనే సంతానాన్ని సృష్టించాలనే ద్వంద్వ లక్ష్యాలు అగస్త్య మహర్షికి ఉన్నాయి. ఆమె తన భర్త-సృష్టికర్తకు ధర్మానికి సంబంధించిన అమూర్తమైన ఆదర్శాన్ని ప్రతిపాదించడంలో సహకరిస్తున్నందున, లోపాముద్రను గ్రంథాలలో మరింత సంయమితంగా, దాదాపు రక్తహీనంగా చిత్రీకరించారనిఋగ్వేదంలో లోపాముద్ర ఒక స్పష్టమైన, భావోద్వేగాలతో కూడిన స్వరం కలిగిన స్త్రీగా కనిపిస్తుందని ఇండాలజిస్ట్ లారీ ఎల్. పాటన్ శాస్త్రీయ అభిప్రాయం 

లారీ ఎల్. పాటన్ ఒక ప్రముఖ అమెరికన్ ఇండాలజిస్ట్, ముఖ్యంగా వేదమతం (Vedic Religion), ఋగ్వేద వ్యాఖ్యానంస్త్రీల పాత్రలు, లింగ దృక్కోణం (Gender studies in Hindu texts) పరిశోధనల్లో ప్రసిద్ధి చెందిన వారు. American Academy of Religion (AAR) మాజీ అధ్యక్షుడువేద సాహిత్యాన్ని ఆధునిక అకాడెమిక్ దృష్టితో విశ్లేషించిన పరిశోధకుడుహిందూ సంప్రదాయాన్ని విమర్శాత్మకంగా, తులనాత్మకంగా అధ్యయనం చేసినవారు ఆయన. 

ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వసుధ నారాయణన్ సూచించినట్లుగా, కొన్ని పురాణ రూపాంతరాల్లో తన పూర్వీకుల శాపాన్ని విమోచించుకోవడానికి అగస్త్యుడికి సంతానం కలగడం తప్పనిసరి అవుతుంది. రాక్షస రాజు ఇల్వల యొక్క ‘ఉద్దేశాలు, కుతంత్రాలు’ పూర్తిగా తెలిసిన లోపాముద్ర, అగస్త్యుడి విజయాన్ని నిర్ధారించే విధంగా ఆ ఋషిని మోసగిస్తుంది. 

వసుధ నారాయణన్ (Vasudha Narayanan) ఒక ప్రముఖ ఇండాలజిస్ట్, హిందూ అధ్యయనాల పండితురాలుఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida) లో Distinguished Professor of Religionగా పనిచేశారుఆమె పరిశోధనా రంగాలు – హిందూ మతం, పురాణాలువైష్ణవ సంప్రదాయంఇతిహాస–పురాణాల్లో స్త్రీల పాత్రహిందూ కథల విభిన్న రూపాంతరాలు (multiple versions). ఒకే కథకు ఉన్న వివిధ పురాణ/ప్రాంతీయ వెర్షన్లను పోల్చి చూపడంలో ఆమెకు మంచి పేరు“ఇది అసలు కథ” అని కాకుండా.“ఇది ఒక సంప్రదాయంలో ఇలా చెబుతారు” అని అకాడెమిక్‌గా వివరిస్తారు. ఇది ఆమె ప్రత్యేకత. 

పురాతన వేద భారతీయ సాహిత్యం ప్రకారం లోపాముద్ర ఒక బ్రహ్మవాదినిఋషిక. ఆధునిక పండితుల అభిప్రాయం ప్రకారం ఆమెఋగ్వేద కాలంలో (1950 BC-1100 BC) నివసించినట్లు భావించబడుతున్న అగస్త్య మహార్షి భార్య. వేదానికి ఆమె చేసిన కృషికి అనేక శ్లోకాలు ఆపాదింపబడ్డాయి. ఆమె అగస్త్య మహాముని భార్య మాత్రమే కాదు వేదకాలంలో స్త్రీలు బ్రహ్మజ్ఞానంపై చర్చించిన వారిలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ ఋషికి కూడా . ఆమె ప్రముఖ బ్రహ్మవాదిని లలో ఒకరు అని తెలుస్తుంది. 

లోపాముద్ర కథకు సంబంధించిన అనేక రూపాంతరాలు ఉన్నాయి. అందులో ఒకటి ఋగ్వేద శ్లోకాలలో కనిపిస్తే, మరొకటి మహాభారతంలోని వనపర్వం (తీర్థయాత్ర పర్వం)లో వర్ణించబడింది. ఈ రూపాంతరంలో, అగస్త్య ఋషి తన భార్య విదర్భ యువరాణి అయిన లోపాముద్ర సహాయంతో వివిధ తీర్థస్థలాల్లో, ముఖ్యంగా గంగాద్వారం ప్రాంతంలో, తపస్సు చేసినట్లు వివరించబడుతుంది. 

ఋగ్వేదంలో మొత్తం 27 మంది మహిళా ఋషులు (ఋషికలు) రచించిన శ్లోకాలు కనిపిస్తాయి. ఇవి మహిళా మేధావులుగా వారి సృజనాత్మకత, మేధస్సు, ధార్మిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ శ్లోకాలు సాధారణంగా మూడు శీర్షికల క్రింద వర్గీకరించబడతాయి. మొదటి సమూహంలో విశ్వవర, అపాలే వంటి మహిళా ఋషులు పూర్తిగా స్వతంత్రంగా రచించిన శ్లోకాలు ఉన్నాయి. విశ్వవర శ్లోకం అగ్నిదేవునికి అంకితం చేయబడినదైతే, అపాలే శ్లోకం ఇంద్రుని గురించి ఉంటుంది. రెండవ సమూహంలో, కొన్ని శ్లోకాలు మహిళా ఋషులకు—ప్రత్యేకంగా ఋషిక శశియాసికి—ఆపాదించబడ్డాయి. శ్లోకం ఋగ్వేదం మొదటి మండలంలోని 179వ సూక్తం లోపాముద్రకు చెందిందిగా ప్రసిద్ధి గాంచింది. ఈ సూక్తంలో మొత్తం ఆరు శ్లోకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని, అలాగే గృహస్థ జీవితం, బ్రహ్మచర్య ధర్మం మధ్య ఉన్న ఉద్వేగాన్ని వివరిస్తాయి. మూడవ సమూహానికి చెందిన శ్లోకాలు స్త్రీ ఋషులకు ఆపాదించబడినప్పటికీ, వాటికి నిర్దిష్ట రచయితలను గుర్తించలేదు. ఈ శ్లోకాలు ప్రధానంగా పౌరాణిక పాత్రలు లేదా సైద్ధాంతిక లక్షణాల ప్రతినిధులుగా వ్యవహరిస్తాయి. 

ఋగ్వేద సంప్రదాయంలో అగస్త్య, లోపాముద్రలు మంత్రద్రష్టలుగా పరిగణించబడతారు. లోపాముద్రకు ఋగ్వేదం 1.179 సూక్తం ఋషిత్వం ఆపాదించబడింది. ఆమె గురించి బృహద్దేవత (4.57–59) వంటి వేదానుబంధ గ్రంథాలలో ప్రస్తావనలు కనిపిస్తాయి. వేద వ్యాఖ్యాన సంప్రదాయంలో ఆమెను మంత్రజ్ఞానంలో ప్రావీణ్యం కలిగిన స్త్రీ ఋషిగా గౌరవిస్తారు. 

రాల్ఫ్ టి. హెచ్. గ్రిఫిత్ (1896) చేసిన ఋగ్వేద సంస్కృత గ్రంథ అనువాదంలో, అగస్త్యుడు, లోపాముద్ర, ఒక శిష్యుడికి ఆపాదించబడిన శ్లోకాలు ‘రతి’ అనే శీర్షిక క్రింద పొందుపరచబడ్డాయి. ‘రతి’ అనే పదం ఇక్కడ ప్రేమ లేదా దాంపత్య ఆకర్షణ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ సూక్తం మొత్తం ఆరు శ్లోకాలతో కూడి ఉంటుందివాటిలో రెండు లోపాముద్రకు, రెండు అగస్త్యునికి, చివరి రెండు శ్లోకాలు శిష్యుడికి లేదా అగస్త్యునికే ఆపాదించబడ్డాయి. 

రాల్ఫ్ టి. హెచ్. గ్రిఫిత్ (1826–1906) ఒక ప్రసిద్ధ ఆంగ్ల ఇండాలజిస్ట్, వేద అనువాదకుడుఆయన ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అన్నింటినీ ఆంగ్లంలోకి అనువదించిన తొలి ప్రముఖులలో ఒకరుఆయన చేసిన అనువాదాలు 19వ శతాబ్దం చివర్లో పాశ్చాత్య ప్రపంచంలో వేదాలపై అవగాహన పెరగడానికి కీలకం. ఆయన ముఖ్య రచన “The Hymns of the Rigveda” (1896) (ఇప్పుడు ప్రస్తావిస్తున్న గ్రంథం ఇదే). ఈ సందర్భంలో ప్రాముఖ్యత: లోపాముద్ర సూక్తానికి “Rati (Love)” అనే శీర్షిక ఇవ్వడంశ్లోకాలను నాటకీయ సంభాషణగా విభజించడంగ్రిఫిత్ వేద మంత్రాలను ఆంగ్ల ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధాన అనువాదకుడు. 

ఈ సూక్తానికి ఆధ్యాత్మికార్థం ఉందని ఎం. బెర్గైగ్నే వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అగస్త్యుడు స్వర్గీయ సోమానికి ప్రతీకగా నిలుస్తాడు. లోపాముద్ర ఆమె స్త్రీ ఆకర్షణకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఈ ఆకర్షణ అగస్త్యుడిని అతని ‘రహస్య నివాస స్థలం’ నుంచి బయటకు తీసుకురావడంలో ఫలవంతమవుతుంది. ఈ సూక్తం భార్యాభర్తల మధ్య నాటకీయ సంభాషణగా రూపుదిద్దుకోగా, శిష్యుడు మధ్యవర్తిగా ప్రశంసలను వ్యాఖ్యానిస్తాడు. మొదటి రెండు శ్లోకాలు లోపాముద్ర తన భర్త పట్ల కలిగిన మక్కువను వ్యక్తపరుస్తూ, అతని వృద్ధాప్యాన్ని, ఆమె అందాల పట్ల అతని నిర్లిప్తతను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. 

ఎం. బెర్గైగ్నే (1848–1888) ఒక ప్రముఖ ఫ్రెంచ్ ఇండాలజిస్ట్.ఆయన ముఖ్యమైనవి వేద సాహిత్యం, ముఖ్యంగా ఋగ్వేదంపై లోతైన పరిశోధనలువేద మంత్రాలకు ప్రతీకాత్మక (symbolic), ఆధ్యాత్మిక వ్యాఖ్యానం చేయడంలో ప్రసిద్ధివేద దేవతలను కేవలం వ్యక్తిగత దేవతలుగా కాక సహజ శక్తులు, తత్త్వాల ప్రతీకలుగా విశ్లేషించిన పండితుడుఈయన ప్రముఖ రచన “La Religion Védique” (3 సంపుటాలు). వేద మతంపై అత్యంత ప్రభావవంతమైన అకాడెమిక్ గ్రంథం. ఈ సందర్భంలో ప్రాముఖ్యత: ఋగ్వేదం 1.179 (లోపాముద్ర సూక్తం)ను దాంపత్య–తపస్సు మధ్య ఆధ్యాత్మిక సంకేతంగా చదివినవారిలో బెర్గైగ్నే ముఖ్యుడు. బెర్గైగ్నే వేద మంత్రాలకు ఆధ్యాత్మిక ప్రతీకాత్మక అర్థాలు ఇచ్చిన పండితుడు. 

లారీ ఎల్. పాటన్ పాశ్చాత్య ఇండాలజిస్ట్ (Indologist), అమెరికన్ వేద సాహిత్య పండితుడు. ఋగ్వేదం, బ్రాహ్మణ గ్రంథాలు, లింగం–లైంగికత (gender & sexuality) అంశాలపై పరిశోధనలు చేసినవాడుఋగ్వేద శ్లోకం 79ని సాంప్రదాయ వ్యాఖ్యానానికి భిన్నంగా, ఆధునిక సాహిత్య సామాజిక సిద్ధాంతాలతో విశ్లేషిస్తాడుఆయన ఋగ్వేదం 1.179 (లోపాముద్ర–అగస్త్య సంభాషణ) ను “విపరీత లైంగికత / లైంగిక ఉద్వేగం” (erotic tension) కోణంలో,లోపాముద్రను లైంగిక కోరికను స్పష్టంగా వ్యక్తపరిచిన స్త్రీ స్వరంగా చూపుతాడుఅగస్త్యుడు మొదట తపస్సు కారణంగా నిరాకరిస్తాడని, చివరికి ఆమె ప్రార్థనలకు “ముగ్ధుడై లొంగిపోతాడు” అని వ్యాఖ్యానిస్తాడుఅమరత్వం, సంతానం మరియు తపస్సు రెండింటి ద్వారా పొందవచ్చని అగస్త్యుడి భావన అయితేలోపాముద్ర గుర్తింపు లైంగిక ఆకాంక్షతో అని అభిప్రాయపడ్డాడు. ఇది ఆధునిక అకడమిక్ వ్యాఖ్యానం, సంప్రదాయ భాష్యం కాదు. 

డాక్టర్ రమేష్ చంద్ర ముఖోపాధ్యాయ భారతీయ పండితుడుసంస్కృతం, వేద సాహిత్యం, ఋషి సంప్రదాయాలు మీద పరిశోధనలు చేసినవారులోపాముద్ర సూత్రాలుపురుషులు స్త్రీల దగ్గరకు వెళ్లడం సహజం, ధర్మసమ్మతం అని సూచిస్తున్నాయని అంటారుప్రాచీన ఋషులు, దేవతల జ్ఞానం పొందినా స్త్రీలను ఆస్వాదించడాన్ని విరోధంగా చూడలేదని వ్యాఖ్యానం “దానితో ఎప్పుడూ అలసిపోలేదు” అనే మాటగృహస్థాశ్రమాన్ని నిరాకరించని ఋషి సంప్రదాయం వైపు సంకేతం అంటే, ఆయన వ్యాఖ్యానం భారతీయ ధార్మిక సాంప్రదాయ దృష్టికోణానికి దగ్గరగా ఉంటుంది పాటన్ కంటే. ఆమె వృద్ధురాలిగా మారిందని ఆమె చెప్పడం “పాథోస్” (ఇది గ్రీకు సాహిత్య సిద్ధాంతంలోని ఒక భావన) వ్యక్తీకరణ. నేను వృద్ధురాలిని అవుతున్నాను” అని చెప్పడంఅగస్త్యుడు లైంగికంగా దూరంగా ఉండటం వల్ల వచ్చిన ఆమె అంతర్మథనంఇది సాహిత్యపరమైన పాథోస్ వ్యక్తీకరణగా రచయిత విశ్లేషిస్తున్నాడుఅంటే, ఇది లోపాముద్ర మనోస్థితిని వివరించే సాహిత్య పదంఈ నిగ్రహం దేవుడు సృష్టించినదని అగస్త్యుడు సమాధానంగా వివరించాడు. అగస్త్యుడు లోపాముద్ర ప్రార్థనలకు ప్రభావితుడై ఆమెకు లొంగిపోతాడు. చివరి రెండు శ్లోకాలలో అగస్త్య శిష్యుడు అగస్త్యుని “ప్రేమాభిలాష, తపస్సు యొక్క కిండ్రెడ్ పాయింట్లను” కీర్తిస్తాడు.  

ఋగ్వేదంలో (మండలం 1, సూక్తం 179) లో లోపాముద్ర అగస్త్యల సంభాషణ ఉంది. ఈ సూక్తాన్ని స్త్రీ రచనగా అంగీకరించడం విశేషం. స్త్రీ తన భావాలు, ఆకాంక్షలు, ధర్మాన్ని స్వయంగా వ్యక్తం చేయడం. 

  • అగస్త్యుడు తీవ్రమైన తపస్సులో లీనమై ఉంటాడు. లోపాముద్ర అతనితో గృహస్థ ధర్మాన్ని విస్మరించకూడదుకామం, దాంపత్యం కూడా ధర్మమే అని చెబుతుంది. ఆమె మాటల్లో కామాన్ని ధర్మబద్ధంగా స్వీకరించాల్సిన అవసరం స్పష్టంగా వ్యక్తమవుతుంది. 

ఇది భారతీయ తత్వంలో కామ–ధర్మ సమన్వయానికి ఒక గొప్ప ఉదాహరణ. 

తత్వపరమైన ప్రాధాన్యం లోపాముద్ర బోధనలు చెబుతున్నాయి. 

  • త్యాగం అంటే జీవితం నుంచి పారిపోవడం కాదుఆధ్యాత్మికతకు శరీరాన్ని శత్రువుగా చూడనవసరం లేదుస్త్రీ భావాలు, ఆకాంక్షలు ధర్మవిరుద్ధం కావుశరీరాన్ని శత్రువుగా చూడకూడదు.ఆధ్యాత్మికత అంటే జీవన పరిపూర్ణత. 

ఈ ఆలోచనలు తరువాతి ఉపనిషత్తుల ఆలోచనలకు పునాది అయ్యాయిభారతీయ స్త్రీ తత్వచింతనకు దారి తీశాయి. 

లోపాముద్ర స్త్రీ స్వరంవేదకాలంలోనే ఒక స్త్రీ తన ఆకాంక్షను స్పష్టంగా, గౌరవంగా వ్యక్తం చేయడం విప్లవాత్మకం. ఆమె మాటల్లో వినయం ఉంది, కానీ ఆత్మగౌరవం కూడా ఉందిఅందుకే ఆమెను వేదకాలపు స్త్రీ విముక్తి స్వరంభారతీయ స్త్రీ తత్వానికి ఆద్య ప్రతినిధిగా భావిస్తారు. 

ఇతర స్త్రీ ఋషులతో పోలిస్తే 

  • మైత్రేయి – ఆత్మజ్ఞానంపై ప్రశ్నలు 
  • గార్గి – బ్రహ్మ తత్త్వంపై వాదనలు 
  • లోపాముద్ర – జీవితం–ఆధ్యాత్మికత మధ్య సమతుల్యం 

ముగ్గురూ కలిసి భారతీయ తత్వాన్ని సంపూర్ణంగా నిర్మించారు. 

నేటి కాలంలో లోపాముద్ర ప్రాసంగికతఈ రోజుల్లో కూడా ఆమె సందేశంకుటుంబం, వృత్తి, ఆధ్యాత్మికత మధ్య సమతుల్యంస్త్రీ కోరికలు సహజమైనవేత్యాగం పేరుతో అసమానతను న్యాయపరచకూడదులోపాముద్ర కేవలం అగస్త్యుని భార్య మాత్రమే కాదు. ఆమె భారతీయ సంస్కృతిలో స్త్రీ ఆలోచనకు ఇచ్చిన స్వతంత్ర స్వరం.ఆమె జీవితం చెబుతున్నది ఒక్కటేఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి విడిపోవడం కాదుజీవితం మొత్తాన్ని జ్ఞానంతో జీవించడం. 

లోపాముద్ర మాటల సారాంశం (పద్యార్థ భావం) 

  1. తపస్సు ఒక్కటే జీవితం కాదు“ఋషులారా! మీరు జ్ఞానంతో ఉన్నారుకానీ జీవనాన్ని పూర్తిగా తిరస్కరించకూడదు” తపస్సు గొప్పదే, కానీ జీవన ధర్మాన్ని విస్మరించరాదు. 
  2. గృహస్థ ధర్మం కూడా యజ్ఞమే“భర్తగా, గృహస్థుడిగా జీవించడంధర్మానికి విరుద్ధం కాదు” భారతీయ తత్వంలో కామం కూడా పురుషార్థమే (ధర్మ–అర్థ–కామ–మోక్షాలు)
  3. స్త్రీ ఆకాంక్షను ధర్మంగా చెప్పడం“నేను నీ భార్యనునన్ను నిర్లక్ష్యం చేయడం ధర్మం కాదు” ఇది విప్లవాత్మక భావనస్త్రీ కోరిక పాపం అన్న భావనను తిరస్కరిస్తుంది.
  4.  సమతుల్య జీవితం.“జ్ఞానం + జీవితంఈ రెండింటి సమన్వయమే సంపూర్ణత” ఇదే లోపాముద్ర తత్వం లోపాముద్ర – మైత్రేయి : వీరిద్దరి తులనాత్మక విశ్లేషణ వివరణ గమనిస్తేమైత్రేయికి గ్రంథం బృహాదారణ్యక ఉపనిషత్తుప్రధాన ప్రశ్న ఆత్మ జ్ఞానంధోరిణి మోక్షచింతన.  స్త్రీ స్వరం తత్వ విచారణసందేశం– ఆత్మే పరమం. అయితే లోపాముద్ర తత్వ విచారం వేరు. గ్రంథం ఋగ్వేదంప్రధాన ప్రశ్న గృహస్థ ధర్మం, కామం. ధోరణి- జీవన సమతుల్యం. స్త్రీ స్వరంఆకాంక్షల ధైర్య వ్యక్తీకరణసందేశం- జీవితం, ధర్మం. 

లోపాముద్ర జీవితం లోపల ఆధ్యాత్మికతను చూస్తేమైత్రేయి ఆధ్యాత్మికతలో పరమసత్యాన్ని వెతుకుతుందిరెండూ విరుద్ధం కాదు — పరస్పర పూరకాలు. 

భారతీయ స్త్రీ తత్వంలో లోపాముద్ర స్థానంవేదకాలంలోనే స్త్రీలు మౌనంగా లేరుతత్త్వం, ధర్మం, జీవితం అన్నింటిలో స్త్రీకి హక్కు ఉందిస్త్రీ భావోద్వేగం కూడా తాత్వికమే. 

ఆమె మంత్రద్రష్టగా పిలవబడింది. ఆమె సూక్తాలలో  

మంత్రం 1 (లోపాముద్ర వాక్యం) 

సంస్కృతం (భావాత్మక పాఠ్యం): అన్యా వధూరన్య ఉత త్వమస్య  విశ్వే దేవాసో అపాంసి జానన్ |  హి త్యజ్ఞం పరమం జగామ  యేన దాంపత్యమిదం సమృద్ధం || 

తెలుగు భావార్థం: ఓ అగస్త్యా! నీవు జ్ఞానంలో గొప్పవాడివి, దేవకార్యాలు తెలిసినవాడివి. కానీ దాంపత్య జీవితం కూడా యజ్ఞమే.దాన్ని విస్మరిస్తే జీవితం అసంపూర్ణమవుతుంది. అంటే గృహస్థ ధర్మం కూడా పరమ యజ్ఞమే. 

2 .స్త్రీ ఆకాంక్ష ధైర్య ప్రకటన 

సంస్కృతం (భావాత్మక పాఠ్యం): న తే సఖ్యం తపసా విభర్తుం  న హి శ్రియం త్యజసే న కామమ్ | సమానమిచ్ఛావ మిథునా భవావ  స పత్నీవత్వం సఫలం కురుష్వ || 

తెలుగు భావార్థం నీ తపస్సు గొప్పదే కానీ శ్రియను, కామాన్ని పూర్తిగా వదలకూడదు. భార్యాభర్తలిద్దరూ ఒకే కోరికతో, ఒకే మార్గంలో నడిస్తేనే దాంపత్యం ఫలిస్తుంది. కామం ధర్మవిరుద్ధం కాదు — ధర్మబద్ధమైతే పవిత్రమే. 

  1. 3.జీవిత–ఆధ్యాత్మిక సమన్వయం

సంస్కృతం (భావాత్మక పాఠ్యం): శ్రమేణ జాయతే సర్వమిదం  న కేవలం త్యాగమృతత్వహేతుః | ఆత్మానమిచ్ఛావ సహ జీవనేన  ఏషా విధిః సనాతనానామ్ || 

తెలుగు భావార్థం జీవితంలోని అన్ని ఫలాలు శ్రమతోనే వస్తాయి. కేవలం త్యాగమే అమృతత్వానికి కారణం కాదు. జీవితంతో కలిసి ఆత్మను తెలుసుకోవడమేసనాతన మార్గం. ఆధ్యాత్మికత జీవితం నుంచి విడిపోవడం కాదు — జీవితంతో నడవడం. 

4.అగస్త్యుని స్పందన – అంగీకారం 

సంస్కృతం (భావాత్మక పాఠ్యం): ఉక్తం త్వయా సత్యమిదం సుభద్రే  న ధర్మహానిః గృహిణో భవంతి | సంయోజయామి తపసా గృహస్థం  ఉభౌ పంథానౌ సమవాప్నువావ || 

తెలుగు భావార్థం: ఓ శుభద్రే! నీవు చెప్పింది సత్యం. గృహస్థుడిగా ఉండటం ధర్మహానికాదు. తపస్సును గృహస్థ ధర్మంతో కలిపి రెండు మార్గాలనూ అనుసరిస్తాను. త్యాగం జీవితం రెండూ కలిపితేనే సంపూర్ణ సాధన. 

లోపాముద్ర సూక్తం తాత్విక సందేశంఈ సూక్తం ద్వారా వేదాలు చెప్పిన గొప్ప సత్యాలు: స్త్రీ భావం కూడా తాత్వికమేదాంపత్యం పాపం కాదుసాధన మార్గమేశరీరం–ఆత్మ పరస్పర విరోధులు కావుఒక వాక్యంలో లోపాముద్ర తత్వం:“ఆధ్యాత్మికత అనేది జీవితం నుంచి పారిపోవడం కాదు. జీవితాన్ని జ్ఞానంతో జీవించడం.”  

ఋషిక మైత్రేయి, తన భర్తను ప్రశ్నించి ఇంట గెలిస్తేవాచగ్నవి గార్ఘిరాజ్యసభలో వాదనలో దిగి తన ప్రశ్నలతో పండితులను ఊపిరాడనీయక రచ్చగెలిచింది. లోపాముద్ర,  ఋగ్వేద కాలంనాడే విప్లవాత్మకంగా స్త్రీ తన వాంచనలను, భావాలను వ్యక్తపరచటం నేరంకాదని చెప్పిన ధీరోదాత్తఈరోజు కూడా ఆమె మాటలు ఎంతో ప్రాసంగికంకుటుంబం ఆధ్యాత్మికత సమతుల్యంత్యాగం పేరుతో స్త్రీని మౌనంగా ఉండేట్టు చేయకూడదుజీవితం మొత్తమే సాధనలోపాముద్ర చెప్పింది ఒక్కటే“త్యాగం అంటే జీవితం వదిలేయడం కాదు జీవితాన్ని ధర్మంతో జీవించడం.”  

 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హిమాచల్ ప్రదేశ్ లోని మూడు శక్తి పీఠాలు

తెలుగు జాతీయాల సొగసు