మన మహిళామణులు

 ముంజలూరి కృష్ణ కుమారి గారు

     మంజులూరి కృష్ణమూర్తి

ఆమె కమ్మని గళంతో కొన్ని విషయాలు వివరించారు.విజయవాడ రేడియో స్టేషన్ లో స్త్రీల కార్యక్రమంలకోసం మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి వారి సమస్యలు ముఖాముఖి అడిగితెలుసుకునేవారు.స్వయం ఉపాధి పథకాలు మూడు తరాల మహిళలతో గోష్ఠి జిల్లా అధికారులతో చర్చలు సమస్యల గూర్చి తెలపటం దాని వల్ల వనితలు లో చైతన్యం కలిగి స్వయం ఉపాధి కోసం బ్యాంకు లద్వారా లబ్ధి పొందటం రేడియో ఎలా నిజజీవితంలోని సమస్యలు పరిష్కారం చూపిందో ఆమె అనుభవాలలో కొన్ని.కలెక్టర్ జయప్రకాష్ నారాయణ గారి తో గాంధీజీ మనవరాలు ఉషాగోకానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కుమార్తె సుశీల వి.వి.గిరిగారి కూతురు మోహినీ గిరి కిరణ్ బేడీ ఇలా ఎందరెందరో తమ అనుభవాలను పంచుకున్నారు.ఇక పిల్లల ప్రోగ్రాం అక్కయ్య గా వారితో లైవ్ ప్రోగ్రాంలు చేశారు.రిటైరైనాక ఇప్పుడు ఆదివారం సర్వోత్తమ గ్రంధాలయం లో పిల్లల కి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు.వారిచేత కథలు వ్యాసాలు భాషపై పట్టు సాధించేలా కృషి చేయడం ముదావహం.ఇప్పుడు ఆమె మాటల్లో ఆమెను గూర్చిన ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం.

నవలా సాహిత్యాన్ని బాలలకు అందించాలి

జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా పర్యావరణ విపత్తు పై బాలల కోసం అనేక నవలలు రాశారు. రేడియో అక్కయ్య ముంజులూరి కృష్ణకుమారి. తూర్పుగోదావరి జిల్లా దుగ్గుదుర్రు లో 29 ఆగస్ట్ 1956 న పుట్టారు. అమ్మ సుబ్బలక్ష్మి, నాన్న అచ్యుతరామయ్య.యం. ఏ తెలుగు, ఎకనామిక్స్ చదవి వృత్తిరీత్యా మార్కాపురం, విశాఖపట్నం, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో ఎంతో కాలం పని చేసి2016లో డైరక్టర్ గా పదవీవిరమణ చేశారు. రేడియోలో బాలసభ, బాల వార్తలు, రూపకాలు, నాటికాలు, పెద్దలతో పిల్లల ముఖాముఖి వంటి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశారు. బాలలనేస్తం కోర్జాక్, చిన్నపిట్టల పెద్ద మనస్సు, రాంబాబు జలుబు మందు, అడవితల్లి, డాక్టర్ కాశీ అనే బాలల నవలలు రాశారు. ఇవే కాక అనేక కథలు, గేయాలు, నాటికలు, వ్యాసాలు రాశారు, ఆంధ్రప్రభ దినపత్రిక చిన్నారి శీర్షికలో ప్రభ అంటి పేరుతో నాలుగేళ్ళపాటు చిన్నారులకు కబుర్లు, కథలు రాశారు. 1994లో NCERT బహువతి పొందిన వీరి రచన చిన్న పిట్టల పెద్ద మనస్సు అనే నవలలో రంగుభేదాలు, ఆహారపు అలవాట్లు వేరైనా స్నేహానికి అడ్డుకావని చిన్నారి కాకి, బుజ్జి చిలుకల ద్వారా చెపుతారు. వీరి తొలి పిల్లల నవల 1982లో రాంబాబు జలుబు ముందు చిన్నారి సైంటిస్ట్ కథ పిల్లలకు కుతూహలం కరిగిస్తుంది. ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చిన అడవితల్లి నవలలో ప్రకృతి సమతూకం కోసం కీటకాలు, చీమలు, పూలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడతాయో తెలియచేస్తారు. 2014లో వచ్చిన డాక్టర్ కాకి నవల ద్వారా సెల్ టవర్గద్వారా ఇబ్బంది పడే పిచుకలు, ప్లాస్టిక్ తిని ప్రాణాలుకోల్పోతున్న జంతువులు, పురుగు మందుల ద్వారా అంతరించి పోతున్న కీటకాలను ఆదుకొని జంతు విప్లవాన్ని తెచ్చిన డాక్టర్ కాకిని బాలలకు పరిచయం చేస్తారు. వెబ్ ప్రపంచంలో మినూ అనే పాప తోటివారికి సాయపడటం, తెలివిగా, చౌకగా బొమ్మల తయారీ, దివ్యాంగుల పట్ల సానుభూతి చూపటం వంటివి ఆరు కథలు పొందుపరిచారు. ఇంకా వినూత్నంగా ఆరు సంవత్సరాలలోపు బాలలతో చిలుకపలుకులు పేరుతో ఆటా, పాట నేర్పారు.

పిల్లలకు కథారచనా శిబిరాలు నిర్వహించారు. యూట్యూబ్ ద్వారా కథాపాఠశాల శీర్షిక తో కథలు చెపుతున్నారు.ఆశువుగా కథ చెప్పటం వీరి ప్రత్యేకత, నేషనల్ బుక్ ట్రస్ట్ వారికోసం సోనుకొండ రహస్యం, చుర్గీ ఉడత, మింజి మాంత్రికుడు మరికొన్ని కథలు దేశభక్తులు అని ఉరి తీసారు అనే పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. మంచి నవలాసాహిత్యాన్ని బాలలకు అందించాలంటారు ముంజులూరి కృష్ణకుమారి, సుధామూర్తి గారి రచనలు మూడు వేల అల్లికలు, అదృశ్యమైన అద్భుతాలయం, కుక్కపిల్ల గోపి కబుర్లు, ప్రతీకారవలయం, జ్ఞానానికి ఆధారం, త్రిశంకు రాజు వంటి పది పుస్తకాలు తెలుగు లోకి అనువదించారు. అనేక బాలసాహిత్య సదస్సులలో పాల్గొన్నారు. వీరి బాలసాహిత్యకృషి కి ప్రతిష్టాత్మక నన్నపనేని మంగాదేవి బాలసాహిత్యపురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం, మంచిపల్లి సత్యవతిజాతీయ బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. మానసిక వైకల్యం కల బాలిక జీవని కథని నాటకంగా రూపొందించి ఆకాశవాణి

జాతీయ పురస్కారం పొందారు రేడియో అక్కయ్య ముంజులూరి కృష్ణకుమారి.

చిరునామా: ముంజులూరి కృష్ణకుమారి -18-36/1, ఎల్.ఐ.సి కాలనీ,

విజయవాడ – 520008 సెల్ : 9494493409.

Created with Mi No

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మా మంచి బావి

మన మహిళామణులు