జ్ఞానం కోసం చదువుకుంటాం
మన అంతరంగ భావనలు తెలియపరచడానికి మాటలు , రాయటం చేస్తాం!
రాయటాన్నే సాహిత్యం అంటాం
దీనిలో ఎన్నో విధాలు
కవితలు, కథలు వ్యాసాలు, నవలలు,పద్యాలు కావ్యాలు ఇలా ఎన్నో రీతులు!
భావనలు భాష లోకి తర్జుమా చేయగలిగితే
రచన గా మారుతుంది ”
రచించే ప్రతిభ రకరకాలు!
కురులుంటే ఎన్ని రకాల కొప్పులయినా వేయవచ్చు!
రాసే ప్రతిభ ఉంటే
నవరసాలు రచనల్లో కలపవచ్చు!
ఊహలు, వాస్తవాలు , నిన్న నేడు, రేపటి గురించి రాయొచ్చు!
రచయిత, రచయిత్రి
ఒక బాధ్యతతో రచన చేస్తే సమాజానికి ఉపయోగం!
భాషా పటిమ ఊహా బలం, భావుకత అందం, భావజాలం బలం కలిగిన రచనలు కోకొల్లలు!
రచయితలు సన్మానాలు, పుస్తకాల కి అవార్డ్స్ అందుకున్నారు నేటివరకూ!
కానీ రచనలు
సమాజానికి ఉపాయోగపడే విధంగా సరళమైన భాషలో విరివిగా రాస్తే బాగుంటుంధి అని
నా అభిప్రాయం!
సమాకాలీన సమస్యలు వాస్తవాలను
పాఠ కులకు అర్థమయ్యేలా వివరిస్తే బాగుంటుంది!
కథ కవిత, వ్యాసం ఏ రూపంలోనైనా సరే!
వేగంగా పతనం వైపు పరుగులిడుతున్న నేటి సమాజాన్ని మంచి రచనలతో ప్రభావితం చేస్తే బాగుంటుంధి!
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపయుక్తమైన రచనలు చేస్తే కొంతలో కొంతైనా ఉపయోగం ఉండొచ్చు !
కలలు కోరికలు ఊహలు, తెలివి ఇప్పటిరోజుల్లో తప్పుదోవలో వెళ్తున్నాయి!
చదువు, ఉద్యోగం, సంపాదన నేటి స్త్రీలకు ఆత్మ విశ్వాసంతో పాటు ఆహాన్ని, అత్యాశ ని పెంచింది
ఉద్యోగం చేస్తే ఇంటిలో పనులు చేయటం ఇష్టం ఉండదు!
ఎప్పుడూ అందానివాటికోసం తపన!
ప్రేమ, పెళ్లి పట్ల కూడా స్వార్ధ దురాశాభావనలు ”
డబ్బు, స్టేటస్ తనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళే కావాలంటున్నారు!
అన్నీ ఇచ్చినా భాగస్వామిని చులకనగా
చూస్తున్నారు!
వాళ్ళను వాళ్ళు సూపర్ అనుకుంటున్నారు!
ఒకప్పుడు పురుషుల్లా ఇప్పుడు స్త్రీలు ప్రవర్తించడంతో
సమాజ విలువలు నైతికత దెబ్బతిన్నాయి!
సున్నితంగా ఉండే స్త్రీ తన కామ, వికార వాంచలకోసం కట్టుకున్నవాఁళ్లను కన్నవాళ్ళను సైతం
హతమార్చడానికి వెనుకాడటం లేదు!
కొందరు కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు!
స్త్రీలలో ఈ విపరీత మార్పు కుటుంబ, మానవ సంబంధాలను దహనం చేస్తూంది!
ఇంటిలో పెద్దలు , రచించే రచయిత లు, సామాజిక మాద్యమాలైన టీవీ,
సినిమాలద్వారా సంస్కరించే ఉద్యమం చేపట్టాలి!
కఠిన క్రమశిక్షణ తీసుకోవటం అవసరం!
నిత్యం దారుణ సంఘటనలు మన చుట్టూ జరగటం వింటూంటే, చూస్తుంటే పట్టనట్లు
కల్పిత కథలు చదవటం, వ్రాయటం నేను చేయలేను!
వాస్తవాలను ప్రచారంలోకి తీసుకొచ్చే కథనాలు, కవితలు, మాటలు, వ్యాసాలు అవసరం ”
పూర్వపు రోజుల సాహిత్య ప్రయాణాన్ని
దిశ, దశ మార్చి ప్రస్తుత సమాజ రుగ్మతల
చికిత్స కోసం వాడుకుంటే విద్య, విజ్ఞానం, అనుభవం ఉపయుక్తమవుతాయి!
అత్యాస, అపరిపక్వతతో దుష్ట ఆలోచనలు,
పనులు చేసే నేటి యువతని సక్రమమార్గంలోకి నడిపించే ప్రయత్నం
సాహిత్యపరంగా
కూడ చేద్దాం!
లోయల్లోకి నెట్టి, ముక్కల్లా నరికి ఫ్రిజ్ లో పెట్టే నేటి ప్రేమ,
పెళ్లి గురించి కల్పించిన భావుకతలో కవితలు, కథలు అల్లలేము!
అల్లవద్దు!
వాస్తవంలో జీవనప్రయాణం చేద్దాం ”
కఠిన వాస్తవాలను గ్రహించి సమాజ హితంకోసం
ఎవరివంతు వారు సాయపడదాం!
ఇంటిలో, బడిలో, గుడిలో మంచి జీవన విధానం గురించే మాట్లాడుదాం!
మనిషిని చూసి మనిషి బయపడేరోజులను
మార్చడంకోసం ప్రయత్నం చేద్దాం!
ఏమంటారు మిత్రులారా!
ఓకే కదా!