మన మహిళామణులు – శ్రీమతి పల్లవి

హైదరాబాద్ లో పుట్టి, పెరిగి, ఇక్కడే చదివి, ఉద్యోగం చేయటంతో నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ప్రాంతీయ మార్పులు ఏవీ లేవు. ఒక రకమైన స్తబ్ధత మధ్య
సాహిత్యం, సంగీతం, చిత్రలేఖ

నం ఈ మూడూ చిన్నప్పటి నుంచి నా వెన్నంటే ఉన్నాయి. సమయానికి తగ్గట్టుగా, వయసుకి తగ్గట్టుగా ఒక్కొక్క దానికి ప్రాధాన్యత పెరుగుతూ, తరుగుతూ నా బాల్యం గడిచింది.
మా అమ్మ శీలా సుభద్రా దేవి, నాన్నగారు శీలా వీర్రాజు గారు ఇద్దరూ బహుముఖ ప్రజ్ఞాశీలురు. వారి ప్రోత్సాహంతో నేను కూడా సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనంలో కృషి చేశాను.

స్కూలులో ఉన్నప్పుడు చిత్రలేఖనం మీద ధ్యాస ఎక్కువగా ఉండేది. వాటర్ కలర్ పెయింటింగ్స్ ఎక్కువగా వేసేదానిని. జవహర్ బాలభవన్ లో, ఇంట

ర్ స్కూల్ పోటీలలో చిత్రలేఖనం పోటీలకి వెళ్లి అనేక బహుమతులు గెలుచుకున్నాను. బంకమట్టితో బొమ్మలు చేయడం, పేపర్ తో రకరకాలుగా క్రాఫ్ట్స్ చేయటం నాకిష్టం.

కాలేజీ రోజుల్లో మాత్రం చిత్రలే

ఖనం కన్నా సంగీతం, లలిత గీతాలు, సినిమా పాటలు పాడటంలో ఎక్కువ గడిచిపోయేది. మా అపార్ట్మెంట్ లోనే వేదాంతం యజ్ఞప్రభ అనే ఒక సంగీతం టీచర్ ఉండేవారు. వారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ఆమె ప్రోత్సాహంతో ఢిల్లీ గంధర్వ మహావిద్యాలయ వారి 4 years సంగీతం సర్టిఫికేట్ పాసయ్యాను. అమ్మ దగ్గర మాత్రం లలిత గీతాలు నేర్చుకునేదానిని. డిగ్రీ చదువుతున్నప్పుడు All India Radio లొ ఆడిషన్ పాస్ అయ్యాను. అప్పటి నుండి రేడియోలో యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు విరివిగా పాడే దానిని.

శాస్త్రీయ సంగీతం నేర్చు

కున్నా, నాకు మాత్రం లలిత సంగీతం అంటేనే చాలా ఇష్టం, అవి రేడియోలో పూర్వం వచ్చే కృష్ణ శాస్త్రి, దాశరథి గారి లలిత గీతాలు కావచ్చు, పాత హిందీ చిత్రాలలో హేమంత్ కుమార్, తలత్ మహముద్, రఫీ, గీతాదత్, లత వంటి వారి పాటలు గానీ, 80లలో

వచ్చిన గజల్స్ గానీ నాకు ప్రాణం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం లో MSc కంప్యూటర్ సైన్స్ చదివి ఒక డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ అధ్యాపకురాలిగా 3 సంవత్సరాలు ఉద్యోగం చేసాను.

అప్పటికీ రేడియోలో లలిత గీతాలు పాడేదానిని. వివాహం తరువాత అమెరికా వెళ్లిపోవడంతో నా సంగీతానికి, చిత్రలేఖనానికీ ఆనకట్ట వేసినట్లయ్యింది. అక్కడి జీవితంలో, software ఉద్యోగంలోపడి అన్ని కళలను వదిలేసాను. అనివార్య కారణాలతో తిరిగి భారతదేశం వచ్చినా మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు. నా అభిరుచులు, కళలు పూర్తిగా మరుగున పడిపోయాయి.

15 సంవత్సరాలు చేసిన software ఉద్యోగం ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తుంటే, ఆ యాంత్రిక జీవితం నుంచి, ఆరాటం నుంచి బైట పడటానికి నాకు నచ్చిన కళలనే ఆప్యాయంగా హత్తుకున్నాను.
10 సంవత్సరాల క్రితం ఉద్యోగానికి good bye చెప్పి నా అభిరుచులను వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నాను. నా కంఠానికి, నా చేతులలో కుంచెకి సాన పడుతున్నాను.

ఇప్పుడు పెన్సిల్ స్కెచెస్ ఎక్కువగా వేస్తున్నాను. బొమ్మలు తయారు చేయడం, కాగితాలతో రకరకాల క్రాఫ్ట్స్ చేయడం నాకు చాలా ఇష్టం. అంతే కాకుండా సాహిత్య పుస్తకాలకు టైటిల్ డిజైన్ చేస్తున్నాను. మా తల్లిదండ్రుల పుస్తకాలకే కాక ఇతరుల పుస్తకాలకు కూడా టైటిల్ డిజైన్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు 25 పుస్తకాలకు టైటిల్ డిజైన్ చేశాను.

ఒక సాహితీ కుటుంబంలో పుట్టి, ఇద్దరు సాహితీ దిగ్గజాల మధ్య పెరిగిన కారణంగా చిన్నప్పటి నుంచీ పుస్తకాలు నాకు కొత్త కాదు. నా వయసుకు తగ్గ పుస్తకాలు ఎప్పుడూ కొంటూ, అమ్మ నా చేత చదివిస్తూ ఉండేది . ఇంట్లో వేలల్లో పుస్తకాలు ఉండటం, అమ్మ, నాన్నగారితో పాటు సాహిత్య మీటింగ్ లకు నేను కూడా వెళ్ళటం, ఆదివారం మా ఇంటికి ఎవరో ఒక సాహిత్య కారులు వస్తుండటం, సాహితీ చర్చలు జరగటం, నాకు తెలియకుండానే నేను వాటిలో భాగం అయిపోయాను.

Software ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు సాహిత్యాన్ని దూరం చేసినా, ఉద్యోగం మానేసి తరువాతే మళ్ళీ పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. ఇటీవలే కవిత్వం రాస్తున్నాను, సామాజిక మాధ్యమాల్లో వ్యాసాలు, అర్టికల్స్ రాస్తున్నాను.

నాకు స్వతహాగా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ. నా చిన్నప్పటి కోరిక మేరకు ఏదైనా ఒక విదేశీ భాష నేర్చుకోవాలని, మళ్ళీ చదువులోకి వచ్చీ రామకృష్ణ మఠం నుండి German భాషలో డిప్లొమా, OU దూరవిద్య ద్వారా MA English చేసాను. వీటి సహాయంతో అనువాదాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. మొదట మా తల్లిదండ్రుల రచనలనే అనువాదం చేస్తున్నాను.

నా సాహితీ ప్రస్థానం ఇప్పుడిప్పుడే తడబడుతూ మొదలయ్యింది. చేరాల్సిన గమ్యం చాలానే ఉంది. ఆలస్యంగానైనా తప్పక చేరుతానని నమ్మకం నాకుంది.
నాగురించి నేను పరిచయం చేసుకునే క్రమంలో, నేను చేరాల్సిన మైలు రాళ్ళను గుర్తుచేసుకునే అవకాశం ఇచ్చిన తరుణి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలు.

– శీలా పల్లవి
9866498018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గంజాయి మత్తులో జీవితాలు చిత్తు

ఎడారి కొలను