అప్పుడు ఆ వ్యక్తి ఇదేంటి నన్ను స్వర్గం నుండి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు. ఆని వారిని అడుగుతాడు. అప్పుడు యమదూతలు నిన్ను నరకానికి తీసుకువెళ్తున్నాం అని సమాధానం చెబుతారు. ఏంటి నేను ఇన్ని దానాలు ధర్మాలు చేశాను. ఎంతోమంది పేదవారికి ఆశ్రయమిచ్చాను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను .అయినా నాకు నరకం ఎందుకు స్వర్గంలోనే ఉంచొచ్చు కదా!!!! అని కోపంగా అంటాడు. అప్పుడు ఆ యమభటులు చిన్న చిరునవ్వు నవ్వి నువ్వు చేసుకున్న పుణ్యంలో 99 శాతం ఎప్పుడో ఖర్చయిపోయింది ఇక మిగిలిన ఒక్క శాతానికి నిన్ను ఇన్ని రోజులు స్వర్గంలో ఉంచాం అని సమాధానం చెబుతారు. అదేంటి ఒక్క శాతం ఏంటి???? నేను చాలా చేశాను కదా ప్రజలకి ,భగవంతుడికి కూడా అని మళ్లీ హెచ్చు స్వరంతో వారిని ప్రశ్నిస్తాడు. ఓ !!! అదా చూడు నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఎవరికైనా ఏమి ఆశించకుండా సహాయం చేసావా ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు దానం చేసిన ప్రతిసారి కడు పేదవారి దగ్గర కూడా ఏదో ఒకటి ఆశించావు అప్పుడే నువ్వు దానం చేసిన ఫలితం లో సగం పోయింది. సరే అలాగైతే మిగిలిన సగం ఉండాలి కదా అని అడుగుతాడు యమభటులను ఆ వ్యక్తి. ఆ యమభటులు మళ్ళీ చిరునవ్వు నవ్వి….. ఓ అదా నువ్వు దానం చేసిన ప్రతిసారి నీ గురించి నువ్వు చేసే దానాలు గురించి నలుగురికి తెలియాలని కోరుకుని ఆ విధంగా ప్రయత్నం చేస్తూ దానం చేస్తావు. అప్పుడు నువ్వు చేసిన దానంలో ఇంకొక పావు వంతు ఖర్చు అయిపోయింది. ఓ అలాగా….పోనీ మిగిలిన పావు వంతైనా ఉండాలి కదా!!!!! అని యమభటులను ప్రశ్నిస్తాడు. ఓయ్ వ్యాపారి నీకు ఇంకా అర్థం కాలేదా మిగిలినది ఏమైనదో????? ఆ మిగిలిన పావు వంతులో నువ్వు సభలకు సమావేశాలకు వెళ్లినప్పుడు నలుగురు చేత నువ్వు చేసిన మంచి పనులను గురించి పొగించుకొని సన్మానాలు ,సత్కారాలు స్వీకరించావు. అక్కడనే నువ్వు చేసుకున్న మిగిలిన పుణ్యం కూడా పూర్తి ఖర్చయిపోయింది. అని చెప్తారు యమదూతలు. అదేంటి నేను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును నలుగురికి దానం చేసి చెప్పుకోవడంలో తప్పేముంది. అంతేకాకుండా నేను దైవకార్యాలకు పుణ్యకార్యాలకు ఎంతో ఖర్చు చేశాను .దానిని చెప్పుకోవడంలో నాకేమీ తప్పనిపించడం లేదు నేను చేసిన మంచి పనులను గురించి నలుగురికి చెప్పుకోవటం కూడా తప్పేనా అని గట్టిగా ప్రశ్నిస్తాడు యమదూతలను. అప్పుడు ఆ యమదూతలు చూడు నాయనా!!!! మన దగ్గరికి ఎవరైనా వచ్చి చేయి చాచారు అంటే వారు ఎంతో ఆపదలో ఉంటే తప్ప అలా ఆత్మాభిమానాన్ని చంపుకొని దానం స్వీకరించరు. అలా అవసరానికి నీ దగ్గరకు వచ్చి చేయి చాచిన వారిని నువ్వు ఎన్నో రకాలుగా తూలనాడావు. నానా దుర్భాషలాడావు. అంతేకాకుండా నువ్వు దేవుడికి సమర్పించిన కానుకలు, పంచిపెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు కూడా నీ గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే చేశావు కానీ….. భగవంతుడు నీకు అన్నీ సమకూర్చి నిన్ను ప్రశాంతంగా జీవించేలా చేశాడు కనుక భగవంతుడికి కృతజ్ఞతగా ఏదీ చేయలేదు నువ్వు. అంతేకాకుండా నువ్వు చేసిన ప్రతి పనిని నీ చేత సహాయం పొందిన వారి చేత అంతట చెప్పించి సన్మానాలు సత్కారాలు పొందావు. Enter your account data and we will send you a link to reset your password.
To use social login you have to agree with the storage and handling of your data by this website. %privacy_policy%
AcceptHere you'll find all collections you've created before.