అక్షర తేజం

 4-9-2023 తరుణి పత్రిక సంపాదకీయం

– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకురాలు

ఈ సమాజం లో మనము మసులుతున్నాం అనే స్ఫురణ కలిగిస్తూ ఉంటుంది విద్యా విజ్ఞానాల తెలివిడి తనం . అందేంటి చదువు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ కు అస్సలే తెలివి లేదా ? వాళ్ల జీవితాలను అర్థమే లేదా అనే ప్రశ్నల కొడవళ్ళు పుట్టవచ్చు. లేదు లేదు వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్యం లో పడవేసేంత తెలివి తేటలు ఉన్నవే. బ్రతుకు తెలివి వేరు చదువు విద్యా విజ్ఞానాల తో కలిగే తెలివి వేరు. మంచినీళ్ళనే త్రాగాలనీ, శుభ్రమైన ఆహారాన్నే తినాలని ప్రాణ రక్షణ చేసుకోవాలానీ ఎవ్వరూ చెప్పకున్నా సహజ సిద్ధమైన బ్రతుకు తెలివి తో తామే జ్ఞాన దీపాలయ్యారు మానవులు.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8 వ తేదీని జరుపుకుంటున్నాం
విద్యా విజ్ఞానాలున్న వాళ్ళు అక్షరాస్యులు.
చదవడం రాయడం వచ్చినవాళ్ళు అక్షరాస్యులు. ఇంకా నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉండడం విచార మే!
స్వాతంత్ర్యం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకునే వరకూ అక్షరాస్యత పైన పెనుమార్పులు రాలేదు ఇదేంటి అని ఎవరిని నిందిద్దాం ఎంతకాలం నిందిద్దాం? సమస్య పరిష్కార మార్గాలు ఉన్నాయి ఒడిసిపట్టుకుని విజయపథాన పయనించేందుకు కృషి చేయాలి. స్వీయ నియంత్రణ పద్ధతులు మాత్రమే తోడ్పాటు అవుతాయి.
ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కొరత. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు చెల్లింపులు ఎక్కువ. మూడు దశాబ్దాల క్రితం చదువుపూర్తి చేసుకొని ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా తమ పిల్లలను ఉన్నత విద్య నందించలేని వాళ్ళైతేనేమి, ఇంకా దిగువ స్థాయి లో ఉన్నవాళ్ల పిల్లలైతేనేమి వాళ్ళు చదువుతున్నవి అర్థం కాకుంటే తల్లిదండ్రులు గా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఫలితం గా ట్యూషన్లు చెప్పిస్తున్నారు. అయినా సరైన న్యాయం ఆ ట్యూషన్ టీచర్లూ
చేయకుంటే ఇక అంతేసంగతులు. బడిలో అర్థం కానివి అలాగే ఉండిపోతాయి. ఇటువంటి పిల్లలు పెద్దయ్యాక చదువులో ఎలాగో కొట్టుకువచ్చినా ఉద్యోగాల లో నిలదొక్కుకోలేకపోతున్నారు . ఈ సైకిల్ ఇలాగే కొనసాగితే వచ్చే తరాల వారికి నాణ్యమైన జీవితం ఎలా దొరుకుతుంది?
ఈ సమస్య పరిష్కార మార్గం ఇది అని చెప్పలేని పరిస్థితి లో ఇంకా ఉన్నామా అనే బాధ పీడిస్తుంది. చదివినప్పుడే కాస్త శ్రద్ధ పెట్టి చదివితే ధ్యాస పెట్టి చదివితే బాగుంటుంది. రానివి , అర్థం కానివి ఉపాధ్యాయులనే అడగాలి వాళ్ళు విద్యార్థుల అనుమానాలు తీర్చాలి. విషయ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు వెనకడుగు వేయక , తప్పించుకోకుండా ఓపిక తో బోధిస్తే కనీసం మరో రెండు తరాల లోనైనా బాగుపడే అవకాశం ఉంటుంది.
ఆదర్శాలు వల్లించడానికేగాని ఆచరణ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కనీసం ఆర్థిక సహాయమైనా అందిస్తే కొంతైనా మార్పు వస్తుంది.
మాతృభాష, రాష్ట్ర భాష, ఇంగ్లీష్ భాష నేర్పే ఉపాధ్యాయుల పై బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భాష బాగా వస్తే మిగతా విషయాలూ బాగా వస్తాయి. ఆత్మాభిమాన ధనువు సాధారణంగా ఎవరిమీదా ఆధారపడరు

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా తెలుగు విశ్వరూపం

అమూల్యా