నదీమతల్లి-3

జరిగిన కథ
ఆడుతూ పాడుతూ తిరిగే రాధ అతి చిన్న వయసులో విచిత్రమైన పరిస్థితుల్లో డాక్టర్ పద్మావతి తమ్ముడు, పోలియోతో అవిటి వాడైన కృష్ణమోహన్ ని మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటానని అన్నలకి,తండ్రికి చెప్తుంది. అన్నలు, తండ్రి బాధపడతారు.తమ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాధ అటువంటి నిర్ణయం తీసుకుందని.

సంతోషంగా సాగుతున్న రాధ, కృష్ణమోహనుల జీవితంలో కృష్ణమోహన్ రిటైర్మెంట్ పిడుగు లాంటి వార్త అయింది అప్పటివరకు రాధకి తనకి కృష్ణమోహన్ కు అంత తేడా ఉందని తెలియదు కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవటానకి ఎలాగైనా సగంలో ఆపిన తను చదువు కొనసాగించి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది రాధ.

సహజంగానే తెలివిగల రాధ నాలుగేళ్ళలో ఇంటరు సెకండ్ఇయర్ పూర్తిచేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బి.ఏ లిట్ డిస్టిన్క్షన్ లో ఉత్తీర్ణురాలైంది.
దానికి పూర్తి సహాయసహకారాలు కృష్ణమోహన్ కలిగించాడు. పిల్లలని చూసుకోడానికి ఆయాని, వంటకు వంటమనిషిని కుదిర్చాడు.రాత్రి పిల్లలు పడుకున్న తరువాత రాధ చదువుకుంటుంటే మెలకువతో ఉండి రాధ కునుకు తీయకుండా చూసుకునేవాడు.

‘నెక్స్ట్’ అన్నాడు కళ్ళెగరేస్తూ కృష్ణమోహన్.

“బి.ఎడ్ చేస్తా వన్ఇయర్ లో అయిపోతుంది.
ఉద్యోగం చేయవచ్చు.”అంది రాధ.

కృష్ణమోహన్కెందుకో అది నచ్చలేదు.అయినా ‘సరే’ అన్నాడు.
బి.ఎడ్ డిస్టిన్కషన్ లో రాధ మరోసారి తన తెలివి తేటల్ని ప్రూవ్ చేసుకుంది. గవర్నమెంటు స్కూల్స్ కి టీచర్ పోస్ట కి ఎప్పియర్ అయింది.మెరిట్లో సెలక్టయింది. జిల్లా పరిషద్ స్కూల్లో.తిరుపతి కి దగ్గర్లోని పల్లెటూరిలో పోస్టింగ్ వచ్చింది.

“ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలో పిల్ల ల ఆలనా పాలనా సరిగ్గా చూసుకో లేనని బాధపడాలో తెలియటం లేదండీ” అంది రాధ.

“రాధా ఉద్యోగం అంటే ఇవన్నీ తప్పవు..ముందు జాయిన్ అవు.నెమ్మదిగా రిక్వెస్టు పెట్టుకొని ట్రాన్సఫర్ చేయించుకుందుగాని”అంటూ ధైర్యం చెప్పాడు
కృష్ణమోహన్.

అసంతృప్తితో జాయిన్ అయిందిరాధ. రోజూ
నాలుగుగంటలకల్లా లేచి వంటచేసి తను రెడీ అయి బస్స్టేండ్కి నడచుకుని వెళ్ళి ఏడుగంటలకల్లా బస్ ఎక్కేది.

గంగిరెడ్డిపల్లి జెడ్.పి.హెచ్ స్కూలు వాతావరణం రాధకు నచ్చింది.నెలలు గడుస్తున్నాయి.రాధలో ఏదో అసంతృప్తి.ఇంటికిచేరేసరికి ఐదు లేక ఐదున్నర అయ్యేది. పిల్లలతో భర్తతో గడపడాననికి సమయముండేదికాదు.

కృష్ణమోహన్ కి కాలేజిలో బి స్ సి కంప్యూటర్ సైన్సెస్ ఓపెన్ చేయటంతో బాధ్యతలు ఎక్కువయ్యాయి. దానితో పిల్లలమీద కాన్సన్ట్రేట్ చేయలేక పోయేవాడు.

ప్రణవ్ మంచి తెలివిగలవాడు. అయితే వాడికి తల్లిదండ్రులు ఇద్దరూ వారి వారి పనుల్లో బిజీ అవటంతో వాడి తెలివితేటలు తప్పుతోవ పట్టడం ప్రారంభించింది.తల్లిపొరుగూరుకి ఉద్యోగనిమిత్తం వెళ్ళటం.తండ్రి అపరూపమైన ప్రేమ,కాలేజీకి వెళ్తే సాయంత్రం వరకూ రాడన్న ధీమా ప్రణవ్ చెడుసహవాసాలకి దారి తీసింది.

ఆరోజు వంట్లో నలతగా ఉండటంతో రాధ లంచవర్లో పర్మిషను తీసుకుని ఇంటికి వస్తోందిఆటోలో. ఒక పాన్షాప్ దగ్గర ఒక పది పదకొండేళ్ళ పిల్లవాడు రింగు లు రింగులుగా పొగ వదలటానికి ప్రయత్నిస్తూ
సిగరెట్టు కాలుస్తూ కనపడ్డాడు. “ఆటో!కొంచెం ఆపు.పట్టుమని పదేళ్ళు లేవు వెధవకి సిగరెట్టు ఎలా కాలుస్తున్నాడో! రాధ టీచరు హృదయం కుతకుత లాడింది. ఏతల్లికన్నబిడ్డో! ఆతల్లిదండ్రులు ఆ బిడ్డమీద ఎన్ని ఆశలుపెట్టుకున్నారో!” అనుకుంటూ ఆటోదిగి వెనుకకు తిరిగి ఉన్న పిల్లాడిని ఒక్కలాగు లాగింది……… అంతే ఆ పసిముఖాన్ని చూసి స్థాణువయ్యింది.ఆ ముక్కు పచ్చలారని పసికందు వేరెవరోకాదు.స్వయాన తన కడుపుచించుకుని పుట్టినబిడ్డ,తన ఆశల పట్టి ప్రణవ్.తనకాళ్ళక్రింద భూమి జారిపోతున్నట్టు, సుడిగుండంలో చిన్నారి ప్రణవ్ కూరుకు పోతున్నట్టుగా తోచింది.

“ప్రణవ్! పదనాన్నాఇంటికి.”అందిరాధ తనలోని ఉద్వేగాన్ని అణచుకుంటూ.

★★★
సాయంత్రం ఇంటికిచేరిన కృష్ణమోహనుకి రాధ చెప్పిన వార్త గుండెల్లో వాడిబాణమై గుచ్చుకుంది.

“ప్రణవ్ నువ్వేక్లాసులో ఉన్నావు?నీకు పట్టు మని పదకొండేళ్ళు నీకు సిగరెట్టుకి డబ్బులెక్కడివి?నీకు సిగరెట్టు అలవాటు చేసింది ఎవరు?గత కొన్ని రోజులుగా ఇంట్లో పది పదిహేనుచొప్పున డబ్బులు మాయమవటం నేను అమ్మ గమనిస్తున్నాము.మేమే పొరపాటు పడుతున్నాం అనుకున్నాం.కానీ నీమీద మాకు అనుమానం రాలేదు.నువ్వు ఇంకా
పదేళ్ళు చదువుకోవాలి. అప్పుడుకానీ చిన్న ఉద్యోగం రాదు. ఈఅలవాటు నిన్నొక దొంగగా మార్చవచ్చు ఇప్పటివరకూ ఇంట్లోంచి తీసికెళ్ళిన ఆపది పదిహేను కూడా దొంగతనంక్రిందే వస్తుంది బంగారం.నువ్వు చాలాతెలివికలవాడివి.టైము వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకో ఇది తెలిసి తెలియక చేసిన తప్పు కాబట్టి నిన్ను పనిష్చేయటంలేదు. .నీ ఎదురుకుండా అమ్మ ఎంత కష్టపడి చదువుకుంది .అంతదూరం వెళ్ళి ఉద్యోగం చేస్తోంది. మీకు కావలసినవన్నీ కొనిపెట్టాలని మిమ్మల్ని బాగా చదివించాలని,నువ్వు అత్తలాగా పెద్ద డాక్టరు వి అవ్వాలని నేను అమ్మ అత్త కలలు కన్నాము.”కానీ నువ్విలా…. ” అంటూ రాధచేయిపట్టుకుని కంటనీరు పెట్టుకున్నాడు.ఏంజరుగుతోందో తెలియనిరాగిణీ బెంబేలెత్తి ఏడవటం మొదలుపెట్టింది.

ఇల్లంతా విషాద ఛాయలు అలము కున్నాయి.
పదకొండేళ్ళ ప్రణవ్ కి తను చేసింది తప్పనితెలుసు కానీ,అది అమ్మానాన్నలకి అంత కోపం వస్తుందనుకోలేదు.నెమ్మదిగా తల్లి దగ్గరకు వచ్చి సారీ డాడ్. అండ్ మమ్మీ అంటూ తండ్రి ,తల్లి మెడలను గట్టి గా కావలించుకున్నాడు.

ఆమాత్రందానికే పొంగిపోయింది రాధ”.ప్రణవ్ తప్పచేసి తెలుసుకున్నావు నాన్నా. ఇకమీదట అమ్మానాన్నలకి కళ్ళనీళ్ళు తెప్పించే పనులు చేయవద్దు తండ్రీ. సిగరెట్టు కార్బన్డయాక్సైడ్.మనం ఆక్సిజెన్ పీల్చాలికదా!ఇలా సిగరెట్ తాగితే చాలా సిక్ అవుతారుఅది పాయిజన్ నువ్వు సినిమాల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అంటూ లంగ్స్ చూపెట్తారుకదా అలా అయిపోతాయన్నమాట మన లంగ్స్ .”అంటూ గట్టిగా కావలించుకుంది.కౌగిలివదలితే ప్రణవ్ తన కందడన్నభయంతో

“రండి భోజనం చేద్దాం!” అంటూ వంటింట్లోకి వెళ్ళింది రాధ.

ఈ సంఘటనతో రాధలో పట్టుదల పెరిగింది. వచ్చిన కాంపిటీటివ్ ఎక్జామ్స్ అన్నిటికీ ఎప్లై చేయటం రాయటం.చేసింది.దాని ఫలితమే.స్టేట్బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్గా తిరుపతి మైన్ బ్రాంచిలో పోస్టింగ్ అయ్యింది.
రాధకి ఇప్పుడు కరెక్షన్స్ కి ఎక్జామ్ పేపర్లు తెచ్చి కరెక్షను చేసేబాధ తప్పింది.ఆఫీస్ అవర్సులో ఆఫీసుపనిఅయ్యాక,ఇంటికి వచ్చి పిల్లల చదువులు చూసుకోవటంతో కొంచెం రిలాక్సడ్ లైఫ్ ని అనుభవించ సాగింది.

★★★
ప్రణవ్ ఆశక్తి చదువుమీదకంటే బిజినెస్ మీద ఉండటంతో రాధ కృష్ణమోహన్లు ప్రణవ్ని బి.బి.ఏ లో చేర్చారు.
రాగిణి అందం కవులకల్పనకి అందదు. నెమ్మదస్తురాలు, మృదుభాషిణి తండ్రి లాగున.ఇంటి పనన్నా మక్కువ చూపేది. తల్లి కి వంటలో హెల్ప్ చేయటం లంచ్బాక్సులు కట్టటం చేసేది.

.తండ్రి కాలేజ్ రూట్లోనే స్కూలవటంతో తండ్రి తో పాటు స్కూలుకి వెళ్ళేది.స్కూలవంగానే తండ్రి కాలేజీకి వెళ్ళి తండ్రితో ఇంటికివచ్చేది.
అందరితండ్రుల్లా తన తండ్రి తనతో ఆడలేకపోతున్నాడని బాధతో కూడిన కోపం ప్రణవ్దయితే అయ్యో పాపం నాన్న ఆకాలుతో చేత్తో ఎంతకష్టపడుతున్నారో అనుకునేది రాగిణి.

అందుకేతండ్రంటే ప్రాణం రాగిణికి. వీలయినప్పుడల్లా సన్నగా పీలగా ఉన్నకాలుచేయికి నూనె మర్ధన చేసేది. వయసుతో పాటు కృష్ణమోహనుకి స్ట్రైనయినప్పుడు పోలియోవచ్చిన కాలు చాలా ఇబ్బంది పెట్టేది.రాధ.పూర్తిగా ప్రణవ్ మీద కాన్సన్ట్రేషన్తో రాగిణి తండ్రి సపర్యలన్నీ చూసుకునేది మాటకి. ముందు వెనుక నాన్నతప్పించి అమ్మా అని వచ్చేది కాదు.కృష్ణమోహన్ రాగిణిని ‘తల్లీ’ అని ముద్దుగా పిలుచుకునేవాడు.రాగిణి చదువులో వెనుకబడింది.టెన్త్ మేథ్స్ లో ఫెయిల్ అయింది.రాధ హోమ్ట్యూటర్ని పెట్టింది.
రాధ గుండెచప్పుడు రాధకే తెలుసు.ఇంకొక్కేడాది కృష్ణమోహన్ రిటైర్మెంట్కి. డబ్బుకి ఇబ్బంది లేదు.ఇద్దరి సంపాదనతో ఒక అపార్టమెంట్ కొనుక్కున్నారు.
ప్రణవ్ బిబిఎ పూర్తిచేసాడు.ఎమ్.బి. ఎ లో ఎక్కడా సీటు రాలేదు.తల్లిని ఎమ్.బి.ఎ చేరటానికి పైదేశం పంపించమని వత్తిడి చేయసాగాడు.తల్లి ససేమిరా తనదగ్గిర అంత.డబ్బులేదని,కాంపిటీటివ్ ఎక్జామ్స్ వ్రాసి ఇండియా లోనే సీటు తెచ్చుకోమంది.

ఆ మాటతో రెచ్చిపోయిన కోపంతో ప్రణవ్ “చాతకాని వాడికి పుట్టినందుకు నాబ్రతుకింతే” అంటూ తండ్రవైపు ఛీదరించుకుంటూ చూసాడు.

వెంటనే చంపఛళ్ళుమనిపించింది రాధ.

“ఏంచూసుకుని కన్నతండ్రిని పట్టుకుని అంతమాటంటావు?ఆయనంత విద్యాబుద్ధులు నీకెటూలేవు.ఆయన సంస్కారంలో వీసమెత్తుకూడారాలేదు.ఆడలేకమద్దెల ఓటిదన్నట్లు,అల్లరిచిల్లరిగాతిరిగి నీజీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీతెలివితేటలకి మురిసిపోనిరోజులేదు మీనాన్న.ఆయన నీ ఫ్యూఛర్ గురించి ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా?ఛీ!నీది ఒక జన్మేనా! ముందు ఆయన కాళ్ళమీదపడి తరువాత నాకు నీ మొహం చూపించు.”అంటూ రుసరుసా బెడ్రూం లోకి వెళ్ళి పోయింది రాధ.

“రాధా! “అంటూ రాధభుజంమీద చేయివేసి తనవైపు తిప్పుకున్నాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ పిలుపుకే గుండెలమీద పడి ఏడ్చింది రాధ.”చూడండి వాడెలా తయారయ్యాడో “అంటూ.
ఎందుకంత ఎమోషనల్ అవుతావు?చిన్నపిల్లవాడు వాడనుకున్నట్లు జరగలేదన్నఉక్రోషంతో
మాట్లాడాడు. కానీ ఆ మాటలు వాడు స్పృహ తో మాట్లాడినవి కావు. అమ్మానాన్నలని కాకపోతే వారికి కావలసినది ఎవరిని అడుగుతారు చెప్పు? లోపం నాలోనే ఉందనిపిస్తోంది ఒక డిగ్రీ కాలేజీ ప్రిన్సపల్ గాఉండి ఎంతోమంది స్టూడెంట్స్ చేత గౌరవిపబడిన నేను ఎందుకు నాస్వంత కొడుకుని సక్రమమైన మార్గంలో పెట్టుకోలేకపోయాను? జరిగిందేదో ఙరిగింది. ఇప్పుడేంచేయాలో ఆలోచించాలి. ఇవాళ సాయంత్రం ఐదుగంటలకి వాడితో మాట్లాడాలనుకుఃటున్నా.వాడింకా చిన్న పిల్లవాడుకాదు. లే లేచి వడ్డించు. భోంచేద్దాం. ఆకలేస్తోంది.ఆఁ. అవును నువ్వు బ్యాంక్ తరఫున షటిల్ టోర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తున్నానన్నావు.ఈవినింగ్ ప్రాక్టీస్ అన్నావు.భోంచేసి రెస్ట తీసుకో!మళ్లీ వెళ్ళాలేమో!” అన్నాడు కృష్ణమోహన్.

“ఇవాళ నా మనసు బాగాలేదు.రేపు సన్డే మార్నింగ్ వెళ్తా. పదండి భోంచేద్దాం!” అటూ డైనింగ్ టేబిల్ దగ్గరకెళ్ళింది.

“అమ్మూ అన్నని పిలు భోజనానికి” అంటూ రాగిణిని పిలిచింది రాధ.
రాగిణిని తల్లి ‘ అమ్మూ’ అని తండ్రి ‘తల్లీ: అని
పిలుస్తారు.

రాగిణికి ఎవరిని ఎలా సముదాయించాలో బాగా తెలుసు.

భోజనానికి రానన్న అన్నతో “అన్నా ఎంతైనా నాన్నని అలా అనటం చాలాతప్పుకదా!ఇన్నేళ్ళలో అమ్మా నాన్నా పోట్లాడుకోవటం గాని అమ్మ నాన్నని నాన్న అమ్మని మాటామాటా అనుకోవటం చూసామా! మాఫ్రెండ్స్ అందరిళ్ళల్లో ఎప్పుడూ వాళ్ళమ్మానాన్నల మధ్య ఏవో ఒక గొడవలు జరగటంపిల్లలు ఏడుస్తూ స్కూలుకు రావటం చూసాను.అలాంటిది నాన్నని అంత మాటంటే అమ్మకి కోపంరాదా!ఎంతైనా నాన్నతరువాతే కదా మనిద్దరం అమ్మకి.అంటూ అన్నగారి గెడ్డం పట్టుకుంది రాగిణి.

‘తనకంటె చిన్నదైనచెల్లెలంత గ్రహింపు తనకుఎందుకు లేదు.నాన్న ని తను అంతమాటంటే చిన్నపిల్లాడని కొట్టి పారేశాడు సిగ్గుపడ్డాడు’ప్రణవ్.

“చెల్లీ! నాన్న ఎదుట పడటానికి సిగ్గుగా ఉంది.”అన్నాడు ప్రణవ్.
ఏమీ పరవాలేదు.మన నాన్నేగా!అంటూ ఈడ్చుకొచ్చింది డైనింగ్ టేబిల్దగ్గిరికి.కంచంలో వడ్డించినవి నోట్లో పెట్టుకోబుధ్ధి కాలేదు. ప్రణవుకు.దుఃఖంతో గుండెమనసూ భారంగా ఉంది.
కృష్ణమోహన్ కొడుకునిగమనించాడు. జాలివేసింది.నెమ్మదిగా తల నిమురుతూ “అన్నం తిను బంగారం .”అన్నాడు.
ఎక్కువ ప్రేమ వస్తే తల్లీ తండ్రి ప్రణవ్ని ‘బంగారం’అని పిలుచుకుంటారు.
తండ్రనోట ఆ పిలుపు వినంగానే ఇక ఆపుకోలేకపోయాడు.కట్టలుతెగిన గోదావరే అయింది ప్రణవ్ దుఃఖం.అమాంతంగా తండ్రిని కావలించుకొని , “నాన్నా!ఇంటెన్షనల్లీ అనలేదు. నోరుజారాను.సారీనాన్నా!ఎక్సట్రీమ్లీ సారీ.అమ్మా సారీ అమ్మా”.అంటూ తల్లి వళ్ళో తలపెట్టుకున్నాడు.

ప్రణవ్ తల్లిని విడిచి ఉండలేడు.తల్లికి కోపం వచ్చిందంటే అది తనతప్పని గట్టినమ్మకం.

ఆ రోజు సాయంత్రం కుటుంబం అంతా సమావేశమైంది.
రాధ ఇంకా జరిగిన విషయంనించీ కోలుకోలేదు.

“పిల్లలూ!ఇవాళ నేను మీకు తెలియని విషయాలు చెప్పదలచుకున్నా!”అంటూసంభాషణకుపక్రమించాడు కృష్ణమోహన్.

మొట్టమొద మీకు ముఖ్యంగా తెలియవలసింది మీ అమ్మకి నాకు పదిహేడు పధ్ధెనిమిది ఏళ్ళ ఏజ్గేప్ ఉంది.ఎలా?ఎందుకు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవలసిన సమయంకాదు.

రెండవదినేను వచ్చేఏడాది ఆగస్టుకి రిటైర్ అవుతా.
మీఅమ్మ టెంత్ కంప్లీట్ అవంగానే, నేను మీ అమ్మని వివాహం చేసుకున్నాను.మీ అమ్మ స్టేట్ ర్యాంక్ హోల్డర్,స్పోర్ట్స్ గర్ల్.

మీ ఒక అత్త ఆకాలంలోనే సైంటిస్ట్స్,ఒకత్తడాక్టరు.
నేను పోలియో బారిన పడినా పట్టుదలతో నా డిజెబిలిటీని అధిగమించాలనే పట్టు దలతో చదువుకొని పి హెచ్ డి చేసాను.

మీ అమ్మ.అంత బ్రిలియంట్ స్టూడెంట్ అయిఉండీ చదువు డిస్కంటిన్యూ చేసి మిమ్మల్ని చూసుకుంటూ తన కలలని పక్కన పెట్టింది.నేను రిటైర్ అవుతానని నీ చెల్లెలు పుట్టిన రెండేళ్ళ కనుకుంటా తెలిసింది.
పెళ్ళైనతరువాత మీ బాధ్యతలతో చదవనని మొండికేసిన మీఅమ్మ నారిటైర్మెంట్ డేట్ తెలియంగానే మళ్ళీతన చదువు మొదలుపెట్టింది.ఏకోచింగుకు వెళ్ళలేదు.నేనే మీఅమ్మని గైడ్ చేసా! ప్రవేట్ గా ఇంటరు కంప్లీటు చేసింది. ఓపెన్ యూని ర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది.తరువాత బి.ఎడ్ చేసి జెడ్.పి. హెచ్ స్కూల్లో టీచర్గా పొరుగూరికి తనదోవన తానువెళ్తే పిల్లలు అంటే ‘మీరు’చెడిపోతున్నారని పట్టుదలగా బ్యాంక్ ఎక్జామ్స్ రాసి ప్రొబేషనరీ ఆఫీసర్ గా సెలక్ట అయ్యింది. ఆమె ఈస్థానానికి చేరుకుందంటే ఆమె పట్టదల.

ఏ ఒక్కరోజు మీతాతయ్యనిగాని, మీమామయ్యలనిగానీ నన్ను కానీ ‘మీవల్ల నాజీవితం ఇలాఅయిందని పొరపాటున కూడా అనలేదు.మంచి కాని చెడు కాని అది. భగవంతుని ప్రసాదంగా భావించింది.ఈ మీ పిచ్చిఅమ్మ.” అంటుంటే గొంతుదుఃఖంతో పూడుకుపోయింది.కృష్ణ మోహన్ కి

వెంటనే మంచినీళ్ళందించింది రాగిణి.

సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బోగన్ విలియాలు

తృణీకారం