పారిస్ – వెండోమ్ మెమోరియల్ కాలమ్, ఐఫిల్ టవర్
కాంకర్డ్ స్కైర్ నుంచి బస్సు బయలు దేరి ప్లేస్ వెండోమ్ స్కైర్ కి తీసుకెళ్ళింది. అదొక విశాలంగా ఉన్న ప్రదేశంలో గ్రీన్ కలర్ ఉన్న వెండోమ్ కాలమ్ నిర్మించబడి ఉంది. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు కనబడ్డాయి. అక్కడ బస్సు దిగి ఫొటోలు తీసుకుని దాని గురించి ఫ్రెంచ్ గైడ్ ఇంగ్లీష్ లోనూ, వైదేహి హిందీ తమిళ్ లో చెబుతున్న ఆ గ్రీన్ కలర్ స్తూపాకారపు మెమోరియల్ గురించి విన్నాము.

వెండోమ్ కాలమ్ (కొలొన్ వెండోమ్): వెండోమ్ స్తంభం ఒక ముఖ్యమైన చారిత్రక స్మారక చిహ్నంగా మిగిలిపోయింది, ఇది నెపోలియన్ యుగంలో ఫ్రాన్స్ సైనిక పరాక్రమాన్ని సూచిస్తుంది. ప్లేస్ వెండోమ్ ఇంతకు ముందు ప్లేస్ లూయిస్-లె-గ్రాండ్ అని పిలిచేవారుట. ప్లేస్ ఇంటర్నేషనల్ అని కూడా పిలుస్తారు, ఇది ఫ్రాన్స్ దేశపు రాజధాని ప్యారిస్‌లో 1వ అరోండిస్‌మెంట్‌లోని ఒక స్కైర్, ఇది టుయిలరీస్” గార్డెన్స్‌కు ఉత్తరాన, ఎగ్లిస్ డి లా మడేలిన్‌కు తూర్పున ఉంది. ఇది Rue de la Paix యొక్క ప్రారంభ స్థానం. స్క్వేర్ మధ్యలో ఉన్న అసలు వెండోమ్ కాలమ్‌ను నెపోలియన్ I ఆస్టర్‌లిట్జ్ యుద్ధం జ్ఞాపకార్థం నిర్మించాడట. ఇది పారిస్ కమ్యూన్ డిక్రీ ద్వారా 16 మే 1871న కూల్చివేయబడింది, కానీ ఆ తర్వాత మళ్లీ నిర్మించారట. అదే ఈనాడు ఆకూడలిలో ఒక ప్రముఖ అంశంగా నిలిచింది. ప్లేస్ వెండోమ్ 1698లో లూయిస్ XIV, గ్రాండ్ మోనార్క్, సైన్యాల కీర్తికి స్మారక చిహ్నంగా ప్రారంభించబడింది. ఆక్రమణలు తాత్కాలికంగా నిరూపించ బడినప్పుడు ప్లేస్ డెస్ కాంక్వెట్స్‌గా పేరు మార్చబడింది. ఫ్రాంకోయిస్ గిరార్డన్ (1699) రచించిన రాజు యొక్క జీవిత-పరిమాణ గుర్రపుస్వారీ విగ్రహాన్ని నగర అధికారులు విరాళంగా ఇచ్చారు. దాని మధ్యలో ఏర్పాటు చేశారు. ఇది ఒకే ముక్కలో వేయబడిన మొట్టమొదటి పెద్ద ఆధునిక గుర్రపుస్వారీ విగ్రహం అని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవంలో నాశనం చేయబడిందట. అయినప్పటికీ, లౌవ్రేలో ఒక చిన్న వెర్షన్ ఇంకా ఉందని చెబుతారు.
ఒరిజినల్ కాలమ్ నెపోలియన్ దర్శకత్వంలో 1806లో ప్రారంభించబడి 1810లో పూర్తయింది. ఇది ఆస్టర్లిట్జ్ విజయాన్ని జరుపుకోవడానికి ట్రాజన్స్ కాలమ్ తర్వాత రూపొందించబడింది. ఈ స్తంభం సుమారు 44 మీటర్లు (144 అడుగులు) పొడవు ఉంటుంది. ఆస్టర్‌లిట్జ్ ప్రచారం నుండి దృశ్యాలను వర్ణించే స్వాధీనం చేసుకున్న శత్రు ఫిరంగులతో తయారు చేసిన స్పైరలింగ్ ఫ్రైజ్‌తో అలంకరించబడింది. ప్రచారం ప్రకారం, 425 స్పైలింగ్ బాస్-రిలీఫ్ కాంస్య పలకలతో కూడిన దాని పొర యూరప్ సంయుక్త సైన్యాల నుండి తీసుకోబడిన ఫిరంగితో తయారు చేయబడింది. వాస్తవానికి ఆస్టర్‌లిట్జ్‌లో 180 ఫిరంగుల పలకలను శిల్పి పియరీ-నోలాస్క్ బెర్గెరెట్ రూపొందించారు. 30 మంది శిల్పుల బృందంచే చేయబడింది. నెపోలియన్ విగ్రహాన్ని కాలమ్ పైన ఉంచారు. నెపోలియన్ రోమన్ వేషధారణలో, ఒట్టి తలతో, పట్టాభిషేకంతో, కుడిచేతిలో ఖడ్గాన్ని పట్టుకుని, ఎడమచేతిలో విక్టరీ (నెపోలియన్ మార్స్ ది పీస్ మేకర్ లాగా) విగ్రహం ఉన్న భూగోళాన్ని చిత్రీకరించారు.

పారిస్ కమ్యూన్ తర్వాత ది ప్లేస్ వెండోమ్, సిర్కా అడాల్ఫ్ థియర్స్ పారిస్ కమ్యూన్‌ను అణచివేసిన తరువాత, దాని శిఖరాగ్రంలో పునరుద్ధరించబడిన నెపోలియన్ విగ్రహంతో స్తంభాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకోబడింది. 1874లో, ప్లేస్ వెండోమ్ మధ్యలో ఉన్న స్తంభాన్ని తిరిగి నిర్మించారు, దాని పైభాగంలో ఉన్న అసలు విగ్రహం యొక్క నకలు ఉంటుంది. పైభాగానికి వెళ్లే లోపలి మెట్లు ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవు. ప్లేస్ వెండోమ్ రిట్జ్ వంటి ఫ్యాషన్ మరియు డీలక్స్ హోటళ్లకు ప్రసిద్ధి చెందింది.
30, ఆగస్ట్ 1997 రోజున ప్రిన్సెస్ డయానా తన ఫియాన్సీ డోడి ఫాయద్ ఆ రిట్జ్ పారిస్ హోటల్లోనే తమ చివరి డిన్నర్ చేసారట. ఆ లగ్జరీ హోటల్ డోడి ఫాదర్ మొహమ్మద్ అల్ ఫాయద్ దే నట. ఆ హోటల్లోని ల’ఎస్పాండన్ అనే రెస్టారెంట్ లో భోజనం చేసారట. అక్కడ చెప్పుకునే విషయాలేమిటంటే వాళ్ళు గ్రిల్డ్ సోల్, వెజిటబుల్ టెంపరరీ, మష్రూమ్ ఆమ్లెట్ లాంటి చాల్ లైట్ డిన్నర్ నే ఆర్డర్ చేసారట. డిన్నర్ తరువాత హోటల్ నుండి డోడి వాళ్ళ అపార్ట్ మెంట్ కి వెళ్ళాలని బయలు దేరాలనుకున్నారు. కాని విపరీతమైన పేపరాజి (Paparazzi) ఫొటోగ్రాఫర్లు, పత్రకారులు వెంటబడుతున్నారని తెలిసి హోటల్ బాక్ సైడ్ లో ఉన్న గేట్ నుండి అర్ధరాత్రి 12.20 కి (31-8-1997) తమ కారు మెర్సిడీస్ బెంజ్ S280 లో బయలుదేరారట. పత్రకారులనుండి తప్పించుకోవటానికి కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ హెన్రీ పాల్ చాలా స్పీడ్ గా పోనిచ్చి, పాంట్ డి ల’ ఆల్మా టన్నల్ దగ్గర కారుని భయంకరమైన ప్రమాదానికి గురి చేసాడు. ఆ దురదృష్టమైన సంఘటనలో డ్రైవర్ తో సహా కారులో ఉన్న డయానా, డోడి ఫాయద్ లు కూడా చనిపోయారు. అందుచేత కూడా ఈ ప్లేస్, రిట్జ్ హోటలు చాలా ఫేమస్ అయ్యాయి. ఆమె చనిపోయిన ఆటన్నల్ దగ్గర ఆమె జ్ఞాపకార్థం ఒక జ్యోతి నిరంతరాయంగా వెలుగుతుంటుంది.

పారిస్ సిటీ తిరుగుతూ పోటోలు తీసుకుంటూ తిరిగి, లంచ్ చేయటానికి, షాపింగ్ కోసం ఒక వీధిలో దింపారు. అది లగ్జోరియస్ షాపింగ్ మాల్ ఎలిసి షాప్స్. అక్కడ ప్రణయ్ నన్ను వదిలి ఏదో షర్ట్స్ షూ చూడటానికి వెళ్ళాడు. ఏదో కొనుక్కుని తిని బస్సు కూడా ఎక్కేసాడు మేము వెళ్ళేసరికి. చాలా దూరం నడవాల్సి వచ్చింది. అలా నడిపిస్తూ మమ్మల్ని, సందులల్లోంచి ఫ్రాగోనార్డ్ పర్ఫ్యూమ్స్ షాపుకి తీసికెళ్ళింది.
పారిస్‌లో 9వ అరోండిస్‌మెంట్‌లోని ఫ్రాగోనార్డ్ పెర్ఫ్యూమ్ మ్యూజియం (మ్యూసీ డు పర్ఫమ్ ఫ్రాగోనార్డ్). ఫ్రాగోనార్డ్ అనేది ఒక చారిత్రాత్మక ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ హౌస్, ఇది విలాసవంతమైన సువాసనలు, సాంప్రదాయ పెర్ఫ్యూమ్ తయారీ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది.
ఫ్రాగోనార్డ్ పెర్ఫ్యూమ్ మ్యూజియం (Musée du Parfum Fragonard) అనేది ఒక ప్రసిద్ధ మ్యూజియం మే కాక ఒక బోటిక్, ఇక్కడ సందర్శకులు పెర్ఫ్యూమ్ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు, పురాతనమైన పెర్ఫ్యూమ్ బాటిళ్లను చూడవచ్చు. మనకు కావలసిన స్వంత సువాసనలను కూడా అడిగి తయారు చేయించుకోవచ్చు. ఈ షాపు ఒపెరా గార్నియర్ సమీపంలో ఉంది, ఇది ఫ్రెంచ్ పరిమళ ద్రవ్యాల పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులకు ప్రసిద్ధ ప్రదేశం. ఇక్కడ సందర్శకులు పెర్ఫ్యూమ్‌లు మరియు సువాసన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫ్రాగోనార్డ్ పెర్ఫ్యూమ్ మ్యూజియం సువాసన ప్రియులు, పెర్ఫ్యూమరీ కళపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఇది పరిమళ ద్రవ్యాల తయారీ చరిత్ర, నైపుణ్యం, విజ్ఞాన శాస్త్రంలో లోతైన విషయాలను అందిస్తుంది. ఇక్కడ సందర్శకులు పురాతన కాలం నుండి ఆధునిక లగ్జరీ సువాసనల వరకు పరిమళం యొక్క చరిత్రను అన్వేషించవచ్చు. నిపుణుల గైడ్‌లు పెర్ఫ్యూమ్‌లను ఎలా తయారు చేస్తారు, వివిధ నోట్స్, పదార్థాలు మరియు సువాసన తయారీ పద్ధతుల పరిణామాన్ని వివరిస్తారు. మ్యూజియంలో పురాతనమైన పెర్ఫ్యూమ్ బాటిళ్లను ప్రదర్శిస్తారు, కొన్ని పురాతన ఈజిప్ట్, 18వ శతాబ్దానికి చెందినవి ఉన్నాయి. పరిమళ ద్రవ్యాలు ఉపయోగించే సువాసన చారిత్రక సుగంధ తయారీ పరికరాలను చూడొచ్చు. ఇక్కడ Fragonard పరిమళ ద్రవ్యాలు, సబ్బులు సౌందర్య సాధనాలు ఫ్యాక్టరీ ధరలకు (డిపార్ట్‌మెంట్ స్టోర్‌ల కంటే చౌకగా) అందుబాటులో ఉంటాయి.
- Fragonard “Étoile,” “Belle de Nuit,” మరియు “Iris” వంటి క్లాసిక్ పెర్ఫ్యూమ్‌లతో పూల తాజా సువాసనలకు ప్రసిద్ధి చెందింది. పరిమళ ద్రవ్యాలు, సువాసన గల కొవ్వొత్తులను కూడా విక్రయిస్తారు. ఫ్రాగోనార్డ్ పెర్ఫ్యూమ్ మ్యూజియం పారిస్‌లోని దాచిన రత్నం, ఫ్రెంచ్ లగ్జరీ, చరిత్ర, సువాసనలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.
అక్కడ అన్ని రకాల పూలతో ప్యూర్ ఎసెన్స్ తో సెంటులు తయారు చేసే కంఫెనీ అది. కింద ఫ్లోర్ లో ఉన్న ఎసెన్స్ తయారు చేసే విధానాన్ని కూడా అతను మాకు చూపించాడు. ప్రణయ్ 300 యూరోస్ పర్ ఫ్యూమ్స్ జ్యోతి వాళ్ళతో కలిపి కొన్నాడు. ఎక్కువ అమౌంట్ బిల్ వల్ల టాక్స్ రిడక్షన్ కి వీలుంటుందట. ఆ గోలేదో వాడే చూసుకున్నాడు. అక్కడ నుంచి చివరికి ఈఫిల్ టవర్ చేరుకునే సరికి 3.30 అయింది.
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్ (లా టూర్ ఐఫెల్) ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటి. ఇది పారిస్ లోని చాంప్ డి మార్స్ స్థలంలో ఈ టవర్ 1887-1889 కాలంలో గుస్టావ్ ఐఫెల్ (ఫ్రెంచ్ ఇంజనీర్) రూపకల్పన చేసాడు. దీన్ని 7,300 టన్నుల చేత ఇనుముతో 330 మీటర్లు (1,083 అడుగులు) ఎత్తుగా నిర్మించారు. ఈ టవర్ మొత్తం బరువు: సుమారు 10,100 టన్నులు. 3 లెవెల్స్ వరకు సందర్శకులకు అనుమతిస్తారు. దీనికి టికెట్ తీసుకుని పై అంతస్తులకు వెళ్ళాలి. పైన రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. పైనుంచి చూడటానికి బైనాక్యులర్స్ కూడా ఏర్పరిచారు. అక్కడ్నుంచి దాదాపు పారిస్ అంతా కనబడుతుంది. విపరీత గాలి ఉన్నా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
ఫ్రెంచ్ విప్లవం యొక్క 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి పారిస్‌లో జరిగిన 1889 ‘ఎక్స్‌పోజిషన్ యూనివర్సెల్లె’ (ప్రపంచ ఉత్సవం) కోసం ప్రవేశపెట్టిన ఆర్చ్ గా ఐఫెల్ టవర్ నిర్మించబడింది. ప్రారంభంలో, ఇది తాత్కాలికంగా ఉద్దేశించబడింది. కానీ రేడియో మరియు టెలికమ్యూనికేషన్‌లలో దాని ఉపయోగం కారణంగా దీనిని తరువాత సంరక్షించారు.
ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే 1930 వరకు న్యూయార్క్‌లోని క్రిస్లర్ భవనం దానిని అధిగమించే వరకు ఐఫెల్ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణం. తుప్పు పట్టకుండా నిరోధించడానికి ప్రతి 7 సంవత్సరాలకు దీనిని తిరిగి పెయింట్ చేస్తారు. ఇనుము తో నిర్మించబడింది కాబట్టి ఉష్ణోగ్రత మార్పులతో టవర్ ఎక్స్పాండ్ అవటం కుంచించుకుపోవటం జరుగుతుంది., వేసవిలో 15 సెం.మీ (6 అంగుళాలు) ఎత్తుకు పెరుగుతుంది. దీనికి పైకి 1,665 మెట్లు తో పాటు సందర్శకుల సౌలభ్యం కోసం లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేసారు. ప్రతి సంవత్సరం దాదాపు 7 మిలియన్ల మంది ఐఫెల్ టవర్‌ను సందర్శిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే చెల్లింపు స్మారక చిహ్నాలలో ఒకటిగా నిలిచింది. మేము టికెట్స్ తీసుకుని క్యూలో నిలుచుని లిఫ్ట్ ఎక్కాము. ఆ లిఫ్ట్ లో ఒకేసారి ఇరవై మంది దాకా పైకి వెళ్ళవచ్చు. పైకి వెళ్ళటానికి కనీసం పదినిమిషాల లోపు పడుతుంది. దానికంటే లిఫ్ట్ కోసం క్యూలో నిలబడటమే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అక్కడ చూసి ఆశ్చర్యపోయిన విషయ మేమిటంటే. నెలల చంటి పిల్లలను వెంటేసుకుని వచ్చారు. తల్లి తండ్రులు ఇద్దరూ, పిల్లల పట్ల అంతే జాగ్రత్తలు వహిస్తున్నారు. అంతేకాదు కొంతమంది తమ పెట్ డాగ్స్ ను కూడా తీసుకువచ్చారు. వీటిని పెట్టుకుని వీళ్ళు ఎలా ట్రావెల్ చేశారా అనిపించింది. మా బాగ్ లు మేము మోసుకుంటూ ప్రయాణించటమే కష్టంగా ఉంది మాకు. వీళ్ళు ఈ కుక్కలను ఎలా మేనేజ్ చేస్తున్నారో కదా అనుకున్నాను.

ఐఫెల్ టవర్ యొక్క 2వ అంతస్తు నుంచి పారిస్ లోని చాలా అద్భుత మైన దృశ్యాలను మనకు చూసే వీలుకలుగుతుంది. 2వ అంతస్తు, 115 మీటర్లు (377 అడుగుల ఎత్తు) ఉండటం వల్ల పారిస్ అద్భుతమైన 360-డిగ్రీల సుందరమైన దృశ్యాలు మనకు కనబడతాయి. సేన్ నది వంపులు, నోట్రే–డామ్ కేథడ్రల్, లౌవ్రే మ్యూజియం, ఆర్క్ డి ట్రియోంఫ్, మోంట్మార్ట్రే వంటి ల్యాండ్‌మార్క్‌లను పై నుండి స్పష్టంగా చూడవచ్చు. అక్కడ బైనాక్యులర్స్ కూడా ఏర్పాటు చేసారు. కాని కాయిన్స్ వేయాలి. వాతావరణం క్లియర్ గా ఉన్న రోజులలో 70 కి.మీ (43 మైళ్ళు) దూరం వరకు మనం చూడవచ్చు.
పైన రెస్టారెంట్లు & డైనింగ్ హాల్స్ ఉన్నాయి. లే జూల్స్ వెర్న్ – గౌర్మెట్ ఫ్రెంచ్ వంటకాలను అందించే మిచెలిన్–స్టార్ చేసిన రెస్టారెంట్, బఫెట్లు & స్నాక్ బార్‌లు అనేక రకాల పానీయాలు దొరుకుతాయి. గ్లాస్ ఫ్లోర్, అంతస్తులోని ఒక విభాగంలో పారదర్శక గాజు ప్యానెల్ ఉందిట, ఇది నేరుగా కింద నేలవైపుకి చూడటానికి వీలవుతుందట. థ్రిల్ కోరుకునేవారికి ఇది ఉత్తేజకరమైన అనుభవమని అంటారు కాని మాకు దాని వైపుకి తీసుకెళ్ళ లేదు. టవర్ నిర్మాణం గురించి టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు, చారిత్రక సమాచారం అందించే ఏర్పాటు కూడా ఉంది. అనేకరకాలైన పుస్తకాలు మాగ్జీన్స్ ఉన్నాయి. అక్కడ నాకు ఒక న్యూస్ పేపర్ పాత కాగితపు రంగుతో కనబడింది. కాని అది ఫ్రెంచ్ భాషలో ఉంది. అదేమిటని షాపు వాణ్ణి అడిగితే ఈఫిల్ టవర్ కట్టటానికి ప్రభుత్వం అనుమతి, దాన్ని కట్టటానికి టెండర్ సాంక్షన్ గురించిన వివరాలు ఉన్న ఆ నాటి పేపర్లట. అది ఇంగ్లీషులో లేదా అని అడిగాను. అదికూడా అవేలబుల్ అని తీసి ఇచ్చాడు. దాన్ని చేతిలోకి తీసుకుని చదువుతుంటే గొప్ప అనుభూతిని పొందాను. ఆ రోజు పేపరు…అద్భుతం…అనిపించింది. ఎందుకో నాకు చారిత్రక విశేషాలపై మొదటి నుంచి చాలా అభిరుచి. మనసు ఎక్కడికో వెళ్ళి పోతున్నట్లుగా అని పిస్తుంది. దాన్ని తనివితీర చేతితో తడిమాను. భద్రంగా నా బాగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నాను. నావరకు అది ఎంతో గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.
ఆ సాయంత్రం సేన్ రివర్ పై నౌకాయాత్ర చేసాము. ఆ విశేషాలు వచ్చే వారం.