గృహోపకరణాల లాగా ఇంట్లో మగ్గే మహిళలు ఈ నాటికి మనకు తారసపడతారు. మరి 17వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించటం పెద్ద కష్టమేమి కాదు. ఇంటి పనులకు, భర్త సేవలకు, పిల్లల సంరక్షణార్థానికే పరిమితమై, తన కంటు ఒక ఉనికి లేని నేపథ్యమది. ఆ నాటి వ్యవస్థలో విద్యావంతులై, కవిత్వరచనలో రాణించిన స్త్రీలు చాలా అరుదుగా కనిపించేవారు.
ఆ సాంఘిక కట్టుబాట్లలో కూడా విద్యను అభ్యసించి, కవితా ధోరణిని అలవర్చుకుని చరిత్రలో నిలచిపోయిన, వేళ్ళపై లెక్కించ గలిగిన కవియిత్రులలో ఒకరై, ‘శతలేఖీని, ఒక ‘ఘటిక’లో దాదాపు 24 నిమిషాల పాటు వంద పద్యాలను ఎనిమిది భాషల్లో కూర్పు చేయగలిగిన’ విదుషీమణి గా పేరొందిన కవయిత్రి రామభద్రాంబ గారు. తెలుగు, సంస్కృతం సాహిత్యంలో ఒక ప్రముఖ కవయిత్రి. ఆమె తంజావూరు నాయకుల కాలంలో (17వ శతాబ్దం) ప్రముఖంగా పేరొందిన పండితిరాలు. ముఖ్యంగా రఘునాథ నాయకుడు (తంజావూరులో 1614–1634) రాజసభలో కవయిత్రిగా ప్రాచుర్యం పొందింది.
ఆమె ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. రామభద్రాంబ గారి జనన సంవత్సరం, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు స్పష్టంగా దొరకడం లేదు. కానీ ఆమె తంజావూరు నాయక రాజుల రాజసభ పరిసరాల్లో పెరిగి, సంస్కృతం, తెలుగు వంటి భాషల్లో పాండిత్యాన్ని పొందిన వారని, కవిత్వంలో ప్రతిభావంతురాలిగా ఎదిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చునని అందుబాటులో ఉన్న పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆ కాలంలో మహిళలు ప్రబంధం/మహాకావ్యం రాయడం చాలా అరుదు, అందుకే ఆమె పేరు ప్రాచుర్యం పొందింది.
తంజావూరు రాజసభ (నాయకుల కాలం, తరువాత మరాఠా కాలం)లో కవయిత్రిగా ప్రాచుర్యం పొందారని చారిత్రక ఆధారాలున్నాయి. ఆంధ్రప్రదేశం – తంజావూరు ప్రాంతంలో నివసించింది. చిన్న వయసులోనే సంస్కృత విద్యను అభ్యసించారు. ఆ కాలంలో రాజమహల్‌లోని గురుకుల వ్యవస్థలో, ముఖ్యంగా సంస్కృత కవిత్వం, వ్యాకరణం, నాటక శాస్త్రంలలో శిక్షణ పొందినట్లు సూచనలు ఉన్నాయి. విద్యను అభ్యసించటమే కాక, చెంగల్వ కళాకవి ప్రియ శిష్యురాలని ఆయన వద్ద కావ్య రచనల రీతులను అభసించారని ప్రముఖుల రచనల్లో అవగతమవుతుంది. జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి విషయాలను వివిధ మూలాల నుండి తీసుకోబడ్డాయని తన వాణిజ్యేతర బ్లాగ్ లో ప్రముఖ సాహిత్య విశ్లేషకులు స్వామినాథన్ గారు సంకలనం చేశారు. ఆ విధంగా ‘‘24 నిమిషాల్లో ఎనిమిది భాషల్లో పద్యాలను కంపోజ్ చేయగల మహిళలు!‘‘ గురించి ఆయన రాశారు.
1565 తళ్ళికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యం చిన్నాభిన్నమై పోయింది. రాయల సంతతి వారు కొంతమంది పెనుగొండకు మరికొంత మంది చంద్రగిరికి వెళ్ళారు. మిగిలినవారు తంజావూరుకు, మధురకు చేరుకున్నారు. ఈ రెండూ కూడా విజయనగర రాజుల క్రింద సామంత రాజ్యాలుగా వుండేవి. తంజావూరు రాజ్యాన్ని 1535 నుండి 1673 వరకు సుమారు 140 సంవత్సరాలు నాయక రాజులు పరిపాలించారు. ఈ వంశంవారు ఆఖరు వరకూ విజయనగర రాజుల పట్ల విశ్వాస పాత్రులుగా వుంటూ వచ్చారు. అచ్యుతరాయలు, రఘునాథరాయలు, విజయరాఘవరాయలు వరుసగా పరిపాలించారు. విజయరాఘవ నాయుకునికి మరొ పేరు మన్నారుదాసు, మధురనాయకుడైన చొక్కనాథునికీ, ఇతనికీ జరిగిన యుద్ధంలో (1674) విజయ రాఘవుడు మరణించాడు.
మధుర, తంజావూరు నాయక రాజులు తమిళనాడులోని మధురై, తంజావూరు ప్రాంతాలను పరిపాలించిన సమకాలిక రాజులు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం తెలుగు సాహిత్యాన్ని పోషించి, తెలుగు సాహిత్యంలో తమకంటూ స్థానం సంపాదించుకున్నవారు ఈ నాయక రాజులు. కానీ వస్తువు విషయంలో విలువలను విడిచిపెట్టి పచ్చి శృంగార వర్ణనలను చేశారన్న కారణంతో బ్రిటీష్-ఇండియా పాలన కాలం నాటి పలువురు సాహిత్యవేత్తలు ఈ యుగాన్ని క్షీణ యుగమని వ్యవహరించారు. ఈ అభిప్రాయం వలసవాద ప్రభావితులైన వారి ధోరణి వల్ల వ్యాపించిందని నేటి సాహిత్య విమర్శల్లో ఇప్పటి పండితులు అబిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా మధుర, తంజావూరు నాయక రాజుల యుగంలోని సాహిత్యం తెలుగు సాహిత్య చరిత్రలో చెదరని స్థానం కల్పించుకుంది. దక్షిణదేశ చరిత్రలో ఆంధ్రనాయకరాజుల పరిపాలన ఒక సువర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర చక్రవర్తుల కాలంలో లలిత కళలు అభివృద్ధి పొందినట్లే, తంజావూరు, నాయక రాజుల కాలంలో కూడా లలిత కళలన్నీ వికాసం పొందాయి. తెలుగు సాహిత్యం, సంగీతం నాట్యం, శిల్పం, యక్షగాన వాగ్మయం ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించాయి. ఆ నాటికీ ఈ నాటికీ ఆ మహావైభోగానికి సాక్ష్యాదారాలుగా అవి తంజావూరులో మనకు దర్శనిమిస్తున్నాయి.
రఘునాథనాయకుడు సా.శ.. 1613 నుండి 1631 వరకూ రాజ్యాన్ని పరి పాలించాడు. ఈయనకు దాన కర్ణుడనే పేరు కూడా ఉంది. మధుర, తంజావూరు నాయక రాజుల కాలంలో రామభద్రాంబగారు తెలుగు, సంస్కృతం సాహిత్యంలో గొప్ప పండితురాలుగా పేరుపొందింది. ఆమె ఒక కవియిత్రి. రామభద్రాంబ గారి భర్త “తిరుమలయ్య” (తిరుమలంబ) గురించి లభ్యమైన చారిత్రక సమాచారం చాలా తక్కువ.
కానీ శాస్త్రీయ గ్రంథాలలో, గ్రహించిన వివరాల ప్రకారం ఆయన ఒక పండితుడు. సంగీతం, సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాడని కూడా భావిస్తారు. రామభద్రాంబ కవిత్వం రాయడానికి ఆయన ఎంతో ప్రోత్సాహించాడని రచనల్లో సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా రామభద్రాంబ తనను పరిచయం చేసుకునే శ్లోకాలలో “భర్తృవ్రతా తిరుమలంభాసమేతా” అని చెప్పింది. అంటే, ఆమె తనను భర్తకు అంకితం చేసుకున్న గృహిణిగా పరిచయం చేసుకుంది. అయితే తిరుమలయ్య రాజు కాదు, పోషకుడు కాదు, ఆయన వ్యక్తిగతంగా పెద్ద రాజబటుడు లేదా సైనికాధికారి అయి ఉండవచ్చునని చెబుతారు. కాని ఎటువంటి ఆధారాలు లేవు. అతను ఒక సాహిత్యాభిమాని, పండితుడు — అంతవరకు మాత్రమే సమాచారం ఉంది. ఆమె తన భర్త ప్రోత్సాహంతో రాజు రఘునాథుడి జీవిత చరిత్ర అయిన రఘునాథాభ్యుదయం అనే సంస్కృతపురాణాన్ని రచించింది.
రామభద్రాంబ, రఘునాథ నాయక పాలనలో, ఆయన సభా స్థానాన్ని అలంకరించిన వారిలో ప్రముఖుంగా చెప్పకోదగిన వారు. ఆయన రాజ్యంలో జరిగిన రాజకీయ, సైనిక సంఘటనలను వివరిస్తూ ఆమె, పన్నెండు ఖండాలలో ‘రఘునాథాభ్యుదయం’ అనే చారిత్రక కావ్యాన్ని రాశారు. ఈ రచన రఘునాథ నాయక రాజు జీవితం, ఆయన విజయ పరంపరల గురించి విశదీకరించబడింది. ఇది సంస్కృతంలో ఉంది. దాని సాహిత్య విశేషాలతో పాటు, ఈ పద్యం కావ్యం విజయనగర చరిత్రకు గొప్ప మూలం. ఇది రాయల విచ్ఛిన్నం, పతనాన్ని వివరించి చేసిన రాజకీయ విప్లవానికి సంబంధించిన సమకాలీన కథనం. ఈ రచన 12 సర్గల్లో వ్రాయబడిన సంస్కృత మహాకావ్యము. రఘునాథుడ్ని రాముడు-కృష్ణుడు-విష్ణువు అంశంగా కీర్తిస్తూ రచించబడింది. మొదటి కొన్ని సర్గలలో రఘునాథుడి స్తుతి ఉంటుంది. ఇందులో అతని శరణు కోరటం, సహాయం అర్థించడం, అతని కరుణ-దయ-క్షమా గుణం-బుద్ధి లను కీర్తించడం కనిపిస్తుంది. నాలుగవ సర్గలో రాఘునాథుడి పూర్వీకుల గురించి, ఆపై వచ్చే సర్గలలో రఘునాథుడి జీవితంలో తొలినాళ్ళు, అతని యుద్ధ కుశలత గురించి చర్చించబడింది. అతడు 8వ సర్గంలో తన తండ్రినుండి వారసత్వంగా రాజపదవిని తీసుకొని తన సైనిక చర్యలను కొనసాగిస్తాడు. ఆఖరి రెండు సర్గాలలో అతని సభలో జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రావీణ్యము చెబుతూ రామభద్రాంబ సాహితీ కృషిని గొప్పగా చెప్పారు. ఇది మొదటి మహిళా ప్రబంధ రచనగా తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందింది. పద్యాలు అలంకారములు, రూపకములుతో నిండి ఉంటాయి. కవియిత్రి రాజును వర్ణిస్తూనే, అప్పుడప్పుడూ తన భక్తి భావం (రాముడు, శివుడు)ను కూడా ప్రతిబింబించింది. కొందరు ఆమెను “ఆంధ్ర సాహిత్య రంగంలో మొట్టమొదటి మహిళా కవి”గా భావిస్తారు.
ఆమె కవయిత్రిగా ఎన్నో ఇతర రచనలు చేసారు. కాని, సంస్కృత కావ్యం ‘రఘునాథాభ్యుదయం’ కాక మరియే ఇతర రచనలు లభ్యపడలేదు. ఈ రచన సమకాలీన కవయిత్రిచే వ్రాయబడింది. కనుక, రాజు, అతని కాలం లోని పరిస్థితులు, అతని విజయాలను గురించి గ్రంథస్తం చేసిన వాస్తవాలు. దీనిలో 12 సర్గలు, 900 శ్లోకాలతో చారిత్రక సత్యపూర్వక సమాచారాలను వివరిస్తుందీ రామభద్రాంబగారి రచనా కావ్యం. ప్రతి సర్గ చివరిలో అభ్యాసానికి అనుగుణంగా ఒక గద్యం తెలుగులో విశదీకరించబడి ఉంది. ఆమె కొన్ని రచనలను తెలుగులోనూ వ్రాసినట్లుగా చారిత్రక ప్రమాణాలు కనబడుతున్నాయి. అవి ఏవి లభ్యం కాలేదు. కాని విజయరాఘవ నాయక రాజు కాలంలోని కవి చెంగల్వ కళాకవి రచించిన ‘రాజగోపాల విలాసము‘అనే గ్రంథంలో రామభద్రాంబగారు తెలుగులో చాలా కావ్యాలను రచించారని విశదీకరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అంతే కాక ఆమె, చెంగల్వ కళాకవి ప్రియ శిష్యురాలని ఆయన వద్ద కావ్య రచనల రీతులను అభసించారని మధుర తంజావూరు కవుల గురించి తిమ్మావజ్జల కోదండరామయ్యగారు రాసిన పుస్తకంలో పేర్కొనబడింది. తెలుగులో ఆమె రచించినవి లభ్యం కానప్పటికీ, తెలుగు కావ్యగతి మాదిరి గానే యతి ప్రాసలను తన సస్కృత కావ్యం ‘రఘునాథాభ్యుదయం‘ రచనలో ఉపయోగించారని ఆ కావ్య రచనా శైలిలో ప్రతిభింబిస్తుందని రాసారు. అందుచేత తెలుగు కావ్యాలు కూడా ఆమె రచించి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు. అంతేకాక రామభద్రాంబిక గారు సమస్యాపూర్ణంలో మంచి దిట్ట అని ఒక సందర్భంలో, రఘునాథనాయక మహాసభలో ఒకేసారి రెండు ప్రశ్నలకు, ఒకటి తెలుగు మరోటి ప్రాక్రుతిక భాషలో ఎదుర్కున్నదని, వాటిని పూరించి అందరి మన్ననలను పొందిందని చెప్పబడింది. ‘‘ఆమె మూడు భాషలలో కవిత్వం కంపోజ్ చేయగలరని, అష్టావధానం అనగా ఒకే సమయంలో ఎనిమిది విభిన్న మేధోసంపన్నులైన పండితులను ఎదుర్కొని, వారి ప్రశ్నలకు జవాబీయగల నిపుణురాలు” అని పండితులు శ్లాఘించారు. ఆమె “రఘునందనాయక పాలనలో రాజకీయ, సైనిక సంఘటనల లెక్కలను” పేర్కొన్న చరిత్రకారిణి అని వారు పేర్కొన్నారు.
పండితులు, రామభద్రాంబ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆమె తన సమకాలీన కవియిత్రి మధురవాణి కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. తన కవితకు చారిత్రాత్మక ఇతివృత్తాన్ని ఎంచుకున్నందున, ఆమె తన కవితా రీతులకు, కల్పనకు పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. అది ఆమె సామర్థ్యం కొదవ వల్ల కాదు, ఆమె ఎంచుకున్న ఉద్దేశ్యం యొక్క పరిమితి కారణంగా. ఆమె కథనంలో గొప్ప శక్తి ఉంది. ఆమె యుద్ధ సన్నివేశాల వివరణలు మనోహరంగా ఉన్నాయి. ఆమె శైలి అనూహ్యంగా ఉంటుంది. ఆమె పద్యం అడ్డంకులు లేని ప్రవాహంలా సాఫీగా ప్రవహిస్తుంది. ఆమె వాక్చాతుర్యంలో ప్రవీణురాలైనందున, ఆమె చిత్రణ వైవిధ్యంగా, వాస్తవానికి దగ్గరగా అసలైనవిగా కనిపిస్తాయని సాహిత్యాభిమానులతోను, విశ్లేషకులతోనూ అభినందించబడింది.
పద్యంలోని రెండు ఖండాలు తంజావూరు ఆస్థానానికి చెందిన స్త్రీల విజయాలను వివరిస్తాయి, ఆమె ఎనిమిది భాషలలో సౌలభ్య పద్యాలతో అద్భుతమైన సృష్టి చేయగలరు, వైశేషిక తత్వశాస్త్రం, వ్యాకరణాన్ని కూడా వివరించగలరని పండితుల అభిప్రాయం. రామభద్రాంబ స్వతహాగా శతలేఖీని, ఒక ‘ఘటిక’లో దాదాపు 24 నిమిషాల పాటు వంద పద్యాలను ఎనిమిది భాషల్లో కూర్పు చేయగలిగింది. నాయక రాజుల కాలంలో మధుర, తంజావూరులో ఉన్న సంసృత, తెలుగు కవులు గురించి 1975 సంవత్సరంలో జరిగిన మొదటి తెలుగు మహా సభల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే, తిమ్మావజ్జల కోదండ రామయ్య గారు రచించిన పుస్తకాన్ని అవిష్కరించారు. అందులో వివరించిన మన మహిళా సాహిత్యకారులైన ఆనాటి కావ్య నాయికలే రామభద్రాంబ, మధురవాణి, రంగరాజమ్మ, ముద్దుఫళని.
మరే ఇతర రచనలు లభ్యం కాకపోవటం, ఆధారాలు కూడా లేనందున ‘రఘునాథాభ్యుదయం’ కవియిత్రిగా రామభద్రాంబ గారు చరిత్రలో నిలిచి పోయారు. ఆమె కవితా పటిమ అమోఘం గా కీర్తించ బడింది. ఆమె “రఘునాథాభ్యుదయం”లో తనను తాను “కవయిత్రి”గా పేర్కొనడం కూడా గమనార్హం. తెలుగు సాహిత్య చరిత్రలో మహిళా కవులలో ఆ పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇది మహాకావ్య శైలిలో వ్రాసిన ప్రబంధం. కవియిత్రి తన యజమానుడు తంజావూరు రఘునాథ నాయకుడు జీవన గాథను మహాకావ్య పద్ధతిలో రాసింది. అందుకే దీనికి “అభ్యుదయం” (అభ్యుదయము = ఉజ్వల విజయగాధ, ఎదుగుదల) అనే పేరు వచ్చింది.
ఇది ఒక మహాకావ్యం (ప్రబంధం) శైలిలో వ్రాయబడింది. రఘునాథ నాయకుని జీవన చరిత్రను రామకథ, పురాణ శైలిలో కవయిత్రి వర్ణించింది. మొత్తం పద్యాలు సంస్కృతం ఛందస్సులతో (ఉపజాతి, మాలిని, శార్దూలవిక్రీడిత మొదలైనవి) నిండి ఉంటాయి. రామభద్రాంబ తనను తాను “స్త్రీ కవి” అని సంస్కృత పద్యంలోనే ప్రస్తావించింది. ఇది చాలా అరుదైన విషయం. ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే కాకుండా సంస్కృత కవితా సంప్రదాయంలో కూడా ఒక అరుదైన స్త్రీ కవయిత్రి రచన. సాధారణంగా ఆ కాలంలో సంస్కృత సాహిత్యం రాయడం పురుషుల ఆధిపత్యంలో ఉండేది. రామభద్రాంబ గారు ఆ అవరోధాన్ని చెరిపేశారు.
రామభద్రాంబగారు రాసిన ఈ రఘునాథాభ్యుదయం సంస్కృతం శ్లోకాలు లభ్యం కాలేదు కాని ఆమె రాసిన కవిత్వపు పరిమళాన్ని తెలుగులో ఆస్వాదించే కొన్ని పద్య నమూనాలను సంపాదించగలిగాను.
ఆమె ఈ ప్రబంధాన్ని సంస్కృతంలో మంగళ శ్లోకాలతో ప్రారంభించారు. తొలుత విష్ణువు, శివుడు, గణపతి, సరస్వతి దేవిని స్తుతిస్తూ మంగళచరణం.
“సరస్వతీ తల్లీ! నా వాణి ఈ రఘునాథాభ్యుదయంలో తీయని ప్రవాహంలా పారాలని ఆశీర్వదించు.” “నా వాణి ఎల్లప్పుడూ జ్ఞానదేవితో కలసి ప్రవహించాలి. ఆ వాణి ద్వారా రఘునాథుని కీర్తిని కీర్తిస్తాను.”
ఆ తరువాత రఘునాథుని వంశవృక్షం, జననం ఆయన వంశపారంపర్యాన్ని, పూర్వీకుల గొప్పతనాన్ని వివరించింది. ఒక శుభ ముహూర్తంలో తంజావూరులో మహోన్నతమైన శాసనరాజు పుత్రుడిగా రఘునాథుడు జన్మించాడు. శౌర్యవంతుడైన, సింహలాంటి ధీరుడు; ధర్మానుసారంగా పరుల సంక్షేమం చేయువాడు — ఇలాంటివాడిని రఘునాథుడుగా నేను కీర్తించుచున్నాను. చిన్నప్పటి లక్షణాలు, విద్యాభ్యాసం, ఆయన రూపాన్ని ఇలా వర్ణిస్తుంది:
“అతని శిశురూపం చంద్రుడి కాంతులా ఉంది. కళ్ళలో మాధుర్యం, నడవడికలో కరుణ, చేతిలో శౌర్యం.”
రాజ్యాభిషేకం గురించి రాస్తూ రఘునాథుడు సింహాసనంపై అధిష్టించడం, ఆయన పరిపాలనా నైపుణ్యం, ధర్మప్రతిపత్తి విధానాలను వివరించింది. యుద్ద కుశలత నైపుణ్యాన్ని లిఖించింది.
పోరాటాలు & విజయాల గురించి ధీరోదాత్తంగా చూపించింది. శత్రువులను జయించి, ప్రజల రక్షణ చేయడం. ఆయన వీరత్వాన్ని “రామావతార” వంటి దివ్యరూపంతో పోల్చి వర్ణించింది. రఘునాథుని పాలనను ఇలా పోలుస్తుంది.
“అతని బాణాలు అగ్ని జ్వాలల్లా శత్రుసైన్యాన్ని దహనం చేశాయి. సింహంలా గర్జించి యుద్ధరంగాన్ని వశం చేసుకున్నాడు.” “అతని రాజ్యం రామరాజ్యాన్ని తలపిస్తుంది. ప్రజలు భయంకరమైన శత్రువులనుండి రక్షణ పొందుతారు. ధర్మమే అతని పాలనా మూలం.”
ఇక రఘునాథుని పాలనలో రాజధాని & సంస్కృతి ఎలా ఉండేదో వర్ణించింది. తంజావూరు నగర సౌందర్యం. రాజసభలో కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు ఉన్న విధానం. రాజధాని సౌందర్యాన్ని గురించి చెబుతూ
“నగరం గంగా తీరం లాగా పవిత్రంగా, కళాకారుల కీర్తితో నిండి ఉంది. వీధుల్లో వేదమంత్రాల ధ్వని, సంగీత రాగాల మాధుర్యం వినిపిస్తాయి.”
చివరగా కవియిత్రి పరిచయం చేసుకుంటూ, ప్రబంధం చివర్లో రామభద్రాంబ తన పేరును, తాను మహిళా కవయిత్రిననే విషయాన్ని స్వయంగా పేర్కొంది.
“రామభద్రాంబా భర్తృవ్రతా తిరుమలంభాసమేతా కవీ
శ్రీరఘునాథపదాభివంద్యచరణా కృత్యేషు నిత్యోన్ముఖీ ।
భక్త్యా రఘునాథరాజమహిమాన్వీతా యశోభూషణీ
స్వీయా రఘునాథభూపతికథా కృతిరియం సంప్రణీతా మయా ॥”
అర్థం. తాను రామభద్రాంబ అనే కవయిత్రి, తన భర్త తిరుమలంభ సాహచర్యముతో, భక్తిగా రఘునాథ నాయుడు పాదాలను నమస్కరించి, ఆయన మహిమలను స్తుతిస్తూ ఈ “రఘునాథాభ్యుదయం” రచనను చేసినట్లు వినయంగా పేర్కొన్నారు.
సాహిత్యం, కవిత్వం అనేది కేవలం పురుషులకే పరిమితం కాదు. స్త్రీలు కూడా కవిత్వం చేయగలరు. అది చిన్న ప్రవాహం కాకుండా సముద్రపు అలలవలె ఉప్పొంగిపోవచ్చు, శక్తివంతంగా, ప్రభావవంతంగా వ్యక్తమవుతుంది.
ఆమె కాలంలో (17వ శతాబ్దం) స్త్రీలు కవిత్వం చెయ్యడం అరుదు. ఆ సమాజంలో తాను కవయిత్రిగా నిలబడి, తన ప్రతిభను ప్రకటించుకోవడానికి రామభద్రాంబ గారు ఇలా ధైర్యంగా చెప్పారు. అంటే — “నేను స్త్రీనని కవిత్వం ఆగిపోదు; అది కూడా సముద్రంలా ఉప్పొంగుతుంది” అని గర్వంగా ప్రకటించింది. ఇది తెలుగు సాహిత్యంలో స్త్రీ స్వాతంత్ర్యం, సాహిత్య ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ.
స్త్రీణామపి కవిత్వముద్రిక్తముదేతి సముద్రవేలావలిః ।
నానారసభావభూషణమలం లోకత్రయీ మోహనం ॥
స్త్రీలకూ కవిత్వం పుడుతుంది, అది సముద్రపు అలల వలె ఉప్పొంగుతుంది. అది అనేక రసాలతో, భావాలతో భూషితమై ఉంటుంది. మూడు లోకాలనూ (లోకత్రయం) ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంది.
“స్త్రీణామపి కవిత్వం సముద్రవేలాలవలె ఉప్పొంగగలదు; నా వాణి రఘునాథుని కీర్తి గాథలతో ఎల్లప్పుడూ అలరారుతుంది.” “నేను రామభద్రాంబ, స్త్రీగా జన్మించినా, సాహిత్యనదిలో ప్రవహించగలను. నా వాణి రఘునాథుని మహిమను ఎల్లప్పుడూ కీర్తిస్తుంది.”
ఈ చివరి స్వీయప్రస్తావన పద్యం చాలా ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఒక మహిళ తనను తాను “కవయిత్రి” అని గర్వంగా ప్రకటించడం ఇదే మొదటి సారి. మొత్తం మీద, రఘునాథాభ్యుదయం తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక-సాంస్కృతిక కావ్యం, రామభద్రాంబ గారిని శాశ్వతంగా గుర్తింపుచేసిన కృతి.
కానీ, Sources of Vijayanagar History అనే గ్రంథంలో రామభద్రాంబ గారి “రఘునాథాభ్యుదయం” ఆంగ్ల అనువాదం లేదా మూల పాఠ్య భాగాలు ప్రచురించబడ్డాయి. కొన్ని శ్లోకాలు అక్కడ ఉండే అవకాశం ఉంది. ఈ కృష్ణస్వామి అయ్యంగార్ “Sources of Vijayanagar History” అనే గ్రంథంలో రాఘునాథాభ్యుదయాన్ని సంక్షిప్త భాగాలుగా ప్రచురించారు.
అలాగే, “రఘునాథాభ్యుదయ కావ్యం” “రామభద్రాంబ విరచితం” అనే సంస్కృత ప్రచురణ (1934) కూడా ఉంది. అయితే, వాస్తవ మానుస్క్రిప్ట్ (హస్త లిపి) అంటే పేపర్ లేదా పాలిపత్రం మీద రాసిన కాపీలు మనకు సాధారణంగా కనిపించటం చాలా అరుదు. గ్రంధాలయాల్లో, సంపాదిత శ్రీరంగం, శాస్త్రాలయాలు వంటి పెద్ద గ్రంథాలయాలలో, లేదా పురావస్తు శాఖల్లో కొన్ని మానుస్క్రిప్ట్‌లు సంరక్షించబడి ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి ఆ మానుస్క్రిప్ట్‌ల స్కాన్‌లు లేదా ఫోటోలు అందుబాటులో లేవు.
అయితే, ఈ గ్రంథం గురించి మరింత సమాచారం కోసం కొన్ని ప్రాచీన గ్రంథాలయాలు లేదా మానుస్క్రిప్ట్ సంరక్షణ కేంద్రాల్లో లభించే అవకాశం ఉండవచ్చు.
- రాజా రామమోహన్ రాయ్ లైబ్రరీ, కోల్‌కతా: ఇక్కడ భారతీయ సాహిత్యానికి సంబంధించిన అనేక పురాతన గ్రంథాలు ఉన్నాయి.
- ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, కోల్‌కతా: ఇది భారతీయ సాహిత్యానికి సంబంధించిన అనేక పురాతన గ్రంథాల సంకలనం కలిగి ఉంది.
- నేషనల్ మానుస్క్రిప్ట్ మిషన్, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సంస్థ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని మానుస్క్రిప్ట్‌లను సేకరించి, డిజిటలైజ్ చేస్తుంది.
ఈ సంస్థలు లేదా గ్రంథాలయాలను సంప్రదించడం ద్వారా రఘునాథాభ్యుదయం యొక్క అసలు మానుస్క్రిప్ట్‌లు లేదా దస్తూరీ ప్రతుల గురించి మరింత సమాచారం పొందవచ్చును. రామభద్రాంబ గారు రచించిన రఘునాథాభ్యుదయం మినహా ఆమె ఇతర రచనలు గురించి ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లభించడం లేదు. ఆమె రచనలు ప్రధానంగా సంస్కృతంలో ఉండి, వాటి గురించి ప్రాచీన గ్రంథాలయాలు లేదా మానుస్క్రిప్ట్‌లు ద్వారా మరింత సమాచారం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
రామభద్రాంబ గారు ప్రధానంగా సంస్కృత కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు. ఆమె రచనల్లో రఘునాథాభ్యుదయం — సంస్కృతంలో రాసిన మహాకావ్యం. ఆమె ఇతర రచనలు కూడా ఎక్కువగా సంస్కృతంలోనే ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలుగులో రాసిన రచనలు లేదా మౌలిక పాఠ్యాలు లభించడంలో ఆధారాలు లేవు. అంటే, ఆమె తెలుగులో రాసిన రచనల గురించి ప్రామాణిక గ్రంథాలయ, మానుస్క్రిప్ట్ సమాచారం ఏమీ అందుబాటులో లేదు. ఆమె తెలుగు కవయిత్రి కాదు, సంస్కృత కవయిత్రి మాత్రమే. కానీ తెలుగు సాహిత్య చరిత్రలో ఆమె పేరు ప్రఖ్యాతి పొందిన మహిళా కవిగా గుర్తించబడింది, ఎందుకంటే ఆ కాలంలో మహిళా రచయితల సంఖ్య చాలా తక్కువే.
రామభద్రాంబ సంస్కృతంలో రచించినా, ఆమె సాహిత్య శైలి, భావన, స్త్రీ కవయితృత్వం తెలుగు సాహిత్య వర్గంలో గుర్తింపు పొందింది. తెలుగు సాహిత్య చరిత్రలో ఆమెను మొదటి మహిళా కవయిత్రులలో ఒకరుగా పరిగణిస్తారు. ఆ కాలంలో మహిళలు ప్రబంధం/మహాకావ్యం రాయడం చాలా అరుదు, అందుకే ఆమె పేరు ప్రాచుర్యం పొందింది. స్త్రీ కవిత్వానికి గౌరవం. ఆమె తన వాణి ద్వారా రాజు రఘునాథుని కీర్తిను కీర్తించడమే కాక, స్త్రీ సాహిత్యపరిశ్రమకు మార్గం చూపింది. తెలుగు కవయిత్రులు (ఆ తర్వాతి శతాబ్దాల్లో) ఆమె ప్రతిభను స్ఫూర్తిగా తీసుకుని సాహిత్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. శైలి, కవిత్వ స్ఫూర్తి. రామభద్రాంబ గారి వచనాలు, పద్దతులు, మహాకావ్య శైలి భవిష్యత్ తెలుగు సాహిత్యకారులకు ఒక మోడల్ అయ్యాయి. భక్తి, రాజభక్తి, గౌరవాభివ్యక్తి వంటి అంశాలను తన రచనల్లో సుప్రతిష్టంగా చేర్చడం, తరువాతి తెలుగు కవులు & కవయిత్రులకు ప్రేరణ ఇచ్చింది. అసలు రచనలు సంస్కృతంలో ఉండగా, తెలుగు సాహిత్య చరిత్రలో ఆమె పేరు అద్భుతమైన ప్రేరణగా నిలిచింది. ఆమె ద్వారా మహిళా రచయితలు, భక్తి & రాజకీర్తి ప్రధాన అంశాలపై తమ రచనలను ముందుకు తీసుకురావడానికి ధైర్యం పొందారు.
ఆమె ప్రబంధం మంగళ చరణం (భావన) గణపతికి నమస్కారం, సరస్వతీ దేవి వందన, ఈ కవిత్వం రాఘునాథుని మహిమను స్తుతిస్తూ ప్రారంభమవుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ ప్రభావం రూపుదిద్దుకుంది. తరువాతి తెలుగు కవులు కూడా మంగళ చరణంతో తమ కవిత్వాన్ని ప్రారంభించడం స్ఫూర్తిగా చేశారు. ఇది కవిత్వం ప్రారంభంలో దేవీ దేవతల పూజ, విద్యా మంగళంను సాధారణ సంప్రదాయం చేసింది.
స్త్రీ కవయిత్రి స్వీయప్రస్తావన. రామభద్రాంబ తాను స్త్రీ అయినా కవయిత్రిగా తన వాణి ద్వారా మహిమను స్తుతిస్తున్నట్లు చెప్పింది. మహిళా రచయితలకు స్త్రీ స్వరాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టడానికి ప్రేరణ ఇచ్చింది. తరువాతి శతాబ్దాల్లో తెలుగు కవయిత్రులు ఆమె చూపిన మార్గాన్ని అనుసరించి భక్తి, ప్రేమ, రాజభక్తి వంటి అంశాలపై రచనలు రాశారు. భక్తి, కీర్తి సమ్మేళనం రాఘునాథుని ఘనతను వర్ణించడం, భక్తి భావనను కూడా చేర్చడం. భక్తి కవిత్వంలో నేటి వరకు మహిళా కవయిత్రుల రచనల్లో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. కవిత్వంలో వీర భక్తి + స్త్రీ వాణి యొక్క కాంబినేషన్ ఒక కొత్త ధోరణి ఏర్పడింది. తెలుగు సాహిత్యం చాలానే ప్రభావితమైందని విశ్లేషకుల అభిప్రాయం. మహిళా కవయిత్రుల కోసం స్వరాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టిన మొదటి ఉదాహరణ. భవిష్యత్తులో మహిళా రచయితలు సాహిత్యరంగంలో ప్రవేశించడానికి ధైర్యం పొందారు.
రామభద్రాంబ గారి రచన తెలుగు కవిత్వానికి ప్రత్యక్షంగా కాదు కానీ స్ఫూర్తిగా నిలిచింది. రామభద్రాంబ తాను స్త్రీ అయినా కవయిత్రి, ఈ కీర్తికావ్యం సమర్పణ ద్వారా ప్రదర్శించడం.
చివరగా తరువాత మహిళా కవియిత్రులకు మార్గదర్శిగా అయిన సారాంశం చెప్పాలంటే ఈ కింది విధంగా చెప్పవచ్చు.
- మంగళచరణం → కవిత్వ ప్రారంభం సంప్రదాయం.
- రాజభక్తి & వీరభక్తి → మహిళా కవయిత్రుల ప్రేరణ.
- నగర / సాంస్కృతిక వర్ణన → సాహిత్యలో అందం / వివరణ.
- భక్తి + వీరభక్తి + రాజభక్తి → శైలీ / నమూనా.
- స్వీయప్రస్తావన → స్త్రీ స్వరానికి కొత్త మార్గం.
రామభద్రాంబగారి విరచిత ప్రబంధం ‘రఘునాథాబ్యుదయం’, రాబోవు తరాలకు ఇంతగా ప్రభావితం చేయటం వల్ల ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రామభద్రాంబ గారి ఇతర రచనల వివరాలు అందుబాటులో రాలేదు కాని సమకాలీన, తరువాత తరం కవుల రచనల ద్వారా కొంత సమాచారం తెలుసుకోగలం. రామాయణ-తిలక: రామభద్రాంబ గారి స్నేహితురాలు మధురవాణి గారు రాఘునాథ నాయక్ యొక్క తెలుగు రచన “రామాభ్యుదయం” ఆధారంగా సంస్కృతంలో “రామాయణ-తిలక” అనే మహాకావ్యాన్ని రచించారు. ఈ రచన కూడా రామభద్రాంబ గారి సాహిత్య వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.
రాజశేఖర గారి రచనలపై విమర్శ: రామభద్రాంబ గారు రాజశేఖర గారి రచనలపై విమర్శలు చేసినట్లు సమాచారం ఉంది. ఈ విమర్శలు సంస్కృత సాహిత్యంలోని వ్యాకరణ, నాటక సాంకేతికతలపై కేంద్రీకృతమయ్యాయి.