ఇంటి ఆడపడుచు

        చంద్రకళ. దీకొండ,

చిట్టి పావడా కట్టి…
సిరిమువ్వ గజ్జెలు ఘల్లుఘల్లుమన…
చెంగుచెంగున చిందులేసే చిన్నారి!

పట్టు పావడా కట్టి…
వయసును వల్లెవాటున కప్పి…
భుజం మీదుగా పూలజడను వాలుగా వేసుకొని…
చేతులతో తిప్పుతూ వేస్తున్న జడగంటల జతులతో…
వయ్యారాలు పోయే కన్నెప్రాయపు సుకుమారి!

గిర్రున గుండ్రంగా చుట్లు తిరుగుతూ…
తనతో పాటు తిరిగే పావడా అంచులను చూసి మురిసిపోతూ…
బుట్టబొమ్మలా మారి
మురిపించే ముగ్ధ!

చెట్టుకు ఊయల కట్టి…
చెలులతో కలిసి చలాకీగా ఊగే…
వెన్నెల్లో ఆడపిల్ల!

పట్టు పావడా కట్టి…
పండుగకు శోభను తెచ్చే…
మన ఇంటి ఆడపడుచు!!!

One Comment

Leave a Reply

Leave a Reply to Dr. Neelam Swathi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

తరుణీయం

తరుణి చిత్రం