ఇది చాలు

కవిత

నిదురను తొక్కేసిన ఆలోచనలు
గుండె గూటిని కలవరపెడుతున్నాయి
సమయం క్షణాలుగా విడిపోతోంది
ఒళ్ళు విరుచుకున్న నిశ్శబ్దం
చుట్టూ పరచుకొంది

వెలుగును మింగేసిన రాతిరిలో
బలవంతంగా మూసిన కళ్ళల్లో
కలల గవాక్షం తెరుచుకుంది
కొత్తలోకంలోని ఊహారూపాలు
ఆయువు పోసుకున్నాయి తాత్కాలికంగా

నల్లరంగు పులిమిన గగనంలో
కాంతిరేఖ మెరిసినట్టు
ఎదురుగా నాదైన నీవు…
నీ చూపుల పరిభాషతో
నాలో పరిమళిస్తున్న భావాలను
ఏ అక్షరమూ విప్పి చెప్పలేదు

ఒకరికొకరైన అనురాగం
అవిరామంగా అంతశ్చేతనమై
ఎల్లలెరుగని ఆరాధనా గీతాన్ని
మనసుతో జతచేసి పాడుతున్నది
వెలుగుకు అందలేని
రసరమ్య నాద జగత్తు
ఈ చీకటిలోనే నిరంతరమై
నిలిచిపోతే ఇక చాలు!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన- 6 భాగం

భవ్య శోభావళి.. దివ్య దీపావళి: