‘అభికి ‘తాతయ్య చేయి పట్టుకుని నడుస్తూ ‘నీతి కథలు వింటూ,దేశభక్తికి సంబదించిన గుణ గరిష్టుల గాధలు చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ‘తాతయ్య కు తాను ఆసరాగా ఉన్నట్లు, తన చేయి తాతయ్య చేతిలో ఉన్నప్పుడు తనను అందమైన భవిష్యత్తులోకి నడిపిస్తున్నట్లు ఆత్మ విశ్వాసంతో సాగేది వారి ఉదయపు నడక. నాయనమ్మ మజ్జిగ చిలికు తున్నప్పుడు కవ్వం తిరిగే శబ్దం వినిపించి కళ్ళు నులుముకుంటూ వెన్న కోసమై చేయి చాచినప్పుడు ఆ చిన్ని కృష్ణుడే దిగి వచ్చి ఎదురుగా కూర్చున్నట్లనిపిస్తుంది ఆమెకు.అలా చేయి చాచిన మనవణ్ణి చూసి అన్నీ ‘వెన్నదొంగ చేష్టలేనని ‘మురిపెంగా ముద్దాడుతూ, పరందామయ్యగారు వస్తున్నారేమోనని తొంగి తొంగి చూస్తూ మనవడి కోసం తాను కూడా వెన్నదొంగగా మారి వెన్న ముద్దలు పెడుతుంది రోజూ. వెన్నదొంగగా మారటం ఎందుకంటే పరందామయ్యగారు నియమబద్ద జీవితం గడుపుతారు. ఆ నియమాలలో ‘పాచి మొహంతో ‘నోటిలో ఏమీ పెట్టుకోకూడదు ‘అనేది ప్రధానమైనది. నియమోల్లంగన జరిగినప్పుడు భయపడాలి కదా!అలా ‘మనవడి ‘ కోసం భయపడుతూ, భయపడుతూనే వెన్నముద్దలు తినిపిస్తుంది. ఆ భయంలోనే అంతులేని ఆనందం పొందుతుంది ఆమె. రేపు ‘సుధ ‘అత్తయ్య వాళ్ళు వస్తున్నారులే, నీ వెన్నలో భాగం పంచుకోవటానికి ‘నీలిమ ‘కూడా ఇలాగే చేయి చాచి నీ ప్రక్కనే కూర్చుంటుందిలే అన్నది ‘జానకమ్మ ‘. రోజూ తెల్లవారు జామునే బాసిబట్లేసుకుని కూర్చుని వెన్న ముద్దకై చేయి చాచే ‘అభిని ‘ చూడగానే చిన్నికృష్ణుడే ప్రత్యక్షమైనట్లు మురిసి తరించి పోతుంది ఆమె అంతరంగం. ‘సుధ ‘ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అని నానమ్మ చెప్పగానే నిద్ర మత్తు వదలగా మెరుపులు నిండిన చక్రల్లాంటి కళ్ళతో “నిజమా!పెద్ద బావ, చిన్న బావ, నీలిమ అందరూ వస్తున్నారా? ఎప్పుడు వస్తారు? ప్రొదున్నే వస్తున్నారా? మధ్యాన్నమా? అని ఆత్రుతగా అడుగుతున్న ‘అభిని ‘ వాడి ఆరాటాన్ని గమనించి చిన్నగా నవ్వుతూ రేపు సాయంత్రం, దసరా సెలవులంతా ఇక్కడే ఉంటారట అన్నది వాడి బుగ్గలు నిమురుతూ. గెంతుకుంటూ తాతయ్య దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి ‘సుధ ‘అత్తయ్య వాళ్ళు వస్తున్నారనే కబురు చెప్పగానే ఆ విషయం అంతకు ముందే తెలిసినా, అప్పుడే తెలిసినట్లుగా “అవునా!అని ఆశ్చర్యం వ్యక్త పరిచారు పరందామయ్య గారు. అవును ఇప్పుడే నానమ్మ చెప్పింది. అలాంటి చిన్న, చిన్న ఆనందాలను వాడితో పంచుకున్నప్పుడు కలిగే తృప్తి, ఆనందం ఆమూల్యమైనవి. ఆయన ఆచారించే సత్య సంధత గోరంత త్యాగం చేసినా పరవాలేదు ఆ సందర్భంలో.ఎప్పుడు వస్తున్నారట? ఎలా వస్తున్నారట? ట్రైన్ లోనా? ప్లేన్ లో నా? అంటూ సంభాషణ పొడిగించారు. ఏమో? అనే ప్రశ్న్తార్ధకం వాడి మొహంలో కనిపించించింది. నానమ్మ నడిగితే అన్నింటికీ సమాధానం దొరుకుతుందనే భరోసాతో అటువైపు పరుగు పెట్టాడు. అది ‘బంధాలు, అనుబంధాలు అనే సారవంతమైన మట్టితో నిర్మించబడిన ఇళ్లతో, లోగిళ్లతో కూడిన పల్లెటూరు. “మచ్చలేని మాణిక్యమని, స్వాతిముత్యం లాంటి వాడని, నిజాయితీ పరుడైన గాంధీయా వాదిగా పేరు బడ్డ ‘పరంధా మయ్యా ‘గారంటే ఆ పల్లెటూరివాళ్లందరికి ఎంతో పూజ్య భావం. సహనమూర్తి అయిన ‘ఇల్లాలు ‘జానకమ్మ గారితో, మనవడు ‘అభిజిత్ ‘, కొడుకు ‘క్రాంతి కుమార్, కోడలు ‘వైదేహి ‘లతో కలిసి తన శేష జీవితం ప్రశాంతంగా గడుపుతున్నరు. “డబ్బు లేని వాడు కాదు పేదవాడు, ఒక ఆశయం అంటూ లేని వాడు నిజమైన పేదవాడు “అన్న ‘వివేకానందుని ‘అభిప్రాయాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు ‘పరంధామయ్య ‘గారి అబ్బాయి ‘క్రాంతి కుమార్ ‘. వైదేహి పేదరికాన్ని పట్టించుకోకుండా ఆడ పెళ్లి వారికి ఆర్ధికమైన భార మేమీ కలుగ కుండా ‘వరకట్నం ‘లేకుండా పూలదండల పెళ్లి చేసుకున్నాడు ‘క్రాంతి ‘. సుధ కుటుంబం తో సహా దసరా సెలవులలో వచ్చింది. ‘దీపావళి’ పండుగకు కొత్త దుస్తులు కొనిపెట్టమని కోడలికి పురమాయించారు పరందామయ్య గారు. సుధ వెళ్ళలేదు. వైదేహికే వదిలేసింది సెలక్షన్. . ముఖ్యంగా ఆ మిర్రర్ ముందు నిలబడి డ్రెస్ విప్పి, మళ్ళీ వేసి చూసుకుంటూ సెలక్షన్ వింత అనుభవం వాళ్లకి. ఇంట్లో బాత్రూం లో మాత్రమే కటడ్రాయర్ లో ఉండే తమకు ఈ అనుభవం acceptable గా అనిపించలేదు. ఏయే షాప్స్ కి వెళ్ళారమ్మా ఇంత సమయం పట్టింది. ‘comfort zone ‘కి మామయ్యగారు. ఆ షాపుకెళితే దర్జీతో పని ఉండదు మామయ్య గారు.ఎన్నో ఏళ్ళుగా ఉపాది కోసం ఈ ఊళ్ళోనే ఉంటూ పొట్టపోసునే దర్జీ వాళ్లకి అన్యా్యం చేస్తున్నామన్న ఆలోచన రానందుకు వైదేహి ని చూసి బాధతో మూలిగింది ఆయన మనసు. ఆ ఐడియా వైదేహికి రానందుకు కొంచెం సిగ్గు గా కూడా అనిపించింది.ఇన్నేళ్ల సహచర్యంలో ఆమె తమ నుండి ఏమి నేర్చుకోలేదని అప్పుడుగాని realise అవ్వలేదు పరందామయ్యగారు. ‘దీపావళి ‘నాడు బట్టలను దేవుడి దగ్గర పెట్టకుండా నేరుగా పిల్లల చేతికి ఇచ్చి వేసుకోమని ఇస్తున్న అమ్మని అయోమయంగా చూసింది సుధ. షాపులో వేసుకుని విప్పిన వైనం విన్నాక, డేట్టోల్ లో గంటసేపు ఉంచి తీసిన బట్టలకు పసుపు, కుంకుమలు కూడా ఎందుకని, దేవుడి దగ్గర కూడా పెట్టబుద్ది కాలేదు జానకమ్మగారికి. పరందామయ్య గారు నిరాడంబర జీవి. విలాసాలకు బద్ధ వ్యతిరేకి. ఎవరు ఏ ఇబ్బందితో తన వద్దకు వచ్చినా తృణమో, పణమో చేతిలో పెట్టి పంపటం ఆనవాయితీ ఆయనకు. తన శిష్యులు ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో బడికి రాలేక పోయినా, ఫీజ్ చెల్లించలేక పోయినా, పరీక్ష రాయలేక పోయినా వారి ఫీజ్ తానే చెల్లించే వాడు. ఇదంతా నచ్చేది కాదు వైదేహికి. అమాయకంగా అనిపించేది వారి దోరణి.జానకమ్మ గారు భర్త అడుగు జాడలలో నడిచి, ప్రతీ విషయంలో తన వంతు సహకారాన్ని అందిస్తూ కష్టాలలో, నష్టాలలో చేదిరిపోని ఆత్మవిశ్వాసంతో భర్తకు తగిన భార్య అని అందరి మన్ననలు అందుకుంటున్నది. ‘వైదేహి ‘చిన్నప్పటి నుండీ పేదరికంలో పెరిగింది. పార్ట్ టైం గా ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ గా డిగ్రీ చదువుకుంది. తన పేదరికాన్ని తానే అసహ్యయించుకునేది. విదేశీ వ్యామోహం ఎక్కువ.’comfort zone ‘అంటూ తన చుట్టూ ఒక గిరి గీసుకుని అందులోకి తన తల్లితండ్రులకు కూడా ప్రవేశం ఉండకూడదని నిర్ణయం తీసుకున్నది. శరీరకంగా, ఆర్ధికంగా బలవంతురాలైనప్పటికీ తన తల్లితండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చింది. (2) తన భర్త ఆశయాల, మామయ్యగారి ఆదర్షాల నీడలకు తన కొడుకు ‘అభి ‘ ని దూరంగా పెంచడానికి నిర్ణయం కూడా తీసుకున్నది. మామయ్య గారి ఉదారగుణం, దానగుణం తెలివి హీనంగా కనిపించేవి. క్రాంతికుమార్ కి అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది. ఉద్యోగ రీత్యా ఇల్లు వదలక తప్పని పరిస్థితి. ముఖ్యంగా మామయ్య గారి నీరాడంబరత తన జీవితాశయమైన విలాసవంతమైన జీవన విధానానికి బద్ధ వ్యతిరేకం.తన కొడుకు అభిని దూరంగా ఉంచడానికి కూడా అవకాశంగా తోచింది వైదేహికి. మామయ్య గారి ఆదర్షాలు, అత్తయ్యగారి మంచితనం వంటబడితే వాడేందుకూ పనికి రాకుండా పోతాడేమోనని, సాధ్యమైనంత తొందరలో వాడిని వారి నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో కాలంతో పాటుగా పరుగులు పెట్టటానికి ‘పందెం కోడిలా కాళ్లకు స్వార్ధమనే కత్తులు కట్టి బరిలోకి వదిలితే గానీ గెలుపు సొంతం కాదని, మంచితనం, మానవత్వం ఉంటే స్వార్ధమనే ‘కత్తులు ‘విడిపోతాయని ‘గెలుపు ‘సాధ్యం కాదని ఆమె అభిప్రాయం. వాడిని ‘comfort zone’ నుండి బయటికి అడుగు పడే ఛాన్స్ లేకుండా, రాకుండా చేస్తే సరి అని ఆమె అభిప్రాయం. వాడికి ఉదయం ఫలహారం, మధ్యాన్నం భోజనం తినిపించడం వారి దిన చర్యలో ప్రధాన ఘట్టం. నాయనమ్మ భుజాల మీదుగా వ్రేలాడుతూ, గారాలు పోతూ, నాయనమ్మ వాడి బుగ్గల మీద ముద్దులు కురుపిస్తూ, వాడు ముద్ద, ముద్ద కు ముద్దు డిమాండ్ చేస్తూ ఇల్లంతా పరుగులు పెట్టిస్తూ, ఇద్దరు దాగుడు మూతలాడుకుంటూ,’అభి ‘తో పాటు చిన్న పిల్లలా పరుగులు పెడుతున్న ఇల్లాలిని చూస్తూ ఎంతో ముచ్చట పడేవారు ‘పరందామయ్యగారు. ‘అభిజిత్ ‘కు మూడేళ్లు వచ్చాక హైదరాబాద్ లోని ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ హాస్టల్ లో చేర్పించారు. అక్కడ రోజూ వాడికి తాతయ్య, నాయనమ్మలు జ్ఞాపకానికి వచ్చేవారు. ఏ పూట అన్నం సహించేది కాదు.’comfortable ‘ఉండేది కాదు. ఒక రోజు ఆకలేస్తున్నా నాయనమ్మ జ్ఞాపకం వచ్చి అన్నం సహించక, డైనింగ్ హాల్ కి వెళ్లకుండా దిగులుగా తన రూంలో మంచం మీద పడుకుండిపోయాడు. హాస్టల్ వార్డెనగారు రూమ్స్ చెక్ చేస్తూ ‘అభిజిత్ ‘అన్నం తినడానికి రాలేదేమని అడగ్గానే వాడి ‘చక్రాల్లాంటి ‘కళ్ళ నిండా కన్నీళ్ళతో “మా ఊళ్ళో అయితే రోజూ మా నాయనమ్మ కంచంలో అన్నం కలిపి ‘ముద్దులు ‘కురిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. ఇక్కడ ఎవరు తినిపిస్తారు? “అని దీనంగా, అమాయకంగా అడిగిన ‘అభిని ‘చూసేపాటికి వార్డెన్ గారికి ‘గుండెలు ‘పిండేసినట్లయింది. ‘అభి’ ని చూడటానికి అప్పుడప్పుడు అమెరికా నుండి వాడి అమ్మ, నాన్న లు వచ్చే వాళ్ళు. వాడు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో వారు వచ్చే వారు కాదు.అలా మూడేళ్లు గడిచి పోయాయి.ఎందుకంటే హాస్టల్ రికార్డ్స్ లోని విజిటర్స్ లిస్ట్ లో వాడి తాతయ్య, నానమ్మల పేర్లు వ్రాయించ లేదు. అది తెలియని పరాందామయ్య గారు అభిని చూడటానికి హాస్టల్ కి వచ్చినా చూసే అవకాశం లభించలేదు. అలా ఎదురు చూపులు అలవాటై పోయాయి వాడికి.కానీ వారి ముద్దులోనితియ్యదనం,ఆ స్పర్శలోని మాధుర్యం తాలుకు ‘తడి ఆరని జ్ఞాపకం ‘వాడి స్మృతి పదం నుండి తొలిగి పోలేదు, చేదిరి పోలేదు. వైదేహి వాట్సాపులో వీడియో చాటింగ్ లో ‘ముద్దులు కురిపిస్తుంది ‘. అవి నాయనమ్మ తాతయ్యల ముద్దులోని తియ్యదనం, మరి మాధుర్యం వాడి స్మృతి పదం లో రీప్లేస్ చేయగలగేవి కాదు. ఒక రోజు క్లాస్ టీచర్ ‘రైమ్స్ ‘బాగా చెప్పిన వారిని ముద్దు ‘పెట్టుకుంటానని చెప్పగానే ‘అభిజిత్ ‘కి తాతయ్య, నానమ్మల తనను ‘అర్తిగా ‘ముద్దు పెట్టుకోవటం జ్ఞాపకం వచ్చింది. ఆ స్పర్శలోని వెచ్చదనం, కమ్మదనం వాడికేంతో ఆనందాన్నిచ్చేవి. వారి జ్ఞాపకాలతో మనసంతా బరువెక్కింది. ఎలాగైనా తానే అందరి కంటే రైమ్స్ బాగా చెప్పి, టీచర్ చేత ముద్దు పెట్టించుకుని తీరాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ‘అభి ‘మనసంతా ఆనందంతో, ఉత్సాహంతో నిండి పోయింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అవకాశం, ఆనందానిచ్చే అనుభూతులని వదులుకో దలుచుకోలేదు. సాయంత్రం ఆటల పిరియడ్లో అందుకోబోయే ‘అపురూపమైన కానుక ‘ను తలుచుకుంటూ విజ్రుభించి ఆడేసాడు. అలా ఆడటంలో పొరపాటున క్రింద పడిపోయాడు. పాపం అభికి గాయం అయింది. రక్తం బాగా పోయింది. హాస్టల్ రూమ్ కొచ్చాక రాత్రంతా ‘రైమ్స్ ‘మనసులో మననం చేసుకొంటూనే ఉన్నాడు. కలల నిండా టీచర్ తన దగ్గరకి వచ్చి ‘ముద్దు పెట్టుకోవటానికి వచ్చి నిలుచున్నట్లే అనిపించిందివాడికి. కానీ ఉదయానికల్లా జ్వరం వచ్చింది. వార్డెన్ గారు వచ్చి ‘జ్వరంగా ఉందని,రూంలో మంచం మీదనే పడుకునుండమని,క్లాస్సేస్ కి వెళ్లొద్దని,టిఫిన్ వాడి రూంకే పంపి,మాత్ర వేసి వెళ్ళింది. కానీ ‘అభిజిత్ ‘ని టీచర్ చేసిన ప్రకటనే వెంటాడుతోంది. క్లాస్ టైం అయింది. ఇహ ఏ మాత్రం ఉండబట్టలేక మంచం దిగాడు. కాలు కింద మోపడం సాధ్యం కాక ‘అమ్మా ‘అంటూ పళ్ళ బిగువునా బాధను భరిస్తూ మొండిగా నాలుగడుగులు వేసి ‘వార్డ్ రోబ్ నుండి స్కూల్ యూనిఫామ్ తీసుకుని వేసుకున్నాడు. గాయం చిట్లిన్నట్లయి రక్తం ధరగా కారటం మొదలు పెట్టింది. బట్టలనిండా రక్తం మరకలయినాయి.అయినా వాడి ఆలోచనల నిండా టీచర్ నుండి పొందబోయే ‘ముద్దు ‘మీదే ఉంది. హాస్టల్ రూమ్ నుండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్లాస్ కెళ్లాలంటే మెట్లు దిగాలి. దిగాలంటే గాయం మరీ బాధ పెడుతోంది. అయినా పళ్ళ బిగువునా బాధను భరిస్తూ, గాయం నుండి రక్తం కారిపోతున్నా లెక్క చేయక మెల్లిగా పాకుతూ, డేకుతూ దిగి క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చాడు. క్లాస్ కి ఆలస్యం అయ్యే పాటికి టీచర్ పది నిముషాలు గుమ్మం దగ్గర’ మోకాళ్ళ ‘మీద నించోమని శిక్ష వేశారు. గాయం బాధ పెడుతున్నా శిక్ష ను ఓపికగా భరంచాడు ‘అభి ‘. కళ్ళ నుండి దారాపాతంగా ‘కన్నీళ్లు ‘కారి పోతున్నాయి. పది నిమిశా లయ్యాక ‘రైమ్స్ ‘బాగా చెప్పి ‘ముద్దు పెట్టించుకుందామనే సంతోషం ముందు అనుభవిస్తున్న కష్టం ఇసుమంతైనా బాధించలేదు వాడిని. .టీచర్ కంట పడకుండా చిట్టి, చిట్టి చేతులతో మాటి మాటికీ ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. పది నిమిషాలయ్యకా క్లాసులోనికి అడుగు పెడదామంటే అడుగు ముందుకు పడలేదు. కుంటుతూ, రక్తం చారికాలతో క్లాస్ లోనికి రావటం గమనించి, ఏమైందని టీచర్ ప్రశ్నించారు ఒళ్ళు కూడా వెచ్చగా తగిలింది. జ్వరంతో ఎందుకు వచ్చావు అన్న టీచర్ ప్రశ్నకు “టీచర్ మీరు రైమ్స్ చక్కగా చెప్పిన వాళ్ళను ‘ముద్దు ‘పెట్టుకుంటానని చెప్పారు కదా!నేనే బాగా చెప్పి మీ చేత ‘ముద్దు ‘పెట్టించుకోలవాలని’ ఆశతో ‘ వచ్చాను. ఎప్పుడో మా నాయనమ్మా, తాతయ్యలు రోజూ ఎన్నెన్నో ముద్దులు పెట్టుకునేవారు.” ఎన్నాళ్లయిందో నన్నెవరూ ముద్దు పెట్టుకోక “అని దీనంగా అన్నాడు ‘అభిజిత్ ‘. ఆ దీనమైన ముఖం చూడగానే టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “అర్తిగా అభిజిత్ ‘బుగ్గలనిండా ముద్దుల వర్షం కురిపించింది. వాడి బుగ్గలు ఎర్రబాడ్డాయి. సంతోషంతో కళ్ళు మెరుస్తుండగా టీచర్ కి థాంక్స్ చెప్పాడు “ఎంతైనా మనసు తళ్లడిల్లేది మమతల కోసమే కదా!వాడిలోని ఆప్యాయత, ప్రేమ, అభిమానం,అనురాగాలు “comfort zone “లో బందీ అయినాయి. ”వేదనలకు వేదికే అయింది ‘comfort zone ‘.