తేట తెనుగు

సొగసైన అక్షర శిల్పాలను కలబోసి ఒడుపుగా కూర్చిన

తేటతెనుగు అక్షరకాంతను నేను

శివుని పంపున ఇలకు దిగిన పుష్పగంధను నేను

వసివాడిన శబ్దకుసుమాలలో జీవకళ నింపే అంగీరసను నేను

ముద్దుగారే చిన్నారుల నోటి మాటల జుంటి తేనియను నేను

ఒడుపైన దోసిట అక్షరమై ఒదిగిపోయే అమృతభాండాన్ని నేను

కళతప్పిన తెలుగుదనానికి రంగులు కలబోసిన హరివిల్లును నేను

అలసిన వేళ వర్ణరాగ రంజితమై హాయిని గొలిపే మలయ సమీరాన్ని నేను

క్షరమైపోతున్న పద సౌందర్యానికి వన్నెచిన్నెలద్దే కవి కోకిలలు చేతబట్టిన అక్షర తూలికను నేను

ఉనికి ప్రశ్నార్థకమైన ఊగిసలాటలో భావితరానికి ఊతమయ్యే శబ్ద క్రాంతిని నేను

హంసవాహిని చేతిలో ఆభరణమై వెలుగులీనుతున్న జ్ఞానజ్యోతిని నేను

అంతిమంగా అమ్మ భాషలోని కమ్మదనపు తేనెలొలుకు తేట తెనుగును నేను.

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జ్యోతి ప్రకాశం