‘నదీమతల్లి’ -4

ధారావాహిక నవల

“ఆఁఇంతకూ నేను చెప్పదలచుకున్నది మన భవిష్యత్తుకి మనమే కారకులం.మీఅమ్మ ఏ విదేశాలకి వెళ్ళి చదువుకోలేదు.ఆవిడ ప్రపంచం ఈ తిరుపతి.”అంటూ ఇంకొక్కగుక్క నీళ్ళు తాగాడుఆయాసపడుతూ.

“బంగారం! నువ్వు మానవ ప్రయత్నంగా ఎమ్.బి.ఏ కాంపిటీటివ్ ఎక్జామ్స్ కి ప్రిపేర్ అవు.సక్సెస్ అవుతావని నాకు నమ్మకముంది.ఒకవేళ కాలేదనుకో విదేశాలకి పంపలేం కానీ మంచిపేరున్న ఐ.సి ఎఫ్.ఎ ఐ లాంటి బిజినెస్ స్కూల్లో పేమెంట్ సీట్ లో జాయిన్ చేస్తాము.ఇది నేను నీ కిచ్చే హామీ.

ఇకపోతే చెల్లెలు .దాని ఐ.క్యు కి తగ్గట్టు అది కష్టపడుతోంది .దాన్ని గ్రేడ్యుయేట్ చేయించాలన్నది మాలక్ష్యం.మనం కులానికి రెడ్లం కాని మనకులంలోని అందరిలా ఆస్థిపాస్థులు లేవు.మనతాత ముత్తాతలుస్వాతంత్ర్యపోరాటంలో ఆస్థులను గడ్డిపోచతో జమకట్టిన దేశభక్తులు.

కాని ఇప్పటి కాలమానం ప్రకారం చెల్లెలికి పెళ్ళి చేయాలంటె ఎంతఖర్చవుతుందో అంచనా వేసేందుకుగూడ ధైర్యం చాలటంలేదు.నారిటైర్మెంటు
తరువాత వచ్చే డబ్బు దాని పెళ్ళికి ఫిక్స్డ్ వేయదలచుకున్నా.నాపెన్షను అమ్మజీతంతో మనందరం బ్రతకాలి.
ఊర్లోమనకి తాతగారిల్లు ఒకటిఉంది.దాని విలువ నేను కట్టలేను.కారణం అది నాతాతలనాటిది అది వారిబాల్యంతోపాటు నాబాల్యం నీబాల్యంకూడా చూసింది .అందులో తరతరాల గుండెచప్పడు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.” అంటూ మళ్ళీ ఒకగుక్క నీళ్ళుతాగాడు కృష్ణమోహన్.

రాధకి భయంగా ఉంది.పెళ్ళైన ఇన్నేళ్ళలో కృష్ణమోహన్ ఇంతసేపు అవిరామంగా మాట్లాడటం బహుశా ఇదె మొదటిసారేమో!

“కృష్ణా!ఆపండి”ఎందుకిప్పుడీవిషయాలు?”అంటూ వారించింది.

పిల్లలిద్దరూ తల్లి తండ్రిని సంబోధించిన విధానానికి ఆశ్చర్య పోయారు.

“నన్నాపకు రాధా! నేనిప్పుడు మాట్లాడలేకపోతె బహుశా ఇంకెప్పటికీ మాట్లాడలేనేమో!మాట్లాడటం ఒక జాడ్యం అయితే మాట్లాడలేకపోవటం ఒక దౌర్బల్యం. మాట్లాడలేకపోవటమనే దౌర్బల్యంతో నే నాజీవితానికి నీజీవితం పణంగా పెట్టా!”అంటూ దగ్గరకొచ్చిన రాధని మృదువుగా ప్రక్కకి నెట్టాడు కృష్ణమోహన్.”కాబట్టి బంగారు ఇదీవిషయం మీఅమ్మ సంపాదనమీదే ఇక ముందుజీవితం. ఎందుకంటే నువ్వు ఇప్పుడప్పుడే సంపాదనపరుడవు అవుతావని ఆశ నాలోలేదు.” అంటూ కళ్ళజోడు తీసి తుడుచుకున్నాడు కృష్ణమోహన్.

అమావాస్యరోజులవటంతో బయట కనుచీకటిపొరలు నిరాశలా అలుముకుంటున్నాయి.
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.అందరిగొంతుకలూ తడారిపోయాయి.తండ్రిని ఆ విధంగాచూడని పిల్లలు గిల్టీగా ఫీలయ్యారు.

శక్తి ఉడిగిన రాధ అమ్ముకి సౌంజ్ఞ చేసింది.

వెంటనే లోపలకెళ్ళి ఐదునిమిషాలలో స్నేక్స్ టీ తెచ్చింది.
టీతండ్రిచేతికందించి తండ్రికాళ్ళదగ్గరకూర్చొనితల తండ్రి వడిలో పెట్టుకుంది.
ప్రణవ్ టీకప్పుతీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు.
★★★
ప్రణవ్ లో కొంచెం మార్పు కనపడుతోంది.కాంపిటీటివ్ ఎక్జామ్స్ కి మటీరియల్ తెచ్చుకున్నాడు.కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు.శ్రధ్ధగా చదవటం ప్రారంభించాడు.
ఐ.ఏ.మ్ ; ఎక్స. ఎల్ .ఆర్. ఐ మొదలైన అన్ని ఎమ్బిఏ కాంపిటీటివ్ ఎక్జామ్స్ కి ఎప్లై చేసాడు.

రాధా కృష్ణమోహన్ లు ఆరోజునించీ చాలా గంభీరంగా ఉన్నారు.ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే
కృష్ణమోహన్ చిరునవ్వుమరచాడు.గలగలామాట్లాడే రాధగొంతు మూగబోయింది.రాగిణికి వయసుకి మించిన పెద్దరికం వచ్చింది

తండ్రిని కంటికి పాపలా కనిపెట్టుకొని ఉంటోంది.టెంత్ మాథ్స్ లో ఎనభై పర్సంటుతో క్లియర్చేసి ఇంటర్ ఫస్ట్ఇయర్లో చేరింది.తండ్రి లాగా తాను ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలని కోరిక.
ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి సెకండ్ఇయర్లో రాగిణి అడుగు పెట్టింది.

కృష్ణమోహన్ రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది.కృష్ణమోహన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవటంతో తిరుపతి కి ఇటూ అటు కాలేజీలకి ప్రిన్స్పాల్ గా వేసారు .అందుకని రిటైర్మెంట్ రోజు అన్ని కాలెజీలనించీ స్టాఫ్కలసి ఘనసన్మానంఏర్పాటు చేసారు.రాధా కృష్ణమోహన్ దంపదులకి. ఎంతో అభినందించారు.కాలేజీ స్టాఫ్ కృష్ణమోహన్ తమకు రోల్ మోడలని కొనియాడారు.

ఆనరరీగా తమకాలేజీలో వచ్చి ఇంగ్లీషు క్లాసులు తీసుకోమని ప్రైవేటు ఇంజినీరింగ్ సంస్థల వాళ్ళు బ్రతిమలాడారు.

తనకి కుదరదు కుటుంబబాధ్యతలున్నాయని మృదువుగా తిరస్కరించాడు కృష్ణమోహన్.

★★★

రాధ బేంక్ వాళ్ళు నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ఛెస్కాంపిటిషన్లో గోల్డ్ మెడల్ సాధించింది.
ముంబయ్ లో రాధని ఆకాశానికెత్తారు.
ఎంతోసంతోషంతోఇంట్లోకి అడుగుపెట్టింది.నాలుగు రోజులు కృష్ణమోహన్ని పిల్లలని మొట్టమొదటిసారి వదిలి ఉండాలంటే దిగులనిపించింది.

తనకలసాకారమైందన్న ఆనందం.దానికి కారణమైన కృష్ణమోహన్ లో తండ్రికనిపించాడురాధకి.
“అమ్మా ఇవాళ నీ ఫోటో హిందూలో వచ్చింది. నాన్న చాలా చాలా హ్యాపీ అంటూతల్లిని గిరగిరా తిప్పింది.చుట్టూ చూసింది రాధ కృష్ణమోహన్ కనిపించలేదు.
“నాన్నేరి అమ్మూ !”అందిరాధ.
“నాన్నకి నిన్నటి నించీ జ్వరం దగ్గు.డాక్టరు దగ్గిరకెళదామంటే అమ్మవచ్చాక రేపు వెళ్తా అని పారాసిట్మాల్ వేసుకున్నారు.”అనిచెప్పింది రాగిణి.
ఒక్క ఉదుటున చేతిలోవస్తువులు ఎక్కడివక్కడ వదిలేసి కృష్ణమోహన్ పడుకున్న మంచందగ్గిరకి
వెళ్ళింది రాధ
“ఎలాఉంది కృష్ణా! “అంటూ నుదిటి మీదచేయివేసింది. వళ్ళుకాలిపోతోంది.

“లేవండి!డాక్టరుదగ్గిరకెళ్దాం.”అందిరాధ.
“ఏం లేదు.వాతావరణం మారిందికదా! అయినా ఇన్నాళ్ళు పాపాయిని చూసుకున్నట్లు చూసుకునేదానివి.హఠాత్తుగా నన్నువదిలేసి వెళ్ళా వయ్యే.బెంగపడ్డా! ముందు నీచేతి కాఫీ తాగితే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.”అన్నాడు బలవంతాన నవ్వుతూ కృష్ణమోహన్.
“ఆఁఅన్నట్టు రాధా!సినిమాలో హీరోలా నిన్ను గిరగిరా తిప్పాని ఉంది కానీ ఈషేక్ హ్యండ్తో సరిపెట్టుకో” అంటూ చేయిచాచాడు.
“నాకలలుమానాన్న లా తీరుస్తున్నారు.” అంటూచేయి కలిపింది.

“అమ్మూ !అన్న ఏడిరా?” అంటూ కాఫీకలపడానికి ఉద్యుక్తురాలైంది .
గబగబా కాళ్ళుకడుక్కొని ఒకకప్పుకాఫీ ఫ్లాస్క్లోపోసి రెండుకప్పుల్లోకాఫీ ఒక కప్పులో అమ్మూకి బోర్నవిటాతెచ్చిచ్చింది.
“రాధా! కోర్ట్ లో అందరూ నిన్నుచూసి వణికి పోయుండాలి. ఏం షాట్స్ ఏండ్రాప్స్. “అంటూ మెచ్ఛుకున్నాడు కృష్ణమోహన్ .
నేను చాలాఅదృష్టవంతురాలిననుకుంది రాధ మనసులో.
“రాధా !నువ్వులేనప్పుడు మాఅమ్మ నన్నెంతో జాగర్తగాచూసుకుంది.”అంటూ రాగిణి తలనిమిరాడు కృష్ణమోహన్.

కాఫీ తాగుతుంటే గాలి దుమారంలా వచ్చాడు
ప్రణవ్.వస్తూనే తల్లిచేతి కప్పు ప్రక్కన పెట్టి తల్లిని ఎత్తు కొని గిరగిరా తిప్పాడు.
“బంగారం నాపేరు చెప్పి ఇంకోరౌండుతిప్పరా!”అంటూ చప్పట్లు కొడుతూ విజిల్ వేసాడు కృష్ణమోహన్ .

అంతేఒక్కసారి తల్లిని తిప్పటంఆపి తండ్రి వంకచూసాడు ప్రణవ్‌.
రాగిణి హే !హే !నాన్నా సూపర్ విజిల్ అంటూ అరవసాగింది.
రాధ ఈఇంట్లో ఈఆనందం కలకాలం నిలవాలని ప్రార్ధించింది .తనుగన్న కొడుకు తనని ఎత్తుకోవటం ఒక మధురానుభూతి.
“మై మామ్ ఈజ్ యూనిక్.” అంటే రాగిణి అవర్ మామ్ అంటూ అరిచింది .
“నా కప్ కాఫీ అంటూ కళ్ళెగరేసాడు.”ప్లణవ్”
ఫ్లాస్క్ల లో ఉంది తెచ్చుకో అంది.

ప్రణవ్ అటువెళ్ళంగానే “అమ్మూ!నేను లేని నాలుగురోజులూ అన్న ఇంటి పట్టున ఉన్నాడటే” అంది రాధ.

“ఆఁ ఇంట్లోనే ఉన్నాడు.రేపెల్లుండిలల్లో ఎమ్ బి ఎ రిజల్ట్స్ వస్తాయని టెన్షనుగా ఉందన్నాడు.”అంది రాగిణి.

‘హుఁ’అంటూవేడి నిట్టూర్పువదిలింది.కాఫీ తాగిన వెంటనే విపరీతమైన చెమటలు కొంచెం కొంచెంగా ఆయాసం ఎక్కువవసాగింది.

“రాధా!నన్ను డాక్టరు దగ్గలకి తీసికెళ్ళు చెప్పలేని బాధగా ఉంది అంటూ విలవిలలాడాడు. “కృష్ణమోహన్.

వెంటనే టేక్సీ పిలిచికృష్ణమోహన్ ని హాస్పిటల్కి
తీసికెళ్ళారు.

వైరల్ ఫీవర్ మూలాన ఇలా ఆయీయాసం వస్తుంది. అయినాకార్డియాక్ టెస్ట్స్ థ‌రోగొ చేయిద్దాం అన్నాడు డాక్టర్ కులకర్ణి.

ఇసిజి ,టుడి ఎకొ టెస్ట్స్అనుమానాస్పదంగా ఉండటంతో ఫీవర్ కంట్రోల్ కాగానే ఏంజియోగ్రామ్ తీయాల్సి వస్తుందన్నారు.

వెంటనే వదినగారికి ఫోను చేసింది రాధ.హుటాహుటీన వచ్చింది పద్మావతి.తెలిసిన డాక్టర్లతో మాట్లాడింది. రిపోర్ట్స్ చూసింది. పరిస్థితి అర్ధమయింది. సర్జరీ అనివార్యమనిపించింది.

అన్నిటికీ ముందు బిపి ఫీవర్ కంట్రోల్.
కావటానికి.మెడికేషన్ మొదలుపెట్టారు.

“అక్కా నువ్వు న్నావుకదా ఇంటికెళ్దాం.”అన్నాడు కృష్ణమోహన్.

పద్మావతి భరోసాతో కృష్ణమోహన్ని ఇంటికి పంపారు.
ఈ పరిస్థితుల్లో ప్రణవ్ కాంపిటీటివ్ ఎక్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. జస్ట్ క్వాలిఫై అయ్యాడు.

“ప్లణవ్! ఇంటి పరిస్థతిని దృష్టిలో పెట్టుకొనినువ్వు దిగులు పడకు.ఇ సీ.ఎఫ్.ఎ.ఐ వాళ్ళ ఎడ్వర్టైజ్మెంట్ పేపర్ కటింగ్ డైరీలో పెట్టారు ఎప్లైచేయి.”అంది రాధ.

అమ్మా! అంటూ.నీళ్ళు నమిలాడు.

నాన్న అన్ని ఎరేంజ్మెంన్ట్స్ చేసారు.ఇ.సి. ఎఫ్ఫ్ ఎ ఐ
లో ఒక.ఫ్రెండ్ ద్వారా వివరాలు కనుక్కున్నారు. హెవిఫీజు కానీతప్పదు.అంటూ చంప తట్టింది గో ఎహెడ్ అన్నట్లు. నాలుగురోజుల తర్వాత జ్వరంతగ్గింది.కృష్ణమోహన్ ప్రశాంతంగా పడుకున్నాడు.

బ్యాంక్ కి శలవు పెట్టింది రాధ.రాగిణికి అనుకోకుండామూడు రోజులు సెలవలు వచ్చాయి. బాంబేనించీ వచ్చాక ఎక్కడా రెస్ట్ లేక పోవడంతో “అమ్మూ! కాస్సేపు పడుకుంటా .నాన్నని గమనిస్తూఉండు” అంటూ మంచినిద్రలోకి జారుకుంది రాధ.

ఇంతలో అమ్మా !అమ్మా ! నాన్న అంటూరాగిణి కేక తో
ఒక్క ఉదుటున కృష్ణమోహన్ మంచందగ్గరకు వచ్చింది. వళ్ళంతా చమటలు పట్టి కళ్ళు తేలవేస్తుంటే కొంచెం వేడిగా హార్లిక్స్ పట్టీ టాక్సీ పిలిచి తల్లీకూతుళ్ళు కృష్ణమోహన్ ని పట్టుకొని హాస్పిటలుకి వెళ్ళారు.తల్లి ఫోనందుకుని ప్రణవ్ హాస్పిటల్ కి వచ్చాడు.

ఎమర్జెన్సీవార్డులో కృష్ణమోహన్ ని చేర్పించారు. ఐ.సి.యు లో ఉంచిటెస్ట్స చేయటం మొదలుపెట్టారు.ఫైనల్గా బైపాస్ చేయాలన్నారు.

“మేడం మీరు ధైర్యంగా ఉండండి వైరల్ఫీవర్మూలంగా
బాడీ చాలా వీకయింది.బి.పి డౌనయింది.థేంక్ గాడ్ కరెక్ట టైముకి హాస్పిటల్కి తెచ్చారు అంటూ డ్యూటీ డాక్టరు ధైర్యం చెప్పాడు.

రాధ వెంటవెంటనే అన్నలకీ, అక్కకి,పద్మావతికి పరిస్థితి తెలిపింది. రెండుగంటలకు పైన అయింది పేషంట్ కండిషనుతెలియదు.బిక్కుబిక్కుమంటూ తల్లిని ఆనుకుని కూర్చుంది రాగిణి.కాలుగాలినపిల్లిలా తిరుగుతున్నాడు ప్రణవ్.

ఇంతలోడాక్టర్ రాజశేఖర్ రాధ దగ్గిరకి వచ్చి
“మేడమ్ పేషంట్ బి.పి ఫ్లక్ట్యుయేట్ అవుతోంది.హీమోగ్లోబిన్పర్సెంటేజ్ చాలాతక్కువ ఉంది.బ్లడ్ ఎక్కిస్తున్నాం.అవిరెండు నార్మలైజ్ అయితేకాని పేషంట్ ని మేము ముట్టుకోలేము.అనిచెప్పాడు కార్డియాలజిస్ట్ డా౹౹రాజశేఖర్.
“నేను చూడవచ్చా!”అంది రాధ.
“నో ప్రోబ్లమ్ చూడవచ్చు. కాకపోతే పేషంట్ ని ఎక్కువమాట్లాడించవద్దు.”అన్నాడు.డ౹౹రాజశేఖర్.
సిస్టర్ పర్మిషన తీసుకొని రాగిణి తో వార్డ్లోకెళ్ళింది
రాధ.
రాధని చూస్తూనే చిరునవ్వుతో చేయి ఊపాడు. కృష్ణమోహన్.

ఒక్క నిమిషం ఆక్సిజెన్మాస్క్ తీసేయవచ్చునా అని సంజ్ఞ చేసాడు నర్స్ కి కృష్ణమోహన్. పల్స్రేట్ చూసి ఫరవాలేదని మాస్క్ తీసింది

“హమ్మయ్య! రాధా ఈ ఎమర్జెన్సీవార్డ్ కి వచ్చాక నాకెందుకో చాలా మాట్లాడాలని ఉంది.ఏరా తల్లి బాగా చదువుకో!ప్రణవ్ ఏడి?”అడిగాడు కృష్ణమోహన్.

“బయట ఉన్నాడు నాన్నా!” అంది రాగిణి.ఏమన్నా మాట్లాడు రాధా!అన్నాడు పక్కనే ఉన్నరాధ చేయిపట్టుకుని”కృష్ణమోహన్.

సజలనయనాలతో రాధకళ్ళు ఎంతవద్దనుకున్నా వర్షించటానికి కాచుకు కూచున్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి.
“రాధా! నువ్వు పెళ్ళికి ముందెలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావు.ఇంత పెద్దపిల్లలకితల్లివంటే నమ్మరు.అంటూ నవ్వాడు కృష్ణమోహన్.
” మీరు ఎక్కువ మాట్లాడవద్దు.సిస్టర్ మాస్క్ పెట్టమ్మా!అంది రాధ.
“ఉండు సిస్టర్!అంతా నార్మల్ అయితే సర్జరీ చేస్తానన్నారు.ఆతరువాత నీతో మాట్లాడగలనో లేనో.
అసలే మాట్లాడటం చాతకాని వాణ్ణి.నన్ను మాట్లాడనివ్వు.ఆఁ పిల్లలు జాగ్రత్త.రాగిణికి మంచిసంబంధం చూసి పెళ్ళిచేయాలి.నా ప్రావిడెంట్ఫండ్ ఫిక్సడ్ లోవేసా! దాని పెళ్ళివరకూ ఆడబ్బు ముట్టద్దు.నన్ను నీవే పోషించుకోవాలి.” అంటూ నవ్వాడు.కృష్ణమోహన్.

ఇంతలోసిస్టర్ వచ్చి,”మేడమ్ మీరు వచ్చి చాలా సేపయింది.మిగతా పేషన్ట్స్ ఎటెండంట్స్ వెళ్ళమంటే మిమ్మల్ని చూపిస్తున్నారు.కాసేపయినతరువాత మళ్ళీ వద్దురుగాని అంటూ మర్యాదగా చెప్పింది.”

‘సరే’ అన్నట్టు తల ఊపి గబుక్కున కర్టెను లాగి ‘నీకేంకాదుకృష్ణా అంటూ నుదిటిని చుంబించింది. రాగిణికూడా తండ్రిని ముద్దుపెట్టుకుని కళ్ళనీళ్ళతో బయటకు వచ్చారు.
కళ్ళనీళ్ళతో ఎదురయ్యాడు ప్రణవ్.
“అమ్మా ! నాన్నెలాఉన్నారు?” అన్నాడు ఆతురతగా ప్రణవ్.

“మాట్లాడుతున్నారు.నిన్నడిగారు ఒకపది నిమిషాలయిన తరువాత నువ్వు వెళ్ళిచూడు.” అందిరాధ.

సశేషం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళామణులు – శ్రీమతి అయాచితుల సోమలత.

మూడు గిన్నెలతో ముచ్చటైన కాపురం