మహిళామణులు – శ్రీమతి అయాచితుల సోమలత.

సోమలతగారు ఢిల్లీనివాసి. కూతురు అల్లుడు మనవరాళ్లతో ఉంటున్నారు.80దాటిన ఈమె స్వరమాధుర్యం హాయిగా వీనుల విందుగా ఉండటం విశేషం ఆమె ప్రస్తుతం సుధామ గారి సప్తపదుల్లో పాల్గొంటున్నారు ఢిల్లీలో గృహిణులకు అన్నమయ్య కీర్తనలు నేర్పించారు ఈమె తల్లిదండ్రులు గరికపాటి నాగభూషణం గారు లక్ష్మీదేవమ్మ గారు గుంటూరు లోనే స్కూల్ చదువు ఏసీ కాలేజీలో ఆపై సెయింట్ జోసెఫ్ కాలేజీలో బిఈడి చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు విజయవాడ రేడియో ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

సంగీత విద్వాంసులు కావడంతో బాల్యంలోనే పువ్వుకి పరిమళం అబ్బింది శ్రీరంగం గోపాలరత్నం గారు ఈమెకి ఏకలవె గురువు గుళ్ళలో బడులలో సంగీతం పాటలు పాడుతూ ఎన్నో బహుమతులు పొందారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పాస్ అయినారు ఆ తర్వాత పెళ్లయింది భర్తతోపాటు ఢిల్లీలో సెటిల్ అయినారు చాలాచోట్ల టీచర్గా జాబ్ చేశారు ఆ తర్వాత సంగీతంపై మక్కువతో ఆ రంగంలోని స్థిరపడ్డారు వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు భర్త మరణానంతరం పదేళ్ల కూతురుతో ఒంటరి జీవితం ఆ పాప చదువు సంధ్యలు పెళ్లి పేరంటాలు ఆమె ఒంటరి తల్లిగా సాధించిన విజయంగా చెప్పవచ్చు పాపతో ఢిల్లీలో ఉద్యోగం ఆశామాషి వ్యవహారం కాదు గత 25 ఏళ్లుగా సాహిత్యంతో ఆమె దోస్తీ కొనసాగుతోంది ఢిల్లీ సాహితీ వేదికలు ఆంధ్ర వనిత మండలి లో కథలు వ్యాసాలు సమీక్షలు సంగీతంతో బాగా రాణించారు 2017 నుంచి ఆ పాటలకి స్వరాలు కట్టి యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయినారు 1500 పాటలకు స్వరాలు కూర్చారు భద్రయ్య గారు నాగార్జున గారికి సంగీతం అందించారు 2024లో రాష్ట్రీయ తెలుగు సమాఖ్య వారు ఉత్తమ మహిళా పురస్కారాన్ని ఇచ్చి సన్మానించారు ఇప్పటికీ జూన్ మీటింగులో హాజరవుతారు కాలుకి యాక్సిడెంట్ అయ్యి హిప్ బోన్ ట్రాన్స్ ప్లాంట్అయింది.కూతురు మనవరాలు మంచి డాన్సర్సు.విదేశాలలో కూడా ప్రదర్శన లిచ్చారు. ” నాజీవితంలో ఇంతకన్నా చెప్పుకోవలసిన విషయాలు లేవు” అంటారు సోమలతగారు.
ఈమె ఫోన్ 8929017746

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన -4

‘నదీమతల్లి’ -4