స్నేహం ఒక మధురమైన అనుభూతి. అందులోనూ బాల్య స్నేహితుల మధ్య స్నేహం మరీ గొప్పది. శత్రువు ఒక్కరైనా ఎక్కువే మిత్రులు వందమంది అయినా తక్కువే అంటారు. అటువంటి స్నేహం గురించి వివరంగా చెప్పాలనుకోవడం లేదు ఇప్పుడు. మనందరికీ స్నేహం విలువ తెలుసు. నేను మహిళా దినోత్సవం రోజున స్నేహితులను కలుసుకున్న విశేషాలు చెప్పాలని అనుకున్నాను. సందర్భం ఏంటో ఎందుకో తెలిసింది కదా.. కలిసాక ఎలా ఏం జరిగిందో చెప్పాలనుకున్నాను. ఇది అందరికీ ప్రేరణగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాస్తున్నాను.
మేమంతా భాగ్యనగరంలోని మాడపాటి బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాము.
అందరమూ 1980 వ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులమయ్యాక అందరమూ వేరేవేరే కళాశాలలో చేరి పై చదువుల కోసం దూరమయ్యాము. కాని కొంత మందిమి కలసినా మిగతా వాళ్ల మంతా కలవడం కేవలం మన మాధ్యమము సహాయంతో 2020 సంవత్సరం లో కలిసాము. అప్పుడు మా whatsaap సమూహాము ఏర్పడింది.
అప్పటి నుండి సంవత్సరానికి ఒకసారి Restaurent లో కలిసేవాళ్లము, ఒక్కసారి మాత్రం ఒక స్నేహితురాలికి farm house లో కలసి ఆరోజు మాత్రం చిన్న పిల్లలమై పిచ్చి అల్లరి చేసాము , అక్కడ swimming pool ఉండే అందులోకి అందరము దిగి బాగా ఆడుకున్నాము, తరువాత పాటలు పెట్టుకొని చాలా డాన్స్ లు చేసాము. వాళ్ల కు రకరకాల పళ్లు, కూరగాయల తోటలు ఉండే అవన్నీ తెంపుకొని మా ఇళ్లకు తెచ్చుకున్నాము. ఈ సారి కొంత ఎక్కువ సమయం (రెండేళ్ల) తరువాత ఈసారి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కలవాలనుకొన్నాము , అది ఒక్కటే కాక అందరమూ ఈ మద్య లోనే 60 సంవత్సరాలలు నిండిన వాళ్లము కనుక అదొక సంబరంగా, ఎంతో చిన్న పిల్లల లాగా ఆనందపడిపోయాము.

ఈ సారి ప్రత్యేకత ఏంటంటే ఆటలతో పాటు మా పెళ్లిళ్లు అయ్యాక మా కుటుంబాల గూర్చి , పిల్లల గురించి చెప్పుకోవడము, ఎవరెవరు ఏంఏం సాధించారు, సంసార జీవితాలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద చర్చించుకున్నాము.
ఈ సందర్భంలో అందరమూ బయటి పదార్థాలు తేవొద్దు అని అందరం తలా ఒకటి చేసుకొచ్చుకున్నాము, అదే కాక No plastic అనే Concept తో ఎవ్వరి మంచి నీళ్లు వాళ్లమే తెచ్చుకున్నాము,steel plates, glasses, ఎవరి గంటేలు వాళ్లమే తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాము. మిగిలినవి మన ఇంటికి తీసుకుని వెళ్లడానికి మన ఇంటి నుండే steel డబ్బాలు తెచ్చుకున్నాము. ఈ సందర్భం కేవలం ఆటలకు, చర్చలకోసమే కాకుండా మా ఈ కలయిక ఒక సందేశాత్మకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో విధంగా జరుపుకున్నాము. మరొక విశేషమేమంటే టిన్ లో దొరికే పండ్ల రసాలు కాకుండా తాజాగా దొరికే కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తెచ్చుకొని తాగడము.
ఇంకో గొప్ప విషయం ఏంటంటే అందరమూ కింద కూర్చోగలగడం, దానికి కారణం మా సమూహంలో చాలా మంది రోజూ యోగాభ్యాసం చేయడం. ఈ రోజుల్లో 40 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులు అనుకునే వాళ్ల కు ఒక సందేశం అందించడం. మా ఆటలో యోగా కూడా ఉండెను.
ఇలా పొద్దున 11 గం.లకు మొదలైతే సాయంత్రం tea తాగి 6.30 కి చాలా సంతోషకరమైన, ఉల్లాసవంతమైన మనస్సులతో ఎవ్వరిండ్లల్లకు వాళ్లము వెళ్లిపోయాము.
అందరం కుటుంబ గౌరవాలను కాపాడుతూ బంధాలతో బ్రతుకుతున్నవాళ్ళమే కాబట్టి ఇంటి బాధ్యతలేకాదు సామాజిక బాధ్యతలకూ విలువ ఇవ్వాలని అనుకున్నాం. అందుకే అలా ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దు అనీ, హోటల్ ఫుడ్ వద్దు అనీ అనుకున్నాం. చిన్ననాటి ముచ్చట్లే కాదు పెరిగాక అనుభవించిన కష్ట సుఖాలను పంచుకున్నాం. ఇలా చర్చించుకోవడం వల్ల కొత్త బలం మాలో వచ్చినట్టు అనిపించింది. ఆరోగ్య కరమైన వాతావరణం లో గడిపాం అనుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా! ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల “తరుణి ” పత్రిక పాఠకులకు కూడా మంచి ఆలోచన తో ఏర్పరచిన ‘స్నేహ సమ్మేళనం‘ అంటే కేవలం ముచ్చట్లతో గడపడమే కాదు అని ఒక సదుద్దేశ్యం కలుగుతుంది అని ఆశిస్తున్నాను.
మొత్తం 16 మందిమి కలిసాము. అందరం మా పాఠశాల దుస్తుల రంగు చీరలు కట్టుకొని రావాలనుకున్నాం. అందరం గులాబీ రంగు చీరలు కట్టుకొని వచ్చాం , సంతోషం గా కలిసాము . మహిళా దినోత్సవం రోజున
పదహారు జీవితాలు అక్కడ , ఆ స్నేహ వనంలో విరబూసాయి.