లండన్ టూర్- రాయల్ ఆల్బర్ట్ హాల్

యూరోప్ ట్రిప్ – 6

కిందటి వారం తరువాయి భాగం….

కిందటి వారం 19వ తేదీన, ఉదయం కార్ల్ మార్క్స్ సమాధి ఉన్న హైగేట్ సిమెట్రీకి, మద్యాహ్నం రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ మెరీడియమ్ కి వెళ్ళాం కదా! తరువాతి రోజు విశేషాలు తెలుసుకుందాం.

నేను ప్రణయ్ రాత్రి కింద డైనింగ్ హాల్లోకి వెళ్ళాము. షెడ్యూల్ ప్రకారం ఆరోజే యూరోప్ ట్రిప్ గ్రూప్ వాళ్ళు లండన్ చేరి, అదే హోటల్ లో చెకిన్ అవుతారు. మేము సాయంత్రం రాయల్ అబ్జర్వేటరీ నుంచి హోటల్కి వస్తున్నప్పుడే, ట్రూప్ మేనేజర్ వైదేహి మెసేజ్ పెట్టింది. కొంతమంది హోటల్కి చేరుకున్నారని, మరి కొంతమందిని రిసీవ్ చేసుకోవటానికి తాను ఎయిర్ పోర్ట్ కి వెళుతున్నట్టు, డిన్నర్ టైమ్ కి డైనింగ్ హాల్ లోకి రావాలని, వచ్చేసిన వారిని కలవొచ్చని ఆ మెసేజ్ లో ఉంది.

రాత్రి అంతగా చూడలేదు కానీ, డైనింగ్ హాల్ చాలా పెద్దగా బాగుంది. పొద్దున్నబ్రేక్ఫాస్ట్ చేసాము కాని వెళ్ళే తొందరలో అంతగా గమనించలేదు. ఎక్కడున్నారబ్బా అనుకుంటూ లోనకెళ్ళాము. ఎవరూ తెలియదు, గుర్తుపట్టలేము. వైదేహి వాట్సప్ ఫొటో చూసాను కాబట్టి కొంత ఐడియా ఉంది. మా థామస్ కుక్ గ్రూప్ వారికోసం విడిగా ఒక వేపు అరేంజ్ చేసారని హోటల్ వాళ్ళు చెప్పారు. కాని ఎక్కువగా ఎవరూ కనబడలేదు. ఒక టేబుల్ ముందు ఒకమ్మాయి బ్లూ జీన్స్, లైట్ బ్లూ ఫుల్ షర్ట్ మీద డార్క్ బ్లూ స్లీవ్ లెస్ కోట్ వేసుకుని డిన్నర్ చేస్తుంది. మమ్మల్ని చూసి కొంత సందిగ్దంగా నవ్వుతూ, ‘హాయ్, యూ ఆర్ విజయలక్ష్మి అండ్ ప్రణయ్? యామ్ ఐ రైట్?‘ అంటూ కుర్చీలోంచి లేచింది. నేను ఆ అమ్మాయిని చూస్తూనే గుర్తుపట్టాను వైదేహి అని. కాని తనెలా గుర్తుపట్టిందబ్బా అనుకుంటూ మేమిద్దరం ఆమె దగ్గరికి వెళ్ళాం. ‘యు ఆర్ రైట్. వెన్ డిడ్ యు రీచ్డ్ లండన్? ఐహోప్ ఆల్ అవర్ ట్రూప్ మెంబర్స్ ఆర్ అరైవ్డ్.‘ ఆమె పక్కనే ఉన్న కుర్చీల్లో నేను ప్రణయ్ కూచుంటూ అడిగాను. ‘ఐ రీచ్డ్ ఎస్టర్డే ఈవ్నింగ్. టూ ఫామిలీస్ ఆల్రెడీ దేర్ అండ్ నౌ ఐహావ్ టు రష్ ఎయిర్ పోర్ట్ టు రిసీవ్ టూమోర్ ఫామిలీస్. దైర్ ఫ్లైట్ ఈజ్ రన్నింగ్ డిలే.‘ అంటూ పక్కన టేబుల్ లో కూచున్న ఇద్దరు మహిళలను చూపించి మమ్మల్ని పరిచయం చేసి, కంగారుగా తాను బయలు దేరింది. పూనా నుంచి వచ్చిన జ్యోతి, వాళ్ళ అమ్మ జూలీగారిని ఆ విధంగా కలిసాము. సాయంత్రం అక్షర్ తో కలిసి భోంచేశాం కాబట్టి, ఆకలి లేక పోయినా డిన్నర్ అయిందనిపించి రూంకి వచ్చి పడుకున్నాము.

పొద్దుట 8.30 కల్లా బస్ లో ఉండాలని లండన్ సైట్ సీయింగ్ కి బయలు దేరాలని మెసేజ్ వచ్చింది. ‘ఈ రోజంతా మనమే ఉన్నాం కాబట్టి, మన అనుకూలంగా మన ప్రోగ్రాం చేసుకున్నాం. కాని ఇకనుంచి మనం గ్రూప్ తో తిరగాలి. మనం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళు చెప్పిన టైమ్ కి మనం అక్కడ ఉండాలి. త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసీ, షెడ్యూల్డ్ టైమ్ కి బస్ లో ఉండాలని‘ ప్రణయ్ కి చెప్పాను.

ఉదయమే మేము త్వరగా తయారై బ్రేక్ఫాస్ట్ కోసం హాల్లోకి వెళ్ళాం. అప్పటికే ట్రూప్ మెంబర్స్ అంతా వచ్చేసి నట్టున్నారు. డైనింగ్ హాల్ అంతా హడావిడిగా ఉంది. నిన్న పరిచయమైన జ్యోతి, వాళ్ళ అమ్మగారు మమ్మల్ని చూడగానే నవ్వుతూ పలకరించారు. వాళ్ళతోనే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇంకా ఒక ఫామిలి వచ్చే వారున్నారని తెలిసింది. నేను, ప్రణయ్ రూంకెళ్ళి కావలసిన వస్తువులు, పాస్పోర్ట్స్, ప్రికాష్నరీ మెడిసిన్స్, డబ్బులు బాక్ బాగ్ లో పెట్టుకుని బస్సు దగ్గరికి వెళ్ళాం. హోటల్ బయటికి రాగానే, వైదేహి ఎదురై దూరంగా ఉన్న మేము ఎక్కవలసిన బస్ చూపించింది. ముందు జాగర్తగా బస్ నంబర్ నోట్ చేసుకున్నాను. అందరిని హడావిడి పెడుతుంది లేటైపోతుందని. మేము లోనికెళ్ళి చివరిసీట్లలో కూచున్నాము. ఏసి బస్సు చాలాబాగుంది.

మిగిలిన ట్రూపువారందరూ ఒక్కొక్కరే ఎక్కుతున్నారు. ఒక జంటమాత్రం హోటల్ బయట ఫొటోలు దిగుతున్నారు. వైదేహి పిలుస్తున్నా, బస్ ఎక్కకుండా, వారు ఎవరిని పట్టించుకోకుండా పోజులిస్తూ సెల్ఫీలు దిగుతుంటే కొంచెం గమ్మత్తుగా అనిపించి, నాకు ఎందుకో దేవానంద్, హేమామాలిని అని పేరు పెట్టాలని చిలిపి కోరిక కలిగింది. అదే ప్రణయ్ తో అన్నాను. ‘ఏంటి విజయా నాకంటే యంగ్ అయిపోయావా? అందరికి అలా పేర్లు పెడుతున్నావ్!‘ అన్నాడు. ‘లేదురా, ఎందుకో వాళ్ళని చూడగానే అనిపించింది ఈ ట్రిప్ లో వాళ్ళు వైదేహిని ఇబ్బంది పెడతారని. కొంచెం టిపికల్ గా ఉన్నారు.‘ అన్నాను. మేము మా ఐఐసిటి ఆఫీస్ తరపున టిటి, బాట్మెంటన్ ఆటలకై టోర్న్మెంటులకు ఇండియాలోని మా సిస్టర్ కన్సర్న్ లాబ్ లకి వెళ్ళినపుడు నేను, నా ఫ్రెండ్ సుజాత చేసిన అల్లరి గుర్తొచ్చింది. తను ఇలాగే ఎదుటి వారి బిహేవియర్ బట్టి వారికి పేర్లు పెట్టేది. నిజంగానే వాళ్ళూ అలాగే ఉండేవాళ్ళు.

అందరిని బస్లోకి రమ్మని వైదేహి తొందర పెడుతుంది. పొద్దుటే, చివరగా లండన్ రీచైన తెలుగు కొత్తగూడెం ఫామిలీ వాళ్ళు హడావిడిగా, చివరగా వచ్చారు. మొత్తం మీద ఉదయం తొమ్మిదికి బయలుదేరాలన్న బస్సు పదింటికి స్టార్ట్ అయింది. ఇప్పుడు లండన్ సిటీ టూర్ వెళుతున్నాం. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది.

ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్, యు కే, అనేవి వేరువేరు ద్వీపాలు.

ఇంగ్లండ్ ఒక దేశం దాని రాజధాని లండన్.

గ్రేట్ బ్రిటన్ అనేది 3 దేశాలు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ల సమాహారం, ఇది ఒక దేశంగా ఉండి, రాజధాని లండన్‌గా ఏర్పరచుకున్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్ అంటే ఈ 3 దేశాలలో ఉత్తర ఐర్లాండ్‌ను చేర్చినప్పుడు, అవి యునైటెడ్ కింగ్‌డమ్ (నాలుగు దేశాల యూనియన్) అవుతుంది. అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ ఉత్తర ఐర్లాండ్. అందుకే దీనిని యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్ అని పిలుస్తారు. ఈ నాలుగు దేశాలన్నీటికీ (స్కాట్లాండ్ ఎడిన్‌బర్గ్, వేల్స్ కార్డిఫ్, ఉత్తర ఐర్లాండ్ బెల్ఫాస్ట్, ఇంగ్లాండ్) విడివిడిగా రాజధానులను కలిగి ఉన్నా సమిష్టిగా, నాలుగింటిని ఒక దేశంగా తీసుకుంటారు కాబట్టి యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్ కి లండనే రాజధాని.

సో, మనం చూసే ఈ లండన్ కి ఇంత ప్రాముఖ్యత ఉందన్న మాట. దాని గురించి థామస్ కుక్ వాళ్ళు ఏర్పాటుచేసిన స్పెషల్ లండన్ సిటీ గైడ్ మాకు వివరించింది.

లండన్ మహానగరం, అతి పెద్ద నగరం. ఇప్పటి లండన్, పురాతన లండన్ దాని చుట్టూ ఏర్పడ్డ నగరాల సముదాయం. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా ఉంది. మూడింటి రాజధానిగా రాజకీయంగానే కాక, వైజ్ఞానికంగా, విధ్య, వినోదం, కళలు, ఫ్యాషన్, ప్రసార మాధ్యమాల్లో ప్రపంచ దేశాలపై దీని ప్రభావం వల్ల ప్రపంచంలో ఒక మహానగరంగా విరాజిల్లుతోంది. ఇది ప్రపంచంలో కెల్లా విస్తీర్ణములో అతి పెద్ద నగరం.

7.5 మిలియన్ల పైగా జనాభాతో ఐరోపా యూనియన్లోనే అత్యధిక జనాభాగల నగరంగా గుర్తించబడింది. మెట్రోపాలిటన్ జనాభా సుమారు 12 నుంచి 14 మిలియన్లు. నగరంలో నివసించే ప్రజలు వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి పౌరులు దాదాపు 300 భాషలు మాట్లాడుతారట. ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఒక నౌకాయన కేంద్రంతో ఇది ప్రధాన అంతర్జాతీయ రవాణాకేంద్రం. అంతేకాక అతి పెద్ద పౌర విమానయాన కేంద్రం కూడా. లండన్ లోని మేము లాండ్ అయిన హీత్రూ విమానాశ్రయం అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను చేరవేస్తుంది.

మొదట 10.48 కల్లా లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ మెమోరియల్ ని చేరాము. లండన్‌లోని కెన్సింగ్టన్ గార్డెన్స్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌కు నేరుగా ఉత్తరాన ఉన్న ఆల్బర్ట్ మెమోరియల్, 1861లో మరణించిన తన ప్రియమైన భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ జ్ఞాపకార్థం క్వీన్ విక్టోరియా ఏర్పాటు చేసిందట. గోతిక్ రివైవల్ శైలిలో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ రూపొందించారు 176 అడుగుల (54 మీ) ఎత్తులో అలంకరించబడిన పెవిలియన్ రూపం, చర్చి యొక్క ఎత్తైన పీఠంపై గోతిక్ సిబోరియం శైలిలో, దక్షిణం వైపున ఉన్న యువరాజు విగ్రహానికి ఆశ్రయం కల్పిస్తుంది. ఇది పూర్తి కావడానికి పది సంవత్సరాలు పట్టింది, £120,000 ఖర్చు (2010లో సుమారు £10,000,000కి సమానం).

1876లో ఆచారబద్ధంగా “కూర్చున్న” ఆల్బర్ట్ విగ్రహంతో స్మారక చిహ్నాన్ని క్వీన్ విక్టోరియా జూలై 1872లో ప్రారంభించింది. ఇది 1970 నుండి గ్రేడ్ I జాబితాలో ఉంది.

ప్రిన్స్ ఆల్బర్ట్ 14 డిసెంబర్ 1861న 42 సంవత్సరాల వయస్సులో మరణించినప్పుడు, ప్రభుత్వం, ప్రజా జీవితంలో ఉన్నవారి ఆలోచనలు విశ్వవిద్యాలయం లేదా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లను స్థాపించడం వంటి అనేక ఆలోచనలలో ఉంటే, క్వీన్ విక్టోరియా, తాను ఒక స్మారక చిహ్నాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మే 1862లో ఏడుగురు వాస్తుశిల్పుల కమిటీని నియమించారు. తర్వాత, ఏప్రిల్ 1863లో స్కాట్ రూపకల్పన అధికారికంగా ఆమోదించబడింది. 1862లో స్వనేజ్‌లోని ప్రిన్స్ ఆల్బర్ట్ మెమోరియల్ ఏర్పాటు చేయబడిన తొలి స్మారక చిహ్నం ఒక ఒబెలిస్క్ రూపంలో ఉంది. 1875లో గిల్ట్ కాంస్య విగ్రహం కూర్చుని, ఆల్బర్ట్ రాయల్ ఆల్బర్ట్ హాల్ వైపు దక్షిణం వైపు చూస్తున్నట్లు ఉంది.

స్మారక చిహ్నం మధ్య భాగం 169 మంది స్వరకర్తలు, వాస్తుశిల్పులు, కవులు, చిత్రకారులు, శిల్పులను వర్ణించే విస్తృతమైన శిల్పకళ ఫ్రైజ్ ఆఫ్ పర్నాసస్ (గ్రీకు మ్యూజ్‌లకు ఇష్టమైన విశ్రాంతి స్థలం అయిన పర్నాసస్ పర్వతం పేరు పెట్టబడింది) చుట్టూ ఉంది. సంగీతకారులు, కవులు దక్షిణం వైపు, చిత్రకారులు తూర్పు వైపు, శిల్పులు పశ్చిమం వైపు, వాస్తుశిల్పులను ఉత్తరం వైపు ఉంచారు. హెన్రీ హ్యూ ఆర్మ్‌స్టెడ్ దక్షిణ, తూర్పు వైపున, చిత్రకారులు, సంగీతకారులు, కవులు (మొత్తం 80 మంది) బొమ్మలను చెక్కి వాటిని వర్గీకరించారు.

మధ్య ప్రాంతం, బయటి ప్రాంతం మూలల్లో, శిల్పాలు ఉన్నాయి: విక్టోరియన్ పారిశ్రామిక కళలు, శాస్త్రాలను (వ్యవసాయం, వాణిజ్యం, ఇంజనీరింగ్, తయారీ) చిత్రీకరించే నాలుగు సమూహాలు. సాంప్రదాయ నాలుగు ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో నాలుగు సమూహాలు: ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ నాలుగు మూలల్లో, ప్రతి ఖండం-సమూహం అనేక ఎథ్నోగ్రాఫిక్ వ్యక్తులు మరియు ఒక పెద్ద జంతువు: ఆఫ్రికా కోసం ఒంటె, అమెరికా కోసం ఒక బైసన్, ఒక ఏనుగు ఆసియా, ఐరోపాకు ఒక ఎద్దు. ఈ సమూహాలు ఖండాల వ్యక్తిగతీకరించిన సాంప్రదాయ ఐకానోగ్రఫీ యొక్క సమ్మేళనాన్ని సూచిస్తాయి.

మెమోరియల్ పందిరి లోపల బయట అలంకార కళాకృతులను అనేక మొజాయిక్‌లతో చేయబడింది. నాలుగు బయట మొజాయిక్‌లలో ప్రతి ఒక్కటి నాలుగు కళలు కవిత్వం, పెయింటింగ్, ఆర్కిటెక్చర్ శిల్పాల కేంద్ర ప్రతీకలుగా చూపుతుంది, దీనికి ఇరువైపులా ఆయా కళల్లో నిపుణులైన వ్యక్తులు కనబడతారు. చారిత్రక వ్యక్తులు: కింగ్ డేవిడ్, హోమర్ (POESIS – కవిత్వం), అపెల్లెస్, రాఫెల్ (పెయింటింగ్), సోలమన్, ఇక్టినస్ (వాస్తుశిల్పం), ఫిడియాస్ మైఖేలాంజెలో (శిల్పం). మొజాయిక్‌లలో ఉపయోగించే పదార్థాలలో ఎనామెల్, పాలిష్ చేసిన రాయి, అగేట్, ఒనిక్స్, జాస్పర్, కార్నెలియన్, క్రిస్టల్, మార్బుల్, గ్రానైట్ ఉన్నాయి. పందిరి చుట్టూ, దాని కార్నిస్ క్రింద, ఒక అంకితమైన పురాణం నాలుగు భాగాలుగా విభజించబడింది, పురాణం ఇలా ఉంది: ‘ క్వీన్ విక్టోరియా ఆమె ప్రజలు • ఆల్బర్ట్ ప్రిన్స్ కన్సార్ట్ జ్ఞాపకార్థం • వారి కృతజ్ఞతా నివాళిగా • ప్రజల మంచి కోసం అంకితమైన జీవితం కోసం‘ అని.

పందిరి యొక్క స్తంభాలు, గూళ్లు ఆచరణాత్మక కళలు, శాస్త్రాలను సూచించే ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి: ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రం, జ్యామితి (నాలుగు స్తంభాలపై) వాక్చాతుర్యం, వైద్యం, తత్వశాస్త్రం, శరీరధర్మశాస్త్రం (నాలుగు గూళ్లలో).

పందిరి టవర్ పైభాగంలో నాలుగు కార్డినల్ ధర్మాలు, మూడు వేదాంత ధర్మాలతో సహా నైతిక, క్రైస్తవ ధర్మాలకు సంబంధించిన ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి. సద్గుణాలు: విశ్వాసం, ఆశ, దాతృత్వం, వినయం, దృఢత్వం, వివేకం, న్యాయం, నిగ్రహం. వినయం నిగ్రహం యొక్క ధర్మానికి అనుబంధంగా పరిగణించబడుతుంది. వీటి పైన, టవర్ పైభాగంలో, బంగారు పూతపూసిన దేవదూతలు తమ చేతులను స్వర్గానికి ఎత్తారు. టవర్ పైభాగంలో బంగారు శిలువ ఉంది.

అంత అద్భుతమైన కట్టడాన్ని, మార్చి 23, 1958న, స్పైక్ మిల్లిగాన్ తన గూన్ షో ఎపిసోడ్ ‘ది ఫస్ట్ ఆల్బర్ట్ మెమోరియల్ టు ది మూన్’లో భాగంగా ఆల్బర్ట్ మెమోరియల్‌ని చేర్చాడు. 1990ల చివరి నాటికి స్మారక చిహ్నం కొంత శిథిలావస్థకు చేరుకుంది. పీటర్ ఇన్‌స్కిప్, పీటర్ జెంకిన్స్ ఆర్కిటెక్ట్‌లచే సమగ్రమైన పునరుద్ధరణ జరిగింది. ప్రతి నెలా మొదటి ఆదివారం నాడు పబ్లిక్ మధ్యాహ్నం పర్యటనలు జరుగుతాయి, సందర్శకులు ఫ్రైజ్ ఆఫ్ పర్నాసస్‌ని నిశితంగా వీక్షించవచ్చు. క్వీన్ విక్టోరియా తన భర్త మరణానంతరం ఎంతో ప్రేమగా, ఎంతో శ్రమకోర్చి నిర్మించిన ఆ ప్మేమ చిహ్నం అమోఘం అనిపించింది. అద్భుతమైన ఆ కట్టడం నిజంగా మెమోరియలే.

గైడ్ చెప్పటం ముగించాక ఈలోకంలోకి వచ్చినట్టైంది. వైదేహి మాకు ఫోటోలు తీసుకోవటానికి కొంత సమయాన్ని ఇస్తూ టైమ్ ని దృష్టిలో ఉంచుకోవాలని ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పింది. నేనూ ప్రణయ్ ఒకరికొకరం ఆ మెమోరియల్ వచ్చేట్టుగా ఫోటోలు తీసుకున్నాము.

అక్కడనుంచి దారిలో ఉన్న సిటీ గురించి ఆ లండన్ గైడ్ వివరిస్తోంది. మేము బస్ లోంచే ఫోటోలు తీసుకుంటూ వింటున్నాము. అక్కడ లండన్లోని ధనవంతులు ఉండే అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్స్, అందంగా ఉన్న వీధులూ నీట్ గా కనబడుతున్నాయి. అక్కడ ఇల్లు కొనాలంటే 3 మిలియన్ పౌండ్స్ పైనే అవుతుందట. దేశం లోనే చాలా ఎక్స్పెన్సివ్ అయిన బిల్డింగ్ 150 మిలియన్ పౌండ్స్ పైనే ఖర్చుచేసి కింగ్ హిన్స్టన్ బ్రదర్స్ కట్టారని చెప్పింది. ఆ రోడ్ లోనే ప్రిన్సెస్ డయానా కి అత్యంత ఇష్టమైన హర్వినికోస్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్ చూసాము. అలా బస్లోనుంచే తీసుకెళ్ళుతూ ఆయా ప్రాంతాల విశిష్టతను గురించి ఆ లండన్ గైడ్ బ్రిటిష్ ఆక్సెంట్ లో చెబుతుంటే, వైదేహి తిరిగి మాకు ఇంగ్లీష్ లో, హిందీలో, తమిళ్ లో వివరిస్తుంది. బస్లో ఉన్నవారు వేరు వేరు భాషల వారు ఉండటం వల్ల ఆమే అన్ని భాషల్లోను చెప్పవలసి వస్తుంది. వైదేహి తమిళ నాడు అమ్మాయట. అందుకే తమిళ్ లో ఈజీగానే చెబుతుంది కాని హిందీ తనకు అంతగా రాదు కాని మానేజ్ చేస్తుంది. తెలుగు కూడా రాదు. మాకు, కొత్తగూడెం తెలుగు వారికి ఇంగ్లీష్ వచ్చుకాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. అలా బుకింగ్ హమ్ ప్యాలెస్ కోసం మా ప్రయాణం ముందుకు సాగింది.

మరి వచ్చే వారం తరువాత లండన్ విశేషాలు తెలుసుకుందాం…

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

మన మహిళామణులు