
పంచభూత సమన్వయమైన నన్ను
పృథ్వీ తత్వమని, గంథ తత్వమని నాకొక్క” లం”అనే బీజాక్షరాన్ని తగిలించి గౌరవించింది వేదం.
కానీ యుగయుగాలుగా తీరని బాధ అనుభవించు చూనే ఉన్నాను.
నా బిడ్డలైన ఈ మనుషుల దాస్టికాలను ఓర్పుతో….
వారి స్వార్థం కోసం నాడు గునపాలతో గుండెల్లో గుచ్చారు..
నాగలితో చీల్చారు,,., తొలిక తొలికతో నవరంద్రాల పొడిచారు… కలుపు తీయుటఅనే సాకుతో….
నేడు ట్రాక్టర్లు మొదలైన నవీన పరికరాలతో
ఇంకా లోతుగా దున్నుతోనే ఉన్నారు, నాటు తోనేఉన్నారు…..
వారి అతి సుఖం నాకు తీరని దుఃఖమయింది..
కానీ నేను శాకంబరినై అన్ని రకాలైన సన్యాన్ని అందిస్తూనే ఉన్నాను మాతృ ప్రేమ కుమ్మరిస్తూ..
కానీ వారి దురాశ మతిమీరి ఆధునికతఅనే నెపంతో సేంద్రీయ వాడక..
అనేక రసాయనాలను…పురుగుల మందులను…
నా నరనరాలా ఎక్కిస్తున్నారు….
ఇంకెక్కడ మిగిలింది నాలోని చావ..
నన్ను నిర్జీవిని చేస్తున్నారు….
కానీ ఓ మనుషులారా మదిని శోచించండి కాస్త…..,.
మీరు కూడా అవి ఆరగించి, నిర్జీవులవుతున్నారునీ ….
రోగాలు రొంపిల తోటి పీడితులవుతున్నారనీ
ఇలా కొంతకాలం గడిస్తే….
నేను గొడ్రాలు అయ్యే సమయం రావచ్చు…
కరువుకాటకాలొచ్చి….మీఉనికిలేకుండాపోవచ్చు…………..తెలుసు కోండి అతి దురాశకు ఆది అంతములు…. నాతోపాటు కలుషితం చేస్తున్నారు…. జల వాయువులనుకూడా….. నింగి కూడా ఎదుర్కొంటోంది ఓజోన పోర చిరిగి…..
ఋతువులు మారి వృష్టి అనావృష్టి అయితే ..
ప్రకృతి వికృతమయితే అంతావిలయ తాండవమే…ఆడేది……
విజ్ఞుడవై తెలుసుకో.., వివేకివై మేలుకో…
అంతా మీ చేతిలో, చేతలోనే ఇమిడి ఉంది….
కానీ ఒక్కసారి ఈ అమ్మ మాట ఆలకించకుంటే
ఆ తండ్రి!భువనభాండ మేలు నా భర్త!
అవతారమెత్తి! అన్నియును సరి చేయ రావంగా
దానికే నేనును, మీరును ఎదురు చూడంగా…