అయినంపూడి శ్రీలక్ష్మి

 2019 లోఅక్షరయాన్ సృష్టికర్తఆకాశవాణి వ్యాఖ్యాత కొన్ని వేల మంది కవయిత్రులను పరిచయం చేసి మాతృ వందనం పేరుతోదేశ విదేశాల నుంచి ఆహ్వానించిన నారీ శిరోమణి రచయిత్రిగా అనేక పుస్తకాలు కవిత్వమే గెలాక్సీ వూ ౦ డెడ్ హార్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కొత్త ప్రేమ లేఖలుఅనుబంధాల పూల తోట రస్కిన్ బాండ్ పిల్లల కధలు దాదాపు 19 పైగా పుస్తకాలు 50 పైగాసంపాదకురాలుగాఫిల్మ్ మేకర్ మరియుకవయిత్రిగా సామాజిక సేవకురాలుగా 4దశాబ్దాలుగా పనిచేస్తూ సాహితీ సేవ సంఘ సేవకురాలుగాప్రకాశిస్తున్నారుఅయినంపూడి శ్యాంసుందర్ రావు గారు సరోజినీ దేవి గారిముద్దుల తనయ తండ్రికి తగ్గ తనయగా పేరు నిలుపుతున్న వనిత తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ లక్ష్మి గారి కరోనాకిఓ రిటర్న్ గిఫ్ట్ వారు వ్రాసిన కవితను మెచ్చుకొన్నారు. 2 నంది జ్యూరీ అవార్డ్స్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణరంజని కుందుర్తి జాతీయ పురస్కారం కపిసో జాతీయ పురస్కారం విశిష్టసాహిత్య కారిణిగారాష్ట్ర పురస్కారంతెలుగు యూనివర్సిటీ కీర్తి ప్రతిభాపురస్కారాలు,పాకాల యశోదారెడ్డి జ్యోత్స్నకళా పీఠం అమృతలత, HI Biz TV,నాయని కృష్ణకుమారి,పాలమూరుసాహితీ పురస్కారాలు అనేక అవార్డ్స్ అందుకొన్నబహుముఖ కళాకారిణిగాగళకళాకారిణిగా విశిష్ట వాక్య నిర్మాణ పొందికల బాణిఆకాశవాణిలో 30 సంవత్సరాలకు పైగాఅనేక సేవలు అందిస్తూ అదే క్రమంలో తెలుగు యూనివర్సిటీలో డిప్యూటీ డైరెక్టర్ చిత్రవాణిగాడిప్యూటేషన్ లో పనిచేశారు

 

.ఆ సమయంలో వందలమంది కవయిత్రులను వారి వారి అనుభవాలను అనుభూతులను పొందుపరిచారువారి వారి పేర్లను చిత్రపటంలో నమోదు చేశారు.అక్షరయాన్ సంస్థలో దాదాపు1, 500కు పైగాతెలుగు రచయిత్రులు, హిందీ, ఆంగ్లము,మరాఠీ, కన్నడం అనేక భాషలలో ఆరితేరిన అనువాదకులు ఉన్నారు.దేశవిదేశాల్లో అనేక రాష్ట్రాల్లో వారి వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రగతి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వారిని కొత్త కలాలు,మాతృ వందనం,అనువాద కవులుగాపేరు పొందుతున్నారు ఏదోరకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిచయం చేస్తున్నారు.అంతేకాకుండా స్త్రీ,పురుష భేదంలేకుండా సమాజంలో దేదీప్య మానంగా వెలిగే ప్రముఖులను గుర్తించి వారికి సన్మానాలు చేయించి వారి గురించి పరిచయం చేయించి గౌరవించిన ఘనతశ్రీ లక్ష్మి గారిది ఫిబ్రవరి 17 ప్రతీ సం. హరిత హోటల్ లోఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఆ రోజే భాషా సేవ చేసిన ఒక వ్యక్తికి పంపకవీ పురస్కారం అందజేయడం జరిగింది కే శ్రీనివాస్ గారికి సుద్దాల అశోక్ తేజ గారికిఅనేక మందిని గౌరవించారు.అదేవిధంగాబాలబాలికల ప్రతిభను వారి రచన శక్తిని ప్రోత్సహించి వారిని సత్కరించడం జరుగుతుంది .పేద విద్యార్థులకు చదువుల యందు ఆసక్తి ఉన్న వారికి తన స్వశక్తితో 20వేల రూపాయలురాహుల్ అనే పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయడం అనేక మంది పేద విద్యార్థులకు విజ్ఞానులకు వారి వారి ప్రతిభను గ్రహించి ఆర్థిక సహాయంచేసే దయార్ధ హృదయినితనలోని మంచితనం మమకారం డాక్టర్లలో ఉంటాయని గ్రహించిన మాతృమూర్తి వారి వారిసేవలను బయటకు తీసి వారిని సమాజానికిపరిచయం చేయడంలో వ్యయ ప్రయాసాలుతట్టుకొని వృత్తి ధర్మంలో వారు ఎదుర్కొన్న సమస్యలను అనుభవాలను సేవలను ఒక్కచోట క్రోడీకరించి డాక్టర్లలో మేలి ముత్యాలవంటి వారిని ఎంతో ఆసక్తిగా జీవన దాతలుగా ప్రాణ పోషకులుగా వైద్య దేవుళ్ళుగా కొత్త జీవితాలు ప్రసాదించే వైద్య బ్రహ్మలువారి సేవల్ని ప్రజలకు తెలియజేయాలని కంకణం కట్టుకున్న శ్రీ లక్ష్మీ గారుడాక్టర్స్ ఫైల్స్ రాయడానికి కారణంమానవ జీవితం క్షణికం నీటినీటి బిందువు ఎప్పుడు ఆరిపోయేదో తెలియదు గాని కదిలే దేవతలు మన ముందు ఉన్నారు.వారే ప్రాణదాతలని చిన్ననాడు టి.బి. బారి నుండిరక్షించిన డాక్టర్ మురళీధర్ రావు రేఖ దంపతులు చేసిన సేవలు మరువరానివని తన తండ్రి వివరించిన తీరువారిని కార్యోన్ముఖులను చేసింది.మరో కారణం డాక్టర్ చంద్రశేఖర రావు గారు శ్రీ లక్ష్మీ తల్లి సరోజ నమ్మకు క్యాన్సర్ జబ్బును నయం చేసి శ్రీలక్ష్మి గారికిఅమ్మను ప్రసాదించారు.అదే కోవకు చెందినవారు డాక్టర్ సుబ్రహ్మణ్యం’డాక్టర్ ఫణీశ్రీడాక్టర్ నిర్మల,సౌమ్య జీవిత చరమాంకంలో ఉన్న వారి పాలిటి దివ్యజ్యోతులు.డాక్టర్ రమేష్ గుడిపాటి గారు 20 సంవత్స రాలకు పైగాశ్రీలక్ష్మి గారి నాన్నగారిని గురువుగా గుండెలకు హత్తుకునేమనస్తత్వం వారిది.శ్రీలక్ష్మి గారి భర్త ఆమె సొంత మేనమామ గారేబండ్లపూడి నాగేశ్వరరావు గారికి అనుకోకుండా యాక్సిడెంట్ తో మృత్యువు కుహారంలోపోరాడిన వారి భర్తకు డాక్టర్ రాఘవదత్ ములు కుట్ల గారుఅనేక సేవలు చేసి శ్రీ లక్ష్మి గారికి పతిభిక్ష పెట్టి సుమంగళిగా సౌభాగ్యం కల్పించిన యమధర్మరాజు.
ఈ విధంగా వారి హృదయంలో వైద్యులు అంటే ప్రాణదాతలు పరబ్రహ్మలు అనివారి ఉద్దేశంతో డాక్టర్స్ ఫైల్స్ అనే రచనకు పూనుకొన్నారు.
ఎందరో నడవలేని వారికి మోకాలి చిప్పలు అరిగిపోయి పాకుతున్న వారికి దాదాపు 10మందికి నలిగిన ఎముకలకు నడకలుప్రసాదించిన డాక్టర్ చిరంజీవి సహనశీలి. ఇ. ఎన్.టి.డాక్టర్ జానకీరాం గారు ఫీజు లేకుండా చికిత్స చేస్తారు. తండ్రి డాక్టరు రామారెడ్డి నుంచికొనసాగిస్తున్నారు. ట్రేకీ అష్టమీ వంటి క్లిష్టతరమైన వ్యాధుల్ని నయం చేసినధన్యజీవి. మూత్రపిండాల పనితనం తెలిసిన అరుదైననెఫ్రాలజిస్ట్ డాక్టరు శ్రీ భూషణ్ రాజు మానవత స్పర్శ ఆలూరి విజయలక్ష్మి గారిఇంటిల్లిపాలిటీ వారందరూ డాక్టర్లే,డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారుగైనకాలజిస్ట్ గా 20 వేల ప్రసవాలు చేసినఅమ్మమ్మ గారి ఇల్లుగా పేరుపొందారు. మరియు రచయిత్రిగా వెలిగారు.డాక్టర్ ఈశ్వరి ప్రకాశం గారు ఓపెన్ హౌస్ పేరిట వైద్యం చేస్తూ ఇన్ ఫెర్టిలిటీ వంటి వాటి మీదసమాజంలోఅవగాహన పెంచడానికి ఎన్నో పుస్తకాలు వ్రాసారు.డాక్టర్ కొమ్మినేని నందకుమార్ గారు నిజామాబాదులో ఎం.డి.ఎస్.దంత వైద్యశాలలో సేవలు అందిస్తూ అనేక యువ వైద్యులకు ప్రోత్సాహం ఇస్తూన్నారు.అనేక సత్కారాల్లో హ్యాట్రిక్ సాధించారు. 35 వేలకు పైగాప్రసవాలు పూర్తిచేసి అతి తక్కువ ఫీజు తీసుకున్నా డాక్టర్ నోముల హేమలత గారు.గ్రామీణ ప్రజల సేవకురాలు తమ్ముడు శ్రీనివాస్ తన సొంత తల్లిగా ఆరాధించడం మనందరికి గర్వకారణం.డాక్టర్ ములుకుట్లరాఘవదత్ గారు గూని వచ్చిన ఎందరో రోగులకు మామూలుగా నడిచే విధంగాతయారుచేసిన ఆర్థోపెడిక్ డాక్టర్.ఆడపిల్లల అక్షరాస్యత కోసం నిధిని కూడ ఘట్టారు.బాధ లేని ఏ చికిత్స ఆపరేషన్చేయాలన్నా ఎనస్తీషియాసుబ్రహ్మణ్యం గారు దాదాపు 200పడకలక్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం నిర్వహణచేస్తున్నప్రతిభగల డాక్టర్ గారు.సామాజిక సేవా రంగంలో రచన రంగంలో నీటి పాలియోటివ్ కేర్ ఆత్మీయ స్పర్శతోరోగుల్ని స్వాంతన పరిచే డాక్టర్ ఫణి శ్రీ ఆఖరి ఘడియలుప్రశాంతంగా కన్నుమూసేలాలాఅధునాతన చికిత్సలో ఆరితేరిన డాక్టర్ పణిశ్రీ గారు.రక్తనాళాలు కూరుకుపోయిన 20 వేలకు పైగా కరోనరీ ఫ్రో సీజర్స్ తోకొత్త రికార్డు సృష్టించిన హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ గూడ పాటి గారు. తమసాహిత్య సేవలుయూట్యూబ్ వెబ్సైట్ ను కల్వకుంట్ల కవిత గారితో ఆవిష్కరించారు.అక్షర యాన్ ఫేస్భుక్,ఇంస్టాగ్రామ్,టెలిగ్రామ్ ల ద్వారా తమ సాహిత్య సేవలు యూట్యూబ్ ద్వార తెలియచేస్తూన్నారు.షీ టీం,భరోసా,హితైషి,నింగిని గెలిచిననేల,నేనే పోలీస్ అయితే,విత్తనోత్పత్తి కథలు, భీజస్వరాలు కవితలు, పసిమొలకలురుధిరజ్వాలలు,సలాం సైనికా,సముజ్వల భారతిస్వయంగా ప్రచురించారు.ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం, డ్రగ్స్ కథలుకవితలు, రాష్ట్రపతి భవన్ లో అనేక భాషల్లో స్త్రీల కవితా సమ్మేళనంఇంకా అనేకం ప్రచురణలు కావడానికి అనేక అంశాలతోసన్నిద్ధంగా ఉన్నాయి. డ్రగ్స్,భాష,బతుకమ్మ,స్వేచ్ఛ,మహిళ,అనేక కవి సమ్మేళనాలు జరిపారు.అంతేకాకుండా చనిపోయిన రచయిత్రులసంస్మరణ సభలు యువ,బాలబాలికల పురస్కారం 5,116ఇవ్వడం అక్షరయాన్ ఔదార్యం శ్రీ లక్ష్మీ సాహసం గవర్నర్ భవనంలో బతుకమ్మ, రాష్ట్రపతి భవనంలో కవి సమ్మేశనం జరపడం వారి సాహసానికి గుర్తు మరియు వారి దయాగుణాణికి నాహృదయపూర్వకంగా అభినందనలు.

ఇట్లు
మీ
అభిమాన రచయిత్రి
డా. నన్నపురాజు విజయశ్రీ
రాష్ట్రపతి అవార్డు గ్రహీత
రంగారెడ్డి జిల్లా
9100439884

Written by Dr.Nannapuraju Vijayasri

డా. నన్నపురాజు విజయశ్రీ
రాష్ట్రపతి అవార్డు గ్రహీత
రంగారెడ్డి జిల్లా
9100439884

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘అనూరాధకి ..ఆశీర్వచనాలు’ — అన్న పిలుపు నేడు మూగ పోయింది –

అమ్మకు పెళ్లి(ళ్లా)