కవులు

విశ్వంభరాభ్యుదయమే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలై,
ఉర్వి జన సంక్షేమమే వాళ్ళ క్షేమమై
సంఘ సంస్కరణమే వాళ్ళ బాధ్యతై
సమాజ సత్కలాపమే వాళ్ళ ఆలాపనై
ప్రతి ప్రత్యూష వేళ చెక్కలొత్తు కోటి భావాలకు
ఉదయాల ఆ స్పందన లకు
పేటికలై ప్రతి ఇంటి వాకిట్లో వ్రేలాడె సమస్యల
తోరణాలను చక్కనొత్తాలని అక్షరమౌతారు

సంతోష వీచికల్ని
సర్వ మానవాళి హృదయాల దరికి చేర్చి
దరహాస రుచులు హెచ్చవుతుంటే ధరణి నిండాపాటుపడే
ఆశయాల నిలయాలవుతారు

కవులంటే హృదయ సమీరాలు
దయకు నిలయాలు
ఆశయాలకు ఆలయాలు

తాము కరిగిపోతూ తొలి తొలి వెలుగు నిచ్చే
కొవ్వొత్తులే కవులు

Written by Dr. Vasundhara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమృత లత గారి స్వీయ చరిత్ర విశ్లేషణ

గులాబీల పిల్లవాడు