పండగ రోజు. ఇంటి ముందర కూర్చొని, కళ్లలో వెలుగు లేక, హృదయంవెలితితో బుజ్జి అలమటిస్తోంది.ఆవిడను చూసిన భాగ్యక్క దగ్గరకు వచ్చి అడిగింది.
బుజ్జి, పండగ రోజు ఇలా ఎందుకు కూర్చున్నావు? పనులేమీలేవా?ఏదో! బాధ పడుతున్నావు ఏంటి?
బుజ్జి లోలోపల నిట్టూర్చి నెమ్మదిగా మాటలు మొదలుపెట్టింది“పనులు ఎందుకు ఉండవు అక్కా ఉంటాయి.కానీ పనులకంటే ముందు ఉండాల్సింది మనుషులు.పండగా అంటే ఇల్లువాకిలి శుభ్రం చేసుకొని ఇంటిని అంకరించికొనిరకరకాలపిండి వంటలు చేసి హాయిగాముచ్చట్లతో ఇంట్లో సందడి సందడిగా వుంటే అదే పండగా.మనుషులే లేకుంటే ఎవరి కోసం వంట చేయను? ఎవరికి పెట్టను? ఒంటరిదాన్నిఏం! వంటచేయను? ఎవరికిచేయను? ఈరోజు పండగ రోజు, కానీ నా మనసులో పండగ లేదు అందిబుజ్జి.
భాగ్యక్క ఆశ్చర్యంగా అడిగింది?“ఏమయ్యింది? పిల్లలు రానన్నారా?”
బుజ్జి కన్నీళ్లు ఆపుకుంటూ నవ్వింది.“పిల్లలు పెరిగిపోయారుపెద్దరుయ్యారుపెద్ద చదువులు చదివారుపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.వాళ్ల నాన్నగారు లేరనిఇంటి దారే మరచిపోయారు.ఒకప్పుడు ఈ ఇంటి వాకిలి తలుపులు తట్టని రోజు ఉండేది కాదు.ఇప్పుడేమో! నా దగ్గరికి రావడానికి కూడా వారికి సమయం లేదు.”బుజ్జి.మెల్లగా అంది.
“అప్పుడు నువ్వే వాళ్ల దగ్గరికివెళ్లొచ్చుగా బుజ్జి…”అందిభాగ్యక్క.
బుజ్జి ముఖంమారింది.“వెళ్ళొచ్చు అక్కా కానీ అక్కడ నాకు స్థానం లేదు.వాళ్ల ప్రేమలో ఏదో వెలితి ఉంది.వాళ్లకు నేను భారమైనట్టుంది.వాళ్ల ఇంట్లోకి వెళ్ళి నా గౌరవం పోగొట్టుకోవటానికి కంటే ఇక్కడఒంటరిగా ఉండడమే మేలు.నా భర్త సంపాదించిన ఆస్తి ఉంది, పెన్షన్ వస్తుంది.ఎవరి దయతో బతకాల్సిన అవసరం లేదు నాకు.కానీ ఈ మనసు మాత్రం పండగ రోజుల్లో పిల్లల కోసం తల్లడిల్లుతుంది అక్కా…

భాగ్యక్క ఆవేదనగా బుజ్జిని చూసింది“నీ దగ్గర డబ్బు ఉంది బుజ్జి. కానీ మేము పేదవాళ్లం.డబ్బులు లేకపోయినామా పిల్లలు మాత్రం ప్రతి పండగకు ఇంటికి వస్తారు.మాకు ఆస్తులు లేవు, కానీ ప్రేమ ఉంది.నీకైతే ఆస్తులు ఉన్నాయి, కానీ ప్రేమ లేదు అదే తేడా బుజ్జి. డబ్బుతో ప్రేమను కొనలేము”
బుజ్జి కన్నీటి బిందువులు చెక్కిళ్లపైకీజారాయి.
“నీ మనవళ్లునానమ్మ కావాలనిఅడగరాపండక్కు రమ్మనిపిలువరా?” అని అడిగిందిభాగ్యక్క.
బుజ్జి మృదువుగా అంది .“వాళ్లను నా దగ్గరకు రానిస్తే కదా!.ఈ కాలం పిల్లలు అంత ఇంగ్లీష్ మాటలేమాట్లాడుతారు. వాళ్లకు తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్ రాదు, నా భాష వాళ్లకు అర్థం కాదు.వాళ్లు ఏదో మాట్లాడుతూ నవ్వుతారునేను అర్థం కాకపోయినా నవ్వుతాను.అంతే మాటల బంధంమాది.
నేను వంట గదిలోకి వెళ్లి వంట చేస్తానంటే నా కోడలు అత్తయ్య వంట అక్కర్లేదు మీరు కూర్చుండి నేను ఆర్డర్ పెడతాను మీకు టీ కావాలా? కాఫీ కావాలా? టిఫ్ఫిన్కావాలా?అని అడుగుతుంది. నేను వెళ్లి వంట గదిలో వంట చేయాలన్ననాకు స్వేచ్ఛ లేదక్కడ. నా కొడుకు అమ్మ కూర్చోటీవీచూడు ఫోన్ చూసుకోచిన్నప్పటినుండి నీ వంటలు తినితిని విసుగొచ్చింది. ఎప్పుడు ఆవే వంటలు నీ కోడలు ఆర్డర్ పెడుతుంది లే…!భాగ్యక్కను చూసి బుజ్జి కన్నీళ్లు అరికట్టుకుంటూ చెప్పింది.
“అక్కా నా కోడలు వంట చేయదు.అందమైన వంటింటిని కేవలం అలంకరణకే అలంకరించుకుంది.వంటింటి వాసన అంటే ఏమిటో తెలియదు.అమ్మ చేతి వంట రుచి అంటే ఏమిటో ఆమెకు తెలియదు.నా కొడుకు నా ఓ ముందులిస్ట్ పెడతాడు.
‘అమ్మా, నీకు కావాలనుకున్నది ఇందులో చూసుకోపిజ్జా కావాలా? బర్గర్ కావాలా? నూడుల్స్కావాలా? బిర్యానీ కావాలా?’
అంటూ రకరకాల వంటకాలుచూపిస్తాడు.కానీ ఆ వంటల్లో నాకు ఒక్కటి నచ్చదు.నా కోడలు చాయ్, కాఫీ కూడా ఆర్డర్ పెడుతుంది.ఇంట్లో వంటింటి మోత, వంటపాత్రల శబ్దంవంట వాసనఇవన్నీ కనుమరుగైపోయాయి అక్కా.నేను చేసిన వంటలు వాళ్లుతినరువాళ్ల పిల్లలు కూడాతినరు.నా ఒక్కదానికోసం వంట వండిపెట్టడం కూడా జరగదు.నా మనసు లోపల తపనపడుతుంది. ‘ఇదేనా నేను కలలు కన్న ఇల్లు?ఇదేనా నేను కష్టపడి పెంచిన కొడుకు ఇంటి జీవితం?’కానీ నేనేం చేయగలను అక్కా. నా కొడుకుతో ఉంటున్నాననిభరించుకోవడమే తప్ప.
భాగ్యక్క బుజ్జి చేతిని పట్టుకుని నెమ్మదిగా నిట్టూర్చింది.“కాలం మారింది బుజ్జి. వంట రుచులు కాదుమనసుల రుచులు తగ్గిపోయాయి.అయినా ఒకరోజు వాళ్లు గుర్తు చేసుకుంటారు.అమ్మ చేతి వంట రుచి, వంటింటి వాసనఅనేవి డబ్బుతో కొనలేనివని.”
బుజ్జి మౌనంగా కళ్లను తుడుచుకునితనలో తానుగా ఆలోచించుకుంది.
“అది నిజమే ప్రేమ లేని ఆహారం రుచి ఉండదు.ఏదో ఒకరోజు నా వంటింటి వాసన వారిని వెతుక్కుంటూ తీసుకోస్తుంది”.మనసును సమాధానపరచుకుంది బుజ్జి.
భాగ్యక్క నా కూతురు ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది”అమ్మ… నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావ్?”ఆ మాటలుప్రతిసారి నా హృదయాన్ని తాకుతాయి. నన్ను ఇంటికి పిలుస్తుంది.నా మనసు ఆ ఆహ్వానానికి పరిగెత్తిపోతుంది.కానీ అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆమె ఇంటి గోడల మధ్య అత్తగారి పెత్తనం, అల్లుడి ఆప్యాయతలో… నా కోసం ఎటువంటి చోటు లేదు అక్కడ. అత్తగారి జోక్యం, సవాళ్లు, పరిమితులతో. నా కూతురు నన్ను చేరదీయలేకపోతుంది.నా కూతురు ప్రతి క్షణం నన్ను చేరాలనుకుంటూ తపనపడుతుంది, కానీ పరిస్థితులు ఆమెను అడ్డుకుంటున్నాయి. ఆ అడ్డంకుల మధ్య, ఆమెలోని ప్రేమ, ఆ ఆత్మీయత నన్ను స్పర్శిస్తుంది, ఆసమయంలో నా హృదయాన్నిమౌనంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను నా మనసులో ఈ వేదన బలంగావుంది. “నా కోడలు ఇలా వుంది, నా అల్లుడు అలావున్నాడు… చివరికి ప్రేమ కోల్పోయి, నేను ఒంటరిగా మిగిలిపోయాను.” అక్కఅంటూబుజ్జి కళ్ళల్లోకన్నీళ్లు ఆగలేదు.
గుండెల్లో బాధ.ప్రేమను కోల్పోయిన హృదయానికి సాక్ష్యమైందినేనే అందిబుజ్జి.
నా కొడుకు ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాడు! కానీ పెళ్లి అయిన తర్వాతకోడలు సాకుతో ‘పనులున్నాయి, టైం లేదు’ అంటూ నా దగ్గరికి రావడమే మానేశాడు.
ఇక్కడికెప్పుడూ రాడు. కానీ తన అత్తగారింటికి మాత్రం తరచుగా వెళ్తుంటాడు.ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు తట్టుకోలేకపోతుంది భాగ్యక్క.ఈ పిల్లల కోసమేనా? మేము పగలూ రాత్రీ కష్టపడి, పస్తులువుండి కూడబెట్టాం?
వాళ్లు కష్టపడకూడదని, పెద్ద పెద్ద చదువులు చదివించాం, పెద్ద ఉద్యోగాలు సంపాదించి.మముల్ని మంచిగా చూసుకుంటారు అనుకుంటేచివరికిలాతయారైయాడు….అదే మేము చేసిన పొరపాటు అయింది.ఇప్పుడు వాళ్లకు డబ్బు కొదవలేదు అందుకే అమ్మానాన్నలకు విలువ తేలికుండా పోయింది.”బుజ్జి గళం కంపించిపోయింది. కళ్లలో కన్నీళ్లు నిండాయి.
భాగ్యక్క దగ్గర కూర్చుని ఆమె చెయ్యి పట్టుకుంది.బుజ్జి… నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు వాళ్లకు డబ్బు ముఖ్యమైంది. కానీ ఒకరోజు ఒంటరితనం వాళ్లకూ తగులుతుంది. అప్పుడు వారు అర్థం చేసుకుంటారు – తల్లిదండ్రుల ప్రేమే నిజమైన సంపద అని.”
బుజ్జి మనసు లోలోపల మూలిగింది.మాటలు రాకపోయినాగుండె లోపల ఒకే ఒక్క భావన మిగిలింది
“మేము చేసిన త్యాగాల విలువ… ఒకరోజు మా పిల్లలు గ్రహిస్తారు లే”
“ఇలాంటి వారికీ వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక తెలుస్తుంది ఒంటరితనం అంటే ఏమిటో.”ఒక్క క్షణం ఆగి, బుజ్జి గుండె బరువుతో
మాటలు పొర్లాయి.ఒకప్పుడు మా ఇల్లు పండగ రోజు మాత్రమే కాదు,ప్రతి రోజు పండగలా ఉండేది.చుట్టాలు, బంధువులు, మామయ్యఅత్తమ్మఇంటి నిండా నవ్వులుసందడేసందడిఎప్పుడోఓసారి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చిన మంచు తెరల కరిగిపోయేవిఎంత బాగుండే వాళ్ళం. అటువంటి ఇంట్లో పెరిగిన పిల్లాడు ఈరోజు ఒంటరితనాన్ని కోరుకోవడం బాధేస్తోంది.
భాగ్యక్క బుజ్జి చేతిని పట్టుకుని మృదువుగా అంది“బుజ్జి, నువ్వు ఒంటరిగా లేవు.మా లాంటి వాళ్లు నీకు ఉన్నారు.ప్రేమ ఉన్న చోటే అసలైన పండగ.పండగను డబ్బు కాదు, మనసు చేస్తుంది.”లే లే మాఇంటి కీ రా ………
బుజ్జి కళ్లలో కన్నీటి చుక్కలు జారినాహృదయంలో ఓదార్పు తాకింది.ఆమె ముఖంలో కాస్త వెలుగు మెరిసింది.కాలం మారినా… తల్లిప్రేమ మాత్రం మారదని
భాగ్యక్కకళ్లల్లో కనిపించింది.