దాతృత్వ సంపద

చప్పట్లతో కేరింతలు కొట్టాల్సిన చిట్టి చేతులు
ఆకలి కేకలతో దీనంగా చేతులు చాస్తుంటే !

మనసున్న చిన్నారి పిడికిట నిండనంటూ మొరాయిస్తున్న బియ్యాన్ని
తన చిన్ని చేతుల్తో ఒడుపుగా తెచ్చినా!

గుమిగూడిన చేతుల్లో గుప్పెడు బియ్యాన్ని పంచడం అసాధ్యం అనుకుందేమో!

చాచిన దోసిళ్ళవైపు
అయోమయంగా చూస్తున్నప్పుడు అంబలితో అందరి ఆకలి తీర్చొచ్చంటూ తళుక్కుమన్న ఆలోచనతో
తనలో తాను తబ్బిబైపోయి ఇవ్వడంలోని ఆనందాన్ని చవిచూసుంటుంది

సర్దుకున్న ఆకలితో అక్కరలోని అనివార్యాన్ని నరనరంలో నింపుకున్న అభాగ్యుల్లో
ఎన్ని ఆలోచనలు అంకురించాయో!

కృతజ్ఞత నిండిన మనసు పొరల్లో ఎన్నెన్ని మతలబులు పదిలమైపోయాయో!

ఎవరికెరుక చేతులు చాచిన కుచేలురే
మునుముందు కుబేరులౌతారేమో!
అర్థించిన చేతులే తమ చేతలతో దాతృత్వ మనోసంపన్నులై కైమోడ్పులందుకుంటాయేమో!

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు- 33

భ్రూణ హత్య (అనుకున్నావు….కానీ…)