మనుషుల మధ్య తెలుపు నలుపు రంగుల భేదాలు ఎప్పటినుంచో విశ్వమంతా రాజ్యమేలుతున్నాయి . కానీ ఓ రంగు మాత్రం పూర్తిగా రాచరికపు చిహ్నంగా , రాజధర్పానికి ప్రతీకగా గౌరవాన్ని పొందింది . ఈ రంగు రోమన్ సామ్రాజ్యపు హంగు . అదేంటంటే ఊదా లేదా వైలెట్ .
వంగ మొక్కల పూలు వైలెట్ రంగులో ఉంటాయి .అందుకని వంగ పువ్వు రంగు అని కూడా అంటారు. నీలం ప్లస్ ఎరుపుల మిశ్రమం ఈ రంగు . ఈ రంగును గూర్చి మనసులో తలవగానే గుర్తొచ్చేభావాలు లగ్జరీ అండ్ మిస్టరీ .మరికొందరికి బోల్డ్ అండ్ కామ్ల అత్యుత్తమ కలయిక .
బైబిల్ కూడా ఉదా రంగు సంపద ,శ్రేయస్సు మరియు విలాసానికి ప్రతీక అని చెప్తుంది .ఈ రంగు విశ్వాసాన్ని విధేయతను సూచిస్తుంది . యేసు తాను సిలువ వేయడానికి ముందు ఊదా రంగు వస్త్రాన్ని ధరించాడు .
ఈ రంగుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అర్థాలు ఉన్నాయి .అంతరార్ధాలు ఉన్నాయి . సంపద , దుబారా ,సృజనాత్మకత జ్ఞానం , గౌరవం , గొప్పదనం ,భక్తి ,శాంతి ,గర్వం ,రహస్యం అందులో కొన్ని .
ఫర్నిచర్లతయారీలో అరుదుగా ఉపయోగించే రంగు ఇది . నీలం యొక్క ప్రశాంతతను ,ఎ రుపు యొక్క శక్తిని ,ఉత్తేజాన్ని మిళితం చేస్తుంది. ఈ రంగును ఇష్టపడని వారు ఉండరు .ఎంతటి మొండి హృదయానికైనా ఈ రంగు నచ్చుతుంది .మనసు సేద తీరిన అనుభూతిని ఇస్తుందిఈ వర్ణమ్ . డ్రాయింగ్రూమ్ కు కు వేస్తే ,అలంకరణ అదిరిపోతుంది .
అనాదిగా అధికారానికి ఐశ్వర్యానికి చిహ్నం .తరతరాలుగా రాచరికం ఆధ్యాత్మికతలను సృజనాత్మకతతో జోడించి , సంస్కృతిని ప్రభావితం చేసింది .రాజులూ రాణు లు ఇష్టపడే రంగు .
ఒకప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం హోదాకు చిహ్నం .ప్రాచ్య దేశాలలో ఈ రంగును కరెన్సీ నోట్లకు వాడేవారు . ఈ రంగుని ఇష్టపడేవారు ధనాపేక్షపరులని అంటారు .ఫ్లోరిడాలోని జైలు గోడలకు ఈ రంగును వేసి ,ఖైదీల స్వభావంలో మార్పులపై పరి శోధనలు చేశారు .అందులో క్రూరుడు కూడా శాంతమూర్తిగా ప్రవర్తించినట్లు ,తాను చేసిన నేరాలను తలుచుకుని బోరున ఏడ్చినట్లు తేలింది .
కంటికి నదురు గా కనిపించే రంగు మాత్రమే కాదు ,మనసు మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది .దీని లేత రంగై న లావెండర్ మనసును శాంత పరుస్తుంది .రోజువారి ఒత్తిడి నుంచి శాంతినిస్తుంది . పనిచేసే దగ్గర ఏదో ఒక మూల ఊదా రంగు వ స్తువు ఉం డేలా చూసుకోండి .దాంతో హఠాత్తుగా మైండ్ బ్లాంక్ అయ్యే సందర్భాలు తగ్గుతాయి .
ఈ రంగుకి ఒక్కో సంస్కృతిలో ఒక్కొక్క అర్థం ఉంది .పాశ్చాత్య దేశాల్లో సంపదకు , రహస్యాలకు ,సృజనాత్మకతకు చిహ్నం . జపాన్లో బలానికి ,కులీ నత్వానికి చిహ్నం . థాయిలాండ్లో విషాదానికి గుర్తు .
మనదేశంలో ఆధ్యాత్మికతకు శాంతికి మరోపేరు .వాస్తు శాస్త్రం ప్రకారం శాంతి ,మానసిక స్పష్టత ,అభివృద్ధికి చిహ్నం ఈ రంగు .సాధారణంగా దీని లేతవర్ణమును పర్పుల్ కు ఉదాహరణంగా వ్యవహరిస్తారు .పర్పుల్ అనగానే గుర్తొచ్చే పదం టైరియన్ పర్పుల్
దీని గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఈ సందర్భంలో .దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది .
పర్పుల్ ఆనాటి రోమన్ సామ్రాజ్యపు రంగు .నాడు ఇది సమాజంలో బలానికి ,సార్వభౌమత్వానికి ,ధనానికి చి హ్నం సమాజంలో ఉన్నత వర్గాలు మాత్రమే వినియోగించాలనిఅప్రకటిత నిబంధన ఉండేది.
ఇది ముఖ్యంగా దక్షిణ యూరప్ , ఆ ఫ్రికా ,పశ్చిమసియాలలో బాగా ఇష్టపడేవారు .ఉతికినా వెలసిపోని దీని గుణం అందరికీ నచ్చేది . క్లియోపాత్రకు ఈ రంగంటే తగని మక్కువ .ఆమె తన పడవ తెరచాపలకు ఈ రంగును వాడేవారు .
చివరికి సమాధులపై కూడా ఈ రంగును వాడేవారు .ఒకప్పుడు నత్తగుల్ల ల పెంకు నుంచి పర్పుల్ రంగు ను తయారు చేసేవారు . చా లా ఖరీదు .ఒక గ్రాము టైరియన్పర్పుల్ రంగు తయారు చేయాలంటే దాదాపు పదివేల నతగుల్లలు అవసరమయ్యేవి అది కారణం . ఈ రంగు తయారీని మొదటి రసాయన పరిశ్రమగా వర్ణిస్తారు .
ఈ రంగులో లావెండర్ రంగు వస్త్రాలను తయారు చేయడం ఖర్చు , శ్రమతో కూడిన పని .అందువల్ల రాజ కుటుంబీకులు , ధనవంతులు మాత్రమే వాడేవారు .మధ్యయుగాల్లో మత గురువులు ఈ రంగు వస్త్రాలను ధరించేవారు . క్రమంగా ఈ రంగు పూర్తిగా రా జరీకపు చిహ్నంగా ,రాజహోదాకు ప్రతీకగా మారింది .తమకంటే తక్కువ స్థాయి వారు ధరించిన భ రించలేనంత అసూయ నాటి రోమన్ రాజులకు కలిగిందంటే ఊహించండి .కొందరు రోమన్ సామ్రాట్లు తాము తప్ప ఇతరులు ఎవరైనా ఈ రంగు దుస్తులను ధరిస్తే మరణశిక్ష విధించేవారు
40 b.cలో రోమన్ చక్రవర్తి మౌరిటానియా రాజును చంపమని ఆదేశించాడు .ఈయన రోమన్లకు స్నేహితుడు . ఓ గ్లాడియేటర్కార్యక్రమానికి ప ర్పుల్ రంగులో దుస్తులు ధరించి వెళ్ళాడు .దీన్ని సహించలేని రోమన్ చక్రవర్తిఅలా ఆదేశం ఇచ్చాడు .
కేథలిక్ పూజారులు ఈ రంగుతో చేసిన దుస్తులను ధరించేవారు .తమ మత గ్రంథాలను ఈ రంగు వస్త్రాలలో భద్రపరిచేవారు . దక్షిణ కొరియాలోని ఐలాండ్ అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి .ఇక్కడ విస్తారంగా లావెండర్ తోటలు ఉన్నాయి .రోడ్లు కూడా ఉదారంగు లోనే ఉంటాయి. ఈ ఊళ్ళోకి అడుగుపెడితే పర్పల్ ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది .
మధ్యయుగాల్లో మత గురువులు ఈ రంగు వస్త్రాలను ధరించేవారు .అప్పట్లో దీన్ని బంగారం కంటే మూడు రెట్లు విలువైనదిగా భావించే వారని క్రీస్తు శకం 31 నాటి శాసనం చెప్తుంది .
15వ శతాబ్దం నాటి దీని తయారు నాటికి తయారీ విధానం పూర్తిగా కనుమరుగైంది ఆ విధానంకాలగర్భం లో కలిసిపోయింది . ఈ రంగుని ఇష్టపడేవారు , ఆలోచనాత్మక ధోరణిని కలిగి ఉంటారు .అంతర్ముకులు . తెలివైన వారు .
ఈ రంగు మనసుకు నరాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది .ప్రశాంతమైన రంగుగా పరిగణించబడుతుంది .ఇది కేవలం ఒక రంగు మాత్రమే కాదు ,ఇది చరిత్ర , భావోద్వేగాలు కలిసి ప్రశాంత స్థితికి మనిషిని తీసుకువెళ్లే అపురూప దృశ్య కావ్యం .