విధి నెదిరించిన వీ రవనితలు

ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన స్త్రీ మూర్తులు ఎందరో ఈ నేలపై నడయాడారు . పరిపాలన పగ్గాలను  చేపట్టారు ప్రజా రక్షణే దీక్షగా నడిచారు .అపారమైన తెలివితేటలతో  ,శత్రువులను గడ్డి కరిపించారు  .పరిమితమైన సేనలతో ,అపరిమితమైన ధైర్య సాహసాలతో శత్రువుల గుండెల్లో ఫిరంగులు పేల్చారు  . ముష్కరులకు సింహ స్వప్నమై నిలిచారు  .అలాంటి మహారా ణులు కొందరినైనా గుర్తు చేసుకుని  ,వారి జీవిత విశేషాలను రేఖామాత్రంగా నైనా ఈ స్వాతంత్ర దినో త్సవ శుభ సందర్భంలో తలుచుకోవడం తోటి మహిళలుగా మన కనీస కర్తవ్యం .

మణికర్ణిక

భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి . బ్రిటిష్ సైన్యాధికారి రోస్ విప్లవకారుల్లోకెల్లా అత్యంత ధైర్య సాహసాలతో పోరు సలిపిన మహిళ అని మెచ్చుకున్నాడు  .శత్రువుల మెప్పును పొందిన ఆ స్త్రీ మూర్తి మన ఝాన్సీ లక్ష్మీబాయి  .ఈమె ఉత్తర భారత దేశంలోని ఝాన్సీ అనే రాజ్యానికి రాణి  .అసలు పేరు మణికర్ణిక 19 నవంబర్ 18 28న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు  .నాలుగు సంవత్సరాల చిన్న వయసులోనే తల్లి మరణించినందున పెంపకం బాధ్యతలన్ని తండ్రి మోరో పంత్  పై పడ్డాయి  .ఆనాటి సాంఘిక పరిస్థితులకు వ్యతిరేకంగా కుమార్తెకు కత్తిసాము  ,గుర్రపు స్వారీ  ,తుపాకీ పేల్చడం చిన్నప్పుడే నేర్పించాడు  .మోరో పంత్  రెండో బాజీరావు వద్ద  సైన్యాధ్యక్షుడు గా ఉండేవాడు .

మణికర్ణిక ను  చిన్నప్పుడు మను  అనిఛబెలి   అనే ముద్దు పేర్ల తో పిలిచేవారు .ఖడ్గం ధరించి  , కళ్లెం బిగించి  ,ఉవ్వెత్తున ఎగిరే కురులతో గుర్రపు సవారి చేస్తూ ఉంటే దారి  ని పోయేవారు రెప్పవాల్చకుండా  చూస్తూ నిలబడి పోయే వారట.13 సంవత్సరాల వయసులో 1842లో ఝాన్సీ కి రాజైన గంగాధరరావు నెవల్కర్ తో ఈమె వివాహం జరిగింది . అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పేరు పెళ్లి తరువాత లక్ష్మీబాయి గా మారింది  .వా రికి ఒక కుమారుడు జన్మించాడు  .కానీ అల్పాయుష్మంతుడు  . నాలుగు నెలల వయస్సు లోనే మరణించాడు .

వారసులు లేనందున గంగాధరరావు దూరపు బంధువు కుమారుడైన దామోదర్ రావును దత్తత తీసుకున్నాడు . ఆ శుభదినం మరుసటి నాడు అంటే 21 నవంబర్ 1853 నా గంగాధరరావు మరణించాడు  .గంగాధరరావు మరణించే సమయానికి డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు  . అతడు ఈ  దత్తత స్వీకారాన్ని ఒప్పుకోలేదు

ఈ పేరు మీద ఝాన్సీని ఆక్రమించాలని బ్రిటిష్ వారి ఆలోచన  .ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ లక్ష్మీబాయి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది . ఈస్టిండియా కంపెనీకి చెందిన న్యాయవాది రా బోట్ ఎల్లిస్ లండన్లో వాదించాడు  .రాణి కేసును ఓ డిపోయింది  .ఆంగ్లేయులు తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించారురాణిని  . ఆమె  దానికి సమ్మతించలేదు  .

వారి వ్యూహం ఆమెకు అర్థమయింది  . బదులుగా తన సైన్యాన్ని బలపరిచింది మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇప్పించింది  .మహిళలు యుద్ధ సామాగ్రిని , తినుబండారాలను అందించేవారు  . అవసరమైనప్పుడు యుద్ధం చేసేవారు   .ఝాన్సీ లో ఇదంతా జరుగుతున్నప్పుడు మీరట్లో భారత సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలు పెట్టారు  .లక్ష్మీ  బాయ్ కి మద్దతుగా తిరుగుబాటుదారుల నాయకుడు తాంతియా తోపే20, 000 సైన్యాన్ని పంపాడు  .

బ్రి టిష్ వారి వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి  . ఎంతో కాలం శిక్షణ పొందిన సైనికులున్నారు .ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉంది వారికి   . ఈ అన్ని కారణాలు కలిసి మూడవ రోజుకు రాణి బలగాలు బలహీనపడ్డాయి.

అయినా రెండు వారాలు పోరాడితే కానీ ఝాన్సీ ఆంగ్లేయుల వశం కాలేదు . ఇంతలో రాణి రహస్యంగా కాల్పి కి కుమారుని తో సహ పారిపోయి  , తాంతియా తోపే ని కలుసుకున్నది . గ్వాలియర్ వద్ద జరిగిన యుద్ధంలో రెండవ రోజు అంటే 17 జూన్ 1858 నాడు యుద్ధంలో జరిగిన గాయాల వల్ల రాణి మరణించింది . ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత బ్రిటిష్ వారు గ్వాలియర్ ను స్వాధీనం చేసుకున్నారు .

తర్వాత కొద్ది రోజులకి మోరో   పంతు తాంబే ను ఉరి తీశారు  . దత్త  పుత్రుడైన దామోదర్ రావుకు ప్రభుత్వం భరణం ప్రకటించింది .అతడు పిత్రార్జితాన్ని అందుకోలేదు  .భ రణాన్ని కూడా తిరస్కరించారు  .అది రాణి నేర్పిన సంస్కార బలం  .

ఆమె కున్న ధైర్యం  ,పరాక్రమం  ,వివేకం  ,ముందు చూపు  ,చేసిన త్యాగాలు ఆమెను భారత స్వాతంత్ర్య పోరాటంలో ఓ మరపురాని  ,మరువలేని ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయి .

 రాణి పద్మావతి

రాణి పద్మిని అని కూడా అంటారు . 13 – 14వ శతాబ్దికి చెందిన రాజపుత్ర వనిత  .అందం  ,ధైర్యం మూర్తిభవించిన మగువ శ్రీలంక రాజుగంధర్వ సేన , చంపావతి ల  కుమార్తె  . అ సాధారణ సౌందర్యరాశి  .అంతేకాదు సునిశిత బుద్ధి కి చిరునామా

మాలిక్ మహమ్మద్ జాయ్ సి రచించిన పద్మావత్ అనే కావ్యం ద్వారా ఆమె గురించి అల్లావుద్దీన్ ఖిల్జీ విన్నాడు . సొంతం చేసుకోవాలనుకున్నాడు .

రాణి వద్ద హీరామన అనే మాట్లాడే చిలుక ఉండేదట  .దాని ద్వారానే రాజా రతన్ సీన్ ఆమె అందాన్ని గురించి తెలుసుకొని వివాహం చేసుకున్నాడు అంటారు .ఖిల్జీ  రతన్ సింగ్ ని బంధించి  ,రాణిని కోరాడు  .రాణి తెలివైనది  .శత్రువు చేత చెక్కిన భర్త రతన్ సేన్ ను  విడిపించడానికి  పల్లకిలో సైనికులను పంపి చాకచక్యంగా భర్తను విడిపించినట్లు జానపద గాథలు ఉన్నవి.

 

ఖిల్జీ  చిత్తూర్ ఘడ్ కోటపై మళ్ళీ దాడి చేశాడు . రాణి ని అప్పగించమని షరతు పెట్టాడు  .శత్రువు చేతికి చిక్కకుండా ఉండేందుకు రాణి పద్మావతి ఇతర రాజపుత్ర స్త్రీలతో కలిసి జోహార్  (అగ్నిప్రవేశం )ఆచరించింది  .

హిందూ జైన  సంప్రదాయాల్లో రాణి పద్మావతి గురించి అనేక లిఖిత  ,మౌ ఖిక ప్రదాయ కథనాలు వాడుకలో ఉన్నాయి.

రాజస్థాన్లోని చిత్తూర్ ఘడ్ స్థానికులు వందల ఏళ్లుగా నమ్ముతున్న విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది  .రాణి  జీవితం చుట్టూ అల్లుకున్న కథలకు సాక్ష్యాలు ఎన్నింటినో చిత్తోర్ ఘడ్  కోటలో చూస్తాము  .మానవ మేధకు అందనివి ఇవి  .

గోముఖం అనే చెరువులో స్నానం చేయడానికి రాణి ఒక సొరంగం గుండా వెళ్ళే దని   ,అందులో ఇప్పటికీ ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికులు చెబుతుంటారు  .ఆ రోజుల్లో చిత్తోర్ ఘడ్ కోటలో నుండి జోహార్ కుండ  వరకు రాణు ల  రాకపోకల కోసం రహస్య మార్గాలు ఉండేవట  .ఈ మార్గాల్లో ఆత్మలు తి రుగుతుంటాయని నమ్ముతారు  .

పర్యాటకులతో కిటకిటలాడే కోటలో సాయంత్రం అయితే చాలు నిశ్శబ్ద సంగీతం వెంటాడుతుంది    .తెలియని స్వరాలు ఎంతటి ధైర్యశాలి నైనా భీ రువు ను చేస్తాయి  .తీతువు కూతలు  ,రాణి  అరుపులు  , చప్పుళ్ళు రాత్రుల్లో  వినిపిస్తాయట  .

ఇదే కోటలో రాణి దేవాలయం కూడా ఉంది . రోజు రాణి  ఆత్మ  వచ్చి దర్శనం చేసుకుంటుందని చెప్తారు  .ఆమె  రాగానే దేవాలయం తలుపులు తెరుచుకుంటాయి అని  ,బయటికి రాగానే మూసుకుంటాయి అని చూసిన వారు చెప్తారు .

అందం  ,అభిమానం  ,అభిజాత్యం కలిసిన ముప్పేట జడ కుచ్చులు వాలుజడ రాణి పద్మావతి .

అహల్యాబాయి హోల్కర్ 1725 1795

మరాఠా సామ్రాజ్యంలోని మాల్వా ప్రాంతాన్ని పాలించిన వీర /ధీరవనిత  .దయామయి  .ఆదర్శ పాలకురాలు . అద్భుతమైన పరిపాలనా  దక్షత ఆమె సొంతం  .జీవితాన్ని ప్రజాసేవకు దైవారాధనకు అంకితం చేసిన  మహిళా శిరోమణి  .

మహా రాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా చండీ గ్రామంలో 31 మే 17 25 న జన్మించారు . తండ్రి పేరు మంకో  జి షిండే పటేల్  .ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయానికి వ్యతిరేకంగా కూతురు అహల్యకు చదవడం  ,రాయడం నేర్పించారు . అహల్యకు చిన్నప్పటి నుండి దైవభక్తి మెండు .

మరాఠా సర్దార్ మల్హర్రావు ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడై తన కొడుకైన ఖండేరావు హోల్కర్ తో ఆమె వివాహం జరిపించాడు . వీరి వివాహం 1735 లో జరిగింది  . మాలే  రావు ,ముక్తా బాయ్ అని ఇద్దరు సంతానం కూడా కలిగారు .

మహారాణి కదా . ఆమె జీవితం వెన్నెల దారుల్లో పూల పడవలా  సాగింది అని  అనుకోకండి  .వ్యక్తిగత  జీవితం కష్టాల కడలిలో సాగింది.   ఆశ్చర్యం అనిపిస్తుంది ఎన్నో సమస్యలను అనుభవిస్తూ కూడా ఆమె తన విద్యుకతా ధర్మాన్ని ,దైవభక్తిని మరువలేదు .

1754లో జరిగిన యుద్ధంలో భర్త ఖండేరావు మరణించాడు . నాటి సంప్రదాయంలో  భాగంగా సతీసహగమనం చేయాలనుకున్నది  .కానీ ప్రజలు అనాధలై పోతారని  ,వారి బాధ్యత తనపై ఉన్నదని నచ్చచెప్పి ,మామగారు ఆ ప్రయత్నం నుండి మరలించారు . అంతేకాదు పరిపాలనా విధానాలను నేర్పించారు .

1766లో మామగారు 1767 లో కుమారుడు మరణించారు  .విషా దాలను  తట్టుకొని 1967లో మాల్వా పాలకురాలిగా బాధ్యతలను స్వీకరించారు  .ఆమె చేసిన కార్యాలు నేటికీ కొనియాడ పడుతున్నాయి .

రాజధానిని ఇండోర్ నుండి నర్మదా తీరంలో ఉన్న మహేశ్వరాని  కి మార్చారు  .మనం ఇప్పుడు కొని అపురూపంగా దాచుకునే మహేశ్వరి చీరల తయారీ ఆమె సంకల్పమే .

సంపాదనంతా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రజాసంక్షేమానికి వెచ్చించారు  .వాటి ఫలితాలను నేటికీ మనం అనుభవిస్తున్నాం .ఆనందిస్తున్నాము  మనకు తెలియకుండానే  .

మనం చూస్తున్న అనేక ప్రాచీన దేవాలయాల రూపురేఖలకు ,  నడక దారులకు రూప రూపశిల్పి ఆమెనే  .ముస్లిం పాలకుల దాడుల్లో ధ్వంసమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని 1780 లో పునర్ ర్మించారు  .పాడు పడి ఉన్న గుజరాత్ సోమనాథ్ ఆలయాన్ని బాగు చేయించారు .

బద్రీనాథ్ -కేదార్నాథ్ –పూరి- ద్వారక -గయ -ఓంకారేశ్వర్ -అయోధ్య వంటి 157 కు పైగా పుణ్యక్షేత్రాలలో స్నానాలకు ఘాట్లు , ధర్మశాలలు  ,బావులు , అన్నదాన కేంద్రాలను కట్టించారు .

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు .

ఇక నాణానికి మరోవైపు .1791లో అల్లుడు యశ్వంతరావు ఫ్యాన్సీ మరణించగా కూతురు సహగమనం చేసింది .మామగారు చనిపోతే అత్తగారు సహగమనం చేసింది  .బాధ్యతల్లో మనశ్శాంతిని వెతుక్కుంది ఆమె  .

దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రజారంజకమైన ధార్మికమైన పాలన సాగించడం మహారాణి అహల్యా  బాయి 13 ఆగస్టు 17 95నాడుమహేశ్వరం లో మరణించారు .

ఆమె 200 వ జన్మదినం సందర్భంగా ప్రభుత్వం 25 ఆగస్టు 1996 నాడు ఓ స్టాంపును విడుదల చేసింది  . నిష్కల్మషమైన భక్తి న్యాయ బుద్ధి  ,సేవల  కారణంగానే నేటికీ ప్రజల గుండెల్లో దేవిగా అంటే దేవి అహల్యాబాయి గా ఆమె కొలువబడుతున్నారు .

రాణి దుర్గావతి   24. జూన్ 1564 -24 జూన్

బుందేల్ఖండ్ సంస్థానంలో ప్రసిద్ధికెక్కిన రాజులలో మొదటి వాడైన చందవేల  గోండ్ రాజు గారి కుమార్తె దుర్గావతి 5 అక్టోబర్ 15 1524 న ఉత్తరప్రదేశ్లో ఉన్న కలింజర్ కోటలో జన్మించింది  .ఆమె రాజా కీరత రాయ్  , కమలావతి తల్లిదండ్రులు  .

18 వ ఏట దుర్గావతి వివాహం సింగూర్ ఘర్ కోటలో దళపత్ షా తో జరిగింది  .1545 లో ఓ కొడుకు జన్మించాడు అతని పేరు వీర నారాయణ  .

మామగారు సంగ్రామ షా 1543 లో చనిపోయాడు .ఆ తర్వాత కొద్ది కాలానికి అంటే 33 సంవత్సరాలు చిన్న వయసులో భర్త మరణించాడు  .భర్త మరణించే సమయానికి కొడుకు వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే .మామగారు , భర్త  మరణాలతో  రాజ్య భారం ఒక్కసారిగా దుర్గావతి మీద పడింది . తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుకు పట్టం కట్టి  ,అతని పేరుతో పరిపాలనా అధికారాన్ని చేపట్టింది  .ద క్షత గల రాణిగా పేరు పొందింది .

ఇరుగు పొరుగు రాజులతో వైరమ్  లేక పరిపాలిస్తుండ గా మొగలాయి పాలకుడు అక్బర్ పాదుషా ఆమె కీర్తి విని ఆ రాజ్యాన్ని తన సొంతం చేసు కోవాలనుకున్నాడు .

15 64లో ఆసఫ్ ఖాన్ అనే ప్రసిద్ధ వీరుని సైన్యంతో రాణితో యుద్ధానికి పంపాడు .సంగతి తెలిసిన రాణి దుర్గావతి భయపడలేదు  . సై న్య సమీకరణకు సిద్ధమైంది .అతి తక్కువ కాలంలో 500 ఏనుగులను  ,5000 గుర్రాలను గొప్ప కాల్ బలాన్ని సిద్ధం చేసుకున్నది . పురుష వేషం తో ఏనుగుపై యుద్ధరంగానికి బయలుదేరింది  .ఆమె చేసిన ఏర్పాట్లను  ,యుద్ధ సన్నాహాలను చూసిన ఆసుఫ్ ఖాన్వెనక్కి వెళ్లి  ,మరి కొంత సైన్యంతో  , ఫిరంగి దళంతో మరునాడు ఎదుర్కొన్నాడు రాణి ని  .

ఫిరంగులను చూసి రాణి గారి సైన్యం బెదిరిపోయి  , దిక్కులు చూస్తుంటే  ,చిన్నవాడైన మహారాజు వీరనారాయణ సైనికులకు ధైర్యం చెప్పాలని శత్రువులను ఎదుర్కొన్నాడు  . కొంత సేపు పోరాడి యుద్ధరంగంలో మూర్ఛిల్లాడు .

సైనికులు ఈ దుఃఖవార్తా ను  రాణికి చేరవేశారు  .అప్పుడు ఆమె యుద్ధ రంగంలో మరో చోట యుద్ధం చేస్తూ ఉండింది . వారితో ఇలా బదులు చెప్పింది  .”ఇది దుఃఖించాలసిన తరుణం కాదు .శత్రువుని ఓడించడం మన తక్షణ కర్తవ్యం  .పిల్లవానికి తగిన ఉపచారాలు చేస్తూ ఉండండి  .ఈ రణ  యజ్ఞాన్ని  పూర్తి చేసి , ప్రాప్తం  ఉంటే పిల్లవాడిని వచ్చి కలుస్తాను” అన్నదా మహాతల్లి  .

క్రమంగా గోండుల సంఖ్య తగ్గుతూ వచ్చింది .కాసేపటికే 300 మంది సైనికులు  మిగిలారు రాణి పక్షాన . అయినా ఆమె జంక లేదు  .ఇంతలో ఆసఫ్ ఖాన్ అతి దగ్గరగా వచ్చి బాణ వర్షాన్ని కురిపించాడు  .ఓ బాణం తలలో గుచ్చుకున్నది  . శరీరమంతా రక్తసిక్తమైనా పోరు ఆపలేదు  .

శత్రువులు మరింత దగ్గరవడం గ్రహించి  ,తన దేహం శత్రువుల చేత చిక్కి అపవిత్రం కావడం ఇష్టం లేక  ,తన ఖడ్గానికి నమస్కరించి , దాంతో తానే పొడుచుకొని రణ భూమిలోనే ప్రాణాలను విడిచింది  .

దుర్గావతి సమాధి జబల్పూర్ లో  పర్వత ప్రాంతాల్లో నిర్మించబడి ఉంది .ఆ కొండపై నుంచి ఇప్పటికి రాత్రుళ్ళు రణ ఘోష వినిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు  .ఆమె మరణించిన  దినాన్ని నేటికీ అంటే జూన్ 24  ,1564 బలిదాన్ దివస్ గా జరుపుకుంటారు . బహుముఖ ప్రజ్ఞాశాలి .శౌర్యవంతురాలు  . పరిపాలనా దక్షత గల నాయకురాలు  .శత్రువులకు లొంగడం కంటే మరణమే మేలు అనేది ఆమె దృఢనిశ్చయం .

1983లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు జబల్ పూర్ విశ్వవిద్యాలయాన్ని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు  .జబల్పూర్  ,జమ్మూ- తావి  మధ్య నడిచే రైలుకు రాణి దుర్గావతి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు . జూన్ 24 1988 ఆమె స్మారక చిహ్నంగా స్టాంపును కూడా ప్రభుత్వం విడుదల చేసింది .

మరి కాస్త

జీవిత కాలంలో ఆమె 52 యుద్ధాలు చేసింది  . 51 యుద్ధాల్లో గెలిచింది  .తాను చనిపోవడమే కాదు  ,ఆమె సందేశం మేరకు అక్బర్ కు వశం  కాకుండా ఐదు వేల మంది గోండుమహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు .

ఓ భర్త లేని స్త్రీ , అందమైన ఆడది , రాజ్యం చేస్తున్నదని తెలిసి , ఆమెను ఓడించి రాజ్యాన్ని , ఆమెను చేగిక్కించుకోవాలని ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు . పన్నాగాలు పన్నారు  .

పరాక్రమం చూపి  ,స్వాభిమాన సందేశం ఇచ్చి పోతూ పోతూ జయకేతనం ఎగుర వేసుకుంటూ డివికేగిన దివ్య మహిళ .

రాణి దుర్గావతి బలిదానం దేశ చరిత్రలో శాశ్వత స్థానం పొందింది>

భారతదేశంలో రత్న గర్భ . అందుకే మందల సంవత్సరాలుగా ఈ పవిత్ర భూమిని సొంతం చేసుకోవాలని  ,అపురూప సంపదన చేజిక్కించుకోవాలని , కుట్రలు చేశారు . కుతంతరాలు పన్నారు ఎందరో .

యుగయుగాలుగా స్త్రీ అంటే చులకన భావమే  .తనకంటే ముందు నడిస్తే అసహనం ,అశాంతి  .అలాంటిది ఓస్త్రీచేతిలో పాలన పగ్గాలు వస్తే సహిస్తారా?రక రకాలుగా శ్రీ శక్తిని అణచాలని చూశారు .

అయినా నాలుగు చినుకులకు తలెత్తిన చిన్ని పువ్వుల్లా  కొద్దిపాటి సహకారంతో స్త్రీలు లేచి నిలబడ్డారు . నలుగురికీ దోవ చూపారు . జీవితాలను ఆదర్శాలకు  , ఆశయాలకు  , ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చి దిద్దుకున్నారు . కాకపోతే వారి నిరాడంబరత కారణంగా చరిత్రలో రావాల్సినస్థానందక్కలేదు .

ఈ శుభ సందర్భంలో వారి జీవిత చరిత్రలను మరోసారి గుర్తు చేసుకుని మనసారా నమస్కరిద్దాం. స్పూర్తి పొందుదాం.

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్నేహబాట పరిమళాలు

ఓ ప్రేమ కథ (మోహన రాగం) 11 వ భాగం