పద్మాభివందనము

ఈ కథలు ఎందుకంటే….

“సెలయేటిలో మొగ్గ సంపెంగలు” కథా సంపుటిని లలితా రామ్ గారు రచించారు. ఈ కథలను “సాంఘిక కథల వేడుక”అని అభివర్ణించారు లలితా రామ్ గారు. ఇందులో 9 కథలు, 6 పౌరాణిక కథలు, 2 డిటెక్టివ్ కథలు ఉన్నాయి .ఈ పుస్తకం నుండి ప్రతినెల ఒక కథను ప్రచురించాలని నిర్ణయించుకున్నాము.” తెలుగు సాహితీ రస హృదయం రచించిన రమ్య కధలివి” అంటూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు,” సెలయేరు ప్రవాహ సంచిక కొత్తదనము, మరికొంత ఔచిత్యము కలగలిపిన ప్రతిష్టాపన ”  అంటూ  శ్రీ ఓలేటి పార్వతీశం గారు అభిప్రాయాలలో అన్నారు. లలితా రామ్ గారు రచించిన ఈ కథలను గురించి ,”సందెగాలిలో, పిల్ల తెమ్మెరలో ఒక సృజన పుష్ప మైవాలుతుంది. వివిధ అంశాలతో కాలమానాలలో మొదటిసారిగా సంయుక్తమై ఈ కథలు మీ హృదయాలను ఆకట్టుకుంటాయని మా గాఢ నమ్మకం. అయోధ్య, బృందావనం, భారతదేశ సుందర ప్రకృతి, అమెరికా అందమైన పరిసరాలలో  పరమాత్ముని ఉనికి , వైవిధ్యమైన పాత్రలు మీకు భక్తి పారవశ్యం, ఆశయాలు, భావతరంగాలు అందించగలవు”  అంటూ పుస్తకం అట్టా మీద రచించి దాన్నిబట్టి గమనిస్తే ఈ కథలను తరుణి పాఠకులను తప్పకుండా అలరిస్తాయి అని మేము కూడా ప్రతి నెల ఒక కథను ప్రచురించాలని నిర్ణయించుకున్నాము.

– డాక్టర్ కొండపల్లి నీహారిణి

తరుణి  సంపాదకులు

 

గౌరవనీయురాలు, ప్రియమైన గురువు, శ్రీమతి పద్మ గారికి,

మొదటి రోజు రామకృష్ణా మిషన్ స్కూలులో.

విశాలమైన మైదానం, వెలుతురుతో నిండిన క్లాస్ రూములు, రంగు రంగుల బట్టలు, ( రోజులలో మాకు యూనిఫారంస్ లేవు), పొడవాటి జడలతో తోటి విధ్యార్ధినులు, బెరుకు బెరుకు గా నేను.

చిన్నప్పుడు సున్నితమైన, సుస్వాదువైన మనస్తత్వము నాది. నాకు అత్యంత ఆప్తులైన తాతగారు, బామ్మ గారు, మా అమ్మ నాన్నలు, ఎంతో కాలం తర్వాత ఇంట్లో ఆడపిల్ల అని, చాలా గారం చేయటముతో కొంచం పలుచగా, నాజూకుగా తయ్యారయ్యాను.

స్కూలులో లంగాలు కంపల్సరీ. అమ్మ గట్టిగా దువ్వి, జడ వేసి ఒక పెద్ద డాలియా పెట్టేది జడ పైన.

రోజు ప్రేయర్ హాలులో, పిల్లలమంతాఓం సహనా వవతు“, ” గురు బ్రహ్మ, గురు విష్ణూఅని చేతులు జోడించి ప్రార్థనలు చేశాము. ప్రతీ గంటకు ఒక క్లాసు చొప్పున, మూడవ గంటలో తెలుగు క్లాస్.

బిల బిల మంటూ, ఎనిమిది మంది ఆడపిల్లలము. ఇంగ్లీషు మీడియం క్లాసు నుంచి , తెలుగు క్లాస్ కు పరుగెత్తాము.

మద్రాసులో, తెలుగు మీడియంలో చదువుకుంటున్న ఆడపిల్లల క్లాసులో, మేము తెలుగు క్లాస్ కు మాత్రంటీచర్ పక్కగా, అంటే మీ పక్కగా, నేలపైన కూర్చునే వాళ్ళము.

మీరు ఊదా రంగు బార్డరున్న తెల్లటి గద్వాలు చీరలో వెను తిరిగి, బోర్డ్ పైనసరస్వతీ నమస్తుభ్యంఅని వ్రాస్తున్నారు. మీ పొడవాటి విగ్రహము, నించున్న ఠీవి, మా ప్రక్క తిరిగి, “రండి, ఇలాగ కూర్చోండిఅని చెప్పటమూ, మీ కళ్ళల్లో కాంతీ చూసి, మేము ముసి ముసి నవ్వులు నవ్వుతూక్లాసులో సెట్టిల్ అయ్యాము.

లేత వయసులో ఉన్న మా అందరినీ చిరు నవ్వుతో అక్కట్టుకొన్నారు. గురువు అంటే భక్తి తో పాటు ఆరాధన ఏర్పడింది.

టీచెర్, మీరుఐదవతరగతినుండిపన్నెండవతరగతివరకూ, మాకుతెలుగుఅమృతతుల్యంగానేర్పారు. పాఠాలతోపాటుమాట్లాటలు, సామెతలు, పొడుపుకథలు, గేయాలు, నాటికలు, ఇలాగఎన్నోప్రక్రియలలోఆసక్తికల్పించారు.

మీకునామీదఎంతోఅభిమానం. ఒకసారి,క్లాసులోమమ్మలినిసింహానికిస్త్రీలింగంఏమిటిఅనిఅడిగారు. చిన్నపిల్లలం. అందరూబిక్కమొహంవేశాం. పులిఅన్నారుకొందరు.

మీరునావంకచూసి,చెప్పుఅన్నట్టుగానవ్వుతూసైగచేశారు. నేనుసింహఅన్నాను. జుస్ట్ప్యూర్గెస్స్అన్నమాట. మీరుకాదుఅన్నారు. అప్పుడుక్లాసులోఅందరికంటేతెలివైనపిల్ల, శైల, సింహిఅనికరక్టుగాచెప్పింది. అప్పటినుంచీఅమెతోపోటీయే.

పద్మా టీచర్, మీకు సంఘటన గుర్తుందా?

నన్నుతెలుగు డిబేట్ క్లబ్ లో చేరమని ప్రోత్సహించారు. మొదటి సంవత్సరం బహుమతి వచ్చింది. మీ సంతోషానికి హద్దులు లేవు.

అయితే రెండో సంవత్సరం, హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకోవటముతో నా కంఠ స్వరం మారింది. మగ పిల్లవాడి స్వరం లాగ అయ్యి, మామూలుగా అవ్వటానికి సంవత్సరాలు పట్టింది. నేను మళ్ళీ బహురాష్ట్ర డిబేట్ లలో పాల్గొనలేదు. మీరు నా కంటే ఎక్కువ బాధ పడ్డారు. మీబేలబాల విద్యార్ధినుల కోసం మీ కంట్లో తడి నేనెన్నటికీ మరువను కదా.

మిమ్మల్ని తలిస్తే భావ గర్బితమైన సంఘటనలు ఎన్నో!

అప్పటికే పధ్నాలుగు ఏళ్ళు పై బడిన మమ్మలిని, ఉగాది పండగ అని మీ ఇంటికి పిలిచారు. ఐదుగురము కలిసి, పట్టు లంగాలేసుకొని, మల్లె పువ్వుల జడలతో, సరదాగా వచ్చాము. మీరే మాకు పులిహార, గారెలు, బొబ్బట్లు పెట్టారు. మీ ఇంటి ఆవరణలో చక్కగా తెలుగు మాట్లాట అని ఆట కూడా ఆడాము.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అనిపించింది, ఇంట్లో టీచర్, ఆమె వంట మనిషి తప్ప ఇంకెవరూ లేరే అని. తర్వాత తెలిసింది, పద్మా టీచర్, మీరు పెళ్ళి చేసుకోలేదనీ, తోబుట్టువులు వేరే ఊర్లలో ఉన్నారనీ, మీది వంటరి జీవితం అనీ.

మేము స్టూడెంట్సే మీ కుటుంబం. స్కూలే మీ ప్రార్థనాలయము. పాఠాలే మంత్రాలు. పండుగలు, పబ్బాలు మా తోనే.

నేను తమిళ నాడులో పెరిగి, తెలుగు రాయగలను, ఇన్ని సంవత్సరాల తర్వాత సభలలో మాట్లాడగలను అంటే ముఖ్య కారకులు మీరే. నేను మీకు ఎలాగ థాంక్స్ చెప్పగలను టీచర్? నేను వ్రాసే ప్రతీ అక్షరం మీద మీ కారుణ్యం మెరుస్తుంది.

తెలుగు క్లాస్ స్టూడెంట్స్ అందరమూ వివిధ కాలేజీలలో చదువుకొన్నాము. పెళ్ళిల్లూ, పిల్లలూ, మా జీవితాలు మావి. 35సంవత్సరాల తర్వాత వాట్సాప్ లో కలిసిన మాకు, మొదటి సంభాషణ మీ గురించే!

తెలుగు మాటలలో తేనెలూరుతాయనీ, పద్యాలలో పద,భావ మాయజాలం దాగుందనీ, వచనంలో వాగ్దేవతల కరుణా రస సాగరముందనీ, వ్యాకరణ సూత్రాలు దివ్య సాధనాలనీ మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తే.

పద్మా టీచర్, మీరింకా చెన్నై లోనే నివాసమా? మీ చల్లని మాట వినాలని తపించి, ఇంటర్నెట్ లో, గూగుల్ లో వెతికాము. ఒక వార్త అయినా దొరకక నిరాశ చెందాము.

ఉత్తరం చూసి, మమ్మల్ని పిలుస్తారనీ, కలుస్తారనీ కొండంత ఆశ.

మీ ప్రియ శిష్యురాలు, లలిత రామ్

Written by Lalitha Ram

లలితా రామ్

రచయిత్రి లలితా రామ్ గారి పేరు మరో పేరు రేవతి. వీరు ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ఆర్టిస్ట్ శ్రీ బుజ్జాయి సుబ్బరాయ శాస్త్రి గారి కుమార్తె. ఫైనాన్స్ లో ఎంబీఏ చేసి,
వైస్ ట్రెజరర్ గా ఉద్యోగం చేసిన తర్వాత వారి అన్నగారి పేరుతో, "అవంతి కళ్యాణం" తెలుగు నవలతో కలం చేపట్టారు. "మేఘ" ఇంగ్లీష్ నవల రచించారు. తెలుగు, ఇంగ్లీష్ల్ భాషల లో కథలు కవితలు, వ్యాసాలు ఎన్నో రాశారు. 2023లో దేవులపల్లి వారి శ్రవ్య నాటిక "తిరుప్పావై" ను ఇంగ్లీషుభాషలోకి "The Champaca Enchantment" అనే పేరుతో అనువదించారు. ఎన్నో పురస్కారాలు బిరుదులను పొందారు. తాత గారి పేరున ఫౌండేషన్ స్థాపించి పిల్లలకు, పెద్దలకు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో సాహిత్య సేవ పురస్కారాలు ఇచ్చారు. 240 మంది అంతర్జాతీయ కవయిత్రుల కవితల కవిత "మేఘమాల", 102 అంతర్జాతీయ రచయితలు రాసిన "నవ్యవ్యాస మాలిక" అనే పుస్తకాల ప్రచురణకు సంపాదకురాలుగా

పనిచేసారు. కృష్ణశాస్త్రి గారు రచించిన లలిత గీతాల ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాభారతంలో కొన్ని పాత్రలపై విశ్లేషణ చేశారు. అమెరికాలో "రైజింగ్ స్టార్ అవార్డ్స్" కు జడ్జిగా పనిచేశారు. ప్రపంచ తెలుగు సమితి వ్యవస్థాపకులలో ఒకరు. ఎన్నో తెలుగు సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేశారు,చేస్తున్నారు.

"సెలయేటిలో మొగ్గ సంపెంగలు" అనే ఈ వైవిధ్య భరితమైన కథలను రచించారు, పుస్తకంగా ప్రచురించారు. ఈ కథలు ఈ పుస్తకంలోనివే!
___***___

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల విజయగాథలు

నీవులేక