The first woman Engineer of India

వ్యాసం

లంగా ఓణి  తో కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తిని అందరూ ఆశ్చర్యంగా చూశారు .

 కారణాలు చాలానే ఉన్నాయి స్త్రీ కావడం మొదటిది  .

అది ఇంజనీరింగ్ కాలేజ్ కావడం రెండవది

మనకు సాధారణమే అనిపిస్తాయి ఈ రోజుల్లో .కానీ అది క్రీస్తు శకం 1940వ సంవత్సరం . ఎందుకంటే ఆ రోజుల్లో నైతిక విద్య మగవారికి మాత్రమే అభిప్రాయం జనసామాన్యంలో బలంగా ఉండేది  . అలా  అందరినీ ఆశ్చర్యంలో ముంచి వేసిన ఆ విద్యార్థిని పేరు లలిత  .అంటే అయ్యల సోమయాజుల లలిత  .లలిత ఆగస్టు 27   ,1919లో మద్రాసులో 8 మంది తోబుట్టువుల్లో  ఐదవ సంతానంగా జన్మించింది  .మధ్య తరగతి కుటుంబం  .ఆ రోజుల్లో బాల్యవివాహాలు సర్వసాధారణం  .అలా 14వ సంవత్సరంలోనే ఆమెకు వివాహం జరిగింది .తండ్రి ప్రోత్సాహం తో  చదువు కొనసాగించింది  .ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పాస్ అయింది . తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే తల్లి కూడా అయింది  .విచారకరమైన విషయం ఏంటంటే పాపకి నాలుగు నెలల వయస్సులోనే ఆమె భర్త మరణించాడు .వితంతువుగా మిగిలిన జీవితమంతా గడిపింది ఆమె

లలిత తండ్రి శ్రీ పప్పు సుబ్బారావు గారు మద్రాసులోని గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు   .అభ్యుదయవాది .చాలా ధైర్యసా హసా లతో  సమాజ రీతికి ఎదురీది  కూతురిని పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నారు .బంధు మిత్రుల  నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు  .

కూతురుని క్వీన్ మేరీ కాలేజీలో పై చదువులకు పంపాలని నిర్ణయించుకున్నాడు  .12 వ త ర గతి మొదటి తరగతిలో పాస్ అయింది  . మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని   ఆమె కోరిక . కానీ ఓ చిన్న పాపకు తల్లి కూడా  అయినందువల్ల తన ఆలోచనను మార్చుకుని ,పై చదువులకు ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకుంది  .ఇంత  వరకు ఇలాంటి నిర్ణయాన్ని ఎవరుతీసుకోలేదు .

తండ్రి వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ను  ,డైరెక్టర్ ను కలిసి విషయాన్ని వివరించాడు  . వారి ప్రోత్సాహంతో లలిత దేశంలోనే తొలి ఇంజనీరింగ్ విద్యార్థినిగా చేరే అపురూపమైన అవకాశాన్ని చేజిక్కించుకుంది . గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఆసియాలోనే తొలి సాంకేతిక కళాశాల  .కాలేజీ మొత్తం లో ఒకే స్త్రీ అవడం వల్ల ఆమె కాలేజీ  వాతావరణంలో  ఒంటరిగా మసలుకో వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి  .ఇది గమనించిన తండ్రి ఆ రోజుల్లో హిందూ దినపత్రికలో ఆసక్తి గల మహిళ అభ్యర్థులకు కాలేజీ అవకాశాలు ఉన్నాయని ప్రకటన ఇచ్చాడు  .థె రెసా  ,లీలమ్మ జార్జ్ అనే ఇద్దరు స్త్రీలు సివిల్ ఇంజనీరింగ్ లో చేరారు  .ముగ్గురు  కలిసి చదువు మీద ప్రత్యేకమైన శ్రద్ధ  వహించారు .వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకున్నది  .1943 లో లలిత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ  పూర్తి చే సింది .

ఆ రోజుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయాలంటే  ,చివర గా ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్గా పని చేయడం  తప్పనిసరి అని  నియమం ఉండేది  .అలా లలిత జమాల్పూర్ లోని రైల్వే వర్క్ షాప్ లో అప్రెంటిస్ శిక్షణను పూర్తి  చేసింది  .1944లో డిగ్రీ చేతికి వచ్చింది . మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే తొలి మహిళ ఇంజనీర్ అని చెప్పుకున్నాం కదా అందువల్ల డిగ్రీ సర్టిఫికెట్ లో ఆ రోజుల్లో  HE మాత్రమే ఉండిందని కొట్టేసి SHE అని రాశారట  .

ఆమెతో కలిసి చదివిన లీ లమ్మ జార్జి గారు కేరళ తొలి చీఫ్ ఇంజనీర్ గా పని చేశారట .1944  లో సిమ్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా చేరారు  .అక్కడ తమ్ముని కుటుంబంతో కలిసి ఉండేవారు  .ఆ చిన్న పాప బాధ్యతను మరదలు చూసుకునేది  .గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు  .1948లో కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఉద్యోగంలో చేరారు  .చాలా కాలం  ఆ కంపెనీలో పని చేశారు  .అందులో భాగంగా దేశంలోని చాలా ప్రాంతాలను సందర్శించారు . ఎన్నో రాష్ట్రాలకి గ్రిడ్ సబ్ స్టేషన్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ రూపొందించడంలో సహాయపడ్డారు భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణంలో ఆమె పాత్ర ప్రముఖమైనది .

1964లో న్యూయార్క్లో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ విమెన్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ మన దేశానికి ప్రతినిధిగా వెళ్లారు  .1977లో ఆమె రిటైర్ అయ్యారు 79 అక్టోబర్ 12న   60 సంవత్సరాల వయసులో మరణించారు  .ఆ రోజుల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లలో 18 సంవత్సరాల వయస్సులో నాలుగు నెలల చిన్న పాపతో ఆమె సాధించిన విజయాలు సాగించిన ప్రయాణం స్త్రీ లోకానికి స్ఫూర్తి దాయకం .

వితంతు వివాహాన్ని ఆమె బలపరిచే వారు  .తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చేవారు . తనకి కూతురి  బాధ్యత ఉన్నందున తాను అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేవారు . ఈ రోజుల్లో కూడా ఎందరో స్త్రీలు ఇంజనీరింగ్ కాలేజ్ చేరి ఏవో చిన్నపాటి కారణాలతో మధ్యలో చదువు మానేస్తున్నారు  . అ లాంటిది 85 సంవత్సరాల క్రిందటి ఆమె పోరాటాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆమె చరిత్ర నుండి స్ఫూర్తి పొందుదాం దేశ పురోగతిలో మనము పాలుపంచుకుందా ము .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన తెలుగుభాషకు మాత్రమే స్వంతమైనవి

పాడె అను నేను…